• దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి
    telugureads,  పౌరాణిక సినిమాలు,  భక్తి సినిమాలు

    దీపావళి తెలుగు పాత సినిమా

    దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది. వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”. దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు…