పిల్లలకు మంచి అలవాట్లు గురించి వ్యాసం. తినగ తినగా వేము తీయగుండు అంటారు. అంటే చేదుగా ఉండే వేపాకు కూడా తినగ తినగా తీయగా అనిపిస్తుంది అంటారు. అలాగే ఒక పని చేయగ చేయగా అదే అలవాటు అయ్యి, ఆ పనిని సునాయసంగా చేసేస్తూ ఉంటారు…
నేర్చుకునే వయసులో పిల్లలకు చూసి నేర్చుకోవడం, అలకిస్తూ ఆలోచించడం, వినడం ద్వారా నేర్చుకునే జ్ఞానం పెంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటి వయసులో మంచి విషయాలవైపు వారి దృష్టి వెళ్ళేలా చూడడమే వారికి చేసే పెద్దమేలు అంటారు. చిన్నతనం నుండే మంచి అలవాట్లు అబ్బేలా చూడాలి అంటారు.
పెద్దలను చూసి పిల్లలు అనుసరిస్తూ ఉంటే, పిల్లల ముందు పెద్దలు ఉత్తమ ప్రవర్తన కనబరుస్తూ ఉంటే, ఆ కుటుంబంలో పిల్లలు కీర్తిగడించే స్థాయికి వృద్ది చెందుతారని అంటారు. పెద్దల మంచి అలవాట్లు ఆచరిస్తూ ఉంటే, పిల్లలు కూడా పెద్దల మంచి అలవాట్లనే అనుసరించే అవకాశాలు ఎక్కువ.
ఏదైనా చూసిన విషయం గురించి కానీ ఆలకించిన ఆలాపన గురించి కానీ చెప్పబడిన విషయం గురించి కానీ ప్రయత్నం చేసే వయసులో పిల్లలకు ఎటువంటి విషయాలు చేరుతున్నాయనేది ప్రధాన విషయం… ఆ విషయాలను బట్టి పిల్లలకు అలవాట్లు దరి చేరే అవకాశం ఉంటే, అది మంచికి కావచ్చు ఇతరం కావచ్చు.
చదువుకునే పిల్లలకు మంచి అలవాట్లు అంటే…

నిర్ధిష్ట సమయంలో మేల్కొవడం చాలా ప్రధాన విషయం అయితే, ప్రతిరోజు వేళకు నిద్రించడం కూడా అంటే ప్రధానమైన విషయం.
ప్రతిరోజు వేళకు తిండి తినడం
పరిమిత సమయంలో ఆటలు ఆడడం, ప్రతి రోజు వ్యాయామం చేయడం… ఇలా పిల్లల ఆరోగ్యపరమైన విషయాలలో పెద్దలు బాధ్యతగా వ్యవహరించాలి.
ఆరోగ్యం ఇంకా చదువుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు తగు జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
ఇలా పెద్దలు, టీచర్లు పిల్లలకు జాగ్రత్తలు చెప్పే విషయాలలో స్మార్ట్ ఫోన్ కూడా చేరడం విశేషం. ఎందుకంటే స్మార్ట్ చేతిలో ఉండే లోకం… లోకంలో ఉండే మంచి చెడులను స్మార్ట్ ఫోన్ అరచేతిలోనే చూపుతుంది… కాబట్టి స్మార్ట్ ఫోన్ అలవాటు ఉంటే వయసుకు మించిన విషయాలలో పిల్లలు దృష్టి పెట్టె అవకాశం ఉండవచ్చు… కాబట్టి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ వినియోగం అంత మంచి విషయం కాదు.
పిల్లలకు మంచి అలవాటు అంటే బుక్ రీడింగ్ ఒక మంచి అలవాటుగా చెబుతారు… స్కూల్ కు వెళ్ళే పిల్లలు పుస్తకాలే చదువుతారు… కానీ ఒక లక్ష్యం ఏర్పడడానికి లేదా ఏదైనా ఆశయ సాధనకు ప్రయత్నించడానికి స్పూర్తినింపే వ్యక్తుల జీవిత చరిత్రలు లేదా గొప్పవారి మాటలు గల పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకు ఉండడం మంచి అలవాటుగా చెబుతారు.
ఇంకా పిల్లలకు ఉండవలసిన ప్రధాన అలవాట్లలో వినయంతో ఉండడం… ఒకప్పుడు గురువు ఎదురుగా ఉండి… విధ్య కన్నా ముందు గురువు ముందు వినయంగా ఉండడం అలవాటు చేసుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు విద్యా విషయాలు సాంకేతిక పరికరాల ద్వారా కూడా పిల్లలకు అందే అవకాశం ఎక్కువ… కాబట్టి తెలుసుకోవడం సులభం అయినప్పుడు గురువు కూడా గొప్పగా కనబడడు… కాబట్టి ఎలాంటి స్థితి అయినా వినయంగా ఉండడం విధ్యార్ధి ప్రధమ లక్షణం అనే హితబోధ పిల్లలకు చేయాలి… వినయంగా ఉండే ఉత్తమ అలవాటును పిల్లలకు చేయాలి.
అభ్యాసం చేసేతప్పుడు సొంతంగా సాధన చేయడం… తెలుసుకునేటప్పుడు అడిగి తెలుసుకోవడం, వినేటప్పుడు వినయంతో వినడం పిల్లలకు అలవాటుగా ఉండడం వారికి శ్రేయష్కరం అంటారు.
వేళకు నిద్రించడం కూడా చెప్పాలా ? అంటే
నేడు చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారని అంటూ ఉంటారు. వారు బాల్యంలో బాగా నిద్రించినవారే లేకపోతే బలంగా అవ్వలేరు కదా… కానీ నిద్రవలన ప్రయోజనలు బాగా తెలియకపోవడం వలన పనిలోపడి నిద్రను అశ్రద్ద చేయడం వలన నిద్రలేమి ఏర్పడే అవకాశాలు ఎక్కువ అంటారు. అదే వారికి నిద్ర వలన శరీరమునకు కలిగే ప్రయోజనలు తెలిసి ఉంటే, నిద్రను అశ్రద్ద చేయరు కదా?
అందుకే సరైన సమయానికి నిద్రించడం అనే అలవాటును పిల్లలకు అలవాటు చేయాలి. ఇంకా తగినంత నిద్ర శరీరానికి ఉంటే, తగినంత విశ్రాంతి శరీరానికి వస్తుందనే విషయం తెలియజేయాలి. అలాగే బద్దకం యొక్క ఫలితం కూడా తెలియజేయాలి. విశ్రాంతి పేరు చెప్పి బద్దకించేవారిని బద్దకస్తులుగా పేర్కొంటారు.. అలాంటి వారు పనుల చేయడంలో విఫలం చెందుతారు. తద్వారా జీవితంలో తమ లక్ష్యం కోసం పాటుపడడంలో వెనుకబడి పెద్దయ్యాక బాధపడతారు.
కావున అతి నిద్ర వలన కలిగే ఫలితాలు. వేళకు నిద్రించడం… వేళకు నిద్రలేవడం వలన కలిగే ప్రయోజనాలు… వారికి అర్ధం అయ్యే రీతిలో తెలియజేయాలి.
ఇంకొకటి సమయానికి తిండి తినడం
తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అనే సామెత ప్రాచుర్యంలో ఉంటుంది. మన పిల్లల విషయంలో అటువంటి మాట లోకం నుండి రాకుండా చూసుకోవాలి. శరీర బలం కోసం తిండి తినాలి. శరీర బలంతో పని చేయాలి. పని అంటే చదువుకునే వయసులో చదువుకుంటూ, శరీరమును తగినంత వ్యాయామం చేయించాలి.
తిండి తినడం కూడా నిర్ధిష్ట సమయంలో చేసేలా చూడాలి. జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే క్రమపద్దతిలో ఆహార నియమాలు కూడా అవసరమే అంటారు.

