బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్

బ్రౌజరులో చూడదగిన మొబైల్ యాప్స్

గమనిక: ‘బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్’ శీర్షిక ఈ పోస్టు ఉంది. అయితే పేమెంట్, మెసేజింగ్, కాలింగ్ లాంటి స్పెషల్ మొబైల్ ఫీచర్లు ఉన్న మొబైల్ యాప్స్ కు ఈ పోస్టును అన్వయించకండి. ఇంకొక విషయం కొన్ని మొబైల్ యాప్స్ వ్యూ, వెబ్ వ్యూ డిఫరెంటుగా ఉంటుంది. అటువంటి మీరు ఎప్పుడూ అనసరిస్తున్న వాటినే అనుసరించడం ఉత్తమం.

మీ ఫోనులో ఇంటర్నల్ మెమోరీ (ఫోనులో మిగిలి ఉన్న స్పేస్ – ఫోను మెమోరి) తక్కువగా ఉంటుందా? ఇంకా మీ ఫోనులో డౌన్ లోడ్ చేయబడి ఉన్న మొబైల్ యాప్స్ కు కానీ వెబ్ సైటు ఉంటే, ఆ వెబ్ సైటును మీ ఫోనులో ఉండే బ్రౌజరు ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చును. ఈ పోస్టులో చూద్దాం.

మీ ఫోను 8జిబి మెమోరి, 16జిబి మెమోరి, 32జిబి మెమోరి మాత్రమే ఉండి ఉంటే, ఖచ్చితంగా మీకు ఈ పోస్టు ఉపయోగడుతుందని భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువగా బడ్జెట్ ఫోనులు 16జిబి – 32 ఫోను మెమోరిని కలిగి ఉన్న ఫోన్లు ఎక్కువమంది యూజర్ల దగ్గర ఉండి ఉంటాయి.

బడ్జెట్ స్మార్ట్ ఫోను మెమోరి?

అప్పటి బడ్జెట్లో 16-32జిబి ఫోను మెమోరి ఉన్న స్మార్ట్ ఫోన్లు లభించేవి. ఫోను మెమోరి కొన్నప్పుడు ఎంత ఉన్నా, వాడుతున్న కొలది అందులో ఉండే మొబైల్ యాప్స్ స్టోరేజి పెరిగి ఫోను మెమోరి సరిపోకపోవడం ప్రధానంగా వాడుతున్న బడ్జెట్ ఫోన్లలో వచ్చే అవకాశం ఎక్కువ. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ చూడడంతో మొబైల్ యాప్ బ్రౌజింగుపై అవగాహన పెరుగుతుంది.

మీరు ఒకప్పుడు 8జిబి ఫోను మెమోరి గల ఫోనును కొనుగోలు చేస్తే, అది వాడే కొలది ఫోను మెమోరి సరిపడకపోడం ఒక సమస్యగా తయారు అయితే, తరువాత 16జిబి ఫోనుమెమోరి గల స్మార్ట్ ఫోను కొన్నా… కొన్నాళ్లకు అదే పరిస్థితి రావడం గమనార్హం. ఇంకా 32జిబి ఫోను మెమోరి కూడా వాడుతున్న కొలది, గేమ్స్, యాప్స్ వాటి స్టోరేజిని పెంచుకుంటూ, ఫోను మెమోరిని ఆక్రమిస్తాయి.

కాబట్టి కేవలం చదవడం, చూడడం వరకే పరిమితమయ్యే మొబైల్ యాప్స్ కూ వెబ్ సైటు కూడా ఉండి, ఆ వెబ్ సైటులను మొబైల్ బ్రౌజరులోనే వాడుకుంటే, మనం ఆ మొబైల్ యాప్ ఫోన్లో వాడవలసిన అవసరం ఉండదు. ఇంకా ఫోను స్టోరేజి ఎక్కువగా ఉన్న స్మార్ట్ ఫోను ఉంటే, అన్ని సెక్యూర్ మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చును.

మొబైల్ బ్రౌజర్లు

అయితే మన స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసి మొబైల్ యాప్స్ లో కొన్నింటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఉదాహరణకు తెలుగురీడ్స్ మొబైల్ యాప్ ఉంది. అలాగే ఈ తెలుగురీడ్స్ మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉంది. ఈ తెలుగురీడ్స్ వెబ్ సైటును మీరు బ్రౌజరులో ఓపెన్ చేస్తే, మొబైల్ పేజి మోడ్లో ఓపెన్ అవుతుంది. ఇలా మీరు మీకు అవసరం అయినా ఆన్ లైన్ విషయం ఏదైనా బ్రౌజరు సాయంతో ఓపెన్ చేసి చూసుకోవచ్చును.

మీ స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను అయితే ఆండ్రాయిడ్ బ్రౌజరు, గూగుల్ క్రోమ్ లాంటి బ్రౌజర్లలో ఓపెన్ చేసి చూడవచ్చును. మీ స్మార్ట్ ఫోను యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరులో ఓపెన్ చేయవచ్చును. అయితే మీకు ఆండ్రాయిడ్ ఫోనులో క్రోమ్ బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. అదే యాపిల్ ఫోను అయితే సఫారి బ్రౌజరు యాప్ ముందుగానే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది.

అసలు బ్రౌజరు పనేమిటి అంటే ఇంటర్నెట్లో ఉండే ఏదేని ఒక వెబ్ సైటు చిరునామాను బ్రౌజరు అడ్రస్ బార్లో టైపు చేస్తే మీకు సదరు వెబ్ సైటులోని కంటెంటును బ్రౌజరులో చూపుతుంది. ఈ బ్రౌజరు పని కంప్యూటర్లో అయినా, లాప్ టాప్లో అయినా, స్మార్ట్ ఫోన్లో అయినా ఏదేని వెబ్ సైటు అడ్రస్ (డొమైన్ నేమ్) అంటే వెబ్ సైటు పేరు (ఉదా: గూగుల్ ఒక వెబ్ సైటు గూగుల్ డొమైన్ నేమ్ www.google.com, అలాగే ఫేస్ బుక్ వెబ్ సైటు పేరు అయితే, ఫేస్ బుక్ డొమైన్ నేమ్ www.facebook.com, ట్టిట్టర్ ఒక వెబ్ సైటు ట్విట్టర్ డొమైన్ నేమ్ www.twitter.com, ఐపిఎల్ టి20 ఒక వెబ్ సైటు పేరు అయితే దీని డొమైన్ నేమ్ www.iplt20.com) ఈ విధంగా ఉంటాయి.

ఇంకా మీకు మొబైల్ యాప్ తోబాటు వెబ్ సైటు కూడా ఉన్న మరిన్ని వెబ్ సైట్లు చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి. మీరు ఆ డొమైన్ పేరును బ్రౌజరులో ఎంటర్ చేయగానే, ఆ వెబ్ సైటు కంటెంటును బ్రౌజరు చూపుతుంది.

వెబ్ సైటు నేమ్ డొమైన్ నేమ్

మీరు తెలుగురీడ్స్ అనే వెబ్ సైటుకు సంబంధించిన డొమైన్ నేమ్ (www.telugureads.com) బ్రౌజరులో ఓపెన్ చేయడం ద్వారా ఆ వెబ్ సైటులో ఉంచబడిన కంటెంటును చూడగలరు. అయితే మీకు గమనించవలసిన విషయం ఒక్కటి ఏమిటంటే, ఏదైనా మొబైల్ యాప్ వెబ్ సైటు కన్నా ఉపయోగించడానికి వీలుగా డవలప్ చేయడం ఉంటుంది. ఈకామర్స్ లాంటి వెబ్ సైటులు అయితే మొబైల్ యాప్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తూ ఉంటారు. మీరు డిస్కౌంట్ల కొరకు చూస్తే, ఈ ఈకామర్స్ మొబైల్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చును.

మొబైల్ యాప్ అయినా ఖచ్చితంగా వెబ్ సైటు ఉండాలని లేదు, కొన్ని క్విజ్, గేమ్స్ లాంటి మొబైల్ యాప్ కేవలం యాప్ తరహా కంటెంటుతోనే ఉండడం వలన వాటి యొక్క వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ఉపయోగం ఎక్కువ. ఇంకా మెసేజింగ్ యాప్స్, వీడియో కాలింగ్ యాప్స్ మాత్రం వెబ్ సైటు కన్నా మొబైల్ యాప్ ద్వారానే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. వాట్సప్, స్కైప్ లాంటి మొబైల్ యాప్స్.

చూడడం, చదవడం ప్రధానంగా ఉండే కంటెంటు ఎక్కువగా వెబ్ సైటు ఆధారంగానే ఉంటాయి. అంటే సోషల్ మీడియా వెబ్ సైటులు ట్విట్టర్, టంబ్లర్, లింక్డ్ ఇన్ లాంటి వెబ్ సైటులు. ఇంకా రివ్యూ ఆధారిత వెబ్ సైటులు, న్యూస్ ప్రొవైడ్ చేసే వెబ్ సైటులు చదవడం ప్రధానంగా ఉంటాయి. వీటికి మొబైల్ యాప్ ఉన్నా, వాటికి వెబ్ సైటు కూడా ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి యాప్స్ ఉన్నా, వెబ్ సైటులు కూడా ఉంటాయి. 91మొబైల్స్ లాంటి టెక్ రివ్యూ మొబైల్ యాప్ ఉన్నా, ఆసంస్థకు వెబ్ సైటు కూడా ఉంది.

బ్రౌజరులో వెబ్ సైటు

బ్రౌజరు అడ్రసు బారులో మీరు ఖచ్చితంగా డొమైన్ నేమ్ అక్షరాలను తప్పులేకుండా టైపు చేస్తే, ఆ వెబ్ సైటు ఓపెన్ అవుతుంది లేకపోతే ఎర్రర్ చూపించడం ఉంటుంది. అయితే ఇప్పుడు అన్ని బ్రౌజర్లు డిఫాల్టుగా ఏదో ఒక సెర్చ్ ఇంజన్ ఎటాచ్ చేసి ఉండడం చేత, మీరు టైపు చేసిన అక్షరాలకు దగ్గరగా ఉన్న వెబ్ సైటులు, మరియ ఆ అక్షరాలకు మ్యాచ్ అయ్యే కంటెంట్ బ్రౌజరులో చూపించడం జరుగుతుంది. గూగుల్ సెర్చ్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ డిఫాల్ట్ గా ఉంటుంది.

ఇక బ్రౌజరు వాడుక విషయానికి వస్తే, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సెర్చ్ విడ్జెట్ మీకు హోమ్ స్క్రీనుపైనే అన్ని ఫోన్లలోనూ డిఫాల్ట్ గా సెట్ చేయబడి ఉంటుంది. ప్రక్కచిత్రం చూడండి

పై చిత్రంలో చూపినట్టుగా ఉండే ఈ విడ్జెట్ గూగుల్ సెర్స్ కు సపోర్ట్ చేస్తుంది. మీరు అక్షరాలను టైపు చేసి, లేక వాయిస్ ద్వారా గూగుల్ సెర్స్ చేయవచ్చును. మైక్రోఫోను ఐకానును టచ్ చేయడం ద్వారా మీ మాటలను గూగుల్ సెర్చ్ చేయవచ్చును. మీరు మాట్లాడిన మాటలకు డొమైన్ నేమ్ మ్యాచ్ అయితే ఆ డొమైన్ ముందుగా మీకు కనబడుతుంది. లేకపోతే ఆ మాటలకు పోలి ఉన్న కంటెంటు కలిగిన ఇతర వెబ్ సైటులు ఓపెన్ అవుతాయి.

వెబ్ ఆధారంగా ఉండే సేవలు ఎక్కువగా వెబ్ సైటును కలిగి ఉంటాయి. మొబైల్ ఫీచర్స్ ఆధారంగా ఉండేవి, ప్రధానంగా మొబైల్ ఉపయోగకరంగా ఉండే విధంగానే డవలప్ చేయబడి ఉంటాయి. వాట్సప్ మొబైల్ ఆధారంగానే పని చేస్తుంది. మీరు ఒకవేళ వెబ్.వాట్సప్ ఓపెన్ చేసినా, మీ మొబైల్ ను వెబ్ సైటుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎటాచ్ చేయాల్సిందే. బ్రౌజరులో మొబైల్ వెబ్ సైట్స్ ఉపయోగంచడం వలన మొబైల్ యాప్ అవసరం అంతగా ఉండకపోవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

నక్షత్రం బట్టి రోజూ మంచి చెడు సమయముల చూపించే వెబ్ సైటు

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు గురించి ఈ తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం.

ఎందుకు సాదారణంగా చేసే పనులు కాకుండా, కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించాలంటే మంచి సమయం ఎంచుకుని, మంచి సమయం వచ్చేవరకు వేచి చూసి మనల్ని కొత్త పనులు ప్రారంభించమంటారు? ఎందుకు కొత్త కార్యం ప్రారంభించాలంటే మంచి చెడుల సమయం చూడాలి?

ఏదో తెలియని శక్తి మనిషి మనసుపై ప్రభావం చూపుతుంది అని చాలామంది పెద్దలు అంటూ ఉంటారు, అంతే కాకుండా ఇంగ్లీషు సైంటిష్టులు కూడా ఈ విషయం అంగీకరించినట్టుగానే లోకం చెబుతుంది. ఆ ఏదో తెలియని శక్తి ఎలా మనమీద పని చేస్తుంది. అంటే గ్రహస్థితిని బట్టి పని చేస్తుంది, అని అంటారు. ఎలా గ్రహాలు స్థితి మనపై ప్రభావం చూపుతాయి? అంటే కొందరు ఇలా అంటారు.

