దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

అప్పుచేసిపప్పుకూడు తెలుగు పాత చలనచిత్రం

అప్పుచేసిపప్పుకూడు తెలుగు పాత చలనచిత్రం

అప్పు చేసి పప్పు కూడు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie విజయ ప్రొడక్షన్స్ పతాకం పై ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో NT రామరావు, SV రంగారావు, సావిత్రి, కొంగర జగ్గయ్య, జమున, చిలకలపూడి సీతారామాంజనేయులు, రేలంగి వెంకటరామయ్య, గిరిజ, అల్లు రామలింగయ్య, ముక్కామల, రమణారెడ్డి, సూర్యకాంతం, తదితరులు నటించారు.

అప్పుచేసి పప్పుకూడు పరపతిని ఉపయోగించుకుని అప్పులు చేసే వ్యక్తి, ఆ అప్పులు తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు గురి అవుతారో ఎందరి జీవితాలతో అడుకుంటారో ఈ చిత్రం ద్వారా కనబడుతుంది. రావు బహద్దూర్ రామదాసు పరపతితో అప్పులు చేయడం, ఇంకా తన కోడలుని కాదని ఇంకో జమిందారి సంబంధం కోసం ప్రాకులాడడంతో మొదలయ్యే చిత్రం, దివాన్ బహద్దూర్ ముకుందరావు తన మనవరాలికి మహారాజాతోనే పెళ్లి చేయాలనీ భావించండంతో చిత్రకధ అనేక మలుపులు తిరుగుతుంది. ‘Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie’.

రావు బహుద్దూర్ రామదాసు జమిందారు అయితే నిండా అప్పుల్లో మునిగి ఉంటాడు. అతనికి ఒక రఘు అనే కొడుకు, పట్నంలో చదువు కుంటూ ఉంటాడు. రావు బహుద్దూర్ రామదాసు కింద గుమస్తాగా భజగోవిందం పని చేస్తూ ఉంటాడు. అయితే రావు బహుద్దూర్ రామదాసు తన కొడుకు రఘు రాజారావు చెల్లెలు లీలతో వివాహం జరిగి ఉంటుంది, అయితే విదేశాలకు చదువు నిమిత్తం రఘు, ఉద్యమంలో భాగంగా రాజారావు జైలు కి వెళ్ళినప్పుడు, డబ్బుపై పేరాశతో రావు బహుద్దూర్ రామదాసు లీల ఇంటినుండి గెంటివేస్తాడు. తరువాత లీల చనిపోయిందని విదేశాల్లో ఉన్న రఘుకి చెబుతాడు. అంతేకాకుండా సాటి జమిందారు అయిన దివాన్ బహుద్దూర్ ముకుందరావు మనవరాలు మంజరికి ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చే సొమ్ముతో బాకీలు తీర్చివేయవచ్చు అని భావిస్తాడు.

భజగోవిందం, రాజారావు కలసి వేసే వేషాలతో కధకు ముగింపు

అలాగే దివాన్ బహుద్దూర్ ముకుందరావు దగ్గర పనిచేసే గుమస్తాకి రావు బహుద్దూర్ రామదాసు లంచం ఇచ్చి సంబంధం ఖాయం చేసేవిధంగా చూడమాని చెబుతాడు. స్వతంత్ర సమరంలో జైలుకి వెళ్లి జైలు నుండి విడుదల అయిన రాజారావు వచ్చేటప్పటికి భజగోవిందం, మంజరి జరిగిన విషయాలు రాజారావుకి చెబుతారు. ఇంటినుండి గెంటివేయబడిన లీలని మరల రామదాసు ఇంటిలో తీసుకువస్తాడు, రాజారావు. సుగుణవతి అయిన లీలని ఇంట్లో పని మనిషిగా అయితే ఉండు, నా ఇంటికోడలుగా కాదు అని ఒప్పిస్తాడు. రావు బహద్దూర్ రామదాసు. రావు రామదాసు గారికి గుణపాఠం చెప్పడానికి, మంజరి, లీలల జీవితాలను కాపాడడం కోసం రాజారావు ఒక జమిందారు గా వేషం వేసుకుని దివాన్ బహద్దూర్ ముకుందరావు గారి ఇంటికి వస్తాడు. విదేశాల నుండి రఘు చదువులు పూర్తీచేసుకుని వస్తాడు. రఘు వచ్చాక అతని భార్య అయిన లీలని పనిమనిషిగా పరిచయం చేస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

కానీ ఆ పని మనిషే లీల అని రఘు తరువాత తెలుసుకుని, తను కూడా ఆ విషయం తెలియనట్టే రావు బహద్దూర్ రామదాసు దగ్గర నటిస్తూ ఉంటాడు. అయితే రాజారావు ఆడుతున్న రాజావారి నాటకం తెలుసుకున్న రావు బహద్దూర్ రామదాసు రాజారావు చెల్లెలుని తీసుకువచ్చి బెదిరించి, జమిందారు దగ్గర నుండి దివాన్ బహద్దూర్ దగ్గర నుండి పంపించేస్తాడు. అలాగే రావు రామదాసు దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి వచ్చి అతని మనవరాలు మంజరిని తన కొడుకు రఘుకి ఇచ్చి చేయమని, లేకపోతే దొంగ రాజాని ఇంట్లో పెట్టుకొని నాటకం సంగతి కోసం నలుగురి చెప్పి మనవరాలి మంజరి పెళ్లి జరగనివ్వనని బెదిరిస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

ఇక భజగోవిందం సూచనతో రాజరావు మరలా సన్యాసి వేషం వేసి, దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి చేరతాడు. రాజారావుతోబాటు భజగోవిందం కూడా సన్యాసి వేషంతో రావు బహద్దూర్ రామదాసు ఆటలకు చెక్ పెడతారు. చివరికి లీల-రఘు, ఉష-భజగోవిందం, మంజరి-రాజారావు జంటలుగా పెద్దలు అంగీకరించడంతో చిత్రం ముగుస్తుంది. “Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie”. దురాశ దుఃఖానికి చేటు, అయితే అయినవారి చొరవతో పెడదారి సరిచేయబడితే బుద్ది తెచ్చుకున్న ఒక పెద్దమనిషిచేత ప్రభావితమైనవారు వేసే వేషాలు ఈ చిత్రంలో ఆకట్టుకుంటే, పాటలు కూడా బాగుంటాయి.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్