Tag Archives: కాలం కాంచన తుల్యం

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు

సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు.

సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు.

ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని కాలంలో ఏంజరుగుతుందో మనకు తెలియదు. మనము ఉన్న కాలంలో మనము కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటామో…. ఆ తర్వాత కాలంలో కూడా మన జ్ఙాపకాలు మిగిలి ఉంటాయని అంటారు.

ప్రధమశ్రేణికి కోసం ప్రయత్నించే విద్యార్ధి ప్రతీ క్షణమును విద్యలోని విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.

ఏదైనా ఆటలో ఉన్నత స్థితిని కోరుకునేవారు, ప్రతిక్షణం సాధనకోసం వినియోగిస్తూ ఉంటారు.

ఒక శాస్త్ర పరిశోధనలో నిమగ్నమైనవారు, ప్రతిక్షణం కూడా పరిశోధనాత్మ దృష్టితోనే ఉంటారు.

వ్యవసాయదారుడు నిత్య పంటపొలాల పర్యవేక్షణకు ప్రధాన్యతనిస్తారు….

ఇలా సమయాన్ని తగువిధంగా ఉపయోగించుకున్నవారు, తమ జీవితంలో తాము అనుకున్న ప్రతిఫలం పొందుతారు. అందువలననే సమయాన్ని వృధా చేసుకోకూడదని అంటారు.

రైతు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం వలన పంటను బాగా పండిస్తాడు. అలా ఎక్కువమంది రైతులు ఈ విధంగా తమ సమయాన్ని సద్వినియోగం చేయడ వలన తగిన ఆహార పదార్దాలు సమాజంలో సమృద్దిగా లభిస్తాయి.

ఒక శాస్త్రజ్ఙుడు తనకున్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేయడం ద్వారా ఒక కొత్త విషయాన్ని సమాజానికి పరిచయం చేయగలడు.

అలాగే ఒక ఆటగాడు తనకున్న సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవడం వలన తన ఆటలో తాను ప్రపంచస్థాయి గుర్తింపు పొంది, తను కీర్తి గడించగలడు. అలాగే తన కుటుంబ సభ్యులకు కూడా గౌరవం అందించగలడు.

ఈ విధంగా కొందరు తమ తమ సమయాలను సరిగ్గా ఉపయోగించుకోవడం వలన వారు కీర్తిని గడించడమే కాకుండా తమతో కలిసి ఉండేవారికి కూడా గౌరవమును, గుర్తింపును తీసుకురాగలరు. కావునా కాలం కాంచన తుల్యం అంటారు. అందుకే సమయం వృధా చేసుకోకూడదు అంటారు.

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది?

వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు.

అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది.

వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.

గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు

ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. కానీ ఆ రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైరు చేయలేకపోతే మాత్రం, మరొకసారి మోటారు సైకిల్ రిపైరుకు వచ్చినప్పుడు సదరు యజమాని మరొక మెకానిక్ కొరకు శోచించే అవకాశం ఉంటుంది. అదే మోటారు సైకిల్ తన దగ్గర కొంతమంది సహాయకులను పెట్టుకుని, తన దగ్గరకు వచ్చిన ప్రతి మోటారు సైకిల్ రిపైరు చేసేస్తూ ఉంటే, అతని దగ్గరకు ఆ ప్రాంతపు మోటారు సైకిల్ యజమానులు మోటారు సైకిల్ రిపైరు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ కాలంలో అవసరానికి మోటారు సైకిల్ రిపైర్ చేయగలగడం వలన అతని ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంకా వాహనదారుల పని కూడా అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది.

కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. అంటే మోటారు సైకిల్ మెకానిక్ ఒక మోటారు సైకిల్ యజమానికి మోటారు సైకిల్ రిపైరుకు రెండురోజులు గడువు ఇస్తే, ఆ మోటారు సైకిల్ యజమాని కూడా తను పనిచేసే చోట కానీ, తన సేవలు అందుకునే వ్యక్తులకు కానీ అదే గడువు కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోటారు సైకిల్ మెకానికి రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.

అలా ఒక మెకానిక్ తను కోరిన గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు.

ఇలా వ్యవస్థ అయిన సరే, తమ సంస్థ ఇచ్చే గడువులోపులో సేవలను అందించడమే, ఆ సంస్థ మనుగడకు ప్రధాన కారణం కాగలదు.

వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.

బాల్యం అంటే చిన్నప్పుడు

యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు

వృద్దాప్యం అంటే ముసలివారు….

పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.

బాల్యంలో ఆటలు ఆదుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజు కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు.

ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్నానమ్ పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.

సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది.

అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు.

కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది.

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు.

కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది.

ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు.

అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది.

ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు….

అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.

ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…. మాత్రం సత్యం... కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు