పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది.

అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది, మానై ఒంగునా’ అని అంటారు.

చూసి నేర్చుకునే వయస్సు నుండి చదివి నేర్చుకునే వయస్సులో కధల పుస్తకాలు, నీతి కధలు పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు విమర్శించేవారి కన్నా, నియమాలు పాటిస్తూ రోల్ మోడల్ గా జీవించి వ్యక్తుల పరిచయం అవసరం. మొదటగా తల్లిదండ్రులే పిల్లలకు మోడల్ గా కనబడతారు.

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు
పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

తండ్రి ఏ విషయంలో సమాజంలో పాపులర్ అయ్యి ఉంటే, అదే విషయంలో ఆ తండ్రి ఆ పిల్లవానికి రోల్ మోడల్ గా ఉంటారు. ఆ విషయంలో తన తండ్రే తనకు హీరో. కొందరు పిల్లలు వెంటనే అనుసరించడం కూడా మొదలు పెడతారు. అందుకే పిల్లల విషయలో తండ్రి పెద్ద హీరోగా ఉంటాడు.

దురదృష్టం కొలది తండ్రికి దురలవాట్లు ఉంటే మాత్రం వాటిని పిల్లలకు తెలియకుండా పెద్దలు జాగ్రత్త పడాలి. కారణం… పిల్లలకు అనుసరించడమే అలవాటుగా ఉండే వయస్సులో తండ్రి ఏంచేస్తే అదే చేసే అవకాశం కూడా ఉంటుంది.

తెలుగు కధలు పుస్తకాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి.

అనుసరించే వయస్సులో ఏది అనుసరించాలి? ఏది అనుసరించ కూడదనే విషయంలో తల్లిదండ్రుల ఇచ్చే క్లారిటీతో బాటు పుస్తకాలు తెచ్చే ఆలోచనా విధానం కూడా పిల్లలకు ఉపయోగం. పుస్తకాలలో ఉండే నీతి కధలలో సారంశం పిల్లలలో వికాసం పెంచుతుంది. స్పూర్తిని పెంచే తెలుగు పుస్తకాలు చదవడం వలన కూడా పిల్లలకు మంచి బుద్దులు పెరుగుతాయి.

స్కూలు విద్యకు వెళుతున్నవారు స్కూల్లో స్నేహితుల ద్వారా విషయ విజ్ఙానం పెంపొందించుకుంటూ ఉంటారు. సామాజిక పోకడలలో వీరు కొన్నింటిని అనుసరించే అవకాశం కూడా స్కూల్ స్నేహితుల ద్వారా ఏర్పడే అవకాశం ఉంటుంది. స్కూలుకు వెళ్ళే పిల్లలకు నీతి కధల పుస్తకాలు మేలును చేకూరుస్తాయి.

స్పూర్తిదాయకమైన వ్యక్తుల కధలు, ధర్మాత్ముల గురించి వివరించడం వలన పిల్లలకు

Children needed models rather than critics.. అంటే పిల్లలకు విమర్శకుల కన్నా మోడల్స్ అవసరం ఎక్కువ. Children are great imitators… అనుసరించడంలో పిల్లలకన్నా ముందుండేవారు ఉండరు.

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు
పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

వినే వయస్సులో చెప్పేవారు చెప్పే మంచి మాటలు వినేవారికి బాగా నాటుకుంటాయి. కధలు విని పడుకోవడం అనే అలవాటు పిల్లలకు ఉంటే, నీతి కధలు, స్పూర్తిదాయకమైన వ్యక్తుల కధలు, ధర్మాత్ముల గురించి వివరించడం వలన పిల్లలకు ఆయా గుణములపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి వారి జీవితానికి ఎంతో మేలునే చేకూరుస్తాయని అంటారు.

స్పూర్తిదాయకమైన వ్యక్తుల గురించిన కధలు వినడం వలన స్ఫూర్తి గురించిన ఆలోచన పిల్లలో పెరుగుతంది. స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి ఆలోచన కలుగుతుంది. ధర్మాత్ముల గురించి వివరించడం వలన ధర్మము యొక్క గొప్పతనం తెలియబడుతుంది. ధర్మాత్ముల జీవితం గురించి తెలిసి ఉండడం వలన, మనసు చెదిరే వయస్సుకొచ్చేటప్పటికీ మనసులో మనసుపై నియంత్రణ ఉండే అవకాశం ఎక్కువ అంటారు.

ధర్మమును ఆచరించి సమాజంలో మంచి పేరు సంపాదించుకున్న ధర్మాత్ముల గురించి పిల్లలకు వివరిచడం తప్పనిసరిగా చేయాలని అంటారు. అలాగే స్ఫూర్తిదాయకమై జీవన కొనసాగించి, సమాజం చేత గుర్తింపు పొందినవారి గురించి కూడా పిల్లలకు తెలియజేస్తూ ఉండడం మరొక మేలైన విషయంగా చెబుతారు.

Children our most valuable resources… పిల్లలు మన విలువైన వనరులు…. నేటి పిల్లలే రేపటి పౌరులు…

నేటి పిల్లలే రేపటి పౌరులు… నేడు పిల్లలగా ఉండేవారు ఎదుగుతూ నేర్చుకునే విషయాలతో పౌరులుగా మారతారు. పిల్లలు ఏవిధంగా పౌరులుగా మారతారో ఈ మూడు విషయాలు కీలకం అవుతాయి. నేర్చుకునే వయస్సులో ఎటువంటి విషయాలు చూస్తున్నారు? ఎటువంటి విషయాలు అనుసరిస్తున్నారు? ఎటువంటి విషయాలపై ఆసక్తి పెంచుకుంటున్నారు?

పిల్లలు నేర్చుకునే వయస్సులో అనుసరణ ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. వారు అనసరించడానికి అతి దగ్గరగా ఉండే మోడల్ అంటే, ఆ పిల్లవాని తండ్రే. తండ్రికి మించిన మోడల్ పిల్లలకు అంతదగ్గరగా మరొకరు ఉండరు. తల్లి ప్రేమతో పిల్లవానికి చాలా విషయాలు తెలియజేస్తుంది. అయితే ఆచరణకు తండ్రి విధానం మోడల్ గా మారుతుంది.

నేడు మంచి విషయాల ద్వారా మంచి వ్యక్తిత్వం ఏర్పరచుకుని ఓ మంచి పౌరుడిగా మారితే, అతను సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు. సమాజానికి మేలు చేసేవారంత వనరుగానే ఉంటారు.

మంచి పౌరునిగా మారబోయే పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి. వివిధ రకాల

జీవిత చరిత్ర కధలు పిల్లలు

జీవిత చరిత్ర కధలు పిల్లలు : జీవిత చరిత్రలు పిల్లల వయస్సు నుండే వ్రాసుకుంటారు, లేదా వ్రాయబడుతుంది. గొప్పవారి చరిత్రలు బాల్యం నుండి చదవడం ఒక అవగాహన ఉంటుంది. కధలు పిల్లలకు కధలు ఇష్ట అయితే నీతి కధలు చెబితే మేలు. పిల్లలు పెంచడం నేటి సమాజంలో చాలా సమస్యలు పిల్లల పెంపకం సరిగ్గా లేకపోవడమే అనే అభిప్రాయం కూడా ఉంటుంది.

జీవిత చరిత్ర : సమాజంచేత గుర్తింపబడి చరిత్రకెక్కినవారు అనేకమంది గురించి మన సమాజంలో గొప్పగా చెప్పబడతారు. సమాజంచేత గుర్తింపబడి సమాజం చేత కీర్తింపబడడం అంటే వారు సమాజానికి మార్గదర్శకంగా నిలబడి ఉండి ఉంటారు.

ఇంకా సమాజం హితం కోసం సమాజంలో ఉన్న సమస్యలపై పోరాడి ఉండి ఉంటారు. సమాజం కోసం తమ జీవిత ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా నిత్యం సమాజ హితం కోసం పాటుపడి ఉండి ఉంటారు. ఇలా సమాజానికి మేలు చేసిన వారి గురించి, వారి వారి జీవిత చరిత్రగా సమాజం చేత గుర్తింపడడంతో అలాంటి వారి జీవిత చరిత్రలు పుస్తకాలలో మనకు లభిస్తాయి.

చరిత్రకెక్కినవారిలో వారి జీవితంలో జరిగిన విశేషాలను తెలియజేసే పుస్తకాలు మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ ద్వారా ఉచితంగా లభిస్తున్నాయి. మహాత్మగాంధీ, బంకించంద్ర చటర్జీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, రాజారామ్ మోహన్రాయ్, వల్లభాయిపటేల్, శివాజీ చరిత్రము మరియు మరింత మహాపురుషుల గురించిన పుస్తకాలు ఇక్కడ చదవవచ్చును. ఈ క్రింది బటన్లపై టచ్ చేయండి లేక క్లిక్ చేయండి.

కధలు: కధలు వినడం అంటే అందరికీ సరదాగా ఉంటుంది, ఆ సరదాకు కొనసాగింపుగా కధల పుస్తకాలు చదవడం అలవాటుగా మారుతుంది. చిన్నప్పుడు చక్కగా అమ్మ కధలు చెబితే, కొనసాగింపుగా కధలు నాన్న చెబుతాడు. చక్కగా కధలు వింటూ అన్నం తినేస్తూ ఉంటాం! కొందరం అయితే కధ చెబితేనే అన్నం తిని ఉండి ఉంటాం, మరికొందరం అయితే కధ చెబితేనే నిద్రపోయి ఉండి ఉంటాం!

ఇలా కధలు మనకు చిన్నతనం నుండి వినడం అలవాటు అవుతుంది, ఇంకా అక్షరజ్ఙానం వచ్చాక, ఇష్టం పెరిగితే వినడానికి కొనసాగింపుగా దొరికిన కధల పుస్తకాలు అన్నీ చదివేస్తూ ఉంటాం. వింటే కధలు కమ్మగా ఉంటే, చదువుతూ ఉంటే కధలు ఆలోచనను, ఊహాశక్తిని పెంచుతాయి. ఇప్పుడు మీకు కధలు అంటే ఇష్టం ఉండి, పురాణ కధలు, నీతి కధలు, బేతాళ కధలు ఉచితంగా చదవాలంటే, ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటు ద్వారా చదవవచ్చును. ఈ క్రింది బటన్ టచ్ చేసి, మీరు ఆయా కధల పుస్తకాలు చదవవచ్చును.

పిల్లలు: నేటి బాలలే – రేపటి పౌరులు అన్నారు! ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు తమకంటే పెద్దవారు ఏమి చేస్తున్నారో తెలిసి లేక తెలియక గమనిస్తూ ఉంటారు. తాము పరిశీలిస్తున్న పెద్దలు వయస్సుకు తాము చేరుకున్నాక పిల్లలు తాము చిన్నతనంలో తమకన్నా పెద్దవారు అవలంభించిన తీరును అనుసరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనిషి మనసు మొదట అమ్మతో నేర్చుకోవడం మొదలు పెట్టి, నాన్నను అనుసరించడం మొదలుపెడుతుంది.

అలాగే తమకంటే పెద్దవారిని కూడా గమనిస్తూ, స్నేహితులను గమనిస్తూ ఉంటుంది. కానీ ప్రాధమికంగా అమ్మ చెప్పిన మంచివిషయాలను మాత్రం ఎప్పటికి మనిషి మనసు మరువదు. పిల్లల గురించిన రచనలు ఉచితంగా మనకు ఫ్రీగురుకుల్.ఆర్గ్ వెబ్ సైటులో లభిస్తున్నాయి. పిల్లల పెంపకం, పిల్లల ప్రవర్తన, బాలలోకం, పిల్లల పాటలు మొదలైన పుస్తకాలు చదవడానికి ఈ క్రింది బటన్ పై టచ్ చేయండి. ఆయా తెలుగు ఉచితంగా బుక్స్ చదవండి.