బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. కారణం బుక్స్ మనలో స్ఫూర్తిని నింపుతాయి. బుక్స్ మనకు గతకాలపు విషయాలను తెలియజేస్తాయి. బుక్స్ మనకు గొప్పవారి జీవితాన్ని తెలియజేస్తాయి.

కరోనాకాలం కష్టకాలం.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా మనం ఇంటికే పరిమితం అయ్యాం. అయినా మన మనసు మాత్రం టివి ద్వారానో, ఫోను ద్వారానో లోకం తిరిగి వచ్చేస్తుంది.

ఎందుకు తిరగదు మనసు గొప్పదనం అదేకదా.. మనిషి కూర్చున్న చోటే ఉంటాడు, కానీ అతని మనసు గతంలో అమెరికా వెళ్ళి ఉంటే, అక్కడికి క్షణాల్లో వెళ్ళినట్టు ఊహించగలదు. అంత శక్తివంతమైన మనసు, అందోళనకు గురైతే దానికి దిక్కుతోచదు.

కోవిడ్ 19 వైరస్ కారణంగా మన జాగ్రత్త కోసం మనం ఇంటికే పరిమితం అవుతున్నాం. అయితే మనం జాగ్రత్తగా ఉన్న మన మనసు ఎలా ఉంటుంది? ఇదే ప్రధానం. ఈ కరోనా కాలంలో మనపై మన పరిశీలన అవసరం అంటే మనసును పరిశీలించడం అంటారు.

మనకు గొప్ప విజయం దక్కిందంటే, మన మనసు అంత ఏకాగ్రతతో ఉన్నట్టు అంటారు. దానికి అంత ధృఢసంకల్పం ఉంటేనే, అది కదలకుండా మన విజయంలో కీలక పాత్ర పోషించగలదని అంటారు.

అదే మనసు కంగారు పడితే, అప్పటికి పడిన శ్రమంతా వృదా కూడా చేయగలదని అంటారు. కంగారు, ఆందోళన మనసు చెందకుండా ఉండాలి అంటారు.

ఇక కరోనా వలన ఇంటికే పరిమితం అయిన మనం సామాజిక దూరం కూడా పాటించడం అంటే ఇంచుమించు ఒంటరిగా ఉండాల్సిన స్థితి. అలా ఒంటరిగా ఉండగలిగితేనే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని అంటారు.

ఒంటరితనం అంటే కానీ పని.. ఏదో ఒక పనిచేస్తూ ఉండడం శ్రేయష్కరం.. అయితే ఎంత పనిచేసినా ఇంట్లో అన్నిరోజుల పని ఉండకపోవచ్చును. కాలక్షేపం కోసం మనకు సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా సినిమాలు చూడగలం.. కానీ ఇతర న్యూస్ అయినా ఏమైనా కరోనా న్యూస్ ఉంటాయి.

మనం కరోనా న్యూస్ చూస్తే కరోనా గురించిన ఆలోచనే కలగవచ్చును. ఏదైనా ఎక్కువగా ఆలోచన చేయడం మంచిది కాదు. ఏదైనా మనకు నష్టం కలిగిస్తుందంటే అందుకు తగిన జాగ్రత్తలు శ్రద్ధగా పాటించాలి. కానీ ఆలోచన పెంచుకోకూడదు.

బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు. బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం పెరుగుతుంది.

ప్రభుత్వం సూచించిన నిబంధనలు మనం కరెక్టుగా పాటిస్తే చాలు.. ఇక కాలక్షేపం కోసం మనం ఇంట్లోనే ఉండడం ప్రధమం.

కాలక్షేపం కోసం బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం పెరుగుతుంది. అయితే ఈ బుక్స్ లో రకరకాలు ఉంటాయి.

పిల్లల కోసం కధలు, కావ్యాలు, కవులు, చరిత్ర తదితర పుస్తకాలు ఉంటాయి. స్ఫూర్తి కోసం వివిధ నాయకుల జీవిత చరిత్రల తెలుగు బుక్స్ కూడా ఉంటాయి. అయితే ఈ కరోనా కాలంలో పిల్లలకు స్ఫూర్తినిచ్చేవారి బుక్స్ చదివించడం మేలు అంటారు.

ఎందుకంటే కొంతమంది జీవితాలలో వారు ఎదుర్కొన్న కష్టాలు అసామాన్యంగా ఉంటాయి. అటువంటి కష్టాలను మన కష్టంలో ఉన్నప్పుడు చదివితే, అప్పుడు మన కష్టాలు తక్కువగా అనిపించవచ్చును. మనసు తేలికపడే అవకాశం ఉంటుంది. తేలిక పడిన మనసు ఆందోళనను తగ్గించుకుని, ప్రశాంతంగా ఉండగలుగుతుందని అంటారు.

జీవిత చరిత్రల బుక్స్ మనకు ఓదార్పుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా స్ఫూర్తినిచ్చే రచనలు కూడా మనకు మరింత మేలును చేకూరుస్తాయని అంటారు.

స్వామి వివేకానంద రచనలు మనసులో మంచి స్ఫూర్తిని నింపగలవు అంటారు. కష్టకాలంలో మహానుభావుల రచనలు మనలో మరింత ధైర్యం నింపుతాయి.

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు అంటారు. బుక్ రీడింగు వలన మనోవికాసం వస్తుందని అంటారు.

కరోనా కోరలు చాచి బయట బస చేసింది. బయటకుపోయినవారిపై కోరలతో కాటేయవచ్చును. అప్పటికే కాటేసినవారి ద్వారా మనకు అంటవచ్చును. ఎలాగైనా కరోనా మనపై కాటువేయడానికి కాపు కాచి ఉంటుంది.

కరోనా వైరస్ ఇప్పుడు బయట బస చేసింది. ఇంట్లోకి కూడా వచ్చి ఉండే అవకాశం మనం ఇవ్వకూడదు. కోరలు చాచిన కరోనా కోరలు పీకేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుంది. మనం చేయాల్సింది ఇంట్లోనే ఉండడం.

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు
కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

ఇంట్లోనే ఉండడం సామాజిక దూరం పాటించడం అంటే ఇంచుమించు వ్యక్తి ఒంటరిగా ఉండాలి. అంటే సామాజికదూరం ఇంటికే పరిమితం కావడం అంటే ఇంచుమించు మనిషి ఒంటరిగా ఉండడమే. బుక్ రీడింగ్ వలన ఒంటరితనం అవగాహన పెంపొందించుకోవడానికి సహకారి అవుతుంది.

బుక్స్ చదివే అలవాటు ఉండి ఈ కరోనాకాలంలో బుక్స్ చదివేవారు వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం అంతగా ఉండదు. ఇలా కరోనా సోకకుండా, కరోనా వ్యాప్తి చెందకుండా బుక్స్ ఆపుతాయి. ఎలా బుక్ చదువుతూ ఉంటే చదివేవారు ఇంట్లోనే ఉంటారు. వారికి కరోనా రాదు, వారి వలన కరోనా వ్యాప్తి ఉండదు. తెలుగు ఫ్రీబుక్స్ తెలుగురీడ్స్.కామ్

విజ్ఙానం అంటే మనోవిజ్ఙానంగానే చెబుతారు. ఎందుకంటే ఏం తెలిసినా మనోనియంత్రణ లేకపోతే లోకం ఆక్షేపిస్తుంది. ఒక గొప్ప పదవిలో ఉండీ కాలానికి పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకోకపోతే, అంతటి పదవి కలిగినవారిని లోకం నిందజేస్తుంది. లోకం ఎప్పుడూ ప్రయోజనం అయితే పొగుడుతంది. అప్రయోజనం అయితే విమర్శిస్తుంది. కాబట్టి మనోవిజ్ఙానంగా గొప్పగానే ఉంటుంది.

కరోనా బయట బస చేస్తే, మనం సామాజిక దూరంతో ఇంటికే పరిమితం అవుదాం కరోనా దాహం తీరక పారిపోతుంది.

సరైన సమయంలో సరైన బుద్ది అంటే అది కొందరికే పరిమితం అయితే మరి కొందరికి మంచి మిత్రుని ద్వారా అలవరుతుంది అంటారు. కొందరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కొందరకు అయితే బుక్ రీడింగ్ అవసరం అవుతుందంటారు.

బుద్దివికానమే మనిషికి కష్టకాలంలో కూడా మనసులో స్థైర్యం నింపకలదు. బుద్ది అందరికీ ఒకేలాగా ఉండాలనేది లేదు. బుద్దివికాసం పెంపొందించుకోవాలంటే, మంచి మిత్రుడు లేదా పండితుడు కావాలి. ఇప్పుడు మనకు ప్రవచాలను కూడా ఉన్నాయి. అయినా మనకు మనం స్వతహాగా ఆలోచన కావాలంటే బుక్ రీడింగ్ బెటర్ చాయిస్ గా చెబుతారు. తెలుగు గుడ్ బుక్స్ చదివితే మంచి మనోవిజ్ఙానం అంటారు.

సామాజిక దూరం అంటే ఒంటరిగా ఉండడమే అందులోనూ ఇంటికే పరిమితం అంటే మనిషి మనిషికి దూరం, వ్యక్తి ఒంటరిగా ఉండాల్సిన సమయం, ఈసమయంలో మనిషి ఎటువంటి ఆలోచన చేస్తే అటువంటి భావనలు బలపడతాయి. మంచి ఆలోచనలు చేస్తే మంచి భావనలు బలపడతాయి. సమాజం గురించి ఆలోచిస్తే సామాజికపరమైన భావనలు బలపడతాయి.

మనసులో బలపడిన భావనలు వలన మనసు ఆ మార్గంలో మరింత శోదన చేస్తుంది. అందుకే సామాజికపరమైన ఆలోచనలు పెంచుకోవడం వలన సమాజంలో మన బాధ్యత మనం నెరవేర్చుకోగలం అంటారు. అందరిలోనూ జ్ఙానం ఉంటుంది. అదే ఏవిధంగా ఉంటుంది?

అజ్ఙానంలో కూడా జ్ఙానమనే అక్షరం ఉంటే, అది అందరిలోనూ ఉంటే, అందరికి జ్ఙానం ఉంది కానీ అ అనే అక్షరం లాగా ఆలోచన లేదు.. బుక్ రీడింగ్ వలన అ ఎలా తొలగించుకోవాలో తెలుస్తుందంటారు. 

కరోనాను తరిమికొట్టడంలో వైద్యులు యుద్దం చేస్తుంటే, మన సామాజిక దూరంతో వారికి సైన్యంలా సహకారం..

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉండి సామాజిక దూరం పాటిద్దాం. కరోనాను తరిమికొట్టడంలో వైద్యులు యుద్దం చేస్తుంటే, మన సామాజిక దూరంతో వారికి సైన్యంలా సహకారం అందిద్దాం.. కరోనా కట్టడికి ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించి కరోనా కోరలు పీకేద్దాం…

కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు
కరోనా బయట బస చేస్తే, మనఇంట్లోనే ఉంటే కాలక్షేపం బుక్ రీడింగ్ కూడా మంచి అలవాటు

ఇంటికే పరిమితం అవుదాం, ఒంటరిగానే ఉందాం.. సామాజికదూరం పాటిద్దాం… కరోనా కోరలు చాచి కాటువేయడానికి బయట బసచేస్తే, మనందానిని అంతం చేయడానికి యజ్ఙం చేద్దాం.. యజ్ఙంలో భాగంగా మంచి భావనలు పెరగడానికి మంచి బుక్స్ చదువుదాం.. బుక్స్ చదవడం వలన మన మనసు కాసేపు ఏకాగ్రతతో మంచి విషయాలను పట్టుకుంటుంది.

బాబు బంగారు బాబులు బయట కరోనా కోరలు చాచి ఉంది, అవి ఎవరికీ కనబడవు, ఎవరినీ కాటువేసాయో కూడా మనకు తెలియదు. కోరలు ఎటువైపు నుండైన మనపై పడవచ్చును. ఆ కోరలకు మనం అవకాశం ఇవ్వవద్దు. ఇంట్లోనే ఉందాం… దాని కోరలకు సమాజం బలికాకుండా మనవంతు సామాజిక బాధ్యతగా మనం ఇంట్లోనే ఉందాం. ఇది మనకోసం మనం చేసే యజ్ఙం…

కరోనా కాపుకాచి ఉంది, ఎలా ఉందో కంటికి కనబడదు.. దానిని ఎదుర్కొవడం అంటే కంటికి కనబడదు. దానిని బయటకు రప్పించాలి. అంటే ఒంటరిగా ఉంటే అది బయటపడుతుది. అలా వ్యక్తి నుండి బయటపడ్డ కరోనా లక్షణాలతో వైద్యులు పోరాడుతారు. ఆవ్యక్తిని కాపాడుతారు. ముందు కంటికి కనబడకుండా ఉన్న కరోనా ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి. కనిపెట్టడం అంటే దాని వ్యాప్తిని నిరోధించడం మనం కరెక్టుగా చేస్తే… కరోనా ఎక్కడ దాగి ఉన్న ఏదో ఒక వేళ లక్షణాలు బయటపడతాయి. అప్పుడు దానిపై పోరాటం చేయడానికి వైద్యరంగం ఉంది.

కరోనా బయటపడేవరకు మనం పూర్తిగా ఇంటికే పరిమితం అయితే అది ఉన్న అన్ని స్థానాలు బయటపడతాయి. మనం తొందరపడి బయటికిపోతే మాత్రం కరోనా స్థానాలు పెంచినవారం అవుతాం. దాని వలన వైద్యులకు పని పెరుగుతంది. వారు ప్రాణాలకు భయపడకుండా పని చేయగలిగితే బయటపడ్డ కరోనాపై పోరాటం చేయగలరు. కానీ దానిని మనం పెంచితే మనతో బాట మన కుటుంబం, సమాజం అందరిని రిస్కులో పెట్టినట్టే…కాబట్టి ఇంటికే పరిమితం అవ్వడం నేటి కాలం మనం చేయాల్సిన యజ్ఙం..

కరోనా కట్టడికి సహకారంగా మనం బుక్ రీడింగ్ చేయడానికి వివిధ రకాల తెలుగుబుక్స్ ఫ్రీలింకులు ఈ క్రింది బటన్లకు జత చేయబడి ఉన్నాయి. ఆయా బటన్లపై టచ్ చేసిన మీరు ఆయా ఉచిత పుస్తకాలు ఉచితంగా చదవవచ్చును.

ధన్యవాదాలు తెలుగురీడ్స్.కామ్