• నక్షత్రం బట్టి రోజూ మంచి చెడు సమయముల చూపించే వెబ్ సైటు
    tech reads

    మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

    మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి? ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు. ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ…