అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జూన్21వ తేదీన జరుపుకుంటున్నారు. 2014వ సంవత్సరం నుండి ఈ యోగాడే అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు.
ఒకరోజులో పగటిసమయం ఎక్కువగా ఉండే రోజుగా
జూన్21వ తేదిని గుర్తించారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో ఈ రోజుకు కొన్ని ప్రత్యేకతలు కూడా చెబుతారు. పగటిసమయం ఎక్కువగా ఉంది కాబట్టి ఈరోజునే ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని, భారత ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతిపాదించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన తీర్మానానికి 175 దేశంలో అత్యదికంగా మద్దతు పలికారు. అలా 2014లో చర్చల ఫలితంగా ఆమోదించబడిన తీర్మానం ప్రకారం 2015వ సంవత్సరం జూన్21వ తేదీన మొదటి
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా యోగాడేగా జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతియేడాది
జూన్21వ తేదీన యోగాడేగా జరుపుకుంటున్నారు.
భారతీయ సంస్కృతిలో
యోగా చాలా ప్రత్యేకమైనది. దీనిని పతంజలి చక్కగా వివరించారని చెబుతారు. ఆచారంలో మనిషి విశిష్టమైన సాధన చేయడానికి
యోగా ప్రాముఖ్యత చాలా ఉంటుంది. చక్కటి యోగా సాధన ఉంటే, మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలడని అంటారు. ఇంకా మనో నియంత్రణకు మూలమైన ప్రాణాయమం యోగాలో సూచించబడినదే….
అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం – యోగాభ్యాసం ప్రయోజనాలు
శరీరంపై అదుపు, మనసుపై నియంత్రణ ఒక సాధన చేత రెండు ప్రయోజనాలు కలిగే యోగాభ్యాసం మనిషికి చాలా అవసరం అని చెబుతారు. సమాజంలో మనిషి సంఘజీవి. తన చుట్టూ ఉండే సమాజం చేత మనిషి ప్రభావితం కాబడుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే సమాజంపై తన ప్రభావం చూపగలుగుతాడు. కర్మ ప్రభావం చేత కాలక్రమంలో కష్టసుఖాలు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రకారం జీవితంలో మనిషి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే
యోగాభ్యాసం వలన మనిషి తనపై ఒత్తిడి తాను తగ్గించుకోవచ్చని అంటారు.
దైనందిన జీవితంలో
యోగాభ్యాసం చేయడం చాలా శ్రేయష్కరమైనదిగా చెబుతారు. అలా మనిషికి శ్రేయస్సుని కలిగించే సాధన, మనిషికి అలవాటుగా మారడానికి, యోగా గురించి ఒక అవగాహన ఉంటే, దానిపై ఆసక్తి పెరిగి,
యోగసాధనకు మనిషి పూనుకునే అవకాశం ఎక్కువ.
శారీరక, మానసిక ఆరోగ్యమును సాధించడానికి మనిషికి యోగా మంచి సాధనగా చెప్పబడుతుంది. దీని గురించి పురాణాలలో కూడా చెప్పబడింది. ఋషుల చేత చెప్పబడిన ఈ
యోగసాధన చాలా ఉపయుక్తమైనది.
విద్యార్ధులకు కూడా యోగాభ్యాసం ఉపయోగమే – అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం

అంతర్జాతీయ యోగా దినోత్సవం
చదువుకునేవారికి కూడా
యోగాభ్యాసం చాలా ఉపయోగమే అంటారు. విద్యార్ధులకు పరీక్షలంటే భయం ఉంటుంది. భయం పెరగడంతో ఒత్తిడి కూడా అధికమవుతుంది. కాబట్టి వారు కూడా యోగాభ్యాసం చేస్తూ ఉంటే, తమలోని ఒత్తిడిని జయించగలరని అంటారు. ఇంకా విద్యార్ధి దశలో ప్రతి విద్యార్ధికి ఏకాగ్రత ముఖ్యం. ఏకాగ్రత సాధనకు
యోగాభ్యాసం కన్నా అభ్యాసం మరొకటి ఉండదు.
ఏకాగ్రత వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటారు. కావునా ఎదిగే వయస్సులో నేర్చుకునే అంశాలలో, చదువులలో విజ్ఙాన విషయాలలో వృద్ది సాధించడానికి అవసరమైన
ఏకాగ్రత యోగసాధన చేత మెరుగుపరచుకోవడానికి విద్యార్ధులకు యోగాభ్యాసం కీలకం.
యోగాడే – అంతర్జాతీయ యోగా దినోత్సవం వ్యాసం
భారతదేశంలో ప్రాచీనమైన ఈ
యోగాభ్యాసం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం ఈ యోగాడే వలన కలుగుతుంది. ఇంకా యోగాభ్యాసం వలన అనేక ప్రయోజనాలు మనిషికి కలుగుతాయి. ఇంకా మనసుపై నియంత్రణ సాధించడం వలన ప్రపంచ వ్యాప్తంగా జనులు శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. క్రమశిక్షణ బాగా వృద్ది చెందే అవకాశం ఉన్న ఈ
యోగాడే అంతర్జాతీయ గుర్తింపు లభించడం మనకు గర్వకారణమే.

అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రపంచం అంతా గుర్తించిన ఈ
యోగాడే రోజు ప్రతియేడాది జరుపుకోవడం వలన, యోగాభ్యాసం గురించి అవగాహన అందరికీ కలుగుతుంది. కొంతమందికే తెలిసిన యోగాభ్యాసం గురించి ఎక్కువ మంది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువమంది
యోగాభ్యాసం చేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చెడు అలవాట్లను కూడా నియంత్రించుకుని, మంచి అలవాట్లను పెంచుకునే అవకాశం యోగాభ్యాసం చేత అలవరుతుందని అంటారు.
కావునా శారీరక,
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనము కూడా యోగాభ్యాసం ప్రారంభించి, మానసిక ఆరోగ్యమును సాధించడానికి మనిషికి యోగా మంచి సాధనకు కృషి చేద్దాం.
ధన్యవాదాలు
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు