పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగులో… పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్ మీ బంధుమిత్రులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగులో పుట్టిన రోజు శుభాకాంక్షలు.
ఫోను నుండి పుట్టినరోజు శుబాకాంక్షలను వచనంగా sms రూపంలో పంపండానికి జన్మదిన శుభాకాంక్షల కోట్స్.
మిత్రుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి తెలుగు కోట్స్
మంచి మిత్రుడు ఉన్నవాడు అదృష్టవంతుడని అంటారు, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సహవాసంలో సంతోషం, బాధ పంచుకుంటూ, ఆనందంగా ఉంటారు. కానీ నీ సహవాసంలో ఎవరైనా మంచి మార్పు వైపుకు మారతారు… నీవు నా స్నేహితుడివైనందుకు ఎంతో సంతోషం.
మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మారుతున్న కాలంలో కష్టనష్టాలు వస్తూ, పోతూ ఉంటాయి కానీ నీ స్నేహం మాత్రం శాశ్వతం. మన స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుతూ…
ప్రియ మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మంచి పుస్తకం చదివితే, మంచి స్నేహితుడు దగ్గర ఉన్నట్టేనని అంటారు. కానీ నాకు ఒక గ్రంధాలయమే నీరూపంలో నాకు లభించింది…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చెప్పుకుంటే బాధ పోతుందని అంటారు అయితే నీ పలకరింపుతోనే ఓదార్పు వచ్చేస్తుంది. నీలాంటి మిత్రుడు నాకు లభించడం నా అదృష్టం.
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మనసుకు మనసే మిత్రుడు అంటారు ఇంకా మనసు ఎరిగిన తోటివారు ఆప్తమిత్రుడు.. నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉండే నేస్తమా….
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మరు జన్మ అనేది ఉంటే, నీకు నీలాంటి స్నేహితుడిగా పుట్టాలని ఉంది.
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుగుతుంటే ఓర్చనివారుంటే, ఎదుగుతుంటే మద్దతు పలుకుతూ, మిత్రుడి ఎదుగుదలే నా ఎదుగుదల అని భావించే మిత్రుడు ఉండడం చాలా అదృష్టం అంటారు. నా ఈ స్థితికి నీ తోడ్పాటు అనిర్విచనీయం…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సరదాకు సాయం చేయడం కాదు అవసరానికి సాయం చేసే నీ గుణమేరా నీ మంచి గుణం…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
కాలంలో రోజులు గడిచిపోతుంటే కొన్ని రోజులు మాత్రం మరిచపోలేము… అలాంటి రోజులలో నీ పుట్టినరోజు కూడా ఉంటుంది. నీ మేలు మరవలేను… నీ మంచి మనసుకు మనస్సుమాంజలి…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఈ జన్మకు చాలు నీలాంటి స్నేహితుడితో అనుబంధం ఏర్పడడం, నిజంగా నా అదృష్టం..
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రక్షించేవాడు దేవుడు, భక్షించేవాడు రాక్షసుడు, పోరాడేవాడు మనిషి…. ఓ మనిషిగా నీ పోరాటం నీకోసం కాకుండా నీచుట్టూ ఉండేవారి కొరకు అవ్వడం అందరి అదృష్టం! నీకు…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మంచిపని చేయాలని అనుకుంటూ ఉండేవారి మద్యలో ఉంటూ మంచిపనులే చేస్తూ ఉండే నీకు ఇలాంటి పుట్టిన రోజు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పుట్టిన ప్రతివారిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అంటూ, అందరిలోనీ టాలెంట్ గుర్తించే నీటాలెంట్ హైలెట్… హాట్సప్ టు యు మై ఫ్రెండ్.
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
శ్రేయస్సుకోసం కఠినంగా మాట్లాడేవాడు మిత్రుడు. శ్రేయస్సు కోసం ప్రయత్నం చేసేవాడు మిత్రుడు.. ఇవ్వన్నీ కాదురా… స్నేహానికి అర్ధం నువ్వు…
నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
సూర్యోదయం లోకానికి వెలుగు, నీ విజ్ఙానం బంగారు భవిష్యత్తుకు మార్గదర్శనం! నీ ప్రయత్నం ఓ యజ్ఙం ! నీ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిస్తూ…. నీకు
మిత్రమా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా జీవన ప్రయాణం మొదలు కావడానికి ఆది నుండి కష్టపడి నన్నింతవాడిని చేసిన నాన్నగారికి నా హృదయపూర్వన నమస్కారములు… నేడు మీ పుట్టినరోజు సందర్భంగా మీకు
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కలగన్నట్టు ఉంది మిత్రమా నీతో పరిచయం అయ్యాక కాలం చాలా ఇష్టంగా గడిచిపోతుందంటే, నీ మాటతీరు నీ సహవాసంలో మ్యాజిక్ ఉంది మిత్రమా…
నేస్తమా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
పరిచయం పెరిగే కొలది మనస్పర్ధలు అధికమయ్యే బంధాలలోనూ మంచిని మాత్రమే గ్రహించే నీ తెలివికి జోహార్లు…
ప్రియ నేస్తమా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
గుడిలో దేవత కూడా పిలిస్తే పలుకుతుంది. ఇంట్లో అమ్మ మాత్రం పిలవకుండానే అన్నీ చూసుకుంటుంది… అమ్మా నీకొక నమస్కారం.
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఓ మై ఫ్రెండ్ అంటూ ఎవరు సాయం అడిగినా, ఆలోచించకుండా సాయం చేసే నీగుణానికి హాట్సప్…
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
చిత్రమేమిటంటే నీ పుట్టినరోజున కూడా నీవే దీవించేది… నీకు మేలు చేయడానికి భగవంతుడికైనా మరుజన్మ కావాల్సిందే… అమ్మ నీకు నా నమస్కారం.
అమ్మా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
అమ్మ నేను పొగిడితే మొదట నిన్నే పొగడాలి… నా పుట్టుక నీకు మరణయాతన కలిగించినా, ఆకష్టం అనుభవించి నన్ను కన్నతల్లిని ఎంతపొగిడినా అది తక్కువే… తల్లీ నీకు నా నమస్కారం.
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎదుటివారి ఆనందం కోసం తపించే హృదయంలో అమ్మ ఉంటే, మరి అమ్మ హృదయంలో ఏముంటుంది…. అమృతమే ఉంటుంది. అమృతమూర్తి అమ్మకు
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అమ్మను మించిన దైవంలేదు నాన్న మించిన హీరో లేడు
నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రకృతిలో పెద్ద కష్టం మరణమే అయితే అంత పెద్ద కష్టం ఇష్టంతో స్వీకరించి నన్ను కన్నతల్లికి ప్రతిరోజు నా నమస్కారం…
అమ్మా…. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
ఆస్తి కన్నా విలువలు ప్రధానమంటూ జీవించిన నీ జీవితం మాకు ఆదర్శవంతం…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పట్టుదలకు ప్రేరణ తోడైతే మంచి ఆశయం జనిస్తుంది…. దానికి సాధన తోడైతే ఆశయసిద్ది కలుగుతుందని నీ జీవితం నిరూపితం!
నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఆశయం, ఆదర్శం, లక్ష్యం, నిశ్చయం, పట్టుదల, సాధన… మొదలైన పదాలకు అర్ధం తెలుసుకోవడం అనవసరం… మిమ్మల్ని అనుసరిస్తే చాలు.
నాన్నకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు.
కాలం ఇచ్చే కష్టంలోనూ, కాలం తీసుకుచ్చే సుఖసంతోషాలలోనూ సమదృష్ఠితో ఎలా ఉండాలో మీకు నేర్పించిన నాన్నగారికి ఎప్పటికీ ఆదర్శం…
నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.
నాన్నకు నాన్నే సాటి, నాన్నే నాహీరో…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆశయంలో తండ్రి మార్గదర్శకుడు అయితే నాన్నగారు మీవలననే నాజీవితానొక మంచి ఆశయం ఏర్పడింది… మీ జన్మదినం శుభ సందర్భంలో…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
దిక్కుతోచని స్థితిలో మీ మాటలు మనసుకు బలం అయితే, కష్టాలలో మీ పట్టుదలే మాకు మార్గదర్శకం… మీ జన్మదినం సందర్భంగా…
నాన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
ఆశపడడానికి హద్దుండదు కానీ ఆశయం సాధించడానికి అడ్డంకులెన్నో… అయినా అడ్డంకుల్ని జయిస్తే, ఆశయం నెరవేరుతుందని నిరూపించిన నీకు….
అన్నా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
సేవలో అమ్మలాగా, ఆజ్ఙలో నాన్నలాగ నన్ను శాశించి నీవు చేసిన మేలే ఈ జీవితం.
అన్నా నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఆదర్శం అంటూ సాగిన నీ నడక కఠినమే కానీ అది నాకు పూలబాట అయ్యింది. నీవలన మన కుటుంబానికి మరింత గౌరవం… పుట్టిన రోజు సందర్భంగా…
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నడిచిన ముళ్ళబాట నేడు మాకు రహదారిగా మారింది… నీ కష్టానికి మా నమస్కారం
అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
పెద్దవానిగా పెద్దరికం వహిస్తావు, చిన్నవాడినైన నాతో చిన్నపిల్లవాని వలె మాట్లాడుతావు… నీ పద్దతి మార్గదర్శనీయం…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
గొప్ప మాటలు విను, గొప్పను ఆపాదించుకోకు… చుట్టూ ఉన్నవారి గొప్పతనం గుర్తించు… గొప్పఅనే భావనతో అంటకాగకు… సంతోషంతో…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
సోదరుడివైనా స్నేహితుడిలాగా సలహా ఇచ్చావు… అవసరంలో అండగా నిలబడ్డ నీకు మరింత మేలు జరగాలని ఆశిస్తూ…
తమ్మునికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
స్నేహంలో సోదరిగా అనుసరణకు మార్గదర్శకురాలుగా నిలబడుతూ నన్ను నిలబెట్టిన సోదరికి
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
ప్రతి పరిచయం ఏదో సందేశం ఇవ్వడానికే అన్నట్టు ఉంటే, నీ పరిచయం మాత్రం మాకు మేలుకొలుపు… నీ మార్గం అనుసరణీయం…
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
సంతోషంగా ఉంటే కష్టం కూడా ఇష్టంగా మారిపోతుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. అలవరుచుకుంటే జీవితం బాగుంటుంది… ఆదర్శప్రాయమైన అక్కకు
అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు
చెల్లెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో కోట్స్
కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సంతోషానికి నీ చిరునవ్వు చిరునామా అయితే కష్టానికి చోటులేకుండా పోయింది.. సోదరికి జన్మదిన శుభాకాంక్షలు
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
పుట్టింటి గౌరవం మెట్టింట్లో వికసిస్తుందనటానికి నీవే ఉదాహరణ… నీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
నీ పుట్టుక మాకు సంతోషదాయకం అయినా మాకు అసలైన సంతోషం నీ జీవిత పర్యంతము సుఖసంతోషాలతో ఉండడమే…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
బంగారు తల్లి నీరాక ఇంటికి శుభం. నీ నడక ఇంటికి సందడి. నీవు వెళ్ళిన ఇళ్ళు మహాలక్ష్మికి ఆలవాలం…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కలసిరాని కాలంలో కలిగావు, ఇంట్లో శుభాల సందడి మొదలయ్యింది… నీవు నిండు నూరేళ్ళు సంతోషంతో జీవించాలి.
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కొడుకుకు పట్టినరోజు శుభాకాంక్షలు తెలుగుఓ
ఓరేయ్ వెనుక ఉండి ముందుకు తోసేవారితో జాగ్రత్త… ముందుండి రమ్మని పిలిచేవారితో ఆలోచించి అడుగు వెయ్యాలి… జీవితం చాలా విలువైనది. కరిగిన కాలం తిరిగిరాదు, నోరుజారిన మాట రాదు… జాగ్రత్త సంతోషంగా జీవించు…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
జీవితంలో ఒక మంచి పనిచేయాలి అంటారు. కానీ ప్రతి పుట్టినరోజుకు ఒక మంచిపని ఆచరించు ఆనందంగా జీవించు..
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
సంతోషంగా జీవించడం అంటే సంతోషం కోసం ప్రాకులాడుట కాదు… సంతోషం పంచడం. చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం తపించే మనసుకు మంచే జరుగుతుంది.
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
కొందరి పుట్టిన రోజులు కొంతకాలం గుర్తు ఉంటుంది. కొందరి పుట్టిన రోజులు ఎల్లకాలం గుర్తుండిపోతుంది. అలా నీవు ఏదైనా సాధించి గొప్పఖ్యాతిని పొందాలని ఆశిస్తూ….
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ప్రతి పరిచయమునకు కారణం కాలం అయితే మన పరిచయం స్నేహంగా మారడానికి కారణం అవసరం కాదు అవగాహన. ఇటువంటి అవగాహన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ…
నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.