Tag Archives: ఆర్ధిక స్తోమతను బట్టి నగలు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు

స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు. అలంకారానికి ఆభరణాలు అందం. ఆకర్షణీయంగా సిద్దం కావడానికి అలంకారంలో భాగంగా ఆభరణాలు ఉపయోగపడుతాయి. అందానికి అదనపు హంగులను నగలు తీసుకువస్తాయి. సంప్రదాయంలో కూడా బంగారం, వెండి వంటి లోహములతో తయారు చేసిన నగలు ధరించాలని చెబుతారు.

సమాజంలో స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు.

మన సభ్య సమాజంలో వివిధ సంప్రదాయలు, వివిధ ఆచారాలు పాటించేవారు ఉంటారు. ఏ సంప్రదాయమైనా, అందంగా అలంకరించుకోవడం అంటే అందరికీ ఇష్టమే. అందరూ బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఒంటిపై ధరించిన నగలు తరుగుదల వస్తూ ఉంటాయి. అంటే శరీరంపై ఉంటూ అరుగుతూ ఉంటాయి. అలా శరీరంపై బంగారం అరుగుతూ ఉండడం మేలు అంటారు. ఇక నగలు మన సమాజంలో స్త్రీలు ఎక్కువగా అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. బాల్యం నుండే తల్లిదండ్రులు తమ పుత్రికలకు బంగారు నగలు అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరించిన తమ పుత్రికలను చూసి మురిసిపోతారు. బాల్యం నుండే బాలికలకు అలంకారంతో అనుబంధం ఏర్పడుతుంది. మగవారికి చిన్ననాటి నుండే అలంకారం గురించిన ఆసక్తి ఉండదు. కానీ కొన్ని వస్తువులు మాత్రం వారికి ఆసక్తి ఉంటుంది. చేతికి ఉంగరం, మెడలో గొలుసు…. తమ పుత్రుడికి కూడా చేతికి ఉంగరం, మెడలో గొలుసు వేసి, వారిని చూసుకోవడం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. ఈ విధంగా నగలతో అనుబంధం చిన్ననాటి నుండి ఉంటుంది. అయితే ఆడువారికి ప్రీతి ఎక్కువగా ఉంటుందని అంటారు.

ఎవరైనా స్త్రీ పురుషులు ఆర్ధిక స్తోమతను బట్టి నగలు ధరిస్తారు.

చిన్నప్పటి నుండే అయినా, వాటిని తమ తమ ఆర్ధిక పరిస్థితి అనుసరించే తల్లిదండ్రులు పిల్లలకు నగలు అలంకరిస్తూ ఉంటారు. వారు ఎదిగిన తరువాయి కూడా తాము తమ ఆర్ధిక స్తోమత ఆధారంగానే నగలు ధరిస్తూ ఉంటారు. ఎందుకంటే నగలు సమాజంలో తమ యొక్క ఆర్ధిక హోదాను కూడా సూచిస్తుంది. కాబట్టి ఒక్కసారి ధరించిన నగలు జీవిత పర్యంతము కూడా ఉండాలనే ఉద్దేశ్యం బలంగా ఉంటుంది. చాలామంది అప్పులు చేసి నగలు కొనుగోలు చేయరు. తాము నగలు కొనేటప్పుడే, ఆ నగలు తమతో ఉండాలని ఆశిస్తారు కాబట్టి అప్పులు చేయడం వలన నగలను అమ్మవలసిన అవసరం వస్తుంది కాబట్టి అప్పు చేసి నగలు కొనేవారు అరుదుగా ఉంటుంది. ఈ విధంగా ఎవరు నగలు ధరించాలని చూసినా, వారు వారి వారి ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుని నగలు కొనుగోలు చేస్తారు. ధరించిన నగలు నలుగురిలో ఒక గుర్తింపు తీసుకువస్తే, ఆ గుర్తింపు పోకూడదని ఆలోచన చేస్తారు. ఈ విధంగా స్త్రీ కానీ పురుషుడు కానీ నగలు ధరించేటప్పుడే తమ యొక్క ఆర్ధిక స్తోమతను దృష్టిలో పెట్టుకుంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు