మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం విషయ విజ్ఞానం వలన పరిజ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, అటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అంటారు.
ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ మన మొబైల్లోని గూగుల్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది.
ఎందుకు మొబైల్ ద్వారా మంచి విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి?
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం వలన అవే విషయాలు మొబైల్ హిస్టరీగా ఉండి, మన ఫోన్ ఉపయోగించే ఇతరులకు అవే సూచించబడతాయి.
మన దగ్గర ఉండే మొబైల్ ద్వారా అనేక విషయాలు తెలియబడుతూ ఉంటాయి. లోకంలో జరిగే వింతలు, విశేషాలు, దారుణాలు, అక్రమాలు, అవినీతి విషయాలు అనేకానేక విషయాలు మొబైల్ ద్వారా మనల్ని పలకరిస్తూ ఉంటాయి.
ఇంకా మొబైల్ ద్వారా వినోద విషయాలు, సరదా విషయాలు ఎన్నెన్నో పలకరిస్తూ అందరినీ రంజింపజేయడంలో మొబైల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అటువంటి మొబైల్ ఉన్నవారు తమ తాము ఒక్కరే కాకుండా ఇతరులు కూడా ఉపయోగించే అవకాశం ఉంటే, అలా వాడే వారు ఎవరు?
అలా ఒకరి మొబైల్ స్వతంత్రంగా ఎక్కువగా వాడే వారిలో జీవిత భాగస్వామి ఇంకా పిల్లలు ఉంటారు. జీవిత భాగస్వామి ఉపయోగించడంలో ఇద్దరి అభిరుచులు ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుంది… ఇంకా వారికి మంచి – చెడులపై సరైన అవగాహన ఉంటుంది.
ఇక పిల్లలు ఫోన్ వాడుక ఎక్కువగా ఉంటుంది. తండ్రి లేదా తల్లి మొబైల్ ద్వారా పిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలా గేమ్స్ ఆడడం, వీడియోలు చూడడం అలవాటుపడిన పిల్లలు మొబైల్లో ఉండే ఇతర విషయాల వైపు దృష్టి సారించే అవకాశం ఎక్కువ. కాబట్టి పిల్లలకు తల్లిదండ్రుల మొబైల్ ద్వారా విషయ విజ్ఞానం అందె అవకాశం ఉంటే, సదరు మొబైల్లో ఎటువంటి విషయాలు సూచించ బడుతున్నాయి. ఎలాంటి విషయాలు చరిత్రగా మొబైల్లో కనబడుతున్నాయనే దానిపై పిల్లలకు విజ్ఞానం పరిజ్ఞానం పెరిగే అవకాశం ఉంటుంది.
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మొదలు పెడితే
మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం మొదలు పెడితే, అంతకు ముందు ఉన్న మొబైల్ చరిత్ర చెరుగుతూ, కొత్త చరిత్ర నమోదు అవుతూ ఉంటుంది.
ఒక వస్తువు తయారీ విధానం గురించి, మనం యూట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తే, అది యూట్యూబ్ సెర్చ్ చరిత్రగా మన ఖాతాలో నమోదు అవుతుంది. అలాగే ఒక క్రైమ్ న్యూస్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే, అదే యూట్యూబ్ వీడియో సెర్చ్ చరిత్రగా నమోదు కావడం మొదలు అవుతుంది… ఏ విషయంపై ఎక్కువగా యూట్యూబ్లో వీడియోలు వెతుకుతూ ఉంటే, అదే యూట్యూబ్ ఖాతా చరిత్రగా నమోదు అవుతుంది.
ఈ విధానంలో మంచిని పెంచే వీడియోల గురించి సెర్చ్ చేస్తే, అదే మన యూట్యూబ్ వీడియో సెర్చ్ చరిత్రగా నమోదు అయ్యి, మరొకరికి మన మొబైల్ ద్వారా మంచి విషయాల పరిచయం జరిగే అవకాశం ఉంటుంది.
ఇంకా యూట్యూబ్ వీడియో సెర్చ్ మాత్రమే కాకుండా గూగుల్ సెర్చ్ కూడా ఒక చరిత్రగా మన ఖాతాకు నమోదు అవుతూ ఉంటుంది. ఇది గూగుల్ క్రోమ్ నందు సెర్చ్ చేసే సమయంలో కనబడుతుంది.
అంటే గూగుల్ సెర్చ్ ఎక్కువగా బ్లాగులు లేదా వెబ్ సైటుల లింకులను సేవ్ చేస్తుంది. గతంలో ఎటువంటి వెబ్ సైట్స్ మనం విజిట్ చేసి ఉంటే, అవే వెబ్ సైట్స్ మరలా క్రోమ్ చరిత్రగా మన ఖాతాకు కనబడుతుంది… కాబట్టి ఎటువంటి వీడియోలు లేదా వెబ్ సైట్స్ వెతుకుతున్నామో అదే మన మొబైల్ చరిత్రగా మన గూగుల్ ఖాతాకు జోడించబడుతుంది.
అంటే గూగుల్ ఖాతా మన మొబైల్లో మాత్రమే కాకుండా వేరే ఏదైనా కంప్యూటర్ లేక లాప్ టాప్ లేక టాబ్లెట్ వంటి పరికరాలలో ఓపెన్ చేసినా మన మొబైల్ ద్వారా నమోదు అయినా సెర్చ్ చరిత్ర వాటిలోనూ కనబడుతుంది.
మన మొబైల్లో మన వెతికే చరిత్ర మన గూగుల్ ఖాతా ద్వారా మనల్ని వెన్నంటి ఆన్లైన్ ద్వారా వస్తూనే ఉంటుంది. ఆ చరిత్రే మన ఖాతాకు సంబంధం ఉన్నవారికి తెలిసే అవకాశం ఉంటే, అది మన మొబైల్ చూసేవారికే తెలిసే అవకాశం ఎక్కువ. అలా ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ ప్రభావం మన చుట్టూ ఉన్నవారిపై కూడా పడే అవకాశం ఉండవచ్చు.
మన మొబైల్ మనం మాత్రమే వాడుతూ ఉంటే, అది వ్యక్తిగతంగా ఉంటుంది… ఇతరులు వాడుతూ ఉంటే, అది మన అలవాట్ల గురించి తెలియజేసే అవకాశం ఉంటుంది.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు