• అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు
    book reads,  telugureads

    అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

    కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ తెలియజేయడానికి ఈ పోస్టు వ్రాస్తున్నాను. గమనిక: పురాణములు చదివేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను ఆయా పురాణ పుస్తకములలోనే తెలియజేస్తారు. ముందుగా ముందుమాట చదివి రచయిత ఉపోద్ఘాతం మరియు పురాణం తెలియజేసే నియమనిష్టలు తెలుసుకుని, వాటిని అనుసరించి పురాణపఠనం చేయడం ఉత్తమమని అంటారు. కావునా మీరు పురాణ పుస్తకములు చదివేటప్పుడు అత్యంత శ్రద్ధతోనూ, మరియు ఉత్తమమైన ప్రదేశములో కూర్చుని, ప్రశాంత చిత్తముతో చదివితేనే పురాణసారం మనసు గ్రహించగలుగుతుంది. పెద్దలచే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కు అధినాయకులు…

  • దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి
    telugureads,  పౌరాణిక సినిమాలు,  భక్తి సినిమాలు

    దీపావళి తెలుగు పాత సినిమా

    దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది. కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది. వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”. దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు…

  • telugureads,  tr

    శ్రీకృష్ణ పరమాత్మా గురించి క్విజ్

  • కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ తెలుగుమూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు.
    telugureads,  పౌరాణిక సినిమాలు

    మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

    మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. రేవతి-బలరాముల ఆడబిడ్డ శశిరేఖని, సుభద్ర-అర్జునుల మగబిడ్డ అభిమన్యునికి ఇచ్చి వివాహాం చేయాలని, వారి బాల్యంలోనే పెద్దలు మాటలు ఇచ్చిపుచ్చుకుంటారు. అటుపై సుభద్ర అభిమన్యుని తీసుకుని తన మెట్టింటికి బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు పాండవులు రాజసూయ యాగం నుండి ద్వారకకు తిరిగి వస్తూ, ధర్మరాజు ఇచ్చిన బహుమతులను తీసుకుని వస్తాడు. వాటిని బలరాముడికి, శశిరేఖకు బహూకరిస్తాడు. బలరామునికి ఇచ్చిన బహుమతి ప్రత్యేకత ఏమిటంటే…”దానిపై నిలబడిన ఎవరైనా సరే, వారి మనసులోని కుఠిలం స్వయంగా వెల్లడి చేసేస్తారు.” ఇంకా శశిరేఖకు ఇచ్చిన…

  • మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా.
    telugureads,  భక్తి సినిమాలు

    సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

    సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది. సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి దగ్గరకూడా ఆమె నిత్యం పాండురంగడి ధ్యానంలోకి వెళుతూ ఒంటరిగా ఉంటుంది. యుక్తవయస్సుకు వచ్చినా ఇంత భక్తిపరాయణత్వం ఏమిటా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అయితే ఒకరోజు సన్యాసి ఆ ఇంటికి వచ్చి, సక్కుబాయిని ఆశీర్వదించి ఆమెకు పాండురంగ స్వామి విగ్రహమును ఇచ్చి వెళతాడు. నాటి నుండి సక్కుబాయి ఆపాండురంగడి విగ్రహమే సర్వస్వంగా ఉంటుంది. సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా ఒక శుభమూహర్తమున సక్కుబాయికి, ఒక రైతుకుటుంబంలోని బిక్షపతికి ఇచ్చి వివాహం జరిపించి, ఆమెను అత్తవారింటికి పంపించేస్తారు. బిక్షపతి తల్లి…

  • శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము
    telugureads,  పౌరాణిక సినిమాలు

    శ్రీకృష్ణావతారం తెలుగు భక్తి చిత్రము

    శ్రీకృష్ణావతారం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి Sri Krishna Avataram Telugu Chitram NTR Acted as lord Srikrishna, Hari Krishna Acted as Child SriKrishna. మహాభారతంలో భాగంగా ఉండే శ్రీకృష్ణ అవతారగాధ భాగవతంలో కూడా భాగమై ఉంటుంది. ఆ గాధని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కృష్ణుడుగా, స్వర్గీయ నందమూరి హరికృష్ణ బాలకృష్ణుడుగా నటిస్తే, శోభన్ బాబు నారద మహర్షిగా నటిస్తే, దేవిక, కాంచన, కైకాల సత్యనారాయణ, నాగయ్య, మిక్కిలినేని, ధూళిపాళ, రాజనాల, ముక్కామల, ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణ, ముదిగొండ లింగమూర్తి, కృష్ణకుమారి, ఎస్ వరలక్ష్మి, ఎల్ విజయలక్ష్మి, గీతాంజలి, సంద్యారాణి తదితరులు  శ్రీకృష్ణావతారం చిత్రంలో నటించారు. దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం, ఋషులు, దేవతలు, భూమాత మొరపెట్టుకుంటే శిష్ట రక్షణార్ధం దుష్టులను నిర్జించడానికి అవతరిస్తానని మాట ఇచ్చిన శ్రీమహావిష్ణువు. సాధుజనులకు ధర్మపరాయణులకు రక్షకుడు అయినా శ్రీమహావిష్ణువు అవతారం కృష్ణావతారం. కంసుడు తన చెల్లెలికి దేవకికి వసుదేవుడుని ఇచ్చి వివాహం చేసి అంగరంగ వైభంగా రధసారధిగా బావగారిని చెల్లెల్ని అత్తవారింటికి…