Tag: సృష్టికర్త

  • త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది.

    త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటాడు…

    కానీ ఒక్కటే అనే భావం బలపడడానికి మాత్రం మనసే కదలాలని అంటారు.

    శివుడు – లయకారుడు

    విష్ణువు – స్థితికారుడు

    బ్రహ్మ – సృష్టికర్త

    తమోగుణం

    రజోగుణం

    సత్వగుణం

    శివుడు లయకారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

    విష్ణువు స్థితికారుడు కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

    బ్రహ్మ సృష్టికర్త కాబట్టి పరమాత్మ లయకారుడిగా ఉంటాడని పెద్దలంటారు.

    అంటే త్రిమూర్తులకు మూలం పరబ్రహ్మమని అంటారు.

    అలాగే త్రిమూర్తులకు భార్యలు

    శివుడుకి భార్య పార్వతి, విష్ణువుకి భార్య లక్ష్మి, బ్రహ్మకు భార్య సరస్వతి.

    ముగ్గురమ్మలకు మూలం పరబ్రహ్మమనే అంటారు.

    ఎలా చెప్పినా ఏం చెప్పిన ఈ త్రిమూర్తి తత్వం ప్రధానంగా ప్రస్తావిస్తూ భగవంతుడి లీలలు, సుగుణాలు గురించి చెబుతూ ఉంటారు.

    సృష్టి ప్రారంభం బ్రహ్మ చేస్తే, బ్రహ్మకు మూలం విష్ణువు అని వైష్ణవులు, శివుడు అని శైవులు అంటూ ఉంటారు. అందుకు తగినట్టుగానే పురాణాలు ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు.

    అయితే ఏనాడో ప్రారంభం అయిన సృష్టిలో మనం ఎప్పటివారమో మనకూ తెలియదు….

    ప్రారబ్దం వలన పుట్టుక ఉంటే, ఆ ప్రారాబ్దానికి కారణం ఏనాటిదో ఈనాడు తెలియడం కష్టమే కానీ ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం చేయడమే శ్రేయస్కరం అని పెద్దలు అంటూ ఉంటారు.

    ఏనాడో ఓనాడు పుణ్యకర్మ, ఎప్పుడో ఒకప్పుడు పాపకర్మ ఈజన్మలో ప్రారబ్ధం అయితే, అప్పటి పాపపుణ్యాలు భగవంతుడికి వదిలి ఇప్పటి కర్తవ్య నిర్వహణకు మనసుని ప్రిపేర్ చేయడానికి భక్తిమార్గం ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు.

    త్రిమూర్తులలో త్రిమూర్తి తత్వం ఉంటుంది. ఒకరిలో ఒక తత్వమే చూడడం అవివేకం అంటారు. ముగ్గురికి ఒకరే యజమాని అయినప్పుడు… ఒకరిలో మూడు తత్వాలు ఉంటాయనేది పెద్దల సూచన.

    విష్ణువు ఒక మనిషిగా పుడితే, ఆ మనిషికి కోపం వస్తే, చెడుని శిక్షించే క్రమలో లయకారుడు అయితే, అదే సమయంలో శిష్టరక్షణ చేసే స్థితికారుడుగా కూడా… సృష్టికి స్థితికి లయకి ఒకదానికొకటి అవినాభావ సంభందం ఉన్నప్పుడూ… త్రిమూర్తులు, ముగ్గురమ్మలు ఒక్కటే అవుతారు.

    ఎక్కువ ఆలోచనలు గందరగోళం అయితే ఒకే ఆలోచన సాధనకు సాకారం అవుతుంది.

    భిన్నాభిప్రాయాలు గల మనసులో శాంతి తక్కువ అయితే, ఏకాభిప్రాయం ఉండే మనిషిలో అశాంతి తక్కువ!

    అలాంటి మనసుకు బలాన్నిచ్చే భక్తిలో భిన్నాభిప్రాయాలను కలిగి ఉండడం కన్నా ఏకాభిప్రాయంతో సాగడమే ఎవరికివారు శ్రేయస్కులుగా మారతారు.

    త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఈ కోణంలో భక్తిభావనలు మనసుకు మేలు చేస్తాయని పండితుల ఉవాచ.

    త్రిమూర్తి తత్వం కలిగిన ముగ్గురిలో ఉన్నది ఒక్కటే పరబ్రహ్మఅయితే ముగ్గురిగా మనిషి అంతర్గతంలో ఉంటే, మనసు మాత్రం తనలో ఉండే భిన్నాభిప్రాయాలతో ఏకాభిప్రాయం సాధించాలని చెబుతారు.

    అందుకు పురాణశ్రవణం, పురాణపఠనం, సద్విచారణ సాయపడతాయని అంటారు.

    తెలుసుకుంటే సాధించాలనే తపన ఉండే మనసుకు పురాణాలు పరమర్ధాన్ని అందిస్తాయని చెబుతారు.