మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది?

నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో కొంత కాలాయాపన జరిగితే, చేసే పనిలో ఆటంకం ఉంటే మరికొంత కాలాయాపన ఉంటుంది. కాలాయాపన జరిగిపోతుందనే ఆలోచనతో దేవునిపై ధ్యాస కరువవుతుంది.

అందుకే ముందుగానే రాబోయే పండుగలు గూర్చి తెలుసుకుని ఉండి ఉండాలి అంటారు. మనకున్న వివిధ పండుగలలో వివిధ దేవీదేవతలను పూజిస్తూ ఉంటాం. ఏదేవుని పూజకు ఆయా విధానం ప్రకారం పూజిస్తూ ఉంటాం. పూజావిధానంతో బాటు మన:ప్రవర్తన మరీ ముఖ్యమంటారు. పూజ చేస్తూ ఉన్నప్పుడు ధ్యాస దేవునిపై ఉండి తీరాలి అంటారు. అప్పుడే ఆ పూజకు సరైన ఫలితం ఉంటుందని పండితులు అంటారు.

కావునా ఏ పండుగకు ఏదేవుడుని పూజించాలో ఆ దేవుని పురాణమను విశిష్టముగా చదివితే, ఆ దేవునిపై మనసు మమేకం అవుతుందంటారు. తినగా తినగా వేపాకు తియ్యగా ఉన్నట్టుగా, చదవగా… చదవగా… చదువుతున్న దేవుని మహిమలు మన మనసులో నాటుకుంటాయని అంటారు. ప్రస్తుతం మనకు ముందుకు రాబోయే మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడం ప్రధానమైన విషయం.

పరమశివుని వైభవం శివపురాణము

ముందుగానే పరమశివుని వైశిష్ఠ్యమును తెలియజేసే తెలుగుబుక్స్ రీడ్ చేయడం ద్వారా పరమశివుని వైభవం మనకు అవగతమవుతుంది. శివపురాణం చదవడం వలన మనకు పరమశివుని వైభవం తెలియబడుతుందని పెద్దలు చెబుతారు. శివపురాణం చదవడం వలన నిత్యం శివుడిని తలవడం మనసుకు అలవాటు అయితే, ఆయొక్క అలవాటు వలన మనసు మంచి సమయములలో కూడా పరమశివుడిని మననం చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటుందని అంటారు.

మననం మనసుకుండే అలవాటు కావున మననం చేసే విషయాలలో సాత్విక విషయాలు ఉండాలి అంటారు. అలా వివిధ దేవతల మంచి గుణములను తెలియజేసే వివిధ దేవతా పురాణములను రీడ్ చేయడం వలను ఆయా దేవతలపై మనసు మననం చేయడం అలవాటుగా చేసుకుంటుంది. శివపురాణం మంచిగా చదివితే, శివుని వైభవం అర్ధం చేసుకునే మనసు, శివుడిని తలుస్తూ ఉంటుంది. ఆవిధంగా పరమశివుడిని గూర్చి మననం చేసే మనసు, మహాశివరాత్రి పర్వదినాన కూడా మననం చేస్తే, ఆ రోజు పూజావిధానంతో బాటు, మనసంతా శివధ్యాసే ఉంటే, ఆ జన్మకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అందుకేనేమో జన్మానికో శివరాత్రి అంటారు.

అంటే మనసులోకి ముందుగా పరమశివుడిని తెచ్చుకుని ఉంటే, ఏదోక శివరాత్రికి మనసంతా శివుడే ఉండి, ఆ మనిషి తరించాడానికి మనసు మేలు చేస్తుంది. మరి మనసుకు పరమశివుని వైభవం తెలియజేసే శివపురాణం గురించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి లేదా క్లిక్ చేయండి. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తే, రాబోయే మహాశివరాత్రులకు మనసు మరింతగా ప్రిపేర్ అవుతుంది.

శివరాత్రి రోజున ఉపవాసం చేయడంతో బాటు, ఆ రోజురాత్రి జాగరణ చేయడం పరపాటి. అయితే ఉపవాసం చేయడం అంటే ఆహారం మీద ధ్యాస లేకుండా, పరమశివునిపైన మాత్రమే ధ్యాస నిలపడం అంటారు. జాగరణ అంటే నిద్ర కూడా మరిచి పరమశివునిపై ధ్యాసను పెట్టడం అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివుని వైభవం తెలియజేసే సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం తెలుగుబుక్ తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.

ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస

చదవడం కన్నా శ్రద్దగా వ్రాయడం వలన బుక్ లో ఉన్న విషయం బాగా అర్ధం అవుతుందని అంటారు. దీని కన్నా శ్రద్దగా వినడం వలన మనసు మరింతగా విషయాన్ని అర్ధం చేసుకోగలదు అంటారు. అలా దేవుని గురించి చదవడం కన్నా ముందు వినడం వలన ఆ దేవునిపై భక్తి బాగా పెరుగుతుంది. అటు తరువాయి ఆయా దేవీదేవతల బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా దేవీదేవతలపై భక్తి భావన బలపడుతుంది. అంటే ప్రవచనాలను ఆసక్తితో వినడం ద్వారా భగవంతునిపై ధ్యాస పెరుగుతుంది. అలా ప్రముఖుల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెంచుకోవచ్చును.

ప్రముఖు ప్రవచన కర్తల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెరగడానికి అవకాశం ఎక్కువ. మన తెలుగు ప్రవచన కర్తలలో ప్రముఖులు, ప్రసిద్ద ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈయన పరమశివుని గూర్చి చెబుతుంటే, మనసు మరు విషయంవైపు మరలదు అంటారు. అటువంటి గొప్పవారి మాటలలో మహాదేవుని గూర్చి వినడం వలన పరమశివునిపై ధ్యాస మరింతగా పెరుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పరమశివుని గురించి అనేకంగా ఉన్నాయి. వాటిలో అష్టమూర్తి తత్వం ప్రవచనాలు చాలా ప్రసిద్ది. అష్టమూర్తి తత్వం గురించి గురువుగారు చెప్పిన ప్రవచనం వినడానికి క్రింది వీడియో చూడండి.

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

మహాశివరాత్రి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన ప్రవచనం ఈ క్రింది వీడియో ద్వారా వీక్షించవచ్చును.

మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

పరమేశ్వరుడుని చేరుట జీవుని లక్ష్యమైతే, పురాణాలు, పురాణ ప్రవచానాలు మార్గం చూపుతాయని పెద్దలంటారు. పరమశివుని గురించి ధ్యాస సాదారణ రోజులలో చదవడం, వినడం ద్వారా అలవాటు చేసుకుంటే, మహాపర్వదినాలలో మనసే మార్గముగా మారిపోతుందని అంటారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం
కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి ఇస్తాడు. పరమశివుడు ఆ ఫలమును పార్వతికి ఇస్తాడు. పార్వతి మాత ఆయొక్క జ్ఙానఫలమును, తమ పిల్లలకు ఇవ్వడానికి నిశ్చయిస్తుంది. అయితే ఆదిదంపతుల కుమారులు ఇరువురు, ఆఫలము తమకు కావాలని అంటారు. అప్పుడు ఆ ఫలమును చెరిసగం చేసుకుని స్వీకరించమని, పార్వతిమాత సెలవిస్తుండగా, పరమశివుడు మాతకు మాటకు అడ్డుపడి, వలదు..వలదు… ఆఫలమును ఎవరో ఒకరే భుజించవలసి ఉంటుంది, అని పలుకుతాడు. అప్పుడు మాత పార్వతిదేవి, మహాదేవునితో ”మీరే పరిష్కారం చెప్పమనగా..” అప్పుడు శంకరుడు ”ఎవరైతే…ముల్లోకములకు ప్రదక్షిణ చేసి, ముందుగా కైలాసం వస్తారో…వారికే, ఈ జ్ఙాన ఫలము” అంటూ సమాధానం చెబుతాడు.

వెంటనే కుమారస్వామి..ఇప్పుడే ముల్లోకములకు ప్రదక్షిణ చేసి వచ్చెదనని కైలాసం నుండి బయలుదేరతాడు. అయితే వినాయకుడు కైలాసంలోనే ఉండి, మాతాపితలకు ప్రదక్షిణ చేస్తే, ముల్లోకములకు ప్రదక్షిణ చేసినట్టే, అని భావించి, విఘ్నేశ్వరుడు పార్వతి పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి, ఆఫలమును స్వీకరిస్తాడు. అయితే ముల్లోకములను చుట్టి తిరిగి కైలాసం వచ్చిన కుమారస్వామి, విషయం తెలుసుకుని, ఆగ్రహంతో మరలా కైలాసం వదిలి వెళతాడు. కైలాసం వీడి వెళుతున్న కుమారస్వామిని ఆపడానికి, ఆది దంపతులు ఇద్దరూ ప్రయత్నిస్తారు. అయినను వినక వెనుదిరగకుండా వెళుతున్న కుమారస్వామిని, ఆపడానికి ఒక అవ్వ ప్రయత్నిస్తుంది. కానీ విఫలం అవుతుంది. ఇక అప్పుడు జగన్నాత పార్వతిదేవి, కుమారస్వామి దగ్గరకు వచ్చి శివమహిమను తెలిపే, శివలీలలను చెప్పడం ప్రారంభిస్తుంది.

పాండ్యరాజు అంత:పురంలో తన రాణితో ఇష్టాగోష్టిలో ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. స్త్రీకేశముల సువాసనను సహజంగా కలిగి ఉంటాయా? అనే సందేహం కలుగుతుంది. దానికి రాణి దగ్గర కూడా సమాధానం లేకపోయేసరికి, ఇదే విషయంలో సందేహం తీర్చినవారికి వేయిబంగారు నాణెముల నజరానతో కూడిన ప్రకటన తన పాండ్యరాజ్యంలో చేయిస్తాడు. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

రాజ్యంలో ప్రకటించబడిన బహుమతికై ఆశతో ఎదురుచూసిన ధర్మి అనే ఒక పేద బ్రాహ్మణునికి, దేవాలయంలో శివుడే మారువేశంలో వచ్చి, ఆ సందేహ నివృత్తి కవితను ఇచ్చి వెళతాడు. దానితో ఆ పేద బ్రాహ్మణుడు ఆ కవితను తీసుకుని, పాండ్యరాజు గారి సభకు బయలుదేరతాడు. అక్కడ సభలో ఎవరూ ఆ సందేహ నివృత్తిని చేయగలిగేవారు లేకపోవడంతో రాజుగారు ఆశ్చర్యపడతారు. అప్పుడే శివానుగ్రహి అయిన ధర్మి బ్రాహ్మణుడు ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ధర్మి తనకు శివుడు అందించిన తాళపత్రంలోని కవితను పాండ్యరాజుగారికి చదివి వినిపిస్తాడు. ఆ కవితకు మెచ్చినరాజు, ధర్మికి బహుమానం అందజేయబోతుండగా, అక్కడి ఆస్థాన పండితుడు అయిన నక్కీరుడు, ధర్మితో ఆ కవితను నీవే వ్రాశావా? అందులో దోషముంది అని చెబుతాడు. ఇక చేసేది లేక ధర్మి సభనుండి నిరాశతో నిష్క్రమించి, దేవాలయమునకు చేరి దు:ఖిస్తూ కూర్చుంటాడు. అక్కడకు మరలా వచ్చిన శివుడు సభలో జరిగిన విషయం చెప్పమని ధర్మిని ప్రశ్నిస్తాడు. ధర్మి నీవు వ్రాసిన కవితలో దోషముంది అని సభలో చెప్పినట్టుగా శివునితో చెబుతాడు. దానికి బదులుగా శివుడు అలా చెప్పినవారిని నాకు చూపించమని, ధర్మిని రాజుగారి సభకు తీసుకువెళతాడు. రాజుగారి సభలో నక్కీరుడు, పరమశివునితో కూడా మీరు కవితలో భావదోషముందని, ఆరోపిస్తాడు. ఆగ్రహించిన పరమశివుడు తన త్రినేత్రంతో నక్కీరుని దగ్ధం చేస్తాడు. తరువాయి రాజుగారి ప్రార్ధనతో పరమశివుడు, నక్కీరుడిని పునర్జీవునిగా చేస్తాడు. తరువాత ధర్మికి వేయి బంగారు నాణేములు బహుమతిగా లభిస్తాయి. ఇక్కడ ధర్మికి బంగారు నాణేములు, నక్కీరునికి పాండిత్యపరీక్ష రెండూ ఒకేసారి చేయడం శివలీలగా పార్వతి మాత కుమారస్వామికి వివరిస్తుంది.

ఇంకా శివుని లీలలు గురించి కుమారస్వామితో మాట్లాడుతున్న పార్వతి మాత, తనను కూడా మహాదేవుని ఏవిధంగా పరీక్షించిందీ…ఆ వివరం కూడా చెప్పనారంభిస్తుంది.

లోకమాత అయిన దాక్షాయినికి, తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఙం గురించి తెలియవస్తుంది. ఆ యొక్క యాగమునకు వెళ్లాలని నిశ్చయించుకున్న దాక్షాయినిదేవి, పరమశివుని తన కోరికను తెలియజేస్తుంది. అప్పుడు మహాదేవుడు వలదని, నీవు నీపుట్టింటి మమకారంతో ఇప్పుడు దక్షుని యజ్ఙమునకు వెళ్లినచో అవమానం పొందుతావు అని వారిస్తాడు. కానీ జగన్మాత మహాదేవునితో వాదించి, శివుని అంగీకారం అడుగుతుంది. అప్పుడు పరమశివుడు విధి లోకమాతతో కూడా ఆడుకుంటుంది అని అనుకుంటూ, వెళ్లమని దాక్షాయినికి అనుజ్ఙ ఇస్తాడు. అప్పుడు లోకమాత దక్షయజ్ఙానికి బయలుదేరుతుంది.

నిరీశ్వర యాగానికి పరమశివుని పిలవకుండా చేయడం వలదని, మంత్రి సలహా ఇస్తాడు. అయినను దక్షుడు వినకుండా నిరీశ్వర యాగమునకు చేయడానికి పూనుకుంటాడు. అక్కడకు వచ్చిన జగన్మాత, తనకు తండ్రి అయిన దక్షునికి నచ్చజెప్పబోతుంది. కానీ దానికి దక్షుడు నిరాకరిస్తాడు. అవమాన భారంతో దాక్షాయిని మరలా కైలాసం చేరి, శివుని చేరుతుంది. కైలాసంలో శివునికి, పార్వతికి వాదం పెరిగి యుద్దమునకు దారి తీస్తుంది. ఆ యుద్ద ఫలితంగా శక్తి అయిన దాక్షాయిని దేహం దగ్గమవుతుంది. (గమనిక: దాక్షాయిని శరీరత్యాగం గురించి, పురాణ ప్రవక్తల మాటలు ప్రకారం అయితే దాక్షాయిని, దక్షయజ్ఙంలోనే ఆత్మార్పణం చేసుకున్నట్టుగా చెబుతారు.) తర్వాత దేవతల ప్రార్ధన మేరకు పార్వతిదేవిగా జగన్మాతకు తిరిగి శివుని చేరుతుంది. ఈ గాధను కూడా శ్రద్దగా ఆలకించిన కుమారస్వామికి ఇంకా మహాదేవి మరో శివలీల గురించి చెప్పడం ప్రారంభిస్తుంది. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

బెస్తనాయకుడి కూతురుగా పుట్టిన లోకపావని గంగా అను నామంతో యుక్తవయస్సులో ఉండగా తనతోటివారితో సముద్రపు ఒడ్డున ఆటాలాడుకుంటూ ఉంటుంది. అక్కడికి శివుడు కూడా ఒక బెస్తవాని రూపంలో వచ్చి, గంగను అల్లరి చేసి వెళతాడు. తర్వాత సముద్రంలోకి వెళ్లిన బెస్తవారు, అందరూ తిరిగి వెనుకకు రాలేకపోతూ ఉంటారు. ఎందుకంటే సాగరంలో ఉన్న తిమింగళం, సముద్రంలోకి వచ్చిన బెస్తవారిని తినేస్తూ ఉంటుంది.

దానితో బెస్త నాయకుడు సాగరంలో తిమింగళాన్ని చంపినవానికే, నాకూతురు గంగను ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు.బెస్తనాయకుడు కూతురు అయిన గంగ అక్కడి ఉన్న ధైర్యవంతులతో కూడి, సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరుతుంది. కానీ అక్కడికి బెస్తవాని వేషంలో వచ్చిన శివుడు తానే సముద్రంలోకి బయలుదేరతాడు. సముద్రంలో తిమింగళం బెస్తవాని వేషంలో ఉన్న శివునితో పోరాడి మరణిస్తుంది. అలా మరణించిన తిమింగళంతో బెస్తవాడు ఒడ్డుకు చేరతాడు. అలా బెస్తవారి వేషంలో ఉన్న పార్వతి, పరమేశ్వరులు ఒక్కటవుతారు. ఈ గాధను కూడా ఆలకించిన షణ్ముఖునికి, అమ్మ పార్వతిమాత ఇంకా ఒక అహంకారి సంగీత విద్వాంసుని విషయంలో శివలీలను వివరించడం ప్రారంభిస్తుంది.

హేమనాధ భాగవతులు పేరుగాంచిన గొప్ప సంగీత విద్వాంసుడు. సరస్వతీ కటాక్షం పొందిన హేమనాధ భాగవతులు ఎన్నో సత్కారాలు అందుకున్న పిదప, అతను పాండ్యారాజ్యానికి చేరతాడు. అక్కడ హేమనాధ భాగవతులకు, పాండ్యరాజే స్వయంగా స్వాగతం పలుకుతాడు. అహంకారం హెచ్చిన హేమనాధ భాగవతులు, తనకు స్వాగతం పలికిన పాండ్యరాజుతో చాలా గర్వంగా మట్లాడి, సభాప్రవేశం చేస్తాడు. సభలో హేమనాధుడు చేసిన గానకచేరికి, రాజు సంతోషించి, స్వయంగా హేమనాధుని దగ్గరకు వచ్చి, చాలా వినయంతో బహుమతులు సమర్పిస్తాడు. అయితే అహంకరించి ఉన్న హేమనాధుడు, నేను చాలా గొప్పవాడిని, నన్ను ఎవరైనా మీ సభలో ఓడించినచో, నేను పాండ్యరాజ్యానికి మొత్తం నాసంపదను దారాదత్తం చేస్తానని, లేకపోతే పాండ్యరాజ్యం మొత్తం నామాటకు దారాదత్తం కావాలని సవాలు చేస్తాడు. ఇంకా నేను గెలిచాక పాండ్యరాజ్యంలో ఎవరూ పాటలు పాడరాదని కూడా పలుకుతాడు.

పోటికి సమ్మతించిన పాండ్యరాజు, పోటిని రేపు నిర్వహిస్తానని చెప్పి, హేమనాధుడికి అతిధి గృహంలో ఆతిధ్యం స్వీకరించమని చెబుతాడు. అటు తరువాయి తన ఆస్థాన పండితులను ”మీలో హేమనాధునితో పోటిపడేవారు ఎవరు?” అని అడుగుతాడు. కానీ వారిలో ఎవరూ ముందుకు రారు. పాండ్యరాజు సంకటంలో పడతాడు. అయితే పాండ్యరాజుకు మంత్రి ఒక సలహా ఇస్తాడు. అదేమిటంటే..”అహంకారం ఉన్న వ్యక్తికి, అనుగ్రహం ఉన్న వ్యక్తి చేతిలో ఓటమి తప్పదు” కాబట్టి దైవానుగ్రహం భాణబట్ట అనే సాధారణ గాయకుడిని తీసుకువచ్చి పోటిలో నిలబెడదాం అని చెబుతాడు. దానికి పాండ్యరాజు అంగీకరిస్తాడు. భాణబట్టుని, పాండ్యరాజు హేమనాధునితో పోటిపడవలసినదిగా ఆజ్ఙాపిస్తాడు. ఆయొక్క రాజాజ్ఙతో భాణబట్ట పరమశివుని ఆలయానికి వెళ్లి, నాకేమిటి ఈ పరీక్ష అంటూ శివుని వేడుకుంటూ, శివలింగం దగ్గరే పడి ఉంటాడు.

అప్పుడు శివుడు ఒక కట్టెలమ్ముకునేవాని వేషం ధరించి, ఆ నగరంలో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించిన పరమశివుడు (కట్టెలవాని వేషంలో) హేమనాధుడు విశ్రమించిన అతిధిగృహం దగ్గర ఉన్న ఒక మండపంపై కూర్చుని అద్భుతమైన గానం చేస్తాడు. ఆ గానం విన్న హేమనాధుడు బయటకు వచ్చి, ఆ అద్భుతగానం చేసిందెవరని వెతుకుతాడు. అక్కడే ఉన్న కట్టెలవానిని, ఇప్పుడు అద్భుతగానం చేసిందెవరని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, హేమనాధునితో నిద్రపట్టక నేనే ఏదో ఒక కూత కూశానని చెబుతాడు. దానికి ఆశ్చర్యపడిన హేమనాధుడు, నీవు ఈ పాట ఎవరిదగ్గర నేర్చుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు కట్టెలవాడు, బాణబట్టు పేరు చెబుతాడు. దానితో దిమ్మతిరిగిన హేమనాధుడికి తన ఎంత అహంకరించినది..ఆలోచన చేసుకుంటాడు. తనతో పోటీపడబోయే శిష్యుని గానం ఇంత గొప్పగా ఉంటే, మరి ఆ బాణబట్టు గానం ఇంకెంత గొప్పగా ఉంటుందో అని ఊహించిన హేమనాధుడు ఊరి విడిచి వెళ్లిపోతాడు. వెళ్లేముందు, తన సంగీతం అంతా పాండ్యరాజ్యానికి ధారదత్తం చేస్తున్నట్టు వ్రాసిన తాళపత్రం కట్టెలవాని చేతికి ఇస్తాడు. ఆ పత్రాన్ని శివుడు శివాలయంలో ఉన్న బాణబట్టుకు అందజేసి, శివలింగంలోకి చేరతాడు. ఇలా లోకమాత కుమారస్వామికి శివలీలలు వివరించి, కుమారస్వామి మనసుని శాంతింపజేస్తుంది. శివుడు వినాయకునితో కలసి, కుమారస్వామి, పార్వతిమాత ఉన్న కొండకు వస్తారు.

ఏకొండపై కుమారస్వామికి లోకమాత శివలీలు వివరించిందో…ఆకొండే పళనిగా ప్రసిద్ది చెందుతుందని వరమిస్తారు. సినిమా సుఖాంతం అవుతుంది.

సాదారణంగా శివుని లీలలు గురించి వింటే, మాములు మనిషి మనసు శాంతిని పొందుతుంది. ఇక సాక్షత్తు మహాదేవుని కుమారుడు అయిన కుమారస్వామి మనసు ఇంకెంత శాంతిని పొంది ఉంటుంది. అంత శాంతిని పొందిన కుమారస్వామి వెలిసిన కొండ పళని కొండ. శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ధన్యవాదాలు, తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా పార్వతి పరమేశ్వరుల గాధ దక్షయజ్ఙం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

దక్షయజ్ఞం చిత్రంలో NT రామారావు పరమశివుడుగా దేవిక సతీదేవిగా, SV రంగారావు దక్షుడుగా, చిత్తూరి నాగయ్య దధీచి మహర్షిగా, రాజనాల ఇంద్రుడుగా, రామకృష్ణ చంద్రుడుగా, మిక్కిలినేని బ్రహ్మగా, పద్మనాభం, బాలకృష్ణలు దక్షప్రజాపతి కుమారులుగా, సూరిబాబు నందిగా, రఘురామయ్య నారద మహర్షిగా, కన్నాంబ వైరినిగా, రాజశ్రీ రోహిణిగా ఇంకా ఛాయాదేవి, మీనాకుమారి, వాసంతి తదితరులు మిగిలిన పాత్రల్లో నటించారు. ప్రజాదరణ పొందిన పాత చిత్రాల్లో దక్షయజ్ఞం ఒక మంచి చిత్రం. ‘దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా’.

పౌరాణిక గాధలలో సందేశం మిళితమై సందేశం కోసం సన్నివేశాలు సంఘటనలతో కూడిన గాధలు ఉంటాయి. అలా పార్వతి పరమేశ్వరుల గురించి చెప్పబడినప్పుడు తరుచూ తగిలే గాధ దక్షయజ్ఞం గాధ! పార్వతి మాత గతజన్మ వృత్తాంతం కావడం ఆ జన్మలోను ఈ జన్మలోను శివుడు మరు జన్మ లేకుండా పార్వతి మాతకు నాధుడై ఉండడం ఈ దక్షయజ్ఞం పౌరాణిక గాధ మనసులో భక్తిని ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అలాగే దక్షయజ్ఞం గురించి పురాణ ఫలశ్రుతి ఉంటే, ఈ పౌరాణిక ద్వారా సాక్ష్యాత్తు త్రిమూర్తుల అండ ఉన్నా అహంకరిస్తే ఏస్థితికి ఎటువంటి వారైనా ఎలా పతనం చెందుతారో తెలియబడుతుంది. అటువంటి దక్షయజ్ఞం దైవ చరితను వెండితెరకు ఎక్కించి ప్రేక్షకుల ముందుకు తెచ్చిన వారు కడారు నాగభూషణం, కన్నాంబ. భక్తీ, మనోబలాన్ని, పుణ్యాన్ని పెంచే దైవగాధ తెలుగు తెరపై ప్రేక్షకులకు చిరపరిచయమే.

త్రిమూర్తుల అనుగ్రహం కలిగిన దక్షుడు శాపానుగ్రహాలు ఇవ్వడం

భూలోకమున ప్రాజాపత్యం పెరగడానికి బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో దక్షుడు ప్రధానంగా ప్రఖ్యాతి గడించి, గర్వంతో అందరికి శాపానుగ్రహాలు ఇట్టే ఇచ్చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో తనతో వాదం ఆడినందులకు కన్నా కుమారులకు సైతం పామరులు కమ్మని, తన కుమారులకు సన్యాస బోధ చేసారని ఆరోపిస్తూ నారద మహర్షికి శాపాలు అనుగ్రహిస్తాడు. ఇలా ఉండే దక్షప్రజాపతికి దత్త పుత్రికలు రోహిణి మొదలైన వారితో27మందితో బాటు, తన వరపుత్రిక అయిన సతిదేవి ఉంటారు.. వారిలో రోహిణి చంద్రుడుని వరిస్తే, ఆమె అభీష్టం మేరకు చంద్రుడికి కబురు పెట్టి రోహిణి అభీష్టం గురించి చెబుతాడు, దక్షుడు. అలాగే బ్రహ్మ అజ్ఞామేరకు దత్త పుత్రికలందరికి పతి ఒక్కడే ఉండాలి, కాబట్టి నీకు సమ్మతమైతే నా దత్త పుత్రికలందరిని నీకిచ్చి వివాహం చేస్తానని అంటాడు. అందుకు అంగీకరించిన చంద్రుడితో 27మంది దత్త పుత్రికలకు వివాహం జరిపిస్తారు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ఆ వివాహనికి విచ్చేసిన త్రిమూర్తులలో శివుడు దక్షుడు కోరిక మేర అతిథిగా దక్షుని నివాసంలోనే ఉంటాడు. అక్కడ సతిదేవి శివుడికి పరిచర్యలు చేస్తుంది. శివుని కోసమే పుట్టిన అమ్మ, శివుని ఆరాధనలోనే ఉంటుంది. ఇప్పుడు శివుని వివాహమాడ తలుస్తుంది.
చంద్రుడిని పరిణయమాడిన 27మంది దత్త పుత్రికలలో రోహిణి మినహా అందరూ సంతోషంగా ఉండరు. కారణం చంద్రుడు కేవలం రోహిణిని మాత్రమే ఆదరిస్తూ ఆమెతోనే ఉంటాడు. ఈ కారణం గ్రహించిన నారదుని సూచనా మేరకు, మిగిలిన దత్త పుత్రికలు 26గురు తమ తండ్రి దక్షునితో మొరపెట్టుకుంటారు. దక్షుడు చంద్రుడిని పిలిచి, భార్యలందరినీ సమంగా చూడకపోవడం తప్పు అని చెప్పబోతే, చంద్రుడు తన సంసారం గురించి మాట్లాడడం మర్యాద కాదు అని బదులు ఇవ్వడంతో ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయ వ్యాదిగ్రస్తుడుగా ఉండమని శాపానుగ్రహం ఇస్తాడు.
వెంటనే చంద్రుడు పరమశివుడుతో మొరపెట్టుకుంటే చంద్రుడుని తన సమక్షంలో ఉండమని, అలాగే దక్షుని శాపం కూడా నిష్ప్రయోజనం కాకుండా పదిహేనురోజులు క్షయిస్తూ, పదిహేనురోజు వృద్ది పొందుతూ ఉండమని అనుగ్రహిస్తాడు. అలా పరమేశ్వరుడు అనుగ్రహం వలననే చంద్రుడు అమావాస్య నుండి పెరుగుతూ, పౌర్ణమి నుండి తగ్గుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన దక్షుడు తన మాట మన్నిస్తానని మాట ఇచ్చిన పరమశివుడు, తన శాపానికి మార్పు చేసి చంద్రుడిని అనుగ్రహించడం నచ్చక పరమశివుడిపైన ద్వేషభావం పెంచుకుంటాడు. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

సతీదేవిని వివాహమాడిన పరమశివుడు

అహంకారంతో వరగర్వంతో ఉండే దక్షుడుకి పరమశివుడుపై ఆగ్రహం రావడంతో తన వరపుత్రిక అయిన సతీదేవికి వివాహం చేయదలచి, సతీదేవి ఇష్టాన్ని ప్రక్కన పెట్టి స్వయంవరం ప్రకటిస్తాడు. సతీదేవి స్వయంవరం విషయం నారద మహర్షి ద్వారా తెలుసుకుని పరమశివుడు, సతీదేవి మనోభిష్టం నెరవేర్చాలని పరమశివుడు భావిస్తాడు. స్వయంవరం సభలో సతీదేవి విగ్రహరూపంలో ఉన్న పరమశివుడు పూలమాల వేసి వరిస్తుంది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై సతీదేవితో అంతర్ధానం అవుతారు.

ఈ సంఘటనతో దక్షుడి అహంకారం పరమశివుడుపై పూర్తీ ద్వేషభావంతో నిండిపోతుంది. ఇక మహర్షులు లోకాల శ్రేయస్సు కోసం తలపెట్టిన యజ్ఞంలోకి అందరితో బాటు దక్షుడిని ఆహ్వానిస్తారు. ఆ యాగానికి విచ్చేసిన దేవతలు త్రిమూర్తులతో సహా అక్కడే ఆసీనులై ఉంటారు. యాగానికి వస్తున్న దక్షుడుని చూసి అందరూ గౌరవంతో లేచి నిలబడితే త్రిమూర్తులు అందరికన్నా పెద్దవారు కాబట్టి ఆసీనులై ఉంటారు. అయితే దక్షుడు పరమశివుడిని చూసి అల్లుడు మామని గౌరవించక పోవడం ఏమిటి అని అంటాడు. అందులకు పరమశివుడు సభలలో బాంధవ్యాలకు తావుండదు. నే త్రిమూర్తులలో ఒక్కరిగా ఇక్కడ ఉన్నాను అంటాడు. అయిన అహంకారి అయిన దక్షుడు పరమశివుడిని దూషిస్తాడు. ఇక సభలో శాపానుగ్రహాలు వస్తాయి.

దక్షప్రజాపతి తలపెట్టిన నిరీశ్వర యాగం

సభలో తనకు పరాభవం జరిగింది, నా అల్లుడు నన్ను గౌరవించలేదు అని భావించిన దక్షుడు, శివుడుపై ఇంకా ద్వేషంతో రగిలిపోతాడు. తత్ఫలితంగా నిరీశ్వర యాగం తలపెడతాడు, అంటే శివుడు లేని యజ్ఞం చేయ నిశ్చయిస్తాడు. వరబలం మెండుగా ఉన్న దక్షుడంటే మహర్షులకు, దేవతలకు హడలు, ఆ భయంతో ఈ నిరీశ్వర యాగానికి వారు దక్షుడితో చేరతారు. బాంధవ్య దృష్టితో చూసి ఆది శక్తిని, శక్తి ఆధారమైన శివాన్ని కాదనడం దక్షుడు అహంకారం ఏ స్థితికి చేర్చిందో ఇక్కడ ప్రస్పుటం అవుతుంది. ఆది దంపతులని ద్వేషించడంలోనే దక్షుడు పతనం చెందాడు, అయితే ఫలితం కనబడే సంఘటన మాత్రం అతడు తలపెట్టిన నిరీశ్వర యాగం స్థలం. దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

జగదంబ అయిన సతీదేవి తనతండ్రి తలపెట్టిన యాగం చూడాలని పరమశివుని ప్రార్ధిస్తుంది. అయితే పరమశివుడు సతీదేవితో దక్షుడి ద్వేషభావన గురించి అప్పుడు చెప్పి, సతీదేవిని వెళ్ళవద్దని వారిస్తాడు. పుట్టింటిపై మమకారంతో అందులోను తనతోబుట్టువులు కూడా ఆ యాగానికి వెళ్ళారని తెలియడంతో అమ్మమనసు అమ్మదగ్గరికి వెళ్ళాలనే నిశ్చయించుకోవడంతో పరమశివుడు శివపరివారంతో సతీదేవిని దక్షయజ్ఞానికి పంపిస్తాడు. యాగానికి వచ్చిన సతీదేవిని యాగశాలలో ఎవరు పలకరించారు, తండ్రి ముఖం చాటేస్తాడు. భర్తమాట కాదని వచ్చినందులకు నాకు తగిన శాస్తి జరిగినది, అని తలచిన అమ్మ అగ్నిలో ఆత్మత్యాగం చేస్తుంది.

విషయం పరివారం ద్వారా విన్న శివుడు ప్రళయ రుద్రుడై నాట్యం చేసి, తన జటాజుటం నుండి వీరభద్రుడిని సృష్టిచేసి దక్షయజ్ఞం నాశనం చేయమని ఆజ్ఞాపిస్తాడు. వీరభద్రుడు దక్షయజ్ఞంలో భీబత్సం సృష్టిస్తాడు. దక్షుడి తలతెగి అగ్నికి ఆహుతి అవుతుంది. అయితే మహా ప్రతివ్రత అయిన దక్షుడి భార్య వైరిని ప్రార్ధనతో త్రిమూర్తులు ప్రత్యక్ష్యమై దక్షుడికి మేక తలను పెడతారు. అలాగే దక్షయజ్ఞం నిర్విఘ్నంగా జరిగేల ఆశీర్విదిస్తారు. అయితే జగదంబ మాత్రం దక్షుడి కుమార్తె మరలా పునర్జీవిగా రావడానికి ఇష్టపడని కారణంగా అమ్మ అదృశ్యంగానే ఉంటుంది. దక్షయజ్ఞం చలనచిత్రం ముగుస్తుంది. ఎంతటి శక్తిమంతులైనా సరే ఆహంకరిస్తే, గర్వంతో ఇతరులను నొప్పిస్తే ఎంతటి పరిణామాలు ఉంటాయో, ఎందరి జీవితాలు తలక్రిందులు అవుతాయో ఈ దక్షయజ్ఞం చిత్రం ద్వారా కనబడుతుంది. దక్షుడి అహంకారం సాక్ష్యాత్తు పరమశివుడు భార్య జగదంబ జీవితాన్నే మార్చేసింది. అలాగే అల్లుడు చంద్రుడు జీవితంపై తీవ్రప్రభావం చూపించింది. దక్షుడితో బంధుత్వం ఏర్పడిన కారణంగా పరమశివుడే నిందింపబడ్డాడు. ఇలా అహంకారి దక్షుడితో సంభందం కలిగిన అందరూ ప్రభావితులైనారు. అయితే దేవతా శక్తికి ప్రకృతి మార్పులతో మొదలువుతుంది కాబట్టి అవన్నీ లోకకళ్యాణం కోసం ఉపయోగపడ్డాయి. “దక్షయజ్ఙం మేటి తెలుగు సినిమా

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

సత్యహరిశ్చంద్ర తెలుగు భక్తి చిత్రాలు

మన పురాణాలలో ఉన్న కధలలోంచి ఎక్కువగా రాముని గురించి, కృష్ణుని గురించి ఇంకా శివుని గురించి ఒకే కధను ఇతర హీరోలతో మరలా తీయడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక మానవుని కధను మూడుసార్లు తీయడం కూడా ఉంది. పాతతరం చిత్రాలలో పాత్రకో ప్రసిద్ద హీరో కనిపిస్తూ సామజిక కుటుంబ వ్యక్తిగత సందేశాలను ఇస్తూ ఉండడం కనబడుతూ ఉంటుంది. అటువంటి తెలుగు చిత్రాలలో ఒక సత్యానికి ప్రతీకగా సత్యం గొప్పతనం తెలిపే గొప్ప చిత్రం

స్టార్ ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో టి.ఏ. రామన్ దర్శకత్వంలో హరిశ్చంద్ర తెలుగు చిత్రం 1930 దశకంలోనే వచ్చింది. ఈ చిత్రంలో అద్దంకి శ్రీరామమూర్తి, పి కన్నాంబ, బందర్ నాయుడు, పులిపాటి వెంకటేశ్వర్లు, మాస్టర్ భీమారావు, ఆకుల నరసింహారావు, జె. రామకృష్ణారావు తదితరులు నటించారు.

ఇంకా రాజ్యం పిక్చర్స్ సమర్పణలో హరిశ్చంద్ర పేరుతోనే మరలా ఈ చిత్రం తెరకెక్కించగా, ఇందులో ఎస్వీ. రంగారావు, లక్ష్మిరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూరిబాబు, రఘురామయ్య, ఏ.వి. సుబ్బారావు, గౌరిపతిశాస్త్రి తదితరులు నటించారు.

తర్వాత సత్యహరిశ్చంద్ర గాధ53 ఏళ్ల క్రిందట వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, ఎస్ వరలక్ష్మి, నాగయ్య, ముక్కామల, రమణారెడ్డి, రాజనాల, రాజశ్రీ, మీనాకుమారి, రేలంగి, గిరిజ తదితరులు నటించారు. సత్యహరిశ్చంద్ర చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు అందించగా ప్రముఖ దర్శకులు కె.వి. రెడ్డి నిర్మాణదర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ సత్యహరిశ్చంద్ర గాధని చిత్రంగా సంస్థ నిర్మించింది.

సత్యహరిశ్చంద్ర మహారాజు పౌరాణిక గాధనుండి తెలుగు తెరపై కె.వి. రెడ్డిగారు నందమూరి తారక రామారావుగారిని సత్యహరిశ్చంద్రగా చూపించారు. ప్రముఖ గాయని అయిన ఎస్ వరలక్ష్మిగారిని సత్యహరిశ్చంద్ర భార్యగా చంద్రమతిగా చూపించారు. తెలుగుతెర తొలి కధానాయకుడు అయిన నాగయ్యగారిని వశిష్ఠ మహర్షి పాత్రలో చూపించారు. ప్రముఖ నటుడు ముక్కామలగారిని మహర్షి విశ్వామిత్రుడుగా చూపిస్తూ, విశ్వామిత్ర ప్రధాన శిష్యుడు నక్షత్రకుడు పాత్రలో రమణారెడ్డి గారిని చూపించారు. కాశి పట్టణవాసిగా కాలకౌశికుడు పాత్రలో రేలంగి నరసింహారావుగారిని చూపిస్తూ, కాల కౌశికుడుకి గయ్యాళి భార్యగా గిరిజని చూపించారు. మిక్కిలినేని గారిని ఇంద్రుడుగా చూపిస్తూ పార్వతిపరమేశ్వరులుగా సబితాదేవి-ప్రభాకర్ రెడ్డిగార్లని చూపించారు. ఇంకా వివిధ పాత్రల్లో ఎల్ విజయలక్ష్మి, రాజబాబు, రాజనాల, రాజశ్రీ, వాణిశ్రీ, మీనాకుమారి, మోహన, చదలవాడ, బాలకృష్ణ మొదలైనవారు SatyaHarisChandra Movie నటించారు. ‘NTR Satya Harishchandra Full Story Telugu Movie’

ఇంద్రసభలో వశిష్ఠుడు-విశ్వామిత్రుల సంవాదం

ఆడినమాట తప్పని హరిశ్చంద్ర మహారాజు సూర్య వంశస్తుడుగా పరమశివ భక్తుడు. రాజసూయ యాగము చేసి యజ్నఫలాన్ని పొందిన హరిశ్చంద్ర మహారాజు ఆ యజ్నఫల మహిమ రాజ్యంలో ప్రజలందరికి కలగాలని రాజసభలో యజ్న ఫల దర్శన భాగ్యం అయోధ్య ప్రజలకు కల్పిస్తారు. పిమ్మట యజ్న ఫలం గొప్పతనం రాజర్షి దాత అయిన హరిశ్చంద్ర మహారాజు గురించి రాజవంశగురువు వశిష్ఠ మహర్షి సభకు తెలియజేస్తారు. అదే సభలో ఒక యోగి వచ్చి మహారాజు దగ్గర మాట ఆ యజ్నఫలాన్ని అర్ధిస్తారు. అంతటి మహిమ కలిగిన యజ్నఫలాన్ని ఆ యోగికి దానం చేసేస్తారు, హరిశ్చంద్ర మహారాజు. (అయితే ఆ నిష్కామయోగిగా వచ్చింది పరమశివుడే, యజ్నఫలాన్ని పట్టుకుని ఆ యోగి, హరిశ్చంద్ర మహారాజు పూజామందిరంలోకి వెళ్లి అంతర్ధానం అవుతారు. అక్కడ వాక్కులుగా  హరిశ్చంద్రుడు యొక్క సత్యనిష్ఠని పరీక్ష చేయదలచానని పరమశివుడు పార్వతిమాతతో పలకడం వినబడుతుంది.)

ఇంద్ర సభలో మహర్షులతో సమావేశమై ఉన్న దేవేంద్రుడు, సభలో మహర్షులతో అందరిని పేద, ధనిక బేదాలు లేకుండా అందరిని తరింపజేసే వ్రతం ఏదైనా సెలవియ్యండి అని అనగా…. విశ్వామిత్ర మహర్షి అందరికి తగిన ఏకైక వ్రతం ఏది లేదు అర్హతను బట్టి వారి వారి తాహతు బట్టి మాత్రమే వ్రతాలు వుంటాయి అని చెబితే, మహర్షి వశిష్టులు మాత్రం అందరూ ఆచరించి తరించగలిగే వ్రతం సత్యవ్రతం ఒక్కటే అని బదులు చెబుతారు. సత్యవ్రతం ఆచరింప అసాద్యం అని అందులోను మానవమాత్రులు ఆచరించడం అనేది కుదరదు. వారి జీవన విధానం రిత్యా మానవులు సత్యవ్రతం అసాద్యం అని మహర్షి విశ్వామిత్రులువారు చెబుతూ వశిష్ఠ మహర్షి ప్రతిపాదనని తోసిపుచ్చుతారు. వశిష్ఠ – విశ్వామిత్ర వాదనల పిదప దేవేంద్రులువారు అలాంటి సత్యవ్రతం చేసేవారు ఎవరైనా ఉంటే చెప్పమని వశిష్ఠమహర్షిని అడుగుతారు.

అందుకు వశిష్ఠ మహర్షి సూర్య వంశస్తుడు త్రిశంకువు కుమారుడు అయిన సత్యహరిశ్చంద్ర మహారాజు గురించి చెబుతారు. ఆ మాటకు కూడా విశ్వామిత్ర మహర్షి ఇంకో వాదనను తీసుకువస్తారు. ఈ వశిష్ఠ మహర్షి హరిశ్చంద్ర వంశానికి గురువు కావున వశిష్టులు హరిశ్చంద్ర మహారాజు గురించి గొప్పగా చెబుతున్నారు అని అంటారు. ఇక ఇంద్ర సభలో దేవతలు, మహర్షుల సమక్షంలో విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్ర మహారాజు సత్యనిష్టతని పరిక్షిస్తానని అందులో హరిశ్చంద్ర మహారాజు కచ్చితంగా అసత్యమాడేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకు వశిష్ఠ మహర్షి ఒకవేళ సత్యహరిశ్చంద్రుడు అబద్దమాడితే నేను ఆచార బ్రష్టుడినై బ్రతుకుతాను అని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే విశ్వామిత్ర మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుతో అసత్యవాక్కు పలికించలేకపోతే తన తపశక్తిలో సగభాగం సత్యహరిశ్చంద్ర మహారాజుకి ధారపోస్తానని, సహస్ర వర్షములు సకల చక్రవర్తిగా పరిపాలన చేస్తాడని, అంతేకాకుండా చిరకాలం 14 మన్వంతరముల వరకు దేవేంద్ర సింహాసనంలో సగభాగం కలిగి ఉండేలా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

విశ్వామిత్ర మహర్షి పరీక్షలో భాగంగా రాజ్యదానం చేసేసిన హరిశ్చంద్ర

స్వర్గం నుండి బూలోకం వచ్చిన విశ్వామిత్ర మహర్షి తన ప్రధాన శిష్యుడు నక్షత్రకుడుతో కలిసి అయోధ్యకు హరిశ్చంద్ర రాజసభకు వస్తారు. ఒక ఎత్తైన మదపుటేనుగుపై ఒక పహిల్వాన్ ఎక్కి అతను విసిరిన రత్నం ఎంత పైకి వెళితే అంత ధనరాశి కావాలి అంటారు. సాదారణంగా ఒకమహారాజు అంతధనము ఇవ్వడమంటే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే అవుతుంది. హరిశ్చంద్రుడుని అంత ధనము అడిగితే, రాజు సంకోచించి మాట వెనుకకు తీసుకుంటాడెమో అని ఆలోచన చేసిన మహర్షి అంత మొత్తం ధనమును హరిశ్చంద్ర మహారాజుని కోరతారు. అడిగిన వెంటనే అంతధనము మీదే పట్టుకుని వెళ్ళండి అని అన్న హరిశ్చంద్ర మహారాజు మాటకు విశ్వామిత్ర మహర్షి ఆ ధనమును అవసరమైనప్పుడు తీసుకుంటాను నీవద్దనే ఉండని అని చెప్పి, రాజ సభనుండి నిష్క్రమిస్తారు.

విశ్వామిత్రవెనువెంటనే తన మాయ సృష్టిద్వారా క్రూరమృగాలను సృష్టించి అడవులలో స్వేచ్చగా వదిలేస్తారు, ఆ మృగాలు అడవి నుండి ఊళ్లపైకి వచ్చి పడతాయి. ప్రజలు మొర ఆలకించిన హరిశ్చంద్ర మహారాజు క్రూర మృగాల వేటకు అడవికి వెళ్లి, వాటిని వేటడతారు. అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి ఇద్దరు స్త్రీలను సృష్టించి అడవిలో ఉన్న హరిశ్చంద్ర మహారాజు వద్దకి పంపిస్తాడు. ఆ స్త్రీలు హరిశ్చంద్ర మహారాజు ముందు ఆడి పాడి, మహారాజుని పెండ్లి చేసుకోవలసినదిగా కోరతారు. వారిని వారించిన వినని స్త్రీలను మహారాజు తన సైన్యం ద్వారా అడ్డుకుంటారు. వారు మరలా విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వచ్చి మొరపెట్టుకుంటారు.

మహర్షి ఆగ్రహంలో ఉండగా అక్కడికి హరిశ్చంద్ర మహారాజు వస్తారు. వచ్చి జరిగిన విషయం వివరిస్తారు. అయితే వరించిన తన కుమార్తెలను పెండ్లి చేసుకోవలసిందే అని చెబుతారు. (వివాహమహోత్సవంలో అందరిముందు అగ్ని సాక్షిగా చేసే మంత్రపూర్వక ప్రతిజ్ఞ ఉంటుంది. ఇప్పుడు హరిశ్చంద్ర మహారాజు కోరి వచ్చారు కదా అని ఆ స్త్రీలను వరిస్తే అసత్య దోషమే వస్తుంది.). అయితే ఇప్పుడు ఇప్పటికే అగ్నిసాక్షిగా సంతానం కోసమే వివాహమాడిన ధర్మపత్ని ఉండగా, ఈ స్త్రీలను వివాహమాడడం అధర్మమని హరిశ్చంద్ర మహారాజు చెబితే, అందుకు బదులుగా బ్రహ్మర్షి విశ్వామిత్ర, తపోధనుల మాట వినడమే రాజధర్మం అని చెబుతారు. రాజర్షి అయిన హరిశ్చంద్రుడు అటువంటి ధర్మం కలిగిన ఈ రాచరికం నాకు వద్దు అని రాజ్యదాననికే సిద్ధపడతారు. నిండు రాజసభలో సకల రాజ్యాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రకు ధారపోసి కట్టుబట్టలతో తన భార్య, కుమారుడుతో కలిసి రాజ్యాన్ని వదిలి అడవికి బయలుదేరతారు, సత్య హరిశ్చంద్రుడు. రాజ్యాన్ని వీడుతున్న రాజుని చూసి ప్రజలు విలపిస్తూ హరిశ్చంద్రుడుకి వీడ్కోలు పలుకుతారు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

హరిశ్చంద్రుడు రాజభోగాలను త్యజించి, తన భార్యాపిల్లలతో అడవులలోకి

మొదటగా విశ్వామిత్ర మహర్షికి దానం చేసిన సొమ్ము హరిశ్చంద్ర మహారాజు వద్ద ఉంటుంది, అయితే సకల రాజ్యం దానంగా ఇచ్చిన మహారాజు విశ్వామిత్రుడికి ముందుగా ఇచ్చిన దానం ఋణంగానే ఉంటుంది. రాజ్యం నుండి బయటకు వచ్చిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్ర మహర్షి తనకు దానంగా ఇచ్చిన సొమ్ము నీవద్దనే ఉంది, కావునా అది నీకు రుణమే ఆ ఋణం తీర్చుకో అని చెబుతారు. అందుకు హరిశ్చంద్రుడు నెలరోజులు గడువు కోరతారు. అయితే ఆ రుణనిమిత్తం అయోధ్య రాజ్యంలో కానీ, అయోధ్య సామంత రాజ్యాలలో కానీ సంపాదన చేయకూడదని విశ్వామిత్ర మహర్షి అజ్నపిస్తారు హరిశ్చంద్రుడిని.

అడవుల బారిన పడిన హరిశ్చంద్రుడిని అతని భార్య పిల్లలు అనుసరిస్తారు, అలాగే రుణ వసూలు కోసం నక్షత్రకుడు హరిశ్చంద్రుడుని అనుసరిస్తారు. అయితే అడవులలో కూడా నక్షత్రకుడు ప్రవర్తనకు తోడూ, వశిష్టుడుగా మారువేషంలో ఒక రాక్షసుడు వచ్చి, విశ్వామిత్ర మహర్షి మోసం నాకు తెలుసు నేను అతన్ని అంతం చేస్తాని, నీవు నీ రాజ్యాన్ని దక్కించుకో అని చెబుతాడు. దానికి సత్యహరిశ్చంద్రుడు దానం చేసిన రాజ్యాన్ని నేను పొందగోరను, అని బదులు చెబుతాడు. తరువాత దావాగ్ని దహించుకుంటూ అడవినలువైపులా నుండి హరిశ్చంద్రుడివైపు వస్తూ ఉంటుంది. NTR Satya Harishchandra Full Story Telugu Movie

అలా వస్తున్న అగ్నిదేవుడు నక్షత్రకుడుతో మీ నిజమైన పేర్లు మీవి కావు అని చెప్పినా మీకు ప్రమాదం ఉండదని చెపుతాడు. ఆ విషయం హరిశ్చంద్రుడుకి చెప్పి, తానూ బ్రహ్మర్షి విశ్వామిత్రుని శిష్యుడుని కాదు నాపేరు నక్షత్రకుడు కాదు అని చెప్పి, అగ్నిలోకి వెళ్లి, క్షేమంగా వచ్చేస్తాడు. అలా వెళ్లి వచ్చి హరిశ్చంద్రుడుని, అతని భార్య చంద్రమతిదేవిని కూడా ఆ పని చేయమంటాడు. పేర్లు తమవి కావు అని అనడమంటే అసత్యమే అవుతుంది. ఆ పని నేనుచేయననే చెబుతారు(కేవలమ పేరు తనది కాదు తాత్కాలికంగా నేను నేను కాదు అని చెప్పినా అసత్యదోషమే అవుతుంది అని భావించిన హరిశ్చంద్రుడు, వారి భార్య పిల్లలు). తరువాత చంద్రమతి దేవి ప్రార్ధనతో అగ్నిదేవుడు శాంతించి వెనుతిరుగుతాడు.

కాశీ పట్టణంలో భార్యా విక్రయం

ఇక అక్కడి నుండి బయలుదేరిన వారు కాశి పట్టణం చేరుకుంటారు. కాశి పట్టణంలో శ్రీమంతుల కొరకు దాసిలను విక్రయించే స్థలం ఉంటుంది. ఋణం చెల్లించవలసిన గడువు నేటితో తీరిపోతుంది అని అన్న నక్షత్రకుడు మాటలతో, హరిశ్చంద్రుడు భార్య చంద్రమతి దేవి, తనను విక్రయించి ఆ ఋషి ఋణం గడువులోపు తీర్చేయండి అని సలహా హరిశ్చంద్రుడుకి సలహా ఇస్తుంది. అందుకు హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మలేను, నేనే దాసిగా అమ్ముడయ్యి, ఆ ఋణం తీర్చేస్తాను అని చెబుతాడు. అయితే అమ్మకంలో రుణానికి సరిపడా సొమ్ములు రాకపోతే, నీవు ఋణగ్రస్తుడుగానే మిగిలిపోతావు అని నక్షత్రకుడి మాటలకూ, హరిశ్చంద్రుడు అచేతనావస్థలో ఉంటారు. అప్పుడు చంద్రమతి దేవి తననే విక్రయించి, ఆ ఋణం తీర్చేయమని హరిశ్చంద్ర మహారాజుకి చెబుతుంది. గత్యంతరం లేని హరిశ్చంద్రుడు తన భార్యని దాసీగా అమ్మడానకి కాశి పట్టణంలో అయిష్టంగా సిద్దపడతాడు.

కాల కౌశికుడు కాశిపట్టణంలో గయ్యాళి భార్య భాదలకు లోనవుతూ తద్దినాలకు వెళుతూ ఉంటాడు. అలాంటి కాలకౌశికుడుకి తోడుగా జడబట్టు ఉంటూ ఉంటాడు. తద్దిన భోజనానికి వెళ్ళిన కాల కౌశికుడు వేషంలో పరమశివుడే వచ్చి కాశిపట్టణ దాసీ విక్రయ స్థలానికి వచ్చి చంద్రమతి దేవిని కాలకౌశికుడుకి దాసిగా నక్షత్రకుడు అడిగిన రుణసొమ్మును చెల్లించి, చంద్రమతి దేవిని కాల కౌశికుడు ఇంటికి చేరుస్తాడు. దాసిగా అమ్ముడైన చంద్రమతిదేవితోనే వారి కుమారుడు లోహితాస్వుడు వెళతాడు. విశ్వామిత్ర మహర్షి ఋణం తీర్చుకున్న సత్యహరిశ్చంద్రుడుకి ఇంకో ఆపద్ధర్మ ఋణం వచ్చి పడుతుంది. ఇన్నాళ్ళు హరిశ్చంద్రుడు వెనుక తిరిగిన నక్షత్రకుడుకి బత్యం బకాయి పడతాడు, హరిశ్చంద్రుడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

నక్షత్రకుడి జీతం చెల్లించడానికి తనని అమ్మకానికి పెట్టమని హరిశ్చంద్రుడు నక్షత్రకుడుని కోరతాడు, అప్పుడు నక్షత్రకుడు కాశిపట్టణంలో సత్యహరిశ్చంద్రుడుని ఒక కాటికాపరి వీరబాహుకి అమ్మి వచ్చిన సొమ్ముతో వెనుతిరుగుతాడు. బానిసగా అమ్ముడుపోయిన హరిశ్చంద్రుడు కాటికాపరిగా పనిచేస్తూ ఉంటాడు. కాటికాపరి వీరబాహు చెప్పినట్టు, శవదహనానికి తగిన ధాన్యము, ధనము తీసుకుని ఆ పని చేస్తూ ఉంటారు, సత్యహరిశ్చంద్ర రాజర్షి.

కాటిదాకా వెళ్లిన విశ్వామిత్ర పరీక్ష

బానిసగా కాలకౌశికుడు ఇంట్లో పనిచేస్తున్న చంద్రమతి, లోహితాస్వులను, గయ్యాళి కాలకౌశికుడు భార్య భాదలు పెడుతూ ఉంటుంది. అందులో భాగంగా లోహితాస్వుడుని దర్బలకోసం కాలకౌశికుడు శిష్యులతో అడవికి పంపుతుంది, కాలకౌశికుడు భార్య, అక్కడ అడవిలో మాయసర్పం కాటుతో లోహితాస్వుడు మరణిస్తాడు. విషయం తెలిసిన చంద్రమతి దేవి లోహితాస్వుడు దగ్గరికి వెళ్లి విలపించి, కుమారుడి శవాన్ని పట్టుకుని కాటికి వెళుతుంది. కాని అక్కడ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు, శవదహన సొమ్ము చెల్లించనదే శవాన్ని కాల్చడానికి వీలులేదని అడ్డుకుంటాడు. భర్తని గుర్తుపట్టిన చంద్రమతిదేవి భర్త అసత్యదోషమేర్పడకుండా ఉండడానికి శవాదహన రుసుం తన యజమాని దగ్గర నుండి తీసుకువస్తానని మరలా కాలకౌశికుడు ఇంటికి బయలుదేరుతుంది.

అయితే విశ్వామిత్ర సృష్టిలో భాగంగా మాయ దొంగ, కాశి రాజు యొక్క కుమారుడుని చంద్రమతి వేషంలో ఎత్తుకొచ్చి అడవిలో వదిలి వెళ్ళిపోతారు. కాలకౌశికుడు ఇంటికి వెళ్తున్న చంద్రమతి దేవికి దారిలో పసిబిడ్డ ఏడుపు వినిపించి, ఆ పసిబిడ్డదగ్గరకి వెళుతుంది, అప్పటికే ఆ బిడ్డడు మరణించి ఉంటాడు. మాయదొంగని వెంబడించిన కాశి రాజు సైనికులు చంద్రమతిదేవిని బంధించి, కాశి రాజుదగ్గర నిలబెడతారు. బిడ్డ ఆమెవలననే మరణించింది అని భావించిన కాశి రాజు చంద్రమతిదేవికి మరణదండన విధిస్తాడు. ఆ మరణదండనను అమలు చేయవలసినదిగా వీరబాహుకి అప్పజేపితే, ఆపనిని వీరబాహు హరిశ్చంద్రుడుకి అప్పజేప్పుతాడు. NTR Satya Harishchandra Full Story Telugu Movie

కాటికాపరి వృత్తిరిత్యా హరిశ్చంద్రుడు తనభార్యని చంద్రమతిని వీరబాహు ఆదేశానుసారం హతం చేయడానికి సిద్దపడతాడు. అయితే విశ్వామిత్రుడు అక్కడికి వచ్చి వారించిన వినకుండా భార్య శిరస్సుని హరిశ్చంద్రుడు ఖండించబోతాడు. విశ్వామిత్రుడు ఓటమిని అంగీకరించినా చంద్రమతి శిరస్సుని ఖండించాబోయిన ఖడ్గం పూలమాలగా చంద్రమతిదేవి మెడలో ప్రత్యక్ష్యం అవుతుంది. పరమశివుడు, ప్రత్యక్షమై సత్యహరిశ్చంద్రుడు కుమారుడిని, కాశిరాజు కుమారుడుని బ్రతికిస్తాడు. బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు తన ప్రతిజ్ఞని నెరవేర్చుకుంటారు. సత్యహరిశ్చంద్ర మహారాజు పరమశివ ప్రార్ధనతో “NTR Satya Harishchandra Full Story Telugu Movie” చిత్రం ముగుస్తుంది.

తెలుగు రీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

వినాయకవిజయం తెలుగు భక్తి రసచిత్రం

Vinayaka Vijayam Vijayavantamaina Telugu Bhakti Chitram – వినాయక విజయం విజయవంతమైన తెలుగు భక్తి చిత్రం. ఆదిదంపతుల ముద్దుబిడ్డ అయిన వినాయకుడి యొక్క పౌరాణిక చిత్రకధ. కొత్తగా ఏ పని ప్రారంభించాలన్న వినాయకుడి అనుగ్రహం అవసరం, అటువంటి వినాయక విజయం తెలుసుకుంటే, విఘ్నాలు జయించి విజయంవైపు వెళ్ళడమే అవుతుంది. ఇక ఈ చిత్రం విజయవంతమైన భక్తి చిత్రం వినాయక విజయంలో వినాయకుడు (Vinayaka) పుట్టుకకు కారణాలు, కారణజన్ముడు అయిన ఉమాపుత్రుడిగా వినాయకుడి పుట్టుక, వినాయకుడి శిరమార్పిడి, వినాయకునికి(Vinayaka) దేవతల ఆశీస్సులు, వరాలు, వినాయకుని(Vinayaka) విఘ్నాదిపత్యం, చివరగా మూషికునిపై విజయంతో కద కంచికి మనం ఇంటికి అన్నట్లు సాగుతుంది.

బ్యానర్: జగన్మాత ఆర్ట్స్
చిత్రంపేరు: వినాయక విజయం
పాత్రలు:
బాలవినాయకుడు: బేబీ లక్ష్మీసుధ
వినాయకుడు: ఎంజివి మదన్ గోపాల్
శివుడు: కృష్ణంరాజు
పార్వతి: వాణిశ్రీ
విష్ణువు: రామకృష్ణ

వినాయకుడి పుట్టుక కారణాలు: అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, బ్రహ్మచర్య దీక్ష, జితేంద్రియుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు, సర్వశక్తిసంపన్నుడు అయిన మహావీరుడు అయి బ్రహ్మ సృష్టిలో పుట్టకుండా ఉన్న వ్యక్తి చేత అంతం అయ్యే అవకాశం మూషిక రాక్షసుడికి ఉండడమే అయితే, ఆ కారణం లోక కళ్యాణం (Vinayaka Vijayam) అయింది. మన అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడు (Vinayaka)వచ్చాడు.

వినాయక విజయం కధప్రారంభం – Vinayaka Vijayam Vijayavantamaina Telugu Bhakti Chitram

కైలాసంలో ఆదిదంపతులు లక్ష్మినారాయణులు, బ్రహ్మాది దేవతలతో కొలువుదీరిన సభతో చిత్ర ప్రారంభం అవుతుంది. ఆ యొక్క సభలో దేవతలందరూ త్రిపుసారుల సంహారం అయ్యింది కానీ మరలా వారి వారసులు మూషికుడు వలన మరియు గజాసురుడు వలన భవిష్యత్తులో ఇంద్రాది దేవతలకు ఇబ్బందులు కలగవచ్చు అని సందేహం నారద మునీంద్రులు వెలిబుచ్చుతారు. అందుకు ప్రతిగా శ్రీమహావిష్ణువు ఆదిదంపతులైన పార్వతిపరమేశ్వరులు ఇరువురు కలసి కైలాసంలో ఉండగా లోకాలలో ఎవరికీ ఏ ఇబ్బంది రాబోదని వెల్లడి చేస్తారు.

మరొక సన్నివేశంలో మూషికుడు, గజాసురుడు సభలో కొలువు తీరి ఉండగా నారద మహాముని వేంచేస్తారు. ఉచితాసినులు అయిన నారద మునీంద్రులు వారికి కైలాస సభ ప్రస్తావన తెచ్చి, హరిహరుల సహకారంతో రాక్షస జాతిని అంతమొందించాలని దేవతల ప్రయత్నం అని చెబుతారు. దానికి మేము అంతకముందే దేవతలను అంతం చేస్తాం అని బదులు ఇస్తాడు మూషికుడు అయితే ఇంతకుముందు చాలామంది రాక్షసులు పలికి ఫలితం సాధించాలేకపోయరని ప్రతిగా బదులు పలుకుతారు నారద మునీంద్రులు. శక్తితో శివుడు కలిసి ఉన్నన్నాళ్ళు ఎవరికీ అపాయం రాదని చెబితే, వారిని భక్తితో వేరు చేస్తానని గజాసురుడు పలుకుతాడు. ఇంద్రుడిని జయించి స్వర్గాన్ని జయిస్తానని మూషికుడు పలుకుతాడు.

మూషికుడు భార్య ప్రియంవద మాత్రం చాల ప్రాతివత్యం కలిగి, జగన్మాతను ఆరాధిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు తన పతి యోగక్షేమాలు కోరుతూ పూజలు చేస్తూ ఉంటుంది. ఇక మూషికుడికి ఇతరుల మనస్సును కొంతసేపు మాయచేసి తానూ అనుకున్న మాయ వారిపై ప్రయోగించకలడు. ఈ విద్యను పూజామందిరంలో ఉన్న తన భార్యపై ప్రయోగించి చూపుతాడు.
మరొక సన్నివేశంలో గజాసురుడు శివుడి కోసం తపస్సు ప్రారంభిస్తాడు, అత్యంత భక్తి శ్రద్దలతో శివుడిని అర్చిస్తూ ఉంటాడు.

దేవేంద్రుడు దుర్వాస మహర్షి చేత శపించబడడం, పరమశివుడు గజాసురుడి గర్భంలో కొలువై ఉండడం.

తరువాతి సన్నివేశంలో ఇంద్రసభకు దూర్వాస మహర్షి వేంచేస్తారు, అప్పుడు దేవేంద్రుడు ఆ మునీంద్రుడుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి గౌరవిస్తారు. సంతసించిన ముని తన తపఃప్రభావమైన ఒక మాలను ఇస్తే, అప్పుడే మూషికుడు కూడా అక్కడ జరుగుతున్న సన్నివేశం చూసి, మహాముని దగ్గర ఇంద్రుడిపై తన విద్యను ప్రదర్శించి, ఇంద్రుడితో అహంకారపూరితమైన మాటలు మాట్లాడించి, దూర్వాస ముని ఆగ్రహానికి కారణం అయ్యేలా చేస్తాడు. ఇంద్రుడి ప్రవర్తన కారణంగా కోపగించిన ముని దేవేంద్రుడు పదవి కోల్పోయి రాక్షసులచే పీడీంపబడతావని శపించి అక్కడ నుండి నిష్క్రమిస్తారు. మాయ తొలగగానే నేనెందుకు ఇలా ప్రవర్తించానని దేవేంద్రులు చింతిస్తుంటే, అందుకు నారద మహర్షి, నీవు మూషికుని మాయప్రభావం వలన అలా ప్రవర్తించావని, అతని దుర్బుద్ధితో నీమీద ఈ ప్రయోగం చేసాడని వివరిస్తారు.

తరువాతి సన్నివేశంలో పార్వతి మాత వద్దకు వెళ్లి, గజాసురుడు చేస్తున్న భక్తిపూర్వకమైన తపస్సు, అందులో అంతర్యం వివరించి, పరమేశ్వరా అంటే పరిగెత్తుకెళ్ళి మరీ వరాలిచ్చే శివుడితో జాగ్రత్త అని చెబుతారు. అయితే పరమశివుడు మాయలు చేయని మహాదేవుడు, భక్తులు కోరికలు నెరవేర్చే భాక్తపరాదినుడు అని అంటుంది పార్వతి మాత. ఈలోపు పరమేశ్వరులు అక్కడికి వేంచయగానే నారద మహర్షి నిష్క్రమిస్తారు. పార్వతి మాత మహాదేవుని గజాసురుడు సంగతి అడిగితే, భక్తులు కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం అని బదులిస్తే, తర్వాతి సన్నివేశం గజాసురుని తపఃప్రాంతంలోకి. Vinayaka Vijayam Vijayavantamaina Telugu Bhakti Chitram

తపస్సు చేస్తున్న గజాసురుడు ఎంతకీ, శివుని అనుగ్రహం కలగలేదని, నీ కరుణలేని ఈ జన్మ నాకొద్దని తనతలని తానే నరుక్కోబోతాడు, వెంటనే పరమశివుడు ప్రత్యక్షమైతే, అప్పుడు గజాసురుడు శివుని చూసి, ముక్కంటి, గౌరీమనోహరా, గంగాధరా కరుణించితివా అని శివుని కాళ్ళపై పడతాడు. అప్పుడు శివుడు నీ భక్తికి మెచ్చా, వరం కోరుకో అంటాడు. గజాసురుడు నీవు నా గర్భంలో కొలువు అయి ఉండాలి అంటాడు, అప్పుడు పరమశివుడు, ఈ కోరిక వలన విపరీత పరిణామాలు వస్తాయని వారించినా, వాటికి నేనుసిద్దం నీ నా గర్భంలో కొలువు కమ్మని వేడుకుంటాడు గజాసురుడు. శివుడు గజాసురుడి గర్భంలోకి శివలింగంగా వెళతాడు. ఇక మూశికుడి ఆగడాలు మొదలవుతాయి. మూషికుడు ఇంద్రుడిని ఓడించి, స్వర్గాన్ని ఆక్రమించి, తానూ ముల్లోకాలకు ప్రభువుగా ప్రకటించుకుంటాడు.

తల్లిచేతిలో పుట్టిన వినాయకుడు (Vinayaka), తండ్రి చేతితో మరలా బ్రతకడం

ఇంద్రాది దేవతలు, మునీంద్రులు బ్రహ్మలోకం వెళ్లి, బ్రహ్మదేవులకు మొరపెట్టుకుంటారు, మూషికుని గూర్చి. భ్రాహ్మగారు మూషికుడు వరసంపన్నుడు అతను అంతం అవ్వాలంటే, అయోనిజుడు, అకుంటిత దీక్షాపరుడు, ద్విజన్ముడు, ద్విరూపుడు, జితేంద్రీయుడు, గుణశ్రేష్టుడు, సురశ్రేష్టుడు సర్వశక్తి సముపార్జుతుడు మరియు నా సృష్టిలో జన్మించనివాడు అయి ఉండాలి అని చెప్పి, ఆ జగజ్జనని శరణు వేడండి అని చెబితే, దేవతలు పార్వతి మాతను కలిసి ఈ విషయం మొరపెట్టుకుంటారు. అప్పుడు పార్వతిమాత పరమశివులు లేరు, శివుడు లేకుండా నేనేమి చేయలేనని చెబితే, దేవతలు శ్రీమహావిష్ణువుని ప్రార్ధిస్తారు. ప్రత్యక్షమైన ఉపేంద్రుడు పార్వతిమాతలో మోసాన్ని మోసంతో జయించాలి, మేము శివుడిని ఆ గజాసురుని గర్భం నుండి బయటికి తీసుకువస్తాం అయితే, మా ప్రయత్నానికి తోడుగా నీవు కూడా శివుడు వచ్చేవరకు భగ్నం కలగకుండా శివదీక్ష చేయమని అంతర్ధానం అవుతాడు.

అభ్యంగన స్నానం చేయబోతు పార్వతిమాత దేవతలు చెప్పిన సుగుణాలు కలిగిన కుమారుని ఆలోచన చేస్తూ, తన చేతిలో ఉన్న పసుపుముద్దతో బాలుడి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మ బాలుడుకి జగన్మాత ప్రాణం పోస్తే, బాలుడికి(Vinayakudiki) పార్వతి మాత తన శక్తి ఆయుధం ఇచ్చి, నేను శివదీక్ష చేస్తున్నాను కావున, ఎవరు మందిరప్రవేశం చేయకుండా కావలి కాయమని చెప్పి, పార్వతి మాత శివదీక్షలో ఉంటుంది.

గజాసురుడు సభలో కొలువై ఉండగా, విష్ణువు, బ్రహ్మాదిదేవతలు మారువేషంలో వచ్చి ఎద్దులతో నృత్యప్రదర్శన చేసి, అతడిని మెప్పిస్తారు. అప్పుడు గజాసురుడు మీకు కావాల్సినది కోరుకోమంటాడు, బదులుగా బ్రహ్మ, విష్ణువులు నీ గర్భంలో ఉన్న శివుడుని ఇచ్చేయమని చెబుతారు. గజాసురుడు దేవతలతో శివుడిని మీరే మెప్పించి తీసుకువెళ్ళండి అని బదులుఇస్తాడు. బ్రహ్మవిష్ణువుల స్త్రోత్రానికి శివుడు గజాసురుని గర్భం చీల్చుకొని బయటకి వస్తే, పరమశివుని చూసి గజాసురుడు ఎప్పుడూ నిన్ను చూస్తూ నీ చెంత ఉండే వరం ఇవమని కోరతాడు, శివుడు అనుగ్రహిస్తాడు.

కైలాస ప్రవేశం చేయబోయిన పరమశివుని పార్వతి పుత్రుడు(Vinayakudu) అడ్డగిస్తాడు. శివుడు వారించి చూసిన ఎదురించే బాలుని(Vinayakuni) శిరస్సు ఖండించి, శిరస్సుని ముక్కంటితో దగ్ధం చేస్తాడు. పుత్రుడి ఆర్తనాదంతో బయటకు వచ్చిన పార్వతిమాత విచారిస్తుంది. అప్పుడు బ్రహ్మవిష్ణువులు ఆ బాలుడుని మేము పునర్జీవుడిని చేస్తాం, కానీ శిరస్సు ఏది పెట్టాలని అంటారు. పరమశివుడు, నంది-బృంగిలను పిలిచి, ఎవరు ఉత్తరదిక్కుకి తలపెట్టుకుని పడుకుంటే, వారి తలను తీసుకురమ్మని చెబుతారు.

శివుని ఆజ్ఞతో బయలుదేరిన వారికి ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని నిద్రిస్తున్నఏనుగు మాత్రమే కనిపిస్తుంది. ఉత్తరదిక్కుగా తలపెట్టుకుని పడుకోవడం అంటే దక్షిణ యమస్థానాన్ని చూడడం అని అనుకుని, ఆ ఏనుగు తలని తీసుకుని కైలసానికి వెళతారు. పార్వతి మాత అంత అందమైన బాలుడికి (Vinayakudiki) ఈ ఏనుగు తలా అని భాదపడితే, నారదుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నీ బిడ్డడు కారణ జన్ముడు అతను ద్విజన్ముడు, ద్విముఖుడు కావాలి కాబట్టి అంగీకరించమని అడుగుతారు. అలాగే నీ బిడ్డడికి సర్వదేవతా శక్తులు వస్తాయని చెబుతారు. పార్వతి మాత అంగీకారం తరవాత ఏనుగు తలని ఆ బాలుడి(Vinayakudi) కి అతికిస్తారు. ఆ బాలుడు గజముఖుడై గజాననుడుగా మారతాడు.

గజాననుడు విఘ్నాదిపతిగా మూషికుడిని ఓడించి వినాయక విజయం పొందడం (Vinayaka Vijayam).

తరువాయి శాస్త్రోక్తంగా ఆ బాలుడికి బ్రహ్మోపదేశం చేసి తపస్సుకి పంపిస్తారు, పార్వతి పరమేశ్వరులు. తపస్సు విజయవంతంగా పూర్తిచేసుకుని వచ్చిన గజాననుడికి నారద మహర్షి కుమారస్వామిని తమ్మునిగా పరిచయం చేస్తారు. తపస్సు పూర్తిచేసుకుని జితేంద్రీయుడైన పుత్రుని చూసి, గణాధిపతిని చేయదలస్తే,  గణాధిపత్యానికి కుమారస్వామి పోటిపడితే, ఇద్దరికీ ఒక పరీక్షను పార్వతి పరమేశ్వరులు పెడతారు.

ఎవరైతే, ముమ్మారు విశ్వప్రదక్షణ చేస్తారో, వారికీ గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు. వెంటనే కుమారస్వామి పోటిలో విజయం సాధించడానికి తనవాహనం అయినా నెమలిపై బయలుదేరితే, గజాననుడు ఆలోచన చేసి, తల్లిదండ్రుల వలననే విశ్వం ఉంటే, విశ్వకారకులైన తల్లిదండ్రుల పాదపూజ చేసి ముమ్మారు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే, కుమారస్వామి వెళ్ళిన ప్రతిచోట గజాననుడు ఎదురువస్తూ కనబడతాడు. ప్రదక్షిణ పూర్తిచేసి వచ్చిన కుమారస్వామి గజాననుడి గెలుపు అంగీకరించి, గణాదిపత్యం అన్నగారికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. ఆవిధంగా గజాననుడు పార్వతి పరమేశ్వరుల పాదపూజ ద్వారా గణముల అన్నింటికీ అధిపతి అయ్యి, విఘ్నేశ్వరుడుగా పిలవబడతాడు.

మూషికుడు గర్విష్టి అయ్యి బందించిన ఇద్దరి దేవతా జంట కోరిక మేరకు వినాయకుడు వారికి మేలు చేయదలచి, మూషికుడుని యుద్దంలో ఓడిస్తాడు, అప్పుడు మూషికుని భార్య ప్రియంవద భక్తికి మెచ్చిన పార్వతిమాత మూషికుని రక్షిస్తే, జగన్మాత మూషికుని గతజన్మ దేవతలకు వివరించి, మూషికుని వినాయకుడిని శరణువేడమంటే, మూషికుడు వినాయకుడిని శరణువేడి వినాయకుడి పాదాల వద్ద ఎలుకగా ఉంటాడు. అతని భార్య వినాయకునికి చత్రమై భర్త చెంతనే ఉంటుంది. వినాయకుడుకి జగన్మాతకి అభేదంగా చెబుతూ వినాయక విజయం విజయవంతం అవుతుంది. Vinayaka Vijayam Vijayavantamaina Telugu Bhakti Chitram.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి