తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి.

తెలుగు పుస్తకాలు విషయ విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలలోని చదివిన విజ్ఙాన విషయాలనే తిరిగి బోధిస్తారు. పుస్తకాలలోని విషయాలతోనే కొందరు శోధకులు పరిశోధనలు చేస్తారు.. పురాణేతిహాసాలు పుస్తక రూపంలో రామాయణం – పుస్తకం, భాగవతం – పుస్తకం, శాస్త్రం – పుస్తకం, పరిశోధన – పుస్తకం.. ​ఏదైనా పుస్తకంలోకి విజ్ఙానం నిక్షిప్తం చేయబడుతుంది. పుస్తకంలోని విజ్ఙానం పరిశీలించబడుతుంది. కొత్త కనుగొనబడుతుంది. పుస్తకం విజ్ఙానంతో ప్రయాణం చేస్తుంది.

విజ్ఙానం పరిశీలన చేస్తూ నేర్చుకుంటాం. బంధు మిత్రులు, టీచర్ల బోధనతో విజ్ఙానం వింటూ నేర్చుకుంటాం.. ఇలా చూస్తూ, వింటూ మరియు పుస్తకం చదువుతూ విషయపరిజ్ఙానం పెంచుకుంటాం. చిన్ననాడు పెరిగిన ఆసక్తో లేక పెరిగాక వచ్చిన ఆసక్తో కానీ పుస్తకంతో విజ్ఙాన పరిజ్ఙాన పరిశీలన ప్రారంభం అవుతుంది. ఏదో ఒక విషయంలోని ఆసక్తి పుస్తకాలవైపు దృష్టి మరలుతుంది. ఒకరికి సైన్సు ఇష్టం ఉంటే మరికొందరికి సోషల్ ఇష్టం ఉంటే ఇంకొందరికి మాథ్స్ ఇష్టం ఉంటుంది.

విద్యాపరంగా ఉపాదికోసం స్కూలు నుండి వివిధ పుస్తకాలు చదువుతాం. అయితే వీటితో పాటు పర్సనాల్టి మేనేజ్ మెంట్ కూడా అవసరం అని చెబుతారు. అంటే వ్యక్తిత్వ వికాసం అంటారు. వ్యక్తిత్వం పనిచేసేచోట మరింత మెరుగైన ఫలితాలను తీసుకురాగలదు, పొందగలదు అంటారు.

వ్యక్తిత్వ వికాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామి వివేకానంద మాటలే అంటారు. ఆయన మాటలు చాల శక్తివంతంగా ఉంటాయి. రీడర్లో స్ఫూర్తిని నింపేవిధంగా ఉంటాయని అంటారు. అలాగే భారతీయ విజ్ఙానంలో చాలా పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించే ఉంటాయని అంటారు. మనసు నియంత్రించుకోవడంలో మనసుకే శిక్షణ ఇవ్వడం… మనసును మనసుచేతనే పరిశీలన చేయడం…ఇతరులతో ప్రవర్తన గురించిన సరైన అవగాహన ఏర్పరచుకోవడం తదితర అంశాలలో బుద్ది వికవసించాలని అంటారు.

పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించిన విజ్ఙానం మనకు అందిస్తాయి.

బుద్ది వికాసం గురించి వ్యక్తిత్వ వికాసంపై గల తెలుగు పుస్తకాలు వివచించగలవు అంటరు. వ్యకిత్వ వికాసం వలననే వ్యక్తి తన జీవన పోరాటంలో విజయం సాధించగలడని అంటారు. విద్యకు వినయం తోడైతే, వ్యక్తి ఉన్నతికి బలమైన మెట్టు ఏర్పడ్డట్టేనని అంటారు. వినయంతో కూడిన మాటతీరు మనిషిని మరింత ఉన్నత స్థితికి చేర్చునని చెబుతారు. పుస్తకాలు వ్యక్తిత్వ వికాసం గురించిన విజ్ఙానం మనకు అందిస్తాయి.

వ్యక్తిగత ధర్మం, సామాజిక ధర్మం, కుటుంబ ధర్మం, ఆద్యాత్మిక అవసరం ఇవ్వన్ని తెలుపుతూ ఉండేవి… ఇతిహాసాలు అంటారు. రామాయణం చదివితే ధర్మం ఎందుకు ఆచరించాలో తెలియవస్తుందిని చెబుతారు. కోపం వలన మనిషి జీవితం ఎటువంటి స్థితులకు మారుతుంది తెలియవస్తుందని అంటారు. ఇంకా స్త్రీ దు:ఖం ఎంత చేటు తెస్తుందో? రావణాసురుని తపస్సు, రావాణాసురుడి కోరికలు చూస్తే తెలియబడుతందని అంటారు. తెలుగు పుస్తకాలు రామాయణంపై ఉన్న అనేక రచనలను మనకు అందిస్తాయి.

భారతంలోని పాత్రలు ఎప్పటికీ ఎక్కడో చోట సమాజంలో కనబడుతూనే ఉంటాయని అంటారు. మహాభారతం వ్రాసిన వేదవ్యాసుడు కూడా భారతంలో లోకంలో ఉంటే అన్ని పాత్రల గురించిన వివరణ ఉంటుందని చెప్పినట్టుగా చెబుతారు. మహాభారతం నిశితంగా పరిశీలించవలసిన ఇతిహాసమని చెబుతారు. ధర్మసూక్ష్మం ఎక్కువగా ఉండేది మహాభారతంలోనే అని చెబుతారు. తెలుగు పుస్తకాలు మహాభారతం, భారతంలోని నీతి కధల ద్వారా మనకు మనో విజ్ఙానం అందిస్తాయి.

తెలుగు పుస్తకాలు భగవంతుని లీలలను తెలియజెబుతాయి.

మనిషికి ఎటువంటి బాధలు వచ్చినా తట్టుకునేది మనసు. సుఖం అయినా దు:ఖం అయినా మనసుకే ఫీలింగు. అది సుఖంగా ఉంటే మరొకరిని సంతోష పెట్టగలదు. అది దు:ఖంగా ఉంటే మరొకరికి బాధగా మారగలదు. మనిషి సుఖ:దు:ఖాలలో మనసు మరీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి మనసు తననితానే భరించలేకపోతే, ఆమనిషి అశాంతికి ఆలవాలంగా మారతాడు. అశాంతి మనిషి జీవితాన్ని పాడుచేస్తుంది.

ఇటువంటి సమయంలోనే మనిషికి తోడు భగవంతుడు అంటారు. సద్గురువుకు దగ్గరలో ఉంటే, సద్గురువే భగవానుడుగా ఉండగలడు. మంచి మిత్రుడైనా సరే…. ఎవరూ ఓదార్పు ఇవ్వలేని సమయంలో భగవానుడినే తలవాలి.. అటువంటి సమయంలో భగవంతుడు ఎటువంటివారిని ఎలా అనుగ్రహించాడు? భాగవతం ద్వారా తెలుసుకుంటే, ఆమనిషి మనసుకు ఊరట లభిస్తుందని అంటారు. తెలుగు పుస్తకాలు భగవంతుని లీలలను తెలియజెబుతాయి.

పురాణాలు, ఇతిహాసాలు వ్యక్తిగత, సామాజిక ధర్మాలను, ప్రకృతి నియమాలను తెలుపుతూ ఉంటాయి. ప్రకృతి ద్వారా భగవానుడి లీలలను తెలియజేస్తాయి. భక్తుల ద్వారా భగవానుడి లీలలను పుస్తకాలు తెలియజేస్తాయి. కీర్తనలు భగవంతుడి లీలలను ప్రస్తుతిస్తాయి. పుస్తకాలు భగవంతుడి గురించి ఆద్యాత్మిక మనో విజ్ఙానం అందిస్తాయి.

పుస్తకాలు విషయ విజ్ఙానం మనకు అందిస్తాయి

ఒకరు విజ్ఙానం పరంగా ఏదైనా విధానం గురించి బోధించినా, మరొకరు లెక్కలలో సూత్రాలు బోధించినా అవి పుస్తకాలలోనివే. అలాగే వాటిని చదువుకుని కొత్తవిధానం రూపొందించినా అవి మరలా పుస్తకాలలోకి చేరతాయి. లెక్కలలలో సూత్రాలు చదువుకుని కొత్త సూత్రాలు కనుగొన్నా అవి మరలా పుస్తకాలలోకి చేరతాయి. అంటే పుస్తకాలు బోధనా విషయాలను మనకు అందిస్తాయి. కనుగొనబడిన విషయాలను నిక్షిప్తం చేసుకుంటాయి. భవిష్యత్తులోకి ఆ విషయ విజ్ఙానం మోసుకుపోతాయి. తెలుగు పుస్తకాలు విజ్ఙానం అందిస్తాయి.

పరిశోధకులకు విషయ విజ్ఙానం పుస్తకాలే అందిస్తాయి. పుస్తకాలను చూసి బోధించని టీచర్ల దగ్గర ఆసక్తితో తెలసుకున్న విషయాలతో వచ్చే సంకల్పం మరింత శోధనకు దారి తీస్తుంది. అలా పుస్తక పఠనం ద్వారా విజ్ఙాన గనిని త్రవ్వడం ప్రారంభం అయితే. త్రవ్వే కొలది విజ్ఙానం తెలియబడుతుంది. తెలుసుకున్న జ్ఙానం కొత్త విజ్ఙానానికి నాంది కావవచ్చును. పుస్తకాలు పరిశోధనకు కావాల్సిన విజ్ఙానం అందిస్తాయి. పుస్తకాలు చదివే అలవాటు వలన పరిశోధనాత్మక బుద్ది పుట్టవచ్చును.

భక్తి తత్వం, భక్తి సారము, భగవన్నామ మహిమ, భగవన్నామ రహస్యము తదితర తెలుగు భక్తి పుస్తకములు ఉచితంగా చదవడానికి

వ్యక్తిత్వ వికాసం అమూల్యమైన మనో విజ్ఙానం తెలుగు ఉచిత పుస్తకాలు చదవడానికి

తెలుగురీడ్స్.కామ్ నందు గల ఇతర పోస్టులు ఈ క్రింది బటన్లకు జత చేయబడ్డాయి.