Tag: అమ్మఒడి ఊయల
-
అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం
అమ్మా అనగానే అల్లాడిపోయే అమ్మతత్వం, అమృతం వంటిది. అమ్మ ఆప్యాయంగా చేసే స్పర్శలోనే అమృతత్వం ఉంటుంది. అమ్మా అనిపించకుండా బాధ ఊరుకోదు. అమ్మా అని ఆర్తితో అరిపించకుండా కష్టం కూర్చోదు. ఒక వయసుకు వచ్చాక కూడా అమ్మా అంటూ బాధను అనుభవిస్తాం… గతంలో అమ్మ చూపిన ఆప్యాయత గుర్తుకు రాగానే బాధను మరుస్తాం…. అంటే అమ్మ అమృతమైన ప్రేమను పంచేస్తుంది. అమ్మలేని జీవిలేదు. అమ్మలేని జీవితం లేదు. అమ్మతోనే వెలుగు ఆరంభం. లోకంలోకి ప్రయాణం ప్రారంభం అమ్మ…