లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది?
నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో కొంత కాలాయాపన జరిగితే, చేసే పనిలో ఆటంకం ఉంటే మరికొంత కాలాయాపన ఉంటుంది. కాలాయాపన జరిగిపోతుందనే ఆలోచనతో దేవునిపై ధ్యాస కరువవుతుంది.
అందుకే ముందుగానే రాబోయే పండుగలు గూర్చి తెలుసుకుని ఉండి ఉండాలి అంటారు. మనకున్న వివిధ పండుగలలో వివిధ దేవీదేవతలను పూజిస్తూ ఉంటాం. ఏదేవుని పూజకు ఆయా విధానం ప్రకారం పూజిస్తూ ఉంటాం. పూజావిధానంతో బాటు మన:ప్రవర్తన మరీ ముఖ్యమంటారు. పూజ చేస్తూ ఉన్నప్పుడు ధ్యాస దేవునిపై ఉండి తీరాలి అంటారు. అప్పుడే ఆ పూజకు సరైన ఫలితం ఉంటుందని పండితులు అంటారు.
కావునా ఏ పండుగకు ఏదేవుడుని పూజించాలో ఆ దేవుని పురాణమను విశిష్టముగా చదివితే, ఆ దేవునిపై మనసు మమేకం అవుతుందంటారు. తినగా తినగా వేపాకు తియ్యగా ఉన్నట్టుగా, చదవగా… చదవగా… చదువుతున్న దేవుని మహిమలు మన మనసులో నాటుకుంటాయని అంటారు. ప్రస్తుతం మనకు ముందుకు రాబోయే మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడం ప్రధానమైన విషయం.
పరమశివుని వైభవం శివపురాణము
ముందుగానే పరమశివుని వైశిష్ఠ్యమును తెలియజేసే తెలుగుబుక్స్ రీడ్ చేయడం ద్వారా పరమశివుని వైభవం మనకు అవగతమవుతుంది. శివపురాణం చదవడం వలన మనకు పరమశివుని వైభవం తెలియబడుతుందని పెద్దలు చెబుతారు. శివపురాణం చదవడం వలన నిత్యం శివుడిని తలవడం మనసుకు అలవాటు అయితే, ఆయొక్క అలవాటు వలన మనసు మంచి సమయములలో కూడా పరమశివుడిని మననం చేసుకుని పుణ్యం మూటగట్టుకుంటుందని అంటారు.
మననం మనసుకుండే అలవాటు కావున మననం చేసే విషయాలలో సాత్విక విషయాలు ఉండాలి అంటారు. అలా వివిధ దేవతల మంచి గుణములను తెలియజేసే వివిధ దేవతా పురాణములను రీడ్ చేయడం వలను ఆయా దేవతలపై మనసు మననం చేయడం అలవాటుగా చేసుకుంటుంది. శివపురాణం మంచిగా చదివితే, శివుని వైభవం అర్ధం చేసుకునే మనసు, శివుడిని తలుస్తూ ఉంటుంది. ఆవిధంగా పరమశివుడిని గూర్చి మననం చేసే మనసు, మహాశివరాత్రి పర్వదినాన కూడా మననం చేస్తే, ఆ రోజు పూజావిధానంతో బాటు, మనసంతా శివధ్యాసే ఉంటే, ఆ జన్మకు అంతకన్నా అదృష్టం ఏముంటుంది? అందుకేనేమో జన్మానికో శివరాత్రి అంటారు.
అంటే మనసులోకి ముందుగా పరమశివుడిని తెచ్చుకుని ఉంటే, ఏదోక శివరాత్రికి మనసంతా శివుడే ఉండి, ఆ మనిషి తరించాడానికి మనసు మేలు చేస్తుంది. మరి మనసుకు పరమశివుని వైభవం తెలియజేసే శివపురాణం గురించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి లేదా క్లిక్ చేయండి. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తే, రాబోయే మహాశివరాత్రులకు మనసు మరింతగా ప్రిపేర్ అవుతుంది.
శివరాత్రి రోజున ఉపవాసం చేయడంతో బాటు, ఆ రోజురాత్రి జాగరణ చేయడం పరపాటి. అయితే ఉపవాసం చేయడం అంటే ఆహారం మీద ధ్యాస లేకుండా, పరమశివునిపైన మాత్రమే ధ్యాస నిలపడం అంటారు. జాగరణ అంటే నిద్ర కూడా మరిచి పరమశివునిపై ధ్యాసను పెట్టడం అంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినమున పరమశివుని వైభవం తెలియజేసే సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం తెలుగుబుక్ తెలుగులో రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ లేక క్లిక్ చేయండి.
ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస
చదవడం కన్నా శ్రద్దగా వ్రాయడం వలన బుక్ లో ఉన్న విషయం బాగా అర్ధం అవుతుందని అంటారు. దీని కన్నా శ్రద్దగా వినడం వలన మనసు మరింతగా విషయాన్ని అర్ధం చేసుకోగలదు అంటారు. అలా దేవుని గురించి చదవడం కన్నా ముందు వినడం వలన ఆ దేవునిపై భక్తి బాగా పెరుగుతుంది. అటు తరువాయి ఆయా దేవీదేవతల బుక్స్ రీడ్ చేయడం వలన ఆయా దేవీదేవతలపై భక్తి భావన బలపడుతుంది. అంటే ప్రవచనాలను ఆసక్తితో వినడం ద్వారా భగవంతునిపై ధ్యాస పెరుగుతుంది. అలా ప్రముఖుల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెంచుకోవచ్చును.
ప్రముఖు ప్రవచన కర్తల ప్రవచనాల ద్వారా పరమశివునిపై ధ్యాస పెరగడానికి అవకాశం ఎక్కువ. మన తెలుగు ప్రవచన కర్తలలో ప్రముఖులు, ప్రసిద్ద ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈయన పరమశివుని గూర్చి చెబుతుంటే, మనసు మరు విషయంవైపు మరలదు అంటారు. అటువంటి గొప్పవారి మాటలలో మహాదేవుని గూర్చి వినడం వలన పరమశివునిపై ధ్యాస మరింతగా పెరుగుతుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు పరమశివుని గురించి అనేకంగా ఉన్నాయి. వాటిలో అష్టమూర్తి తత్వం ప్రవచనాలు చాలా ప్రసిద్ది. అష్టమూర్తి తత్వం గురించి గురువుగారు చెప్పిన ప్రవచనం వినడానికి క్రింది వీడియో చూడండి.
మహాశివరాత్రి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచించిన ప్రవచనం ఈ క్రింది వీడియో ద్వారా వీక్షించవచ్చును.
పరమేశ్వరుడుని చేరుట జీవుని లక్ష్యమైతే, పురాణాలు, పురాణ ప్రవచానాలు మార్గం చూపుతాయని పెద్దలంటారు. పరమశివుని గురించి ధ్యాస సాదారణ రోజులలో చదవడం, వినడం ద్వారా అలవాటు చేసుకుంటే, మహాపర్వదినాలలో మనసే మార్గముగా మారిపోతుందని అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో