1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వస్తూ విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. పవన్ అభిమానులకు థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం సృష్టించింది. సినిమాతో మనసు మమేకం అయితే, ఆ సినిమా ప్రజల మనసులో నిలిచిపోతుంది. అలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమాలలో తొలిప్రేమ ఖచ్చితంగా ముందుంటుంది.
ఒక కొత్త డైరక్టర్ ఈ కధకు ఈ హీరో అయితేనే బాగుంటాడు అనుకుని, అతనితోనే సినిమా తీయగలగడం ఆ డైరక్టర్ కు పెద్ద సవాల్ అయితే? తీసిన మొదటి సినిమానే ఓ పెద్ద సంచలన సినిమాగా మారడం పెద్ద విజయం. ఇది తొలిప్రేమ టీమ్ విజయం.
అనుకున్న హీరోతే రాసుకున్న కధను సినిమాగా రావడంతోనే ఈ సినిమాలో నాచురాలిటీ మిస్ కాలేదు అనుకోవచ్చును.
ఇక తొలిప్రేమ ఓ ప్రేమకధ… యువతకు బాగా నచ్చే కధ. అయితే తొలిప్రేమ సినిమా కధ ప్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే తొలిప్రేమ ప్రేమకధతో బాటు కుటుంబ బంధాల మద్య ఉన్న ఎమోషన్స్ టచ్ చేస్తుంది.
చాలా సహజంగా మద్యతరగతి కుటుంబంలో ఉండే యువకుడు, ఓ అమ్మాయి విషయంలో ఎలా ఉంటాడు? అతని స్నేహితులు అతని మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతారు? అందనిది అందితే మనసులో ఎంత ఆనందంగా ఉంటుందో? అదే సమయంలో ఆ మనసుకి లక్ష్యం గురించిన విలువ తెలుసుకుని ప్రవర్తించవలసి రావడం. ఈ సినిమాలో హీరో నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇంకా ఇందులో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఇంకా పెద్దనాన్నతో హీరోకి ఉండే సఖ్యత సరదాగా ఉంటుంది. చివరగా నాన్నతో ఉండే సెంటిమెంట్ సీన్ మనసుని కట్టి పడేస్తుంది.
ఓ యువకుని కలలకు, ఆదర్శవంతమైన జీవితాన్ని సాధించాలనుకునే అమ్మాయి పరిచయం అయితే, అల్లరిగా తిరిగే యువకుడి ప్రవర్తన, పరివర్తన సినిమాలో చాలా సహజంగా అనిపిస్తుంది. అందరి మదిలో మంచి ముద్రను వేస్తుంది. అందుకే తొలిప్రేమ 1998 లోనే వచ్చినా 2025 లో కూడా తాజా ప్రేమకధగానే అనిపిస్తుంది.
ఈ తొలిప్రేమ సినిమాలో క్లైమాక్సే ఓ అద్భుతమైన ఫీలింగ్ ను మనసుపై చెరగని ముద్రగా ఉండిపోతుంది.
1998లోని తొలిప్రేమ 2023లో మరొకసారి వచ్చి ధియేటర్లలో సందడి చేస్తుంది.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
suvasana meaning in Telugu
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు