Tag Archives: ఉచిత తెలుగుబుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

సూక్తులు తెలుగు బుక్స్

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

నమస్కారం తెలుగురీడ్స్.కామ్ వెబ్ సైటు సందర్శించి ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు… మీ ఆదరణ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ… ఈ పోస్టులో తెలుగులో ఉచితంగా లభిస్తున్న సూక్తులు, సామెతలపై ఉన్న బుక్స్ గురించిన లింకులు అందిస్తూ నాలుగు మాటలు కూడా వ్రాస్తున్నాను.

సమాజం చేత మంచివారుగా గుర్తింపబడినవారి మాటను కష్టకాలంలో చెడ్డవారు కూడా వింటారు. అలా సమాజం చేత మంచివారిగా గుర్తింపు పొందారు అంటే వారు గొప్పవారు అయ్యి ఉంటారు. గొప్పవారు తనంతట తానుగా చెప్పుకుంటే కాదు సమాజం చేత గుర్తింపబడితే గొప్పవారుగా అంతటా కీర్తి వస్తుంది.

అయితే గొప్పవారికి ఉండే లక్షణాలు అంటే ఏం చెప్పగలం? ఎందుకంటే గొప్పవారుగా కీర్తింపడినవారి జీవితం పేదరికంలో ప్రారంభం అయ్యి ఉండవచ్చును. అనేక కష్టాలు అనుభవించి ఉండవచ్చును. కష్టంలోనూ ఇష్టంగా పనిచేసే తత్వం కలిగి ఉంటారని అంటారు.

​​కష్టంలోనూ ఇష్టంగా పనిచేయడం సేవాలక్షణం అయితే, కష్టకాలంలో ధైర్యం చెప్పడం గొప్ప లక్షణంగా ఉంటుంది. సేవా అయినా మంచి మాట అయిన మనిషికి సమాజానికి మేలు చేసేదిగా ఉంటుంది. విపత్తు కాలంలో ధైర్యం మాటే అవుతుంది.

ఇప్పుడు కరోనా కాలంలో మన ప్రధాని నరేంద్ర మోదీగారు సంకల్ప స్ఫూర్తిని భారతీయలలో రగిలించారు. ఇది నిజంగా నాయకత్వ లక్షణాలలో ప్రధమమైనదిగా చెబుతారు.

అలా ఒక మాట మాట్లాడితే అది సమాజాని మేలు చేసేదిగానూ, మరింత మందికి మార్గదర్శకంగానూ ఉండాలి అంటారు. అలాంటి మంచి మాటలు మనం బుక్స్ రూపంలో కూడా చదవవచ్చును.

మంచి మాట మాట్లాడినప్పుడు ఆ మాట మనల్ని కదిలిస్తుంది. మనతో బాటు మనతోకూడి ఉన్నవారిని కదిలిస్తుంది. మాట మనసుకు ధైర్యం ఇవ్వగలిగేదిగా ఉంటుంది.

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్
సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

మంచి మాట మనిషికి ఆలోచన శక్తిని అందిస్తుంది. కొన్ని మాటలు చాలా పవర్ పుల్ గా ఉంటాయి. అయితే సమాజంలో గుర్తింపు పొందినవారు మాముల మాట మాట్లాడితే సమాజంలో చాలామంది వింటారు. అదే సెలబ్రిటీ మంచి మాట మాట్లాడితే సమాజంలో చాలామంది మనసులో ఆమాటపై ఆలోచన చేస్తారు.

ఇలా మంచి మాట మనిషిని, సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మనకు మంచి మాటలు సూక్తులు రూపంలో చాలానే ఉంటాయి. కొన్ని ఆణిముత్యాలుగా ఉంటాయి. అవి మనల్ని మరింత ఉత్తేజపరుస్తాయి.

369 మంచి ముత్యాలు తెలుగు బుక్

369 మంచి ముత్యాలు అంటూ మంచి మాటల తెలుగు పుస్తకంలో ఈ క్రింది విధంగా మొదటి మూడు వాక్యాలు ఉన్నాయి.

సమయాన్ని సరిగా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటే వస్తాయి.

ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు.

మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నయినా మరుసటి రోజుకల్లా మరిచిపోగలుగుతాడు.

మీరు ఉన్నతంగా ఎదగటానికి మీకు ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి!

హృదయం పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది, గమ్యం స్పష్టం అవుతుంది అంటారు!

మంచి పనికి మించిన పూజలేదు. మానవత్వానికి మించిన మతం లేదు! ధనం ఉన్నవారందరికీ దాన గుణం ఉండదు, దానగుణం ఉన్నవారందరికీ ధనం ఉండకపోవచ్చును!

సామెతలు సూక్తులు తెలుగు బుక్స్
సామెతలు సూక్తులు తెలుగు బుక్స్

ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా…విలువలతో జీవించే వ్యక్తి మిన్న! ప్రపంచంలో మేధావులు అందరి కన్నా, మంచి సహృదయం కలిగిన వ్యక్తి ఎంతో గొప్పవాడు అంటారు!

అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత నిజమో, పోరాడి ఓడినవారు గెలవటం కూడా అంతే నిజం అని అంటారు!

ఇలాంటి వ్యాక్యాలు వింటూ ఉంటే, మనసులో భావాలు బయలుదేరతాయి. ఒక వ్యాక్యం వింటే ఆలోచన కలుగుతుంది, ఇంకొక వ్యాక్యం వింటే నమ్మకం పెరుగుతుంది, మరొక వ్యాక్యం వింటే మనసు కుదుటపడుతుంది. ఇలా మదిగదిలో వెలుగులను నింపే వ్యాక్యములు వందలకొలది మంచి వ్యాక్యములు ఉచితంగా ఆన్ లైన్లో పి.డి.ఎఫ్ పుస్తక రూపంలో చదవవచ్చును.

సామెతలు తెలుగుబుక్స్

మాట ముదిరితే అది సామెతగా మారుతుందేమో… ఎందుకంటే అవి వాడుక భాషలోనే ఉంటాయి. ఎక్కువగా బుక్స్ లో వ్యాకరణం ద్వారా ఏర్పడి ఉన్నాయో లేదో తెలియదు కానీ సామెతలు మాత్రం మనముందు ఎవరో మాట్లాడినట్టే ఉంటాయి. వాడుక మాటలతో కలిసి సామెతలు ఉంటాయి.

సామెతలు తేలిక పదాలతో ఉన్నా… బరువుతో కూడి ఉంటాయి. ఒక్కో సామెత మాట వింటే మన ప్రవర్తన పరిశీలన చేయవలసి ఉండవచ్చును. ఒక్కో సామెత సీరియస్ గా తీసుకుంటే ఆచరించడం కూడా కష్టమే అంటారు. సామెతలు తేలికైనా వాడుక మాటలతోనే కూడి ఉంటాయి. కానీ అర్ధం అనంతంగానే ఉంటుంది.

 తెలుగు సామెతలు అనే ఒక తెలుగు బుక్ లో ‘అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అక్కరకు వస్తుంది’ ఈ మాట చెబితే చాలామంది ఆడువారికి కోపం రావచ్చును. ఇంకా మేకప్ వేసుకునేవారికి కూడా కోపం కలగవచ్చును. సామెతలు ఇలానే ఉంటాయి. మనం చేస్తున్న పనిని ప్రశ్నిస్తూ, ఆపని ఫలితం ఎటువంటిదో? ఆపనిని విధానం మార్చుకుంటే ఫలిత ఎటువైపు ఆలోచనలను సృష్టించగలవు.

ఈ తెలుగుబుక్ లోనే మరొక సామెత ఆశ సిగ్గెరగదు… ఈమాట మూడు పదాలతో కలిసి ఉంది. కానీ ఆశ – అత్యాశ – దురాశ వీటి మద్యనే నలిగి మనిషి జీవితం గుర్తుకు వస్తుంది. మాట చిన్నదే కానీ అర్ధం పెద్దది..అలోచన చేస్తే…

ఇంకా వివిద సందర్భాలలో వాడే తెలుగు సామెతలను తెసుకోవడానికి ఈ క్రింది బటన్ పై క్లిక్ చేయండి.

సామెతలు అయినా సూక్తులు అయినా వ్యాక్యాలు చిన్నవిగానే ఉంటాయి. కానీ భావాలు మాత్రం పెద్దవిగా ఉంటాయి. కొన్ని సామెతలు ఆలోచనను పుట్టిస్తాయి. కొన్ని సామెతలు స్వీయపరిశీలనకు దారితీస్తాయి. కొన్ని సూక్తులు అవగాహనను కలగడానికి కారణం కాగలవు.

సూక్తులు సామెతలు మనసుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా పెద్దలు సామెతలు చెబుతూ పిల్లలను, తమకన్నా చిన్నవారిని హెచ్చరిస్తూ ఉంటారు. సూక్తులు బడిలోనో, మాస్టారిగారి దగ్గరో వింటూ ఉంటాము. సామెతలు సూక్తులు మనకు పలుమార్లు వినవస్తాయి. ఆలోచిస్తే అవి మన మనసును కదిలిస్తాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?