చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకుంటే సరదాగా సమయం గడిచిపోతుంది. మనసు విశ్రాంతి కలుగుతుంది. కొంత సమయం సినిమా హాలులో కూర్చోబెట్టి, ఆ కొంత సమయంలోనే మధ్యలో విశ్రాంతి ఇస్తారు. ఒక గంటా పదిహేను నిమిషాలపాటు నిరంతరంగా పనిచేసే మనిషి ఇంద్రియాలకు విశ్రాంతి సమయం ఇచ్చి మరల ప్రారంభిస్తారు. డ్రామా సినిమా యాక్షన్ సినిమా అయినా భక్తీ చిత్రం అయినా కుటుంబ కధా చిత్రం అయినా ప్రేమ కధా చిత్రం అయిన చివరి హాస్య చిత్రం అయినా గంటదాటాక విశ్రాంతి మాములే.
నేడు చిత్రంగా పిల్లలు కూడా చదువు అని పుస్తకాలూ మోసి మోసి, చదివి చదివి ఒత్తిడిలోకి నెట్టబడడమే ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఇలా చదువుకునే వారి దగ్గర నుండి కుటుంబ భాద్యత రిత్యా కష్టపడే కష్టజీవి అందరు ఎదో ఆర్ధిక సమస్య అనో, కుటుంబ సమస్య అనో, ఆరోగ్య సమస్య అనో ఒత్తిడికి లోనయ్యేవారి శాతం అధికమే. ఒత్తిడికి దూరంగా అంటే చతురతకు దగ్గరగా వెళ్ళడమే అంటారు. చతురత అంటే హస్యమంటారు.
హాస్య చిత్రాలలో హాస్యకధానాయకుడిగా కామెడీ చేసే హీరోలలో మనకి రాజేంద్ర ప్రసాదు గారి చిత్రాలు చాలానే చాలా మందిని సంతోషపెట్టాయి. కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలు ఆడే హాలుకు వెతుక్కుని మరి వెళ్లి చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ చిత్రాలకు ఆదరణ సాదారణ ప్రేక్షకులతో బాటు ప్రముఖ వ్యక్తులు కూడా అభిమానులే అంటారు. చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు
యూట్యూబ్ – వీడియో వీక్షణలకు
ఇంతకుముందు కామెడీ చిత్రాలు చూడాలంటే ధియేటర్లకు వెళ్ళడం లేకపోతే CD/DVD ల ద్వారా వీక్షించడం ఉండేది. కానీ కాసేపు కాలక్షేపం కోసం కామెడీ సినిమాలతో సరి పెట్టుకోవడానికి కామెడీ కోసం కామెడీ సీన్స్ స్మార్ట్ ఫోన్లతో యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. హీరో రాజేంద్రప్రసాద్ చిత్రాలలో కామెడీ చిత్రాల గురించి సంక్లిప్త వివరణ.
అహనా పెళ్ళంటా
జంధ్యాల కలం నుండి జాలువారిన హాస్య కధనం అహనా పెళ్ళంటా చిత్రం. పిసినారితనాన్ని తారాస్థాయిలో చూపించిన కామెడీ మూవీ. కోటశ్రీనివాసరావు పిసినిగొట్టుతనానికి బ్రహ్మానందం ముఖ కవళికలు కామెడీగా ఆకట్టుకుంటాయి. ఒక ఆస్తిపరుడు కొడుకు ఈ పిసినారి కూతుర్ని ప్రేమించి, తండ్రితో పందెం కట్టి ఈ పిసినారి ఊరికి వచ్చి తను పిసినిగొట్టుతనంలో పండితుడుగా నటిస్తాడు. రాజేంద్ర ప్రసాద్, రజని, నూతన్ ప్రసాద్, రాళ్ళపల్లి, బ్రహ్మానందం, సుత్తి వీరభద్రరావు, సుత్తివేలు, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించారు. జంద్యాలగారు దర్శకత్వం వహించారు.
బామ్మా మాట బంగారు బాట
రాజేంద్ర ప్రసాద్, గౌతమి, భానుమతి, నూతన్ ప్రసాద్, ఏవిఎం బ్యానర్ నిర్మించారు. రాజశేఖర్ దర్శకత్వం వహించారు. బామ్మా మీద కోపంతో అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయినా యువకుడు ఒక అమ్మాయిని పెళ్లిచేసుకుని పట్నంలో కాపురం పెడతాడు. బెంగపెట్టకున్న బామ్మా మంచాన పడుతుంది. అనుకోకుండా పట్నంపోయిన మనవడికి మగపిల్లవాడు పుట్టినట్టుగా విన్న బామ్మ తేరుకుని మనవడి దగ్గరికి ముని మనవడిని చూడడానికి వస్తుంది. ఆ అబద్దాన్ని నిజం చేయడానికి ఆ దంపతుల పాట్లు చిత్ర కధాంశం. కారుతో కామెడీ సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్, నూతన ప్రసాద్ల కామెడీ ఆకట్టుకుంటుంది.
చెట్టుకింద ప్లీడర్
వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం చక్కటి కామెడీతో బాటు చక్కని పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఒక డబ్బున్న గోపాల కృష్ణ అనే వ్యక్తి సుజాత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని చనిపోతే, అతని ఆస్తిని ఆమెకు దక్కకుండా సదరు బంధువులు ఆమెకు లాయర్ నోటిసు పంపిస్తారు. సుజాత – గోపాలకృష్ణలకు అసలు వివాహమే కాలేదు అని ఆమె ఆస్తి కోసం అబద్దం చెబుతుందని. బాలరాజు అనే వాదనలో అనుభవం లేని ప్లీడర్ సహాయంతో ఆమె తన ఆస్తిని తను దక్కించుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, కిన్నెర, ఊర్వసి, గొల్లపూడి మారుతీరావు, శరత్ బాబు, మల్లిఖార్జునరావు తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.
రెండురెళ్ళు ఆరు
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కధా హాస్యచిత్రంలో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, రజని, ప్రీతి, సుత్తివీరభద్రరావు, శ్రీలక్ష్మి, సుత్తివేలు, తదితరులు నటించారు. బాల్యవివాహం జరిగిన ఇద్దరు బాలబాలిక జంట పెరిగి పెద్దయ్యాక కూడా పట్నంలో తామెవరో వివరం తెలియకుండానే వారిద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఇద్దరికీ చిన్ననాటి బాల్య వివాహం సమస్యగా ఉంటుంది. ఊరిలో పెద్దలు బాల్యవివాహాన్ని యువవివాహంగా చేయడానికి కబురుచేసే వారిరువురు తమతమ స్థానంలో ఇతరులను పంపిస్తారు. అలా వెళ్ళిన వారు ఏమయ్యారు, బాల్యవివాహం చేసుకున్న వారు ఎలా కలిసారు. అదే చిత్ర కధాంశం.
చలాకి మొగుడు చాదస్తపు పెళ్ళాం
రేలంగి నరసింహారావు హాస్య చిత్రదర్శకుల దర్శకత్వంలో వచ్చిన చలాకిమొగుడు చాదస్తపు పెళ్ళాం చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, రజని,సీత నిర్మలమ్మ తదితరులు నటించారు. ఉద్యోగం చేసుకునే వ్యక్తి పెళ్లిచేసుకుని, ఆ దంపతులు కొత్త కాపురం ప్రారంభిస్తారు. పెళ్లికూతురికి ఉన్న బామ్మ తన చాదస్తపు ప్రభావం మనవరాలి కొత్త కాపురంపై ప్రభావం చూపుతుంది. చాదస్తపు అలవాట్ల్తతో ఉన్న భార్యతో చలాకిమొగుడు పాట్లు చిత్రకధాంశం.
బంధువులొస్తున్నారు జాగ్రత్త
శరత్ దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కధా హాస్యచిత్రంలో రాజేంద్ర ప్రసాద్-రజని జంటగా నటించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని వంటరివాడుగా ఉండే చిట్టిబాబు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ, బంధువులు అంటే అభిమానం పెంచుకుంటాడు. అలా ఉండే చిట్టిబాబు ఎక్కువమంది బంధువులు కలిగిన తన స్నేహితుడు సుధాకర్ ఇంటికి పెళ్ళికి వెళ్తాడు. అలా పెళ్ళికి వెళ్ళిన చిత్తబాబుకి, సుధాకరు చిన్నాన్న కూతురికి ప్రేమ పుడుతుంది. తత్ఫలితంగా వారు ఒకటై కొత్త కాపురం ప్రారంభిస్తారు. కొత్తకాపురంలో బంధువుల తాకిడి తగులుతుంది. బంధువులంటే అభిమానం ఎక్కువగా ఉండే చిట్టిబాబు సంసారంలో బంధువుల బాగోతమే ఈ చిత్ర కధాంశం.
లేడీస్ టైలర్
సుందరం తన చేస్తున్న దర్జీ పనిమీద దృష్టి పెట్టడం మానేసి జాతకాల మీద నమ్మకంతో అదృష్ట ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి తొడపై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లిచేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది. అని చెబుతారు. ఊరిలో బట్టలు అమ్మేవ్యక్తి బట్ల సత్యం సహాయంతో ఊరిలో పెళ్ళికాని అమ్మాయలకు ఎవరి తొడపై పుట్టుమచ్చ ఉందో వెతికే పనిలో పడతాడు. ఆ ప్రయత్నంలో ఊరిలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయనితో ప్రేమలో పడతాడు. చివరికి పుట్టుమచ్చ ఉన్నది లేనిది అనే అంశం ప్రక్కన పెట్టి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. రాజేంద్ర ప్రసాద్, అర్చన, శుబలేఖ సుధాకర్ తదితరులు నటించారు, వంశి దర్శకత్వం వహించారు.
అప్పుల అప్పారావు
అందరి దగ్గర అప్పులు చేస్తూ అప్పులవాళ్ళతో ఇంటిదగ్గర క్యూ కట్టించుకునే అప్పారావు అప్పుల అప్పారావుగా ప్రసిద్ది. అతనికి అప్పు తీసుకోవడమే కానీ తీర్చడం ఉండదు. అలా అప్పారావుకి డబ్బు అప్పుగా ఇచ్చి తిరిగి ఇస్తాడా ఇవ్వడా అంటూ మంచమెక్కిన ఒక వ్యక్తి ఆసుపత్రి పాలు అవుతాడు. అప్పారావుకి అప్పునే తలుస్తున్న ఆ వ్యక్తి అప్పారావు చేతుల మీదుగా అప్పు తిరిగి తీసుకోగానే మరణిస్తాడు. సాదారణంగా అప్పులు తీసుకున్నవారు ఇబ్బంది పడితే, ఇక్కడ అప్పు తీసుకున్న అప్పారావు హ్యాపీగా అప్పులు చేస్తూ బ్రతికేస్తూ ఉంటాడు. అటువంటి అప్పారావు ప్రేమ కధ అనేక మలుపులు తిరిగి ఇద్దరి పెళ్ళాల పెళ్ళితో ముగుస్తుంది.
ఏప్రిల్ 1 విడుదల
వంశీ రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ విలక్షణ కామెడీ హిట్ చిత్రాలుగా ఉంటాయి. అటువంటి వాటిలో ఏప్రిల్ 1 విడుదల. నెలరోజుల పాటు నిజమే చెప్పాలనే పందెం ఈ చిత్రం యొక్క కధాంశం. ఫంక్షన్లకు వీడియో షూటింగ్లు చేస్తూ, ఇంటికి కాసెట్లు అద్దెకు ఇచ్చే దివాకరం అందరితోనూ అబద్దాలే చెబుతూ ఉంటాడు. అయితే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం, తమ పందెం విషయం ఎవరికీ చెప్పకుండా కేవలం నిజాలే చెప్పడం మొదలుపెడతాడు. అలా నిజాలు చెప్పి ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు. అయినా అబద్దం చెప్పడు. అతనిని వదిలించుకుందాం అని పందెం కాసిన ఆ అమ్మాయి అతని సిన్సియారిటికి అతన్ని పెళ్లి చేసుకోవడంతో చిత్రం ముగుస్తుంది.
మాయలోడు
వీధులలో గారడి చేసే వీరబాబు ఒక చిన్నపాప కళ్ళు తెప్పించడానికి అని పాటుపడుతూ ఉంటాడు. అయితే ఆ పాపా మేనమామే అప్పలకొండ ఆ పాపని చంపాలని చూస్తాడు. అలాగే వీరబాబుని హత్యకేసులో ఇరికిస్తాడు. జైలుకి వెళ్లిన వీరబాబు జైలులోనే ఉంటూ తన మాయ విద్యలతో అప్పలకొండ ఆట ఎలా కట్టించాడో ఈ చిత్ర కధాంశం. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య, నిర్మల, గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, అలీ బాబు మోహన్, పద్మనాభం తదితరులు నటించారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం, స్క్రీన్ ప్లే, స్టొరీ, సంగీత దర్శకత్వం చేసారు. కామెడీ చైల్డ్ సెంటిమెంట్ చిత్రం సరదాగా ఉంటుంది.
ఆ ఒక్కటి అడక్కు
కష్టపడకుండా కోటీశ్వరుడు అవుదామని జాతకాన్ని నమ్మి సంవత్సరంలో నేనే కింగుని అనుకుంటూ కాళిగా తిరిగే అటుకుల చిట్టిబాబుని, కష్టపడి కోటీశ్వరుడు అయిన రొయ్యలనాయుడు కూతురు రంభ ప్రేమిస్తుంది. జ్యోతిష్కుడు కుడా రంభని పెళ్లి చేసుకుంటే కోట్లు కల్సి వస్తాయంటే, రంభని పెళ్లి చేసుకోవడానికి చిట్టిబాబు సిద్దపడతాడు. అయితే అప్రయోజకుడుగా తిరుగుతూ ఉండే అటుకుల చిట్టిబాబుతో పెళ్ళికి రొయ్యలనాయుడు ఒప్పోకోడు. రంభ ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో పగటి కలలు కనే చిట్టిబాబుని లక్ష కట్నం ఇచ్చి నా కూతుర్ని పెళ్లిచేసుకో అనిచెబుతాడు. లక్ష కట్నం కోసం చిట్టిబాబు ప్రయత్నాలే చిత్ర కధాంశం. రాజేంద్ర ప్రసాద్, రంభ, రావుగోపాలరావు, రాధాబాయి తదితరులు నటించారు.
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్ రాజేంద్రుడుగా ఏనుగు గజేంద్రుడుగా ఈ చిత్రం హాస్యభరితంగా ఉంటుంది. ఇంటి అద్దెకూడా కట్టుకోలేని రాజేంద్రుడుకి గజేంద్రుడు బహుమతి లాటరీలో వస్తుంది. తనకే తిండికి గతిలేనిది తను ఏనుగుకి తిండి పెట్టడం ఎలా అనుకుంటూనే అదృష్టాన్ని నమ్మకుని ఏనుగుని ఇంట్లో పెడతాడు. a విషయంలో అద్దేవిషయంలో చెప్పినట్టే ఇంటి యజమానికి మాయమాటలు చెప్పి ఒప్పిస్తాడు. రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా కలిసి సహజీవనం చేస్తారో ఈ చిత్రం చూడాల్సిందే. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఇంకా సౌందర్య, గుండు హనుమంతరావు, కోటశ్రీనివాసరావు, గుమ్మడి, బ్రహ్మానందం, అలీ, బాబుమోహన్ తదితరులు నటించారు.
ఆ నలుగురు
కామెడీ చిత్రాలతో నవ్వించే రాజేంద్ర ప్రసాద్ కొన్ని సందేశాత్మక చిత్రాలలో కూడా నటించారు. అటువంటి వాటిలో ఆనలుగురు విమర్శకుల ప్రశంశలు పొందిన చిత్రం. కుటుంబంపై ఎంత భాద్యత ఉందో సమాజంపై కూడా అంటే భాద్యతతో మెసిలే ఓ మాములు మధ్యతరగతి వ్యక్తి కధ. పత్రిక ఎడిటర్ గా ఉంటూ, సమాజంలో అందరి క్షేమం కోరుతూ వచ్చిన డబ్బుతో విలవలు కాపాడుకుంటూ జీవించిన వ్యక్తికి అతని కొడుకులు తలగోరివి పెట్టడడం కన్నా డబ్బే ప్రధానంగా భావిస్తే సమాజంలోంచి అతని కోసం వచ్చిన స్పందన చూసి తీరాల్సిందే. రాజేంద్ర నటన అద్బుతంగా ఉంటే, ఈ చిత్రానికి నంది అవార్డు వచ్చింది. ఈ చిత్రానికి దర్శకత్వం చంద్ర సిద్దార్ధ వహించారు.
మిస్టర్ పెళ్ళాం
రాజేంద్ర ప్రసాద్ – ఆమని జంటగా మధ్యతరగతి ఉద్యోగులుగా ఈ చిత్రం సరదాగా సందేశాత్మాకంగా సాగుతుంది. ఉద్యోగానికి వెళ్ళే భర్తకి ఇంట్లో ఇద్దరి పిల్లలకి సమయానికి సేవచేస్తూ భర్తని ఆఫీసుకి పిల్లలని స్కూలుకి పంపించే ఇల్లాలుగా ఆమని నటన అందరిని ఆకట్టుకుంటుంది. బ్యాంకు ఉద్యోగిగా ఉండే రాజేంద్ర ప్రసాద్ బ్యాంకు మేనేజర్ చేత మోసగింపబడి ఉద్యోగబ్రష్టుడు అవుతాడు. కుటుంబ భాద్యతగా ఆమని ఉద్యోగం చేయడం, రాజేంద్ర ప్రసాద్ వంటచేయడం జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఇద్దరి మద్య వచ్చే చిన్న చిన్న తగాదాల ఫలితం ఏమిటి, చివరికి భర్త ఉద్యోగిగా మారడం చిత్ర కధాంశం. బాపు దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కావ్యం.
ఇంకా రాజేంద్ర ప్రసాద్ కామెడీ మూవీస్ గోల్ మాల్ గోవిందం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, భలేమొగుడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు, అత్తింట్లో అద్దె మొగుడు, వద్దుబావా తప్పు,
దొంగకోళ్ళు, ఆలీబాబా అరడజను దొంగలు, పెళ్ళాం పిచ్చోడు, వాలుజడ తోలుబెల్ట్, పేకాట పాపారావు, తెనేటిగ, వివాహ భోజనంబు, జూలకటక, చిక్కడు దొరకడు, అల్ రౌండర్, కొబ్బరిబొండం, ఖుషి ఖుషిగా, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ముత్యమంత ముద్దు, శ్రీరామచంద్రులు తదితర చిత్రాలు కలవు.
చిత్రం భళారే విచిత్రం
నగరంలో ఉద్యోగం లేని నిరుద్యోగులు, అద్దెకు ఉండే ఉద్యోగుల చిత్రంగా పడే పాట్లు విచిత్రంగా ఈ సినిమాలో కనిపిస్తాయి. మూవీ పేరు చిత్రం భళారే విచిత్రంగా ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుంది. సుధాకర్, బ్రహ్మానందం స్నేహితుడుతో కలిసి గరుడాచలం ఇంట్లో అద్దెకు ఉంటుంటే వారికి తోడూ ఉద్యోగాల వేటకు రాజా రాఘవ వస్తారు. మద్యం సేవించి నానావాగుడు వాగినందుకు గరుడాచలం సుధాకర్ని అతని స్నేహితుల్ని ఇంట్లోంచి గెంటివేస్తాడు. అద్దె ఇల్లు కోసం రాజా ఆడవేషంలో వారు ఒక కుటుంబంలాగా అద్దింట్లో వారు పడే పాట్లు ఈ చిత్ర కధాంశం. జంధ్యాల దర్శకత్వంలో నరేష్, బ్రహ్మానందం, శుబలేఖ సుధాకర్, మహర్షి రాఘవ, కోట శ్రీనివాసరావు తులసి తదితరులు నటించారు.
చంటబ్బాయ్
చిరంజీవి హాస్యభరితంగా నటించిన చిత్రం చంటబ్బాయ్, ఈ చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించారు. డిటెక్టివ్ ఏజెన్సీ కంపెనీలో డిటెక్టివ్ జేమ్స్ పాండ్(చిరంజీవి) గా పనిచేస్తూ, మర్డర్ చేసిన తమ కంపెనీ మేనేజర్ నేరాన్ని బయటపెట్టి ప్రమోషన్ పొందుతాడు. ఆ కేసులో పరిచయమైనా జ్వాల(సుహాసిని) స్నేహితురాలి(ముచ్చెర్ల అరుణ)అన్నయ్యని వెతికి పట్టుకునే కేసుని జేమ్స్ పాండ్ స్వీకరిస్తాడు. ఇన్వెస్ట్ గేటు చేసి ఒక వ్యక్తిని చంటబ్బాయ్ గా తీసుకువస్తే, ఇంకొకరు వచ్చి నేనే చంటబ్బాయ్ అంటాడు. చివరకి చంటబ్బాయ్ ఎవరు అనేది చంటబ్బాయ్ చేత కనుగొనబడడం ఈ చిత్ర విశేషం. చిరంజీవి, సుహాసిని, అల్లు అరవింద్, చంద్రమోహన్,ముచ్చెర్ల అరుణ, జగ్గయ్య తదితరులు నటించారు.
ఆడుతూ పాడుతూ
గోపి సొంతబస్సు ఉండి, కిరాయిలు దొరక్క ఇంటికి అద్దె కట్టలేక, నగరంలో స్థిరంగా ఉండే ఇల్లు లేక గోపి(శ్రీకాంత్) అతని స్నేహితుడు పాపారావు(సునీల్) ఇద్దరూ బాచిలర్స్ బస్సులోనే నివాసం ఉంటూ ఉంటారు. అలాంటిది వారి బస్సింట్లోకి అంతుబట్టని భాషలో మాట్లాడే అమ్మాయి వచ్చి చేరుతుంది. ఆ అమ్మాయని వదిలించుకునే ప్రయత్నంలో గోపి ఆ అమ్మాయితో ప్రేమలో పడడం జారుతుంది. దుబాయ్ వెళ్లాలనుకునే పాపారావు పాస్ పోర్ట్ కొట్టేసిన ఎలుకపై పాపారావు రివెంజ్ సన్నివేశాలు కామెడీగా ఉంటాయి. శ్రీకాంత్, సునీల్, గాయత్రి తదితరులు నటించారు.
ప్రముఖ హాస్య దర్శకుల చిత్రాలు చాలానే తెలుగులో ఉంటాయి. జంధ్యాల, ఈవివి సత్యనారాయణ లాంటి దర్శకుల నుండి అనేక కామెడీ చిత్రాలు ఉంటాయి. ఇక ఇప్పుడు ట్రెండ్ అయితే యాక్షన్ చిత్రాల్లో కూడా కామెడీ కలసి ఉండే విధంగా చిత్రాలు సాగుతున్నాయి. వాటిలో వెంకి, డి, రెడీ, రేసుగుర్రం, శంకర్ దాదా MBBS వంటి చిత్రాలు కామెడీ వంతు ఎక్కువగానే ఉంటుంది. చిత్రం భళారే విచిత్రం ఆడుతూ పాడుతూ అప్పుల అప్పారావు మొదలైన చిత్రాలు యూట్యూబ్లో వీక్షించవచ్చు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో