మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం

శ్రీరామ నామ జపం చేయడం అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం అంటే వేయి విష్ణు నామాలు పలికినట్టేనని పరమశివుడు, పార్వతీదేవికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయని పెద్దలు అంటారు.

భక్తితో ”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే” ఈ శ్లోక పఠిస్తే వేయిసార్లు విష్ణు భగవానుడి నామాలు చెప్పినట్టు అని అంటారు. సహజంగా కష్టకాలంలో మనసులో మరే ఇతర భావన లేకుండా, చటుక్కున శ్రీమహావిష్ణువును తలవడమే తరువాయి, వచ్చి ఆపదనుండి గట్టెక్కిస్తాడు. అలాంటి శ్రీమహావిష్ణువు నామాలు వేయిమార్లు పలికితే వచ్చే పుణ్యఫలం శ్రీరామ నామం మూడు మార్లు పలికితే వచ్చేయడం అంటే… శ్రీరామనామం యొక్క గొప్పతనం మనకు కనబడుతుంది.

మనసులో ఏభావన లేకుండా కష్టకాలంలో పూర్తి మనసును భగవంతుడిపై పెట్టి, భగవంతుడిని తలవడం జరిగితే, శ్రీమహావిష్ణువు ఏవిధంగా వచ్చి రక్షణ చేస్తాడో మనకు గజేంద్రమోక్షం ఘట్టం నిరూపిస్తుంది.

పదే పదే మారుకి ఒకసారి మూడు మార్లు శ్రీరామ నామ జపం చేయడం ద్వారా శ్రీరాముని గురించిన భావనలు మన మనసులో బలపడతాయి. శ్రీరాముని గురించి బలపడిని భావనలు శ్రీరాముని గురించి తెలియజేయబడిన గ్రంధపఠనం వైపు మనసును మళ్ళిస్తాయి. శ్రీరామాయణం మనసు పెట్టి చదివినవారికి శ్రీరాముని గుణగణాలే మనసులో బాగా నాటుకుంటాయి.

శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా చెబుతారు.

శ్రీరామాయణంలో ఒక చోట రావణుడికి శ్రీరాముని గురించి చెబుతూ… ”శ్రీరాముడు నిలువెత్తు ధర్మస్వరూపంగా, నడిచే ధర్మముగా చెబుతారు. అటువంటి శ్రీరామ నామ జపం చేయడం వలన, మన మనసులో ధర్మం గురించిన భావనలు బలపడతాయి.

ధర్మమును రక్షిస్తే, ధర్మము నిన్ను రక్షిస్తుంది. అటువంటి ధర్మమును అడుగడుగునా ఆచరించి చూపిన శ్రీరాముని గురించి జపం చేయడం, తపించడం అంటే ధర్మము గురించి తపించడమే…

ప్రకృతిలో పదార్ధమును పరిశీలించిన ఏవో కొన్ని ధర్మములను కలిగి ఉంటాయి. ఆ పదార్ధము యొక్క ధర్మాలను తెలుసుకోవడం వలన, ఆ పదార్ధమును ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలియవస్తుంది. అలాగే జీవిత పరమార్ధమును చేరుకునే ధర్మమార్గమును ఆచరించినవారి గుణగణాలు తలవడం అంటే, ఆ ధర్మమార్గము మనకు మన జీవితంలో గోచరించే అవకాశం ఉంటుంది.

భగవానుడు అందరినీ ఒకే లాగా అనుగ్రహించడం…. శ్రీరామదాసు, అన్నమయ్య… ఇద్దరూ భగవానుడిని కీర్తించినవారే కానీ ఇద్దరినీ అనుగ్రహించిన తీరు వేరుగా ఉంటుంది. అలాగే అందరి జీవితాలు కూడాను… కాబట్టి మనం ఆ భగవానుడిని పట్టుకుంటే మన జీవితం గురించి సాక్షి అయిన శ్రీరామచంద్రుడే, ఏవిధంగా అనుగ్రహించాలో ఆవిధంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది.

ధర్మమార్గమునకు మన ప్రయత్నం చేయడం మన ప్రధమ కర్తవ్యం. మన జీవితానికి అవసరమైన కర్తవ్యం మనం నిర్వహించుకుంటూనే, మన జీవిత పరమార్ధం గురించి కూడా మన ప్రయత్నం చేయడం మన ధర్మం. అందుకు ముందుగా నామస్మరణ కన్నా మేలైనది లేదు అంటారు.

పోతనమాత్యుడు రచించిన భాగవతం శ్రీరామునికే అంకితం

బమ్మెర పోతరాజు రచించిన భాగవతం, ఎక్కువగా శ్రీమహావిష్ణువు గురించి, శివుడి గురించి ఉంటే, అలాంటి భాగవత రచనకు దైవానుగ్రహం శ్రీరాముని రూపంలో జరిగింది. భాగవతం రచించిన పోతనామాత్యులు పరమ రామభక్తుడు… చివరికి భాగవతం శ్రీరామునికే అంకితం ఇచ్చారు. అంటే శ్రీరాముడు అనుగ్రహిస్తే శ్రీమహావిష్ణువు, పరమశివుడు అనుగ్రహం పొందినట్టే.

హరిహరుల అనుగ్రహం సులభంగా పొందాలంటే, శ్రీరామ నామ జపం మూడు మార్లు పదే పదే తీరిక వేళల్లో చేయడం మేలు అంటారు. మరీ ముఖ్యంగా శ్రీరాముడు కష్టకాలంలో ఓ మాములు మనిషిలాగానే దు:ఖించడం కనబడుతుంది.

మన కష్టకాలంలో తోటివారి మాటలు ఓదార్పు ఎలా ఉంటుందో… శ్రీరామాయణం చదివితే, రాముని మనసు మన మనసుకు మరింత దగ్గరవుతుందని అంటారు. అందుకే శ్రీరామ నామ జపం పదే పదే చేసి, శ్రీరామచంద్రుని గురించి భావనలు బలపడ్డాక, శ్రీరామాయణం చదువుతుంటే, శ్రీరాముడే మనసులో కొలువై ఉంటాడని అంటారు. ముందుగా శ్రీరామ నామ జపం మనస్ఫూర్తిగా, భక్తితో, నమ్మకంతో చేయడం అలవాటు అయితే, శ్రీరాముని అనుగ్రహం కలుగుతుంది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

శ్రీరామాయణంలో రాముడు చరిత్రను తెలియజేస్తూ, శ్రీరాముని ధర్మాచరణను తెలియపరుస్తుంది. అయితే యోగవాశిష్ఠము మోక్షసాధనకు మంచి పుస్తకంగా చెప్పబడుతుంది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…

యోగవాశిష్ఠము తెలుగుబుక్ ఎవరు చదవవచ్చు అంటే… ఈ బుక్ లో ఇలా వ్రాయబడి ఉంది. ‘నేను నాది అనే అహంకార బంధనంలో చిక్కుపడి, దు:ఖాలను అనుభవిస్తూ, ఈ సంసార బంధనాల నుండి విముక్తి కోరుకునేవారు అయ్యి ఉండి ఆ భావన బాగ బలపడి, మరీ అజ్ఙాని కాకుండా, పూర్తి జ్ఙాని కాకుండా ఉన్నవారు యోగవాశిష్ఠము తెలుగుబుక్ రీడ్ చేయవచ్చని’ వ్రాసి ఉన్నారు.

ఆరుకాండల శ్రీరామాయణంలో శ్రీరాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, అరణ్యాలకు వెళ్లడం, సుగ్రీవునితో కలవడం, హనుమంతుడు సీతాదర్శణం లాంటి ఘట్టాలతో ధర్మం తెలియజేస్తూ ఉంటే, యోగవాశిష్టము శ్రీరాముని వైరాగ్య భావనలు, వాటికి గురువుల బోధ ఉంటుంది. ఈ బోధలో తత్వం గురించి తెలియజేయబడుతుంది. శ్రీరాముడు జీవన్ముక్తుడు ఎలా అయ్యింది యోగవాశిష్ఠము తెలుగుబుక్ లో ఉంటుంది.

విద్యాభ్యాసం పూర్తయిన శ్రీరామునికి తీర్ధయాత్రలు చేయాలనే ఆలోచన పుడుతుంది. వెంటనే శ్రీరామచంద్రమూర్తి దశరధ మహారాజుగారి అనుమతితో తీర్ధయాత్రలను బయలుదేరతాడు. పుణ్యనదులలో స్నానం చేస్తూ, పుణ్యక్షేత్రములను దర్శించుకుని తీర్ధయాత్రలు చేసిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వస్తాడు.

యోగవాశిష్ఠము శ్రీరామునికి వశిష్ఠ బోధ

అయోధ్యకు తిరిగి వచ్చినా శ్రీరామునిలో స్పష్టమైన మార్పు కనబడుతుంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ, ఒక తాపసిలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు అయోధ్యకు రావడం జరుగుతుంది. అయోధ్యకు వచ్చిని విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తిని తనతో అడవులకు పంపవలసినదిగా దశరధుడిని అడుగుతాడు. అయితే మొదట్లో అందుకు అంగీకరించని దశరధుడు, వశిష్ఠుడి సలహాతో అంగీకరిస్తాడు. అప్పుడే దశరధుడు శ్రీరామునిలో తీర్ధయాత్రల తర్వాత కలిగిన మార్పు గురించి విశ్వామిత్రుడితో చెప్పి, శ్రీరాముని విశ్వామిత్రుడు, వశిష్ఠుల సమక్షంలోకి పిలిపిస్తాడు.

విశ్వామిత్రుడు – వశిష్ఠుల ముందర శ్రీరాముడు తన వైరాగ్యభావనలు తెలియజేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముని జ్ఙానిగా అభివర్ణించి, శ్రీరామునిలో ఆ జ్ఙానమును పరిపుష్టం చేయడానికిగాను వశిష్ఠుడిని శ్రీరామునకు బోధ చేయవలసినదిగా అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీరామునకు వివిధ ఉపాఖ్యానములుగా చేసిన తత్వబోధనే యోగవాశిష్ఠముగా చెప్పబడింది. యోగవాశిష్ఠము తెలుగుబుక్ రీడ్ చేయడం ద్వారా శ్రీరామునకు వివాహం కంటే ముందుగానే, అంటే యవ్వనంలోకి ప్రవేశించిన మొదట్లోనే వైరాగ్యం వచ్చినట్టుగానే తెలియవస్తుంది.

శ్రీరామాయణంలో రాముని ప్రవర్తన అందరికీ ఆదర్శంగా చెబుతారు. యోగవాశిష్ఠములో శ్రీరామాయణం ఆంతర్యంగా చూస్తే, శ్రీరామునకు వివాహం కంటే ముందుగానే తత్వం తెలియబడింది. గురువుల బోధతో మోక్షమునకు అన్వేషణ జరిగింది. అందుకే యోగవాశిష్ఠము భక్తిజ్ఙానం కోసం తాపత్రయపడుతూ, పలు భక్తి పుస్తకములపై విచారణ జరుపుతుండేవారు చదవడం వలన మరింత తాత్విక ప్రయోజనం కలుగుతుందంటారు.

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకునే ముందు కొంత పురాణ పరిశీలన అవసరం

యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకోవడానికి ముందుగానే కొన్ని భక్తి పుస్తకములు చదివి ఉండడం మరియు వాటిలోని ధర్మ సూక్ష్మముల గురించి అవగాహన ఏర్పరచుకుని ఉండడం మేలు అని అంటారు. లేదా ప్రసిద్ద ప్రవచనకర్తల ప్రవచనములు వింటూ తాత్విక విచారణ చేస్తున్నవారు ఈ యోగవాశిష్ఠము తెలుగుబుక్ చదవవచ్చు. తత్వచింతన చేస్తున్నవారికి యోగవాశిష్ఠము మరింత ప్రయోజనం కలిగించే విధంగా ఉంటుందనే విషయం ఈ బుక్ లోనే తెలియజేయబడింది. యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి… తెలుసుకునే ముందు కొంత పురాణ పరిశీలన అవసరం అంటారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్