బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి?

బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి?

బాహుబలి తెలుగుమూవీ కానీ అంతర్జాతీయంగా అందరి మన్ననలు అందుకుంది. తెలుగువారికి తెలిసిన విషయమే! కానీ అంత గొప్ప పేరు తెచ్చుకున్న బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి? ఈమూవీ చూస్తున్నంత సేపు మహాభారతం గుర్తుకు వస్తుంది. అందరం మహాభారతంలోని కొన్ని పాత్రలను బాహుబలి మూవీలో పాత్రలతో పోల్చుకుంటాం.

అయితే లండన్ వేదికగా మాట్లాడుతూ తెలుగుసినిమా బాహుబలి హీరో పాత్రకు రామాయణంలోని రాముడే ప్రేరణ అని చెప్పారు. సాదారణంగా మహాభారతం అంటే ఆసక్తిగా చూస్తాం. రామాయణం అంటే అనాసక్తిగా అనిపిస్తుంది. కానీ మన దేశంలో రామాలయాలకు అనేకంగా ఉంటాయి. ఎందుకు అని ఆలోచిస్తే, శ్రీరాముడు మానవునిగా వచ్చి తన ఆచరణతో భగవానుడుగా అందరి మన్ననలు అందుకున్నాడు. తనను అమితంగా ప్రేమించేవారిని సంపాందించుకున్నాడు. ముఖ్యంగా అతి బలవంతుడు అయిన హనుమ మరియు రాముని సోదరులు అందరూ శ్రీరాముని భక్తితో కొలుస్తారు. అందుకే బాహుబలి పాత్రకు శ్రీరాముడే ప్రేరణ అని చెప్పాడు. ఈ క్రింది వీడియో రాజమౌళి మాటల్లో వినండి.

బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి?

రాజమౌళి శ్రీరాముని ధర్మం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తే ఒక బాహబలి వచ్చింది. అటువంటిది శ్రీరామాయణం మొత్తం రాజమౌళి తీస్తే ఇంకెంత గొప్పగా ఉంటుందో?

తెలుగు సినిమా బాహుబలి అంతటా ఆదరణ పొందింది. అటువంటి బాహుబలి తెలుగుహీరోకు ప్రేరణ ఏమిటి? మూలమైన పాత్రకు ప్రేరణ సనాతన ధర్మమును ఆచరించి చూపిన శ్రీరాముడు. హిందూ ధర్మంలో శ్రీరాముని గురించి తెలియని వారుండరు. శ్రీరామనామం పలకకుండా హిందువు ఉండడు.

హిందూధర్మంలో అనేకమంది దేవతలు ఉన్నారు. కానీ వారందరూ మానవాతీతులుగానే ఉంటారు. మానవాతీత శక్తులుకలిగి ఉంటారు. కానీ శ్రీరామాయణంలో రాముడు అప్పటి మహారాజులు వలనే ఉన్నాడని అంటారు. శ్రీరాముడు సర్వశక్తిమంతుడు అయినా ఒక మనిషిలాగానే సుఖదు:ఖాలు అనుభవించి, ఎప్పుడూ ధర్మమును వదలకుండా పట్టుకున్నాడు. అందువలననే శ్రీరాముడు అందరిచేత, రాజ్యంలోని ప్రజలుచేత పూజింపబడ్డాడు అని చెబుతారు.

మన భారతదేశంలో మాములు వ్యక్తులే కాదు మహానుభావులు కూడా శ్రీరామభక్తులుగానే జీవించారు. అందులో మహాత్మగాంధీని కూడా చెబుతారు. ఆయన మరణించే సమయంలో హేరామ్ అని అన్నారని అంటారు. పండితులు ప్రచనం చేస్తే శ్రీరామచంద్రమూర్తి గురించి కీర్తించకుండా ఉండలేరని అంటారు. శ్రీరామనామం తారకమంత్రంగా చెబుతారు. శ్రీరాముని గురించి మాట్లాడితే మాటలు ఆగవు, వ్యాక్యాలు వరదలై వస్తూనే ఉంటాయంటారు.

శ్రీరామాయణంలో ఫ్రీ తెలుగుబుక్స్ చదవడానికి ఇక్కడ క్లిక్ టచ్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు

కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే పుణ్యమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే విజ్ఙానం, వినయమంటారు, కొందరు పురాణ తెలుగు పుస్తకములు చదివితే మనసుకు శాంతి కలుగుతుంది అంటారు. కొందరు పురాణ పుస్తకములు చదివితే దు:ఖంలో ఉన్నవారి మనసుకు మేలు కలిగే ఆలోచనలు బుద్దిరూపంలో బయటపడతాయి అంటారు. ఏదైనా పుస్తకము చదువుట అంటే ఆపుస్తకంలోని అంశంతో ఏకాగ్రతతో పయనించడం అని అంటారు. ఇప్పుడు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శీర్షికన శ్రీమహావిష్ణువు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ తెలియజేయడానికి ఈ పోస్టు వ్రాస్తున్నాను.

గమనిక: పురాణములు చదివేటప్పుడు కొన్ని నియమ నిబంధనలను ఆయా పురాణ పుస్తకములలోనే తెలియజేస్తారు. ముందుగా ముందుమాట చదివి రచయిత ఉపోద్ఘాతం మరియు పురాణం తెలియజేసే నియమనిష్టలు తెలుసుకుని, వాటిని అనుసరించి పురాణపఠనం చేయడం ఉత్తమమని అంటారు. కావునా మీరు పురాణ పుస్తకములు చదివేటప్పుడు అత్యంత శ్రద్ధతోనూ, మరియు ఉత్తమమైన ప్రదేశములో కూర్చుని, ప్రశాంత చిత్తముతో చదివితేనే పురాణసారం మనసు గ్రహించగలుగుతుంది.

పెద్దలచే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కు అధినాయకులు చెప్పబడతారు. సృష్టి అంటే పుట్టుక అది మనకు తెలియకుండానే జరిగే ప్రక్రియ, లయ అంటే ముగింపు(రోజు నిద్ర గురించి, దీర్ఘనిద్ర గురించి, సృష్టి అంతం గురించి చెబుతారు) అంటారు. ఇక స్థితి ఇది చాలా ప్రధాన విషయంగా కనబడుతుంది. స్థితి అంటే కరెంట్ స్టేటస్, ప్రస్తుతం అంటారు. సృష్టి, లయలలో అందరికి తెలిసేలా ఉండదు కానీ స్థితి మాత్రం ఉన్నవారందిరికి పరిచయమే. ఇప్పుడున్న స్థితిలో మీరు బాగున్నారా? అంటారు. ఇక్కడ అడిగినవారు, చెప్పినవారు ఇద్దరూ స్థితిలో ఉన్నవారే. ఈ స్థితికి శ్రీమహావిష్ణువు రక్షకుడుగా పండితులు చెబుతారు. వ్యక్తికి స్థితికారుని హృదయం తెలిసి ఉంటే, ఏ సమయంలో ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియబడుతుందంటారు. స్థితికారుని గూర్చి తెలిపే పురాణములు విష్ణుపురాణము, హరివంశము, గరుడ పురాణము, శ్రీకృష్ణ లీలలు వివిధ గ్రంధములుగా మనకు తెలుగుబుక్స్ లభిస్తాయి.

స్థితికారుడు శ్రీమహావిష్ణువు కాబట్టి విష్ణుపురాణం మరి మిగిలిన గ్రంధాలు ఎందుకంటే, స్థితికారుడు అయిన వైకుంఠాధీశుడు ధర్మ సంస్థాపనార్ధం అవతారములు స్వీకరిస్తాడు. అందుకనే అన్ని అవతారములలోనూ వైకుంఠపురవాసి పురాణములు, ఇతిహాసముల గ్రంధములు, తెలుగు పుస్తకములు అనేకంగా ఉంటాయి. వైకుంఠాధీశుడు రామావతారం గురించి తెలిపే శ్రీరామాయణం ఒక ఇతిహాసమై ఉంది. శ్రీకృష్ణావతారం గురించి తెలిపే హరి వంశం, శ్రీకృష్ణ లీలలు తదితర తెలుగురచనలు ఉంటాయి. అలవైకుంఠపురంబున నివసించే శ్రీమహావిష్ణువు స్వయంగా గరుడునికి తెలియజేసిన పురాణం గరుడ పురాణంగా ఉంది. అల వైకుంఠపురవాసి దశావతారముల గురించి తెలియజేసే భాగవతం పోతనామాత్యులు మనకు తెలుగులో రచించారు. ఇంకా భాగవతం గురించి ఎన్నో తెలుగుబుక్స్ మనకు లభిస్తాయి.

అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు ఆన్ లైన్లో

పురాణములు చదవడానికి, వినడానికి ఎంతో పుణ్యఫలం ఉంటేనే సాధ్యమంటారు. ఇంకా అల వెకుంఠాధీశుని అనుగ్రహం ఉంటేనే గరుడపురాణం చదవే అదృష్టం కలగదు అని పండితులు చెబుతూ ఉంటారు. ఇంకా గరుడపురాణం గురించి ప్రవచనరూపంలో వినడం కూడా చాల ప్రశస్థమైన విషయంగా చెబుతారు. అలాంటి గరుడపురాణం తెలుగులో ఉచితంగా ఆన్ లైన్లో చదవడానికి లేక డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. గరుడ పురాణం గరుడుని ద్వారా శ్రీమహావిష్ణువు లోకానికి అందించి విశేష జ్ఙానముగా చెబుతారు, ప్రవచనకారులు. ఈ పురాణమును గూర్చి ఎంత శ్రద్ధతో వింటే అంత ఫలితం అని చెబుతారు. దీనిని గూర్చి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

శ్రీ హరివంశ పురాణమును ఎక్కువగా పిల్లలు లేనివారు ఈ పురాణ పఠనమును అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఈ పురాణ పుస్తకము చదివేవారు ఒక వ్రతదీక్షలాగా చేయాలని చెబుతారు. అకారణంగా ఎవరిని నిందించకూడదు, పవిత్ర హృదయముతో దయతో మౌనముతో నిత్యం సరళ స్వభావము కలిగి వినయభావనతో ఉంటూ ఈ శ్రీహరివంశ పురాణమను చదవాలంటూ చెబుతారు. ఎన్ని సార్లు ఎంత భక్తిశ్రద్ధలతో చదివితే లేక వింటే అంతగొప్ప ఫలితం ఉంటుంది అంటారు. మీరు శ్రీహరివంశ పురాణం తెలుగు ఉచిత పుస్తకం చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. ఇంకా ఈ పురాణమును గూర్చిన ప్రవచనం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారి వీడియోలు వినడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

శ్రీమహావిష్ణువు అల వైకుంఠపురమువాసి తెలుగు పురాణ పుస్తకములు శ్రీరామాయణం గురించిన తెలుగు పుస్తకములు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. శ్రీనివాసుడు శ్రీరామునిగా భూమిమీద ఒక నరుడుగా నడిచిన ఇతిహాసం శ్రీరామాయణం. శ్రీరామనామం భక్తిశ్రద్ధలతో మననం చేసుకున్న పుణ్యమే అంటారు. అటువంటి పరమపవిత్రమైన రామాయణంలోని సుందరకాండ గురించి ఎక్కువగా తెలుగు పుస్తకాలు ఉంటాయి. ఇంకా సంపూర్ణ రామాయణం ఆరుకాండలతో కలిపి ఎక్కువగా మనకు లభిస్తాయి. సంపూర్ణ రామాయణం గురించిన వివిధ రచయితల తెలుగుబుక్స్ చదవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

స్థితి అంటే ప్రస్తుతము కాబట్టి ప్రస్తుతం ఒకరికి దు:ఖంగా ఉంటే అదే ప్రస్తుతం మరొకరికి సు:ఖంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక మనిషి మనసుకు ఏర్పడే సుఖదు:ఖాలకు కారణం పురాణములు తెలియజేస్తాయి. నమ్మితే పురాణములు ప్రశాంతచిత్తమును ఇస్తాయి అంటారు. మనిషి ప్రశాంతంగా ఉన్నప్పుడే బాగా పనిచేయగలడని అందరూ అంటారు. ఈ విధంగా చూస్తే ప్రస్తుతంలో జీవితం గురించి సరైన అవగాహనతో సుఖదు:ఖాలను చూడడం అలవాటు అవసరం కాబట్టి పురాణపఠనం మంచిదనే పెద్దలు అంటారు. మీకు ఈ పోస్టు నచ్చితే షేర్ చేయండి.

ధన్యవాదాలు తెలుగురీడ్స్

రామాయణ రచయిత వాల్మీకి జయంతి

శ్రీరామాయణం రచించిన మహర్షి వాల్మీకి జయంతి నేడు

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ తిధి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం తేది మారుతుంది. ఈసారి అక్టోబర్ 13న వచ్చింది. రామాయణ రచయిత అయిన వాల్మీకి గురించిన గాధ ఇలా ప్రాచుర్యం పొంది ఉంది.

బందిపోటు దొంగగా అడవిలో ఉంటాడు. అడవిలో ఆ దారిలో వస్తున్న నారదమహర్షిని కూడా ఆ దొంగ అడ్డగిస్తాడు. అయితే అప్పుడు నారదుడు అతనిని ”నీవు చేస్తున్నది పాపం, ఈ పాపంలో నీ భార్యబిడ్డలకు భాగం ఉందో లేదో తెలుసుకో” అని అంటాడు. దానికి వెంటనే ఆ దొంగ తన ఇల్లాలిని ఇదే విషయం అడిగితే, ఆమె ”నీవు సంపాదించి, తీసుకురావడం నీ ధర్మం, నీ పాపంలో నాకు భాగముండదు” అని చెప్పడంతో ఆ దొంగ మరలా తిరిగి నారదుడిని చేరతాడు.

అప్పుడు నారద మహర్షి అతని వైరాగ్య భావనను గమనించి అతనికి తారకమంత్ర ఉపదేశం చేస్తాడు. అయితే ఆ దొంగకు రామ రామ రామ అనడం కూడా చేతకాకపోవడం వలన రామ అక్షరాలను వెనుక నుండి మర మర అనమని చెబుతాడు. అప్పుడు అతను మర మర మర మర….అంటూ పలుమార్లు ఉచ్ఛరించడం చేత, అది రామా రామా గా మార్పు పొంది, పెద్ద తపస్సులోకి వెళతాడు. అతని తపస్సు పూర్తయ్యేసరిగి అతని చుట్టూ పుట్ట పెరిగిపోయి, అందులోంచి తిరిగి మహాజ్ఙానిగా బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు.

మహాతపస్సు చేత బ్రహ్మగారి వర ప్రభావంతో నారదమహర్షి సంక్లిప్త రామాయణం విన్న వాల్మీకి మహర్షి ఆరుకాండట శ్రీరామాయణం రచించడం ప్రారంభించి, దిగ్విజయంగా పూర్తి చేసారు. అయితే ఇందులో ప్రత్యేకత ఎవరైనా రచయిత కల్పన చేత పాత్రలను సృష్ఠించగలరు. కానీ శ్రీరామాయణంలోని వ్యక్తుల మనసులోని భావాలను తెలుసుకోగలిగిన వరం పొంది ఉన్న వాల్మీకి రామాయణ రచన అంతా వారి వారి మనోభావాలను యధాతదంగా వ్రాయగలిగారు అని అంటారు.

మానవజీవితాన్ని ఉద్దరించగలిగిన రామాయణం రచించి ఇచ్చిన వాల్మీకి మహర్షి జయంతి నేడు కాగా ఈ వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మనకు మంచిని ప్రబోధిస్తూ ధర్మాన్ని పట్టుకుంటే భూమి ఉన్నంత కాలం చరిత్రగా ఎలా ఉంటుందో నిరూపించే శ్రీరామాయణం రచించిన వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందదాయకం.

ధన్యవాదాలు తెలుగురీడ్స్

సంపూర్ణ రామాయాణం తెలుగు భక్తి చిత్రం

Sampoorna ramayanam Telugu chitram directed by Bapugaru, rama and sita story. Rama good boy, Sita good girl God came as man. The man name is Rama. Fully traditional Epic. రామ ధర్మమార్గదర్శి అయితే, సీత అనుసరించిన మహాసాద్వి, దేవుడు మనుజుడుగా అవతరించి, మనిషి రాముని ఆచరించిన ధర్మం ఈ ఇతిహాసం.

బ్యానర్ : లక్ష్మి ఎంటర్ ప్రైజెస్
చిత్ర తారాగణం : శోబన్ బాబు, ఎస్వి రంగారావు, చంద్రకళ తదితరులు
సంగీతం : కేవి మహదేవన్
నిర్మాత: నిడమర్తి పద్మాక్షి
దర్శకత్వం: బాపు

Shobhanbabu acted as Rama in this movie, Chandrakala acted a Sita character. SV Rangarao acted as Ravana. రామునిగా శోభన్ బాబు(Shobhan Babu) చేస్తే, జతగా సీతగా చంద్రకళ(Chandra Kala) నటించారు. ప్రతినాయుకుడు రావణాసురుడు పాత్రలో ఎస్వి రంగారావుగారు(SV Rangarao) నటించారు. It is directed by Bapu, Film name as Sampoorna Ramayanam.

శ్రీమహావిష్ణువు తదితర దేవతల అవతార సన్నివేశం.

వైకుంఠములో లక్ష్మినారాయణులు ఆదిశేషుని కొలువుతీరి ఉండగా దేవతలు అంతా వచ్చి రావణ రాక్షస అకృత్యాలపై మొరపెట్టుకుంటారు. ద్రుష్ట శిక్షణ చేయడానికి నేను నరుడిగా అవతరిస్తాను, మీరు మీ మీ అంశలతో వానరాలుగా అవతరించండి అని శ్రీమహావిష్ణువు వెల్లడి చేస్తారు. ఎందుకంటే రావణుడు మనుషులపై చులకన భావంతో మనుషులు, వానరులు తప్పించి మిగిలిన వారితో మరణం లేని వరం కలిగి ఉంటాడు. వేరొక సన్నివేశంలో రావణాసురుడు వేదవతిని వేదిస్తుంటే, ప్రతిగా వేదవతి నేను మరో జన్మలో నీ మరణానికీ కారణం కాగలనని రావణుడిని శపించి ఆత్మాహుతి చేసుకుంటుంది. దేవతలు వాలి, సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు మొదలైనవారు అవతరిస్తే, శ్రీమహావిష్ణువు రామునిగా, రాముని తమ్ములుగా శంఖు, చక్ర, గదలు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా దశరద మహారాజుకి జన్మిస్తారు.

తనఇంట రావణుడు శివ పూజ చేస్తుండగా, పూజ పుష్పం నుండి ఒక బాలిక ఉద్బవిస్తుంది. ఆ శిశువుని రావణాసురుడు పారవేయమని చెబుతాడు. అలా రావణాసురుని ఇంట ఉద్బవించిన శిశువు పొలం దున్నుతున్న జనక మహారాజుకి దొరుకుతుంది. అలా జనకమహారాజుకి దొరికిన బాలికకు సీత అను పేరు పెడతారు. సీత జగదేక ప్రసిద్ది పొందుతుంది అని జనకమహారాజు గురువులు శతానందులు సెలవిస్తారు.

అయోధ్యలో రామయ్య కౌసల్య – దశరదుల వద్ద అల్లారుముద్దుగా పెరిగి, గురువుల దగ్గర విద్యాభ్యాసం పూర్తీచేసుకుంటాడు.  జనకమహారాజు స్వగృహంలో పెరుగుతున్న సీతమ్మ ఒకరోజు అటాడుకుంటూ ఉండగా బంతి ఒక ధనుస్సు ఉన్న బాక్స్ క్రిందకు వెళుతుంది, అప్పుడు సీతమ్మ తల్లి a పెట్టెని ఇట్టే జరిపి ఆ పెట్టే కింద ఉన్న బంతిని తీసుకుని మరలా ఆటలోకి వెళుతుంది. అది గమనించిన జనక మహారాజు, వారి గురుదేవులు ఆశ్చర్యచకితులు అవుతారు. వేలమంది తోస్తేకాని జరగని ఆ ధనుస్సు కలిగిని పెట్టెని, ఇట్టే జరిపిన సీతమ్మతల్లికి స్వయంవరంలో ఎవరైతే శివదనుస్సుని ఎక్కుపెడతారో వారికే ఇచ్చి వివాహం జరిపిస్తానని అంటారు.

రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి వెంట కానలకు వెళ్ళడం – Sampoorna Ramayanam Telugu Chitram Directed by Bapugaru

ఒకరోజు సభలో దశరధ మహారాజు గురువు వసిష్ఠ మహర్షితో కొలువు దీరి ఉండగా, అక్కడకు విశ్వామిత్ర మహర్షి కూడా వస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి రాకకు కారణం వివరిస్తూ, రామ చంద్రుని తనతో అడవులకు పంపమని దశరధుని విశ్వామిత్ర మహర్షి అడుగుతారు. దానికి దశరధ మహారాజు సంశయిస్తే, అప్పుడు వసిష్ఠ మహర్షి నచ్చచెప్పడంతో దశరధ మహారాజు రామ లక్ష్మణులను విశ్వామిత్ర మహర్షి వెనుక పంపడానికి అంగీకరిస్తే, అక్కడికి వచ్చిన రామలక్ష్మణులు తండ్రి అజ్ఞాపాలన మేర విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

విశ్వామిత్రుని వెనుకు రామలక్ష్మణుల నడక సాగుతుండగా తాటక రాక్షసి కనిపిస్తుంది, ఆ రాక్షసి వారి ముగ్గురిపై రాళ్ళతో దాడి చేస్తుంటే, విశ్వామిత్ర మహర్షి అజ్ఞా మేరకు, రాముడు తాటకిని సంహరిస్తాడు. తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు కొన్ని శక్తి అస్త్రశస్త్రాలను ఉపదేశిస్తారు. విశ్వామిత్ర మహర్షి మరియు ఇతర మునులు జరుపుతున్న యజ్ఞం భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సుబహువు రాక్షసుడుని రాముడు అంతమొందించి, మారీచుడుని రామ బాణంతో కొన్ని యోజనాల దూరంలో పడేటట్టు చేస్తాడు. యాగం సంపూర్తి అవుతుంది, నారద మహర్షి కూడా అక్కడకు వచ్చి రామచంద్రుడిని దర్శించుకుని, విశ్వామిత్ర మహర్షితో సీతాస్వయంవరం గురించి వివరిస్తారు. అదేవిధంగా ఆ విషయం రావణుడి చెవికి చేరవేస్తాడు. రావణుడు సీతాస్వయంవారానికి బయలుదేరితే, రామలక్ష్మణులు ఇద్దరూ గురువు విశ్వామిత్ర మహర్షిని అనుసరిస్తారు.

దారిలో అహల్యకు శాపవిమోచనం కావించి, రామలక్ష్మణ మహర్షులు జనకమహారాజు సభకి చేరుతారు. స్వయంవరానికి విచ్చేసిన మహావీరులందరు ప్రయత్నించి విఫలమైతే, రావణాసురుడుకి కూడా గర్వభంగం అవుతుంది. ఇక గురువు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రామచంద్రులు శివధనుస్సు ఎక్కుపెట్టగానే, ధనుస్సు విరుగుతుంది. సీతారాముల వివాహం అంగరంగవైభవంగా ఇరువురి బంధుమిత్ర సపరివారం మద్య జరుగుతుంది. శివధనుస్సుని విరిచింది ఎవరు అంటూ వచ్చి, అంతకు వేయిరెట్లు అధిక శక్తి కలిగిన హరివిల్లుని కూడా ఎక్కుపట్టమని పరశురాముడు చెబితే, ఆ హరివిల్లుని కూడా ఎక్కుబెట్టిన రాముడు, పరశురాముడుకి శ్రీమహావిష్ణువుగా దర్శనం అయ్యి అక్కడ నుండి నిష్క్రమిస్తారు.

శ్రీరామ పట్టాభిషేకం ముహూర్తంలో సీతారామలక్ష్మణులు అడవులకు – Sampoorna Ramayanam Telugu Chitram

తరువాతి సన్నివేశంలో భరత, శత్రుఘ్నుడు ఇద్దరు వారి మావగారి గృహానికి వెళతారు. మరొక సందర్భంలో  దశరధ మహారాజు తన సభలో పెద్దలు, ప్రజలు, గురువుగార్ల సమక్షంలో నేను వృద్దుడిని అవుతున్న కారణంగా శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తానని అనగానే అందరు హర్షిస్తారు. శ్రీరాముడు కేవలం నా పెద్దకుమారుడు కావడం మాత్రమే కాకుండా శ్రీరామునికి చాలా మంచి గుణాలు ఉన్నాయని అందుకే పట్టాభిషేకం చేస్తానని అంటే సభ మరొకసరి సంఘీభావం తెలియజేస్తే, అక్కడికి వేంచేసిన శ్రీరామునికి పట్టాభిషేక విషయం వివరించి, రేపటి పట్టాభిసేకనికి సంసిద్దుడివి కమ్మని చెబుతాడు.

మరుసటి రోజు అయోధ్య అంతా సంబరాలు జరుపుకుంటూ ఉంటే, కైకేయి మందిరానికి వచ్చిన మందర నూరిపోసిన వాక్కుల వలన కైకేయి మనసు చెదిరి, దశరధ మహారాజుని వరాలు అడగడంతో శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి, అదే సమయానికి సీతారామ లక్ష్మణులు అడవులకి బయలుదేరవలసి వస్తుంది. అంతా ఈశ్వరేచ్చ అని భావించి, సీతారామలక్ష్మణులు అడవులకి వెళతారు, అలా రధంలో బయలుదేరిన రాముని ఎడబాటు భరించలేని దశరధ మహారాజు మరణిస్తారు. తదుపరి వచ్చిన భరతుడు విషయం గ్రహించి తల్లిని మందలించి అన్నగారి వద్దకు అడవులకి బయలుదేరతాడు.

అడవిలో సీతారామలక్ష్మణులు నార దుస్తులు ధరించి ముని ఆశ్రమంలో ఉండగా, భరతుడు సపరివార సైన్యంతో రావడం చూసి లక్ష్మణుడు భారతునిపై సందేహం వెలిబుచ్చుతాడు. కానీ భరతుడు అన్నగారు అయిన శ్రీరామచంద్రుడినే రాజ్యం స్వీకరించాలని, తనతల్లి చేసిన తప్పుకు తానూ ఈ శిక్ష భరించలేనని అంటాడు. అలాగే కైకేయి తదితర వారంతా శ్రీరాముని అయోధ్యకు వచ్చి రాజ్యపాలన చేయవలసినదిగా కోరితే, శ్రీరాముడు తాను తండ్రికి మాటకు మచ్చ రానివ్వను అంటూ రాజ్యభారం ప్రస్తుతం భరతుడే నిర్వహించవలసినదిగా చెబుతారు. శ్రీరామ పాదుకలు తీసుకుని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేసి పాలిస్తానని, గడువు ముగిసే సమయానికి నీవు రాకపోతే, నేను ప్రాయోపవేశం చేస్తానని చెప్పి అయోధ్యకు వెనుతిరుగుతాడు.

రావణుడు సీతాపహరణం చేయడం – Sampoorna Ramayanam Telugu Chitram Directed by Bapugaru

మరొక సన్నివేశంలో రామలక్ష్మణులను చూసిన శూర్పణఖ మోహితురాలై వారి వెంటబడితే, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కుచెవులు కొస్తే, ఆమె రావణ సభకి వెళ్లి మొరపెట్టుకుంటుంది. అంతేకాకుండా సీత అందచందాలు పొగిడేసరికి, రావణుడిలో దుర్బుద్ధి పెరిగి సీతాపహరణకు పధకం వేస్తాడు. పధకం ప్రకారం మారీచుడు బంగారు లేడి వేషంలో సీతారామలక్ష్మణుల ఆశ్రమం ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఆ బంగారులేడిని చూసిన సీతమ్మ ఆ లేడిని తనకు తెచ్చి ఇవ్వవలసినదిగా రాముని కోరితే, రాముడు బంగారులేడి వెనుక వేట బాణాలతో బయలుదేరతారు. కొంచెంసేపటికి రాముని ఆర్తనాదం విన్న సీతమ్మ లక్ష్మణుడిని కూడా రాముని బాట పట్టిస్తుంది. ఇక మారువేషంలో వచ్చిన రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆకాశమార్గంలో సీతమ్మని తీసుకునిపోతున్న రావణుడిపై జటాయువు పోరాటం చేసి రెక్కలు పోగొట్టుకుంటాడు.

తిరిగి వచ్చిన రాముని దుఃఖానికి హద్దు ఉండదు. లక్ష్మణ ఓదార్పుతో తేరుకుని శ్రీరామలక్ష్మణులు సీతమ్మని వెతుక్కుంటూ బయలుదేరతారు. మధ్యలో కనిపించిన శబరి ఆతిద్యం స్వీకరించాక, శబరి మాటల ప్రకారం వారిరువురు ఋష్యమూక పర్వతం చేరుకుంటారు. వాలితో ఉన్న తగువు కారణంగా రాజ్యానికి దూరంగా నివసిస్తున్న సుగ్రీవుడు ఆ పర్వతంవైపు వస్తున్న శ్రీరామలక్ష్మణులను చూసి, తనమంత్రి అయిన హనుమతో వాళ్ళెవరో వివరాలు తెలియగోరతాడు. అప్పుడు ఆ అంజనిపుత్రుడు శ్రీరామలక్ష్మణుల వద్దకు కామరుపంలో వెళతాడు. కానీ కామరుపంలో ఉన్న హనుమని శ్రీరామచంద్రుడు గుర్తించగా, లక్ష్మణుడు తమ వివరాలు చెప్పగా మళ్ళి రాముడు హనుమ సంభోదిస్తే, హనుమ తన నిజ స్వరూపంతో స్వామిని ఋష్యమూక పర్వతంపైకి తీసుకువెళతాడు.

ఋష్యమూక పర్వతంపై శ్రీరామసుగ్రీవుల స్నేహం కుదురుతుంది. సీత గురించి చెబితే, హనుమ సీతమ్మవారి నగలు తెచ్చి రామునికి ఇస్తాడు. నగలు సీతమ్మవే అని గుర్తించి మరల శ్రీరాముడు దుఃఖిస్తాడు. తరువాత సుగ్రీవుడు తన కధని శ్రీరామునికి చెపుతాడు. అధర్మంగా సుగ్రీవుని రాజ్యబహిష్కరించి, సుగ్రీవుని భార్య అయిన రుమని వాలి అనుభవించడం విన్న శ్రీరామచంద్రమూర్తి వాలిని చంపడానికే నిశ్చయిస్తాడు. వాలి సుగ్రీవుల ద్వంద్వ యుద్దంలో పూలమాల లేని వాలిని శ్రీరాముడు చెట్టు చాటునుండి బాణంతో కొడతాడు. రామబాణం తగిలిన వాలి రాముని చూసి ఇదేమి ధర్మం చెట్టు చాటునుండి బాణప్రయోగం ఏమిటి ? అని అడిగితే. దానికి రాముడు వ్యన్యమృగాలను చెట్టు చాటునుండి కొట్టడం ధర్మమే, అందులోను నీవు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి ఈ విధంగా శిక్షించాను అని చెబుతాడు. అంగదుడుని సుగ్రీవునికి అప్పగించి వాలి మరణిస్తాడు.

సీతాన్వేషణకు హనుమ, జాంబవంత, అంగద తదితర వానరులు బయలుదేరడం Sampoorna Ramayanam Telugu Chitram Directed by Bapugaru

సుగ్రీవ పట్టాభిషేకం తరువాయి సుగ్రీవుడు రాజ్యభోగాలలో ఉండి, సీతాన్వేషణ విషయం రాముని విషయం మరుస్తాడు. లక్ష్మణస్వామి ఆగ్రహించి సుగ్రీవుని వద్దకు వస్తే, తార మాటలతో చల్లబడ్డ లక్ష్మణస్వామితో సుగ్రీవుడు క్షమాపణ వేడుకుని, రాముని వద్దకు చేరి, సీతాన్వేషణకు వానరాలను నలుదిశలకు పంపుతాడు. హనుమతో కూడిన అంగద, జాంబవంతుడు మొదలైన వానరులు దక్షిణంవైపు వెళతారు. అయితే హనుమ రాముని నుండి గుర్తుగా ఉంగరం పొంది ఉంటాడు. అలా దక్షిణదిక్కులో ఉన్న సముద్రం దాటే విషయమై వానరులు అందరూ తర్జనబర్జన పడి, చివరికి హనుమనే వేడుకుని, ఆంజనేయస్వామి శక్తిని వేనోళ్ళ పొగుడుతారు. ఇతరులు గుర్తుచేస్తేకానీ తనశక్తిని గుర్తించలేని మునిశాపం నుండి విముక్తుడై సీతాన్వేషణకు రామబాణంలా సముద్రం దాటుతాడు, హనుమ.

హనుమ లంకలో కావలి కాస్తున్న లంకిణిని ఓడించి, లంకలో ప్రవేశిస్తాడు. అప్పటికి లంకలో రావణుడు సీతమ్మకి రెండూ మసాల గడువు విదించి వెళతాడు. దుఃఖితరాలుగా సీతమ్మ కూర్చుని ఉన్న చెట్టుపై ఉన్న హనుమ రామకధ వినిపించి, అయిన రాక్షస మాయేమో అని శంకించిన సీతమ్మకి రామచంద్రుని ముద్రికను సీతమ్మకి చూపుతాడు. తనబుజాలపై కూర్చోతల్లి రాముని చెంతకు చేర్చుతాను అని హనుమ పలికితే, సీతమ్మ రాముడే తనభార్యని అయిన నన్ను యుద్దంలో రావణుడిపై గెలిచి తీసుకువెళ్లాలని చెప్పి, తన చూడామణిని హనుమకి ఇచ్చి పంపుతుంది.

వెనుకకు వెళ్తూ హనుమ వనమంతా చెట్ల కొమ్మలు విరిచి కొంతమంది రాక్షసులను నిర్జిస్తాడు. ఇక రావణుడు కొడుకు బ్రహ్మాస్త్రానికి గౌరవం ఇచ్చి, పట్టుబడతాడు, హనుమ. సభలో ఆంజనేయస్వామి తన శక్తిని చూపి రామచంద్రుని శరణువేడుకో అని హితవు చెప్పగా, దానికి బదులుగా రావణుడు ఆంజనేయస్వామితోకకి నిప్పంటించమని చెబుతాడు. ఎవరు అంటించిన నిప్పు వారినే తగలబెట్టినట్టు, ఆంజనేయ స్వామి తనతోకతో లంకలో కొన్ని భవంతులను కాల్చి మరీ రాముని చెంతకు వెళతాడు.

రామరావణ యుద్ధం – శ్రీరామ పట్టాభిషేకం Sampoorna Ramayanam Telugu Chitram Directed by Bapugaru

సీతమ్మ ఇచ్చిన చూడామణి చూసి రామలక్ష్మణులు, సుగ్రీవాది వానరులతో కలిసి యుద్దానికి బయలుదేరతాడు. సముద్రుడు సహకారంతో సముద్రంపై వారధి ఏర్పరచుకుని రామలక్ష్మణులు యుద్ద సైన్యం అంతా లంక చేరతారు. యుద్ధం మొదలై అనేకమంది వానర యోధులు యుద్ద విన్యాసాలు, లక్ష్మణస్వామి యుద్దనైపుణ్యం, రామరావణుల సంగ్రామంలో రావణుడు మరణిస్తాడు. రావణమరణానంతరం విభీషణుడికి పట్టాభిషేకం చేసి, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, సుగ్రీవుడు మొదలైనవారితో అయోధ్య చేరతారు. అయోధ్యలో శ్రీరామపట్టాభిషేకం జరిగాక, రామచంద్రమూర్తి పరిపాలనలో అయోధ్య ధర్మపదంలో నడుస్తుంది.

రామాయణం రాముని చరితము, హనుమాన్, సుందరకాండ వినడం అంటే అది అదృష్టం అయితే, గురువుగారు చాగంటి కోటేశ్వర రావు గారి నోట పలికిన అమృతపలుకులు వినడం మరీ అదృష్టమే.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి