• భాగవతం భక్తుల గాధలతో భగవానుని మహిమలు
    book reads

    భాగవతం భక్తిగాధల తెలుగుబుక్స్

    భాగవతం వేదవ్యాసుడు సంస్కృతంలో రచనచేస్తే, శ్రీరామభక్తుడు అయినే బమ్మెర పోతనామాత్యులు తెలుగుకు అనువదించి, శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అటువంటి భాగవతం గురించిన రచలను ఆన్ లైన్లో లభిస్తున్నాయి, ఆ పుస్తకముల లింకును అందిస్తూ, కొన్ని పదాలు భగవానుని కృపతో… భాగవతం మనిషికి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఆ మనిషి మనసు భాగవత గ్రంధం వైపు మనసు వెళ్లదు అంటారు. ఏనాడో ఏ జన్మలోనో పుణ్యం చేసుకుంటేనే, భాగవతం గురించిన తలంపు మనసులో మెదులుతుంది అని తెలుగుపెద్దలు అంటూ ఉంటారు. జీవన యాత్రలో గమ్యం లేకుండా సాగిపోయే సమయంలో, అసలు జీవన యాత్ర లక్ష్యం ఏమిటి అనే ప్రశ్న వస్తే, తత్వవేత్తల జవాబు ముక్తి అంటారు. మరి మామూలు విషయములతో ముడిపడి, సాదారణ సమయంలోనూ ఏదో ఒక ఒత్తిడిని కొని తెచ్చుకునే మనసుకు ముక్తి అంటే మూడు ఆమడల దూరం పోతుంది, కదా మరి మనసుని ముక్తివైపు మరల్చగలిగే మెటీరీయల్ ఏది? అన్న ప్రశ్న వస్తే, దానికి జవాబు భాగవతం అని భాగవతప్రియులు, ప్రవచరకారులు చెబుతూ…