• తొలిఏకాదశివ్రతం ఏకాదశివ్రతమహత్యం తెలుగుబుక్స్ తెలుగువీడియోలు
    book reads

    ఏకాదశి వ్రత తెలుగుబుక్స్

    తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో… ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది. ఆధునిక వైద్య పద్దతిననుసరించి కూడా ప్రతి పక్షానికి ఒక రోజు పూర్తి సాత్విక ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్య లక్షణం అంటారు. అంటే ప్రతి పదిహేను రోజులకు ఒక రోజులో కేవలం సహజంగా లభించే ఆహారం పండ్లు, పాలు లాంటివి స్వీకరిస్తే, జీర్ణవ్యవస్థ భాగుగా ఉంటుంది, అంటారు. కాబట్టి హిందూ సంప్రదాయ ఏకాదశి నియమాలు కూడా ప్రత పక్షానికి ఒకమారు రావడంతో ఏకాదశి చేయడం భక్తితోపాటు ఆరోగ్యవంతం కూడా అని అంటారు. ఇలా రెండు రకాలు…