లోకంలో చాలామంది అజీర్ణ వ్యాధులతో బాధపడుతున్నట్టు చెబుతారు. అంటే ఎక్కువమంది వేళకు తినడం తగ్గించడం వలన అటువంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి…
సమాజంలో కల్తీ ఆహార పదార్ధాలు కూడా ఉంటూ ఉంటాయని అంటారు… కల్తీ ఆహార పదార్ధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి… కల్తీ ఆహారం విషాహారంతో సమానమని అంటారు.
అతి అన్నింటిలోనూ అనర్ధమే
ఇది ప్రధానంగా బాగా అర్ధం అయ్యేటట్టు పిల్లలకు చెప్పాలి. నేర్చుకునే వయసులో పిల్లలకు ఏదో ఒక విషయంలోనో, అంశంలోనో అతి చూపిస్తూ ఉంటారు.

అలా అతిని ప్రదర్శించడం ప్రమాదకరం అనే విషయాన్ని మెల్ల మెల్లగా వారికి అర్ధం అయ్యే రీతిలో చెప్పాలి…
అతిగా చదువుతూ ఉంటే, పుస్తకాల పురుగు అంటారు.
అలాగే అతిగా ఆలోచిస్తూ ఉంటే, పిచ్చివారు అంటారు.
ఇంకా అతిగా ఆడుతూ ఉంటే, శరీరానికి సమస్యలు.
అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటే, అల్లరి పిల్లలు అంటారు.
ఎక్కువసేపు నిద్రిస్తూ ఉంటే బద్దకస్తులు అంటారు.
అతిగా తింటూ ఉంటే, తిండిపోతు అంటారు.
ఎక్కువగా అదే పనిగా పని చేస్తూ ఉంటే, ఏమి అనరు కానీ వాడుకుంటూ ఉంటారు. లోకువగా చూస్తారు.
ఏ విషయంలోనైనా సరే అతిగా స్పందిస్తూ ఉండడం ఉంటే, అది ఏ విషయంలో అలా జరుగుతుంది… ఆ విషయం వలన వచ్చే అనర్ధాలు ఏమిటి? లోకం నుండి ఎటువంటి ఫలితం వస్తుంది? ఆలోచించి… అతిగా ఉండడం తగ్గించే మానసిక దృక్పదం ఏర్పడేలా చూడాలి.
అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతి అన్నింటా అనర్ధమే.. అని అర్ధం. అదే పనిగా మొబైల్ వాడడం వలన అది వ్యసనం అవ్వడంతో బాటు కంటి సమస్యలు, మెడ సమస్యలు, నిద్ర సమస్యలు ఇంకా మనసుకు మరింత సమస్య…
కాబట్టి అతి అనేది ఏ విషయంలోనైనా మంచిది కాదు అని తెలియజేయాలి. అతిని నియంత్రించుకోవడం అతి పెద్ద మంచి అలవాటుగా జీవితంలో నిలబడిపోతుంది.
ఈ మంచి అలవాటును అందరూ అలవరచుకోవాలని పెద్దల సూచన
ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే గొప్ప లక్షణం అలవాటు చేయాలని అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?