ఒక కంపెనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ స్థాయి ఉద్యోగులు, మీటింగులో ఉన్నప్పుడు అదే రోజు కొత్తగా జాయిన్ అయిన క్రింది స్థాయి ఉద్యోగి అవసరం పడి, మీటింగులోకి వెళితే, ఆ మీటింగులో ముఖ్యవిషయం మాట్లాడుకుంటున్నవారి దృష్టి ఆ చిన్నఉద్యోగిపై పడి, వారి స్వభావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం కలుగుతుంది. ఆ చిరు ఉద్యోగి ఆ ఆఫీసులో ఉన్నంతకాలం ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అలానే ఉంటుంది. ఇది ఎలా సాధ్యమో అలాగే ఒక జీవి పుట్టినప్పుడు, ఆకాశంలో గ్రహస్థితి దృష్టి, స్థానం, భావం ఆ వ్యక్తిపై ప్రభావం ఎలా ఉండబోతుందో తెలియజేస్తాయి అంటారు.

అయితే ఆఫీసులో ఫస్ట్ ఇంప్రెషన్ పడ్డ చిన్న ఉద్యోగి, బాగా పనిచేసి, వారి మనసులో భావాలు చెరిపేసినట్టుగా, జీవి క్రమశిక్షణ వలన గ్రహస్థితి యొక్క ప్రభావం తట్టుకోవడం లేక ప్రభావం తగ్గించుకోవడంలాంటివి సాధ్యమే అంటారు. ఇలా కష్టపడి తన పైఅధికారుల అనుగ్రహం పొందిన చిన్నఉద్యోగి, ఆయా అధికారుల స్థితిని చూసి, ప్రవర్తించినట్టే, మనం కూడా కదులుతున్న కాలం గమనిస్తూ, మంచి సమయం మనకు అనుకూలంగా ఉన్న సమయంలో కొత్త ప్రయత్నం ప్రారంభిస్తే మంచిదని అంటారు.

కాలం కలసి రాకపోతే తాడు పాము అయ్యి కాటు వేస్తుంది అని అంటారు. అటువంటి కాలం చాలా విలువైనది, ఆలోచన పుట్టిన సమయం ఒక పండితుడికి, చెబితే ఆ ఆలోచన పుట్టిన సమయం ప్రభావం బట్టి మీ ఆలోచన ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పగలిగే వారు ఉంటారు. సమయం గమనిస్తూ, పనిపై శ్రద్ద పెడితే పని జరుగుతుంది. అయితే

ఒక్కోసారి తలపెట్టిన సమయం కొన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని పండితులు అంటారు. కాబట్టి ఒక ముఖ్యపనిని ప్రారంభించే సమయం ముందుగానే సరి చూసుకుంటే, ఆ పని మనకు ఇబ్బందులు లేకుండా అవుతుంది.కానీ కష్టం లేకుండా పని ఉండదు. అయితే కష్టం వృధా కాకుండా ఉండాలంటే, తలపెట్టే పనిని సరైనా సమయంలోనే ప్రారంభించాలి అంటారు.

అటువంటి కాలంలో ప్రస్తుతం జరుగుతున్న సమయం గ్రహస్థితిని బట్టి నక్షత్రమును ఒకసారి వెబ్ సైటులో యాడ్ చేసుకుంటే, ఆ వెబ్ సైటు ఆ నక్షత్రం గలవారికి ఏ రోజు ఎలా ఉంటుందో మూడు రంగులలో చూపుతుంది. ఆ వెబ్ సైటను గూర్చి ఈ పోస్టులో చూద్దాం. మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

పంచాంగం ప్రకారం మన నక్షత్రమును బట్టి మంచి చెడుల సమయుమలను పండితులు మనకు సూచిస్తూ ఉంటారు. అయితే ఇది మనకు ప్రత్యేకమైన సంధర్భములలో మాత్రమే మనం మనకు మంచి సమయము ఎప్పుడు ఉందో సరి చూసుకుంటాం. అంటే ఏదైనా గృహప్రవేశం, బారశాల లాంటి ముఖ్యపనులలో మాత్రమే బ్రాహ్మణ పండితుల దగ్గరకు వెళ్లి సమయాసమయములను చూసుకుంటాం.

ఎవరైనా 27 నక్షత్రములలోనే ఉంటారు, అయితే అందరికీ అన్నివేళలా అనుకూల సమయముగా ఉండదు. ఒక నక్షత్రమునకు ఒక్కో లగ్నం అనుకూలంగా ఉంటే, అదే లగ్నసమయం మరొకరికి ప్రతికూలం కాగలదు. ముఖ్యకార్యములలో మనం మూహూర్తం చూసుకుని ఆరంభిస్తాం.

Time is gold. If you know your the current time is favor for your, that is the gold in your hand. How to find the good time as per your name or zodiac sign, click here on different color letter from this text to visit the website.

అయితే కొన్ని సార్లు మాత్రం ఏదైనా వ్యాపారం విషయములలో నిర్ణయం అప్పటికప్పుడు తీసుకోవాలసి ఉండవచ్చును. రోజువారీ కార్యక్రమములలో కూడా కొన్ని సార్లు కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మనకు కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. అయితే వాటిలో రోజువారీ మంచి-చెడుల సమయములను అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ కేవలం మన నక్షత్రముననుసరించి మనకు మేలు సమయం తెలుసుకోవాలంటే మాత్రం పండితులను కాంటాక్ట్ చేయాలి.

కానీ మంచి-చెడులు చెప్పేవారు ఈరోజులలో అందుబాటులో లేకపోవడం ఉండదు. ఎందుకంటే సాంకేతిక అభివృద్ది చెందాకా ఎవరైనా మాటలకు మాత్రం అందుబాటులోనే ఉంటారు. అయితే ఒక్కోసారి అలా పండితులను కాంటాక్ట్ చేసే సమయం కూడా మంచి సమయం కాకపోతే, అప్పటి ఆ సమయం ప్రభావం కార్యసమయం నిర్ధేశంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండకపోదు అంటారు.

అలా కాకుండా కొత్తకార్యం అయినా శుభకార్యం తలపెట్టాలనే సమయమే మంచిదా? కాదా? చెక్ చేసుకుంటే….ఆ తలంపు వచ్చిన సమయం మంచి సమయము అయ్యి ఉండి, ఆ సమయము కూడా మన నక్షత్రం ప్రకారం మనకు అనుకూలం అయితే, ఆయొక్క కార్యమునకు సంబంధించిన పనులు అన్ని చక చకా జరిగిపోతాయి అంటారు.

ఊహూ అలా కాదు…కార్యం తలపెట్టాలనే ఆలోచన వచ్చిన సమయం, మన నక్షత్ర బలానికి వ్యతిరేకంగా ఉంటే, అది మనకు అనుకూల ఫలితం ఇవ్వకపోవచ్చును. అలాంటప్పుడు మనకు వచ్చి ఆలోచన సరైనదా? కాదా? అని సమయమును బట్టి నిర్ణయించాలంటే, మన నక్షత్రమును బట్టి మనకు అనుకూల సమయమును, ప్రతికూల సమయమును కలర్ ఇండికేషన్ రూపంలో చూపే వెబ్ సైటు అన్ని భారతీయ భాషలతో పాటు ఆంగ్లములో కూడా ఉంది.

అలా నక్షత్రమును బట్టి ఆ నక్షత్రమునకు ఏ ఏ కాలము చాలా బాగా అనుకూలంగా ఉంటే ఆ కాలము పచ్చ రంగులో ఉంటుంది. కాలము మద్యస్తంగా ఉంటే పసుపు రంగులో ఉంటుంది. ప్రతికూలంగా ఉంటే ఎరుపు రంగులో ఉంటుంది. పచ్చ రంగు సూచించే సమయములో ఆ నక్షత్రమువారు శుభకార్యములు ప్రారంభించవచ్చునని, పసుపు రంగు సూచించే సమయములో మాములు కార్యములు నిర్వహించుకోవచ్చని, ఎరుపురంగు సూచించే సమయములో ఆచితూచి వ్యవహరించమని అర్దం.

జాతకములను నమ్మేవారికి, మంచి చెడు సమయములను పరిశీలన చేసి కొత్త పనులు ప్రారంభించేవారికి, పెద్దలను సంప్రదించే సమయము లేకపోతే ఈ వెబ్ సైట్ ఉపయుక్తముగా ఉంటుంది. మీ నక్షత్రమును బట్టి మీకు మంచి చెడు సమయములను సూచించే వెబ్ సైటును దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

వెబ్ సైటులో ఒక్కసారి మీ పేరు, పుట్టిన తేదీ, సమయం లేదా నక్షత్రం ఒక్కసారి జత చేసి మీ బ్రౌజరులో సేవ్ చేసుకుంటే, మీరు మరలా ఆ వెబ్ సైటను చూసిన ప్రతిసారి మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటులో సమయమును తెలుసుకోవచ్చును.

మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు
మీనక్షత్రం బట్టిమీకు మంచి-చెడులను చూపేవెబ్ సైటు

ధన్యవాదాలు – తెలుగురీడ్స్