దీపాల వరుసతో దీపావళి పండుగ

దీపాల వరుసతో దీపావళి పండుగ

మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు! దీపావళి అంటే దీపాలవరుస అని అంటారు. ఆవునెయ్యి, నువ్వులనూనే, కొబ్బరినూనే వంటి నూనేలతో దీపాలను వెలిగిస్తారు. అటువంటి కొన్ని దీపాలను వరుసలగా ఇంటిముందు వెలిగిస్తారు. కాబట్టి దీపాల వరుసతో దీపావళి పండుగ అని చెబుతారు.

ఇంటిముందు వాకిట్లో దీపాలను తైలంతో వెలిగించి, ప్రకృతి ఆరాధించే ప్రక్రియ దీపావళి పండుగలో ఉందంటారు. వినాయకచవితి లాంటి పండుగలు ఇంట్లో పత్రితో, తైలంతో ఆరాధించడంతో మంచి ప్రకృతిని మన చుట్టూ మనం ఏర్పరచుకుంటే, దీపావళికి ఇంటిముందు దీపాలతో చుట్టు ప్రక్కల కూడా మంచి వాతావరణం ఏర్పరచుకుంటాం అని అంటారు.

సనాతన ధర్మంలో పండుగలకు పెట్టిన ఆచారాలు ప్రకృతితో సత్సంబంధం పెంచుకునే విధంగా ఉంటాయనే అంటారు. ఆవు నెయ్యి దీపాలతో చుట్టూ గాలిలో మంచివాతావరణం ఏర్పరస్తూ ఉంటుంది. అటువంటి దీపాలను ఊరిలో అందరూ ఏర్పరిస్తే, ఆ ఊరి ప్రకృతి అంతా బాగుంటందని అంటారు.

దీపాల వరుసతో దీపావళి పండుగ చేసుకోవడ ప్రధానంగా పండుగయెక్క ప్రధాన ఉద్దేశ్యంగా ఉంటుందని అంటారు. ఇంటిముందు కొన్ని దీపాలతో కొన్ని దీపాలవరుసను ఏర్పరస్తూ దీపావళిపండుగ చేయడమే దీపావళి అంటారు.

ఇంకా ఔత్సాహికులు ఆలయాలలో కూడా అనేకమైన దీపాలవరుసలతో దీపాలను వెలిగించి దీపావళి పండుగను జరపడం ఈ పండుగలో విశిష్టం. దీపాలవరుసతో దీపావళి పండుగ చేయడం వలన వాతావరణానికి ఉపయోగం ఉంటే, పర్యావరణ పరిరక్షణగా కూడా చెప్పవచ్చును. తెలం కానీ ఆవు నెయ్యి కానీ ఈ దీపాలలో వాడుట ఆచారం అని అంటారు.

దీపావళి పండుగ గూర్చి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనములో వినడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ప్రవచనకారుల ప్రవచనములలో ఆచార సంప్రదాయాల గురించి పండుగలు గూర్చి వివరణలు ఉంటాయి. ఆనందంగా చేసుకునే పండుగలలో దీపావళి పండుగ మరింత ఆనందం ఇస్తుంది.

అటువంటి ఆనందదాయకమైన పండుగ ఆచరణ విధానంలో ప్రకృతిలోకి ఔషధ శక్తిని పంపించే ఆవునేతి దీపాలను వెలిగించడం సంప్రదాయంగా చెబుతారు. ఉన్నవారు ఉన్నతంతో ఆవునేతి దీపాలు లేక తైలంతో దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.

ఈ ఆనవాయితిని ఆచరించే సంప్రదాయం కలకాలం కొనసాగాలంటే మనం కూడా ఆచరిస్తూ, దీపావళి దీపాల వలన ప్రకృతికి ఏవిధంగా ఉపయోగమో పిల్లలకు తెలియజేయాలి అని పెద్దల ప్రవచనములలో వింటూ ఉంటాం. భక్తికోసం సత్యభామ, శ్రీకృష్ణుల నరకవధను గూర్చి తెలియజేయాలి అని కూడా అంటారు.

ఉపకారికి ఉపకారం చేయడం ప్రకృతి లక్షణంగా చెబుతారు, అలాంటప్పుడు దీపావళి ఆవునెయ్యి దీపాలతో ప్రకృతినే, ఆరాధిస్తే, ప్రకృతి నుండి ప్రత్యుపకారం ఉంటుందని కూడా అంటారు. ఆవునేతి / తెల దీపాల వరుసతో దీపావళి పండుగ జరుపుకోవడం మనకు సంతోషం, ప్రకృతికి మేలు కూడాను అని అంటారు.

ప్రమాదకరమైన వస్తువులతో ఆటలు కన్నా, వెలుగులు ఇచ్చే తైల దీపాల కాంతి మనకు మేలు అంటారు. అయితే ప్రధానంగా వీలైనన్ని దీపాలతో కొన్ని దీపాల వరుసలను తైలంతో కానీ, ఆవునేతితో కానీ వెలిగించి దీపావళి జరుపుకుందాం. మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆశిస్తూ……

ధన్యవాదాలు తెలుగురీడ్స్

దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.