ఎవరితో ఎలా మాట్లాడాలి? మంచి ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది తెలియకపోతే జీవితంలో అనేక ఇబ్బందులకు గురి కావాలి అంటారు. ఎందుకంటే స్నేహితునితో మాట్లాడినట్టుగా, కార్యాలయంలోని అధికారితో మాట్లాడరాదు. ఎక్కడ ఎలా మాట్లాడాలో? ఎప్పుడు ఎలా మాట్లాడాలో? తెలియకపోతే మాట్లాడడం రాదని అంటారు.
సభలో మాట్లాడినట్టుగా ఇంట్లో మాట్లాడితే, ఇంట్లో మాటలు కరువ అవుతాయి. అంతవరకు ఎందుకు కార్యాలయంలో ప్రవర్తించినట్టు ఇంటిలో ప్రవర్తించినా, ఇంట్లో సభ్యులతో ఇబ్బంది వస్తుంది.
కావునా కార్యాలయంలో ఎలా మాట్లాడాలి? కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడాలి? ఇతర ఆఫీసులలో అధికారులతో ఎలా మాట్లాడాలి? అపరిచితులతో ఎంతవరకు మాట్లాడాలి? ఒక అవగాహన అవసరం అంటారు.
స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడడం
మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో సరదాగా మాట్లాడేయం ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తుంది. మీరు ఇతరులతో ఉపయోగించని యాస లేదా హాస్యాన్ని ఉపయోగించవచ్చు. మీరు వారితో కనెక్ట్ అవ్వడానికి భాగస్వామ్య అనుభవాలు లేదా అంతర్గత జోక్‌లను కూడా ఉపయోగించవచ్చు. స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ మాట్లాడడం వలన మనసు తేలికపడుతుందని అంటారు.
ఆఫీసులో అధికారులు, సహోద్యుగులతో మాట్లాడేటప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి? మంచి
కార్యాలయంలో ఉన్నప్పుడు పై అధికారితో ఖచ్చితంగా వృత్తిపరమైన మాటలకే పరిమితం కావడం వృత్తిపరంగా మరింత ఉన్నతిని పెంచుతుంది.
ఇంకా సహోద్యోగులతో, మీరు పని వెలుపల వారితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పటికీ, వృత్తిపరమైన మాటలనే కొనసాగించడం ఉత్తమం. మీరు గౌరవప్రదంగా, మర్యాదగా ఉండే భాషను ఉపయోగించుకోవాలి. సరదాగానే మాట్లాడినా అది శృతిమించరాదు.
ఆఫీసులో తోటివారి ప్రవర్తనను బట్టి కాకుండా, మన కర్తవ్వం బట్టి ఇతరుల ఆరోపణలను ప్రక్కన పెట్టి, తాను గమనించిన ప్రవర్తనను బట్టి మాట్లాడడం వలన ఇబ్బందులు రావు. ఆరోపణల ఆధారంగా మాటలు ఉంటే, వివాదాలకు మార్గం చూపుతాయి.
ఆఫీసు బయటకు వెళితే, మనతో మన పై అధికారి చాలా స్నేహంగానే ఉండవచ్చును. కానీ దానిని అలుసుగా భావించి, ఆఫీసులో మన పై అధికారితో ఇష్టానురీతిగా ప్రవర్తిస్తే, మనపై మన పై అధికారికి గౌరవం పోతుంది.
అదే ఆఫీసు బయటకు వచ్చినప్పుడు పై అధికారి స్నేహంగా ప్రవర్తిస్తే, మనం కూడా స్నేహంగా ప్రవర్తిస్తూ, మరలా ఆఫీసులోకి వెళ్లగానే మన పై అధికారితో మనం కేవలం వృత్తిపరమైన మాటలకే పరిమితం అయితే, అందువలన పై అధికారికి మనపై ఇంకా గౌరవం పెరుగుతుంది. కాబట్టి అధికారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి?
మనకు పరిచయమే లేని అపరిచితులతో మాట్లాడేటప్పుడు, మర్యాదగా మరియు గౌరవంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి అంటారు. కానీ అప్పుడప్పుడు అపరిచితులతో చాలా సులభంగా మాటలు పెరగవచ్చును. కానీ వారి ఎవరో పూర్వాపరాలు తెలియకుండా, ఎక్కువ చనువుగా మాట్లాడరాదు. అది ఇబ్బందులపాలు చేయవచ్చును.
ఎక్కువగా ప్రయాణాలలో అపరిచితులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాలలో మంచివారు, చెడ్డవారు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. చెడు సవాసం ప్రమాదకరం అంటారు కాబట్టి అపరిచితులతో పరిచయం చేసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు. అలాగని అపరిచితులంతా చెడ్డవారిగా పరిగణించి మన మాటలు ఉండరాదు.
సంఘంలో మనం మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు కూడా మర్యాదగానే మాట్లాడుతారు. కావునా ముందుగా అపరిచితులతో మర్యాదగా మాట్లాడాలి.
ఇతర ఆఫీసులలో అధికారులను, ఉపాధ్యాయులను కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి?
ముందుగా ఆఫీసు గదిలోకి వెళ్ళగానే నమస్కారం చేయడం వలన వారికి పాజిటివ్ దృక్పధం వస్తుంది. అలాగే మాట కూడా వినయంగా ఉండాలి. అధికారులు, ఉపాధ్యాయులు లేదా పోలీసు అధికారులు వంటి అధికార వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, గౌరవప్రదంగా ఉండటం ప్రధానం.
కార్యాలయంలో అధికారుల ముందు మాట్లాడేటప్పుడు అధికారిక భాషను ఉపయోగించడం ముఖ్యం. వారు చెప్పేది జాగ్రత్తగా వినడం మరియు వారు మీకు ఇచ్చే సూచనలను అనుసరించడం కూడా చాలా ముఖ్యం.
విద్యాలయంలో ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా మార్యదతో మాట్లాడాలి. అలాగే మన పిల్లల ముందు టీచర్ తో మాట్లాడేటప్పుడు చాలా హుందా మాట్లాడాలి. అప్పుడే పిల్లవానికి టీచర్ పైనా, మనపైనా గౌరవం ఉంటుంది.
పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి?
చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు, వారు అర్థం చేసుకోగలిగే భాషను ఉపయోగించడం మరియు ఓపికగా మరియు ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మీరు పిల్లల వయస్సు గురించి కూడా గుర్తుంచుకోవాలి మరియు దానికి అనుగుణంగా మీ భాష మరియు స్వరాన్ని సర్దుబాటు చేయండి.
మొత్తంమీద, మీ కమ్యూనికేషన్ శైలిలో అనుకూలత మరియు అనువైనదిగా ఉండటం మరియు మీరు మాట్లాడుతున్న వ్యక్తి యొక్క అవసరాలు మరియు ప్రాధాన్యతల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
ఎవరితో ఎలా మాట్లాడాలి? మంచి ప్రశ్న చాలా ముఖ్యమైన
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు