Tag Archives: ఆన్ లైన్ క్రెడిట్

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు

ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు చేయవచ్చును. ఫ్లిప్ కార్టులో పే లేటర్ ద్వారా అప్పు తీసుకోవచ్చును. ఇందుకు ఎటువంటి ష్యూరిటీతో సంబంధం లేదు.

కేవలం మీకు ఫ్లిప్ కార్టు ఖాతా ఉండి, ఆ ఖాతకు ఆధార్ ఐడి లింక్ అయితే సరిపోతుంది.

ఒక్కసారి మీ ఖాతా పేలేటర్ అప్రూవ్ అయితే, మీ ఖాతకు కొంత ఏమౌంట్ కేటాయించబడుతుంది. మీకు కేటాయించిన ఎమౌంటులో నుండి మీరు షాపింగ్ చేయవచ్చును.

ఈ నెల ఒకటో తేదీన మీరు కొనుగోలు చేస్తే, వచ్చేనెల పదవ తేదీ లోపు మీరు పే చేయవచ్చును.

ఉదా: మీరు 8000/- రూపాయిలతో ఒక స్మార్ట్ ఫోను మార్చి 1, 2020 తేదిన కొనుగోలు చేసారు. ఆ 8000/- లు మీ పేలేటర్ ఖాతా నుండి కట్ అవుతాయి. మీరు పేలేటర్ కు ఏప్రిల్ 10, 2020 లోపులో చెల్లించాలి. ఇంచుమించు 40 రోజుల అప్పు మీకు ఫ్లిప్ కార్ట్ నుండి పొందవచ్చును.

ఒకవేళ ఆర్డర్ కాన్సిల్ చేస్తే, సంబంధిత సొమ్ము మీ ఖాతాకు జమ అవుతాయి.