Tag: వ్యతిరేక పదం

  • తెలుగు వ్యతిరేక పదాలు

    తెలుగు వ్యతిరేక పదాలు కొన్ని పదాలు వాటి వ్యతిరేక పదాలు

    మంచికి వ్యతిరేక పదమంటే చెడు అనునది వ్యతిరేక పదం. అలా భాషలో కొన్ని పదాలు ఒక భావమును వ్యక్తపరుస్తూ ఉంటే, ఆ భావమునకు వ్యతిరేక భావము ఉండే పదాలు కూడా ఉంటాయి.

    మొదలు అనే ప్రారంభం అనే భావమును తెలియజేస్తూ ఉంటే, చివర అను పదము అంత్యము భావమును తెలియజేస్తుంది.

    అనుకూలము అనే పదమునకు వ్యతిరేక పదము ప్రతికూలము. విజయము పదమునకు వ్యతిరేక పదము అపజయము. సద్వినియోగం పదమునకు వ్యతిరేక పదము దుర్వినియోగము.

    ధర్మము పదమునకు వ్యతిరేక పదము అధర్మము… ఇలా పాజిటివ్ కు నెగటివ్ ఉన్నట్టు. కొన్ని క్రియా పదాలకు వ్యతిరేక పదాలు ఉంటాయి.

    కొన్ని తెలుగు వ్యతిరేక పదాలు

    అందము x .వికారము
    అమృతము x విషము
    ఆది x అంతము
    ఉపక్రమము x ఉప సంహారము
    కలిమి x లేమి
    ఖర్చు x పొదుపు
    గెలుపు x ఓటమి
    చీకటి x వెలుగు
    జననము x మరణము
    తమస్సు x ఉషస్సు
    తీపి x చేదు
    దారిద్ర్యము x ఐశ్వర్యము
    దోషము x గుణము
    ద్రవ్యము x ఘనము
    నాందీ x భరత వాక్యము
    పండితుడు x పామరుడు
    పాపము x పుణ్యము
    ప్రత్యక్షము x అంతర్ధానము
    ప్రవేశము x నిష్క్రమణ
    మంచి x చెడు
    మడి x మైల
    మేలు x కీడు
    మోదము x ఖేదము
    రహస్యము x బహిరంగము
    లఘువు x గురువు
    లాభము x నష్టము
    వక్త x శ్రోత
    వ్యష్టి x సమష్టి
    వికసించు x ముకుళించు
    శీతము x ఉష్ణము
    స్వర్గము x నరకము
    స్వాగతము x వీడ్కోలు
    సుఖము x దుఃఖము
    హ్రస్వము x దీర్ఘము
    ఆరోహణ x అవరోహణ
    ఇహలోకము x పరలోకము
    ఉచ్ఛ్వాసము x నిశ్వాసము
    ఉపకారము x అపకారము
    కృతజ్ఞత x కృతఘ్నత
    పురోగమనము x తిరోగమనము
    ప్రత్యక్షము x పరోక్షము
    సంకోచము x వ్యాకోచము
    తృణము x ఫణము
    అతివృష్టి x అనావృష్టి
    స్వాధీనము x పరాధీనము

    కొన్ని తెలుగు వ్యతిరేక పదాలు


    శేషము x నిశ్శేషము
    షరతు x భేషరతు
    హాజరి x గైరుహాజరు
    కారణము x నిష్కారణము
    సత్కార్యము x దుష్కార్యము
    సత్ఫలితము x దుష్ఫలితము
    అనుకూలము x ప్రతికూలము
    కనిష్ఠము x గరిష్ఠము
    క్రమము x అక్రమము
    కారణము x అకారణము
    కృత్యము x అకృత్యము
    ఖండము x అఖండము
    చేతనము x అచేతనము
    జీర్ణము x అజీర్ణము
    జ్ఞానము x అజ్ఞానము
    ధర్మము x అధర్మము
    దృశ్యము x అదృశ్యము
    ధైర్యము x అధైర్యము
    ద్వితీయము x అద్వితీయము
    నాగరికత x అనాగరికత
    పరాజిత x అపరాజిత
    పరిచితుడు x అపరిచితుడు
    పరిమితము x అపరిమితము
    పవిత్రత x అపవిత్రత
    శోకము x అశోకము
    సంపూర్ణము x అసంపూర్ణము
    సంభవము x అసంభవము
    సమగ్రము x అసమగ్రము
    సమర్థత. x అసమర్థత
    సహజము x అసహజము
    సహనము x అసహనము
    సత్యము x అసత్యము
    స్పష్టము x అస్పష్టము
    స్వస్థత x అస్వస్థత
    సాధారణము x అసాధారణము
    సామాన్యము x అసామాన్యము
    స్థిరము x అస్థిరము
    సురులు x అసురులు
    హింస x అహింస
    అంగీకారము x అనంగీకారము
    అల్పము x అనల్పము
    అధికారి x అనధికారి
    అంతము x అనంతము
    అవసరము x అనవసరము
    ఆర్థము x అనర్థము
    అఘము x అనఘము
    అర్హత x అనర్హత
    అసూయ x అనసూయ
    ఆచారము x అనాచారము
    ఆచ్ఛాదము x అనాచ్ఛాదము
    ఇష్టము x అనిష్టము, అయిష్టము
    ఉచితము x అనుచితము
    ఉదాత్తము x అనుదాత్తము
    ఉపమ x అనుపమ
    ఉక్తము x అనుక్తము
    ఔచిత్యము x అనౌచిత్యము
    ఐక్యత x అనైక్యత
    కీర్తి x అపకీర్తి
    ఖ్యాతి x అపఖ్యాతి
    భ్రంశము x అపభ్రంశము
    జయము x అపజయము

    తెలుగు వ్యతిరేక పదాలు


    నమ్మకము x అపనమ్మకము
    ప్రథ x అపప్రథ
    శకునము x అపశకునము
    స్వరము x అపస్వరము
    హాస్యము x అపహాస్యము
    గుణము x అవగుణము
    మానము x అవమానము
    లక్షణము x అవలక్షణము
    అదృష్టము x దురదృష్టము
    ముహూర్తము x దుర్ముహూర్తము
    సద్గుణము x దుర్గుణము
    సన్మార్గము x దుర్మార్గము
    ఆటంకము x నిరాటంకము
    ఆడంబరము x నిరాడంబరము
    ఆధారము x నిరాధారము
    అపరాధి x నిరపరాధి
    ఆశ x నిరాశ
    ఆశ్రయము x నిరాశ్రయము
    ఉత్సాహము x నిరుత్సాహము
    ఉపమానము x నిరుపమానము
    గుణము x నిర్గుణము
    దయ x నిర్దయ
    దోషి x నిర్దోషీ
    భయము x నిర్భయము
    వచనము x నిర్వచనము
    వికారము x నిర్వికారము
    విఘ్నము x నిర్విఘ్నము
    వీర్యము x నిర్వీర్యము
    గర్వి x నిగర్వి
    సుగంధము x దుర్గంధము
    సదాచారము x దురాచారము
    సుదినము x దుర్దినము
    సద్బుద్ధి x దుర్బుద్ధి
    సుభిక్షము x దుర్భిక్షము
    సుమతి x దుర్మతి
    ఆకర్షణ x వికర్షణ
    ప్రకృతి x వికృతి
    సంయోగము x వియోగము
    సజాతి x విజాతి
    సఫలము x విఫలము
    కయ్యము x వియ్యము
    సరసము x విరసము
    స్వదేశము x విదేశము
    సుముఖము x విముఖము
    స్మరించు x విస్మరించు
    స్మృతి x విస్మృతి
    రక్తి x విరక్తి
    అడ్డం x నిలువు
    అతివృష్టి x అనావృష్టి
    అదృష్టం x దురదృష్టం
    అధమం x ఉత్తమం
    అధికము x అల్పము
    అనుకూలం x ప్రతికూలం
    అనుకూలముగ x ప్రతికూలముగ
    అనుగ్రహం x ఆగ్రహం
    అర్థం x అనర్థం
    అవును x కాదు
    ఆకర్షణ x వికర్షణ
    ఆకలి x అజీర్తి
    ఆడ x మగ
    ఆరోగ్యం x అనారోగ్యం
    ఆరోహణ x అవరోహణ
    ఆసక్తి x అనాసక్తి లేదా నిరాసక్తి
    ఇష్టం x అయిష్టం
    ఉచితం x అనుచితం
    ఉచ్ఛ్వాసము x నిశ్వాసము
    ఉత్తమం x అధమం
    ఉత్తరం x దక్షిణం
    ఉదాత్తమైన x అనుదాత్తమైన
    ఉన్నతం x నీచం
    ఉపకారం x అపకారం
    ఉపాయం x అపాయం
    ఊర్ధ్వ x అధో
    ఎక్కువ x తక్కువ
    ఎత్తు x పల్లం
    ఎక్కు x దిగు
    ఏకం x అనేకం
    ఒప్పు x తప్పు
    ఓటమి x గెలుపు
    కష్టం x సుఖం
    కారణము x అకారణము
    క్రింద x పైన లేదా మీద
    కీర్తి x అపకీర్తి
    కుంభాకార x పుటాకార

    తెలుగు వ్యతిరేక పదాలు


    కుడి x ఎడమ
    కొత్త x పాత
    ఖ్యాతి x అపఖ్యాతి
    గట్టి x మెత్త
    గెలుపు x ఓటమి
    గౌరవం x అగౌరవం
    చల్లని x వేడి
    చిన్న x పెద్ద
    చిన్న ప్రేగు x పెద్ద ప్రేగు
    చౌక x ఖరీదు
    జననం x మరణం
    జయము x అపజయము
    జ్ఞానం x అజ్ఞానం
    జీర్ణం x అజీర్ణం
    తగ్గించు x పెంచు
    తగ్గు x హెచ్చు
    తప్పు x ఒప్పు
    తన x పర
    తడి x పొడి
    తల్లి x తండ్రి
    తీపి x చేదు
    తూర్పు x పడమర
    తృప్తి లేదా సంతృప్తి x అసంతృప్తి
    దగ్గర x దూరం
    దైవం x దెయ్యం
    ద్వైతము x అద్వైతము
    ధన x ఋణ
    ధనాత్మక x ఋణాత్మక
    ధనిక x పేద
    ధర్మం x అధర్మం
    ధైర్యం x అధైర్యం లేదా పిరికి
    నీతి x అవినీతి
    నవ్వు x ఏడుపు
    న్యాయం x అన్యాయం
    నిజం x అబద్ధం
    నిశ్చయము x అనిశ్చయము
    నెమ్మది x తొందర
    పగలు x రాత్రి
    పండితుడు x పామరుడు
    ప్రత్యక్షం x పరోక్షం
    ప్రశ్న x జవాబు
    ప్రాచీనం x నవీనం లేదా ఆధునికం
    ప్రియం x అప్రియం
    ప్రేమ x ద్వేషం
    పాపం x పుణ్యం
    పైన x క్రింద
    పైదవడ x క్రిందదవడ
    పైపెదవి x క్రిందపెదవి
    పురోగమనము x తిరోగమనము
    పురుషుడు x స్త్రీ
    పూర్వ x పర
    మంచి x చెడు
    ముందు x వెనుక
    మూయు x తెరుచు లేదా విప్పు
    రాజు x రాణి
    లఘు x గురు
    లఘుకోణము x గురుకోణము
    లావు x సన్నము
    వవిఘ్నం x అవిఘ్నం
    వివేకి x అవివేకి[వీరుడు వ్యతిరేక పదం 1]
    విమర్శించు x పొగడు
    వెలుగు x చీకటి
    శాంతి x అశాంతి
    శీఘ్రం x ఆలస్యం
    శుభం x అశుభం
    సంకోచం x వ్యాకోచం
    సంయోగం x వియోగం
    సజ్జనుడు x దుర్జనుడు
    సమ్మతి x అసమ్మతి
    సమ్మతించు x సమ్మతించకపోవు
    సమ్మతమైన x సమ్మతము కాని
    సాపేక్ష x నిరపేక్ష
    సాధ్యం x అసాధ్యం
    స్త్రీ x పురుషుడు
    స్వర్గం x నరకం
    సుఖము x దుఃఖము
    సుగంధం x దుర్గంధం
    సుభిక్షము x దుర్భిక్షము
    సులభము x దుర్లభము
    సూర్యోదయం x సూర్యాస్తమయం
    స్థూల x సూక్ష్మ
    హళ్ళు x అచ్చు
    హెచ్చు x తగ్గు

    తెలుగు వ్యతిరేక పదాలు

    ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

    తెలుగురీడ్స్.కమ్

    తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

    ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

    telugureads