• ప్రముఖ జ్యోతిష్య తెలుగు యూట్యూబ్ చానల్స్ లిస్టు
    tech reads

    ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

    గమనిక: ద్వాదశ రాశుల వారికి వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు అందించే కొన్ని చానల్స్ ను లిస్టును తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది. తెలుగురీడ్స్ ఈ పోస్టు గురించి! అదేం చిత్రమో మన ఊళ్లో మనకు అందుబాటులో పిలిస్తే పలికే పండితులు ఉన్నా దూరంగా ఉండే పండితులంటే, ఇంకేమి చెబుతారో అనే ఆలోచన వలననేమో ఒక ఊరి నుండి మరొక ఊరికి జ్యోతిష్యులను వెతుక్కుంటూ వెళ్తాం. కొన్ని పల్లెటూళ్లలో అయితే పండితులు ఉండకపోవచ్చును. దీర్ఘకాలిక రోగంతో బాధపడేవారు, అందుబాటులో ఉన్న వైద్యంతో బాటు దూరంగా ఉన్న వైద్యంవైపు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కారణం త్వరగా స్వస్థత చేకూరాలనే ఆలోచనతో, ఇంకా ఆ దీర్ఘకాలిక బాధలు అనుభవించి, అనుభవించి వాటి నుండి ఎప్పుడు బయటపడతామా….అనే ఆలోచన మనసును కుదుటపరచదు. ఈ విధంగానే జాతకపరమైన దీర్ధకాలిక కష్టాలతో బాధపడేవారికి, తమ సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పరితపిస్తూ ఉంటారు, అంటారు. ప్రతి చిన్న సమస్యకు ఒకప్పుడు జ్యోతిష్యులు దగ్గరకు వెళితే, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలలో…