Tag Archives: చెప్పిన మాట వినడం

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు… కేవలం అనుసరించడంలోనే శరీరంతో బాటు మనసు కూడా ఎదుగుతుంది.

బాల్యంలో అన్నింటిని సమకూర్చేది తల్లిదండ్రులు…

అంటే ఒక వ్యక్తికి బాల్యంలో అన్నింటిని సమకూర్చేది తల్లిదండ్రులు… కాబట్టి వారు వారు వారి వారి బిడ్డలకు ఏమైతే మంచి జరుగుతుందో ఆలోచించి, వాటిని తమ తమ పిల్లలకు సమకూరుస్తూ ఉంటారు. ఈ కోణంలో పిల్లవానికి తల్లిదండ్రుల నుండి ఏమి అందాలో అది అందుతుంది. అంటే ఇక్కడ తల్లిదండ్రుల మాట పిల్లలు వింటే, బాల్యం అంతా వారి సంరక్షణలో సాగిపోతుంది… కానీ ఏదో ఒక కోరిక ఇతరులను చూసి ఏర్పరచుకుంటే, అది పెద్ద కోరిక అయితే జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చిన్న చిన్న కోరికలు అయితే చిన్నపాటి సంఘర్షణల ఏర్పడుతూ ఉంటాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

తల్లిదండ్రులపై ఆధారపడి తల్లిదండ్రుల మాట మేరకు చదువును పూర్తి చేసినవారికి వేరు కోరికల జోలికి పోకుండా ఉండడం వలనే చదువు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అంటే విద్యార్ధి దశలో అనవసరపు కోరికలకు లొంగి, వాటిని తీర్చమని తల్లిదండ్రులపై పదే పదే ఒత్తిడి చేయడం వలన చదువు మద్యలో ఆగిపోవచ్చును. అప్పుడు అసంపూర్ణ చదువు జీవితంలో దు:ఖమును తీసుకువస్తూ ఉంటుంది. అదే తల్లిదండ్రుల పెంపకంలో వారి మాటకు విలువ ఇస్తూ అనవసరపు కోరికలకు తావివ్వకుండా, తల్లిదండ్రుల అందిస్తున్న సౌకర్యాలతో తృప్తిగా చదువు పూర్తిచేసుకున్న విద్యార్ధులు ధన్యులు.

చదువు పూర్తయ్యాక వచ్చిన ఫలితాలను బట్టి సమాజంలో ఒక స్థాయి ఉద్యోగం లభించవచ్చును. లేదా ఒక స్థాయి వ్యాపారంలో నిమగ్నమై ఉండవచ్చును. ఏదైనా సమాజంలో తమకు లభించిన స్థాయిని బట్టి అవసరాలు తీర్చుకుంటూ, కోరికలను నియంత్రించుకుంటూ ఉండేవారు తమ తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలరు. అలా కాకుండా అనవసరపు కోరికలు లేకా వ్యామోహాలకు గురైతే, ఆకోరికలు, వ్యామోహాలు దు:ఖానికి మూలం అవుతాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

అంటే ఒక వ్యక్తికి బాల్యం నుండి తనకంటూ ఒక జీవిత భాగస్వామి లభించేటంతటి వరకు తల్లిదండ్రుల ద్వారా అనేక సౌకర్యాలు లభించే సంప్రదాయం మనకు ఉంది. అనవసరపు కోరికలు, వ్యామోహాలకు తావిచ్చినప్పుడే తల్లిదండ్రుల నుండి అందవలసినవి అందకుండా పోయే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల సంరక్షణలో సంతృప్తికి పెద్దపీఠ వేస్తే, జీవితంలోనూ సంతృప్తిగా జీవించడానికి అలవాటుపడతారు. కాబట్టి తృప్తిగా జీవించే అలవాటును చిన్ననాటి నుండే అలవాటు చేసుకోవాలి. జీవితం ఏర్పడ్డాకా సమస్యలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతూనే ఉంటాయి.

కోరికలే దు:ఖానికి మూలం

కారణం కోరిక తీరగానే మరలా మరొక కోరిక మన ముందుకు వస్తుంది. మరలా వచ్చిన కోరిక తీరగానే ఇంకొక కోరిక వస్తుంది. అదీ తీరగానే మొదట్లో తీరిన కోరిక మరలా మన ముందుకు వస్తుంది. కావునా కోరికలే దు:ఖానికి మూలం.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

వంకాయ కూర అంటే ఇష్టం అది తినగానే తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది. మరలా రెండు రోజులకు వంకాయ కూర తినాలనిపిస్తుంది. అదే పనిగా ఇష్టమని వంకాయ కూరను ఎక్కువగా తింటే, దాని వలన శరీరంపై దుష్ప్రభావం పడే అవకాశం ఎక్కువ. ఒక్కసారి దుష్ప్రభావం శరీరంపై పడితే, మరలా అది కంటిస్యూ అయ్యే అవకాశం ఉండడం చేత, వంకాయకూర తినాలనే కోరిక దు:ఖమునకు మూలం అవుతుంది. అంటే వంకాయ కూర ఇష్టం కదా అని వంకాయ కూర కోరిక కాబట్టి వంకాయ కూర దు:ఖానికి కారణం కాగలదు కాబట్టి వంకాయ కూర తినడం మానేయమని కాదు…. అది లభించినప్పుడు తినడం తృప్తి అయితే, దానిని తెచ్చుకుని వండించుకుని తినడం కోరిక తీర్చుకోవడం అవుతుంది. కావునా ఇష్టానికి కోరికలు తీర్చుకోవడం కన్నా ఇష్టమైనవి లభించేదాకా వెయిట్ చేసి, వాటిని తినడం వలన తృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది.

ఇష్టమును కోరికగా మార్చుకోవడం వలననే ఇబ్బందులు

మనకున్న ఇష్టమైన విషయం లభించినప్పుడు అనుభవిస్తే తృప్తి. అదే మనకున్న ఇష్టము కొరకు ప్రయత్నించి సాధించుకుంటే అది కోరిక కానీ కొన్ని కోరికలు పదే పదే రిపీట్ అయితే అవే ప్రాణాంతకము లేక జీవనగతిని మార్చివేసేవిగా మారతాయి.

ఒకరికి స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అనిపించింది. అలా అనిపించిన ఆలోచన పెరిగి స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టంగా మారింది. ఇష్టంగా మారిన విషయం బయటకు పొక్కింది. అది కోరికగా పరిణితి చెందింది. ఆ కోరికను తీర్చమని అడగడంతోనే, ఎందుకు అనే ప్రశ్న పుడుతుంది. దానికి కారణం ఉండదు. ఎందుకంటే తనతోటి వారు వాడుతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ పై ఆశ పుట్టింది. అదే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అవసరం కాదు… అవసరమైనప్పుడు అది నేను కొనుక్కుంటారు. నేనిప్పుడు చదువుకోవడం నా ప్రధమ కర్తవ్యమని భావిస్తే, స్మార్ట్ ఫోన్ వాడాలనే ఆశ ఇష్టంగానే ఉంటుంది కానీ కోరికగా బయటపడదు.

అదే కోరిక ఎందుకు బలహీనపరుస్తుందంటే?

కేవలం ఇష్టం మనసులోనే ఉంటే, అది అతనిలోనే ఉంటుంది. అదే ఇష్టం గురించి ఆలోచన మొదలు కాగానే ఇష్టమును తీర్చుకోవాలనే తపన పుడుతుంది. దాని గురించి తల్లిదండ్రులను అడగగానే, తల్లిదండ్రుల ముందు విద్యార్ధి లోకువ అవుతాడు. కారణం… చదువుకుంటున్న వయసులో చదువుకు సంబంధించిన అనేక అవసరాలు ఉండగా, స్మార్ట్ ఫోన్ పై దృష్టి ఎందుకు పడిందనే ప్రశ్న తల్లిదండ్రుల మనసులో ఏర్పడుతుంది. తర్వాత చదువుపై దృష్టి లేదనే అవగాహన తల్లిదండ్రులకు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా చదువుకునే విద్యార్ధి అనవసరపు కోరిక కోరితే, తన చదువు విషయంలో బలహీనంగా ఉన్నట్టు లోకంలో కనబడుతుంది. కోరిక మనిషిని బలహీనుడుగా చూపెట్టడానికి ప్రయత్నిస్తుంది.

అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరం అయినప్పుడు అది అందవలసిన సమయంలో అందుతుంది. ఎలా అంటే… ఒక స్కూల్లో అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాలనే నియమం పుట్టిందనుకో, ఆ స్కూల్లో చదివే విద్యార్ధికి స్మార్ట్ ఫోన్ అడగవలసిన అవసరంలేకుండా, స్మార్ట్ ఫోన్ అందుతుంది. కానీ స్మార్ట్ ఫోన్ ఏ వయసు వారికి ఎంతవరకు అవసరమో స్కూల్ యాజమాన్యానికి మరియు తల్లిదండ్రులకు తెలుసు… వారు ఒక కోరికను నియంత్రిస్తున్నారంటే, అందులో ఏదో పరమార్ధం ఉంటుందనే విషయం విద్యార్ధులు గ్రహించాలి. వయసురిత్యా అన్ని విషయాలపై విపులంగా వివరించరు.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

ఇష్టమును కోరికగా మలచుకుని తీర్చుకోవడం వలన కోరిక మరలా మరలా రిపీట్ కావడం వలన మన చుట్టూ ఉన్నవారి మనసులో కూడా మన బలహీనతను నోటీస్ చేసినవారమవుతాము. ఆ తర్వాత వారి వారి అవరసరాలకు మన బలహీనతను ఎరగా చూపి, వారి అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది. కావునా కోరిక మనల్ని బలహీనపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అనసరపు కోరికలకు తావివ్వకుండా తృప్తిగా జీవించడానికి అలవాటు పడాలని పెద్దలంటారు.

అనసరపు కోరికలకు తావివ్వడం అంటే దు:ఖాన్ని ఆహ్వానించడానికి ద్వారాలు తెరిచినట్టేనని అంటారు.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

కోరికలే దు:ఖానికి మూలం అన్నారు కదా అని కోరికలు చంపుకుని బ్రతకమని కాదు. అలా చేస్తే అది మరింత ప్రమాదకరం అంటారు. కావునా కోరికలు కోసం వెంపర్లాడకుండా, లభించిన దానిలో తృప్తిని చూడాలి. ఒక వ్యక్తి ప్రకృతి నుండి ఏమి లభించాలి… అది వారి వారి స్థాయిలో లభిస్తుంది. లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ, జీవితపు లక్ష్యాన్ని చేరుకోవచ్చని పెద్దలు అంటారు. అలా కాకుండా కోరికలే ప్రధానంగా జీవిస్తే, జీవనపు ప్రధాన లక్ష్యం నెరవేరదని పెద్దలు అంటారు.

వ్యక్తికి కావాల్సిన కనీస సౌకర్యాలు చిన్ననాటి చుట్టూ ఉండేవారి ద్వారా లభిస్తాయి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

జీవితంలో లభించేవి అన్నీ మన చుట్టూ ఉండేవారి నుండి లభించేవే. పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమానురాగాలు నుండి ప్రారంభం అయ్యే జీవితం, ఎదుగుతున్న కొద్దీ చుట్టూ చేరే వ్యక్తులు అందించే సహాయ సహకారాలు వలన చాలా వరకు అవసరమయ్యేవి అన్నీ సమకూరుతూ ఉంటాయి. కారణం తల్లిదండ్రుల సామాజిక స్థాయిని బట్టి మన జీవితంలో వీరంతా ప్రభావం చూపుతూ ఉంటారు. కావునా సహజంగా లభించే అవసరాలను తీర్చుకుంటూ అనవసరపు కోరికలకు తావివ్వకుండా జీవించే అవకాశం ప్రతిజీవికి కుటుంబ వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి వ్యక్తే అనసరపు కోరికల కోసం ప్రాకులాడి లభిస్తున్న సౌకర్యాలకు అడ్డంకులు తెచ్చుకుని, తర్వాత దు:ఖిస్తూ ఉంటారు.

మనసుని కోరికల నుండి ఎలా కాపాడుకోవాలి?

ముందు మనసులో పుట్టిన ఆలోచన బయట ఎవరికైనా ఉందా? లేదా ? చూసుకోవాలి. ఒకవేళ అటువంటి ఆలోచనను బయట పెట్టినవారి గతి ఎలా ఉంది? ఇదే ప్రధానం మనకు మన ఆలోచనను కొనసాగించాలా? వద్దా? అనే ప్రశ్నకు సమాధానం… ఈ యొక్క అవగాహనపైనే ఆధారపడి ఉంటుంది. కానీ ఆలోచన ఫలితంగా ఏవిధంగా ఉందో వాస్తవంగా తెలుసుకోవాలి. అవాస్తావాలు, అపోహలను విని, నిర్ణయించుకుంటే, అబాసుపాలు కాకతప్పదు.

మీ తరగతిలో ఎవరికీ స్మార్ట్ ఫోన్ లేదు. మీకు స్మార్ట్ ఫోన్ పై ఆశ కలిగింది. కారణం ఎవరో ఇంటి ప్రక్కన ఉండే స్టూడెంట్ స్మార్ట్ ఫోన్ వాడుతుంటూ మీకు కనిపించింది… మీకు కూడా దానిపై దృష్టిపడింది. కాబట్టి స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుండు అనే ఆలోచన కలిగింది. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి స్మార్ట్ ఫోన్ కొంటే ఎలా ఉంటుంది?

అలా మీ తరగతిలోనే ఒక విద్యార్ధి స్మార్ట్ ఫోన్ క్లాసులోకి తీసుకువచ్చాడు. అప్పుడు టీచర్ అతని దగ్గర నుండి స్మార్ట్ ఫోన్ తీసుకుని, తల్లిదండ్రులకు రిపోర్ట్ చేయడం, తల్లిదండ్రులు వచ్చి హెడ్ మాస్టర్ ముందు దోషిలాగా నిలబడితే, హెడ్ మాష్టర్ ఆ పిల్లవానికి, ఆపిల్లవాని తల్లిదండ్రులకు క్లాస్ తీసుకోవడం జరిగింది. అతని తల్లిదండ్రుల హెడ్ మాష్టర్ వలె సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. కానీ తన స్థాయివారి ముందే తలదించుకునే పని అతని కొడుకు చేయడం వలనే కదా… ఈస్థితి.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

ఇప్పుడు మీరు ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంటే, మీ తల్లిదండ్రులపై ప్రేమను బట్టి మీకు మీ స్మార్ట్ ఫోన్ పై కోరిక కలగదు. అలా మార్పు ఆలోచచ మనసులో మొదలైతే, మనసు ఇలా మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా మంచి ఫోన్ సంపాదించుకునే స్థాయికి వెళ్ళాలనే లక్ష్యమేర్పడుతుంది కానీ ఎలాగైనా మా నాన్నతో స్మార్ట్ ఫోన్ కొని దొంగచాటుగా క్లాసులోకి తీసుకువెళ్లాలనే కోరిక కలగదుకాక కలగదు.

అంటే దీనిని బట్టి లోకంలో కొన్ని సంఘటనలు కొన్ని కోరికల వైపు వెళితే ఎటువంటి అవమానకరపు స్థితిలోకి తప్పు చేయని తల్లిదండ్రులు కూడా లాగబడతారో ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన అనసరపు కోరికలను అదుపు చేస్తుంది. మీపై మీకు పూర్తి నియంత్రణ వస్తుంది.

మనిషి సంఘజీవి కావునా మనసుకు నచ్చిన పనులన్నీ చేసుకుంటూ పోతే వాటిని అనుసరించి పాడయ్యేవారు కూడా ఉంటారు. కావునా మనసుకు నచ్చే పనులను ఆచి తూచి నిర్ణయించుకుని చేయాలి.

మనిషి మనసుకు నచ్చినది, నచ్చనది రెండూ మనిషి చుట్టూ

మనసుకు నచ్చినది, నచ్చనది రెండూ మనిషి చుట్టూ ఉంటాయి. వాటి విషయంలో మనసు చేసే అల్లరి మీకు మాత్రమే తెలిస్తే, మీకు మీపై నియంత్రణ అదే బయటకు కూడా తెలిస్తే, మీపై లోకానికి నియంత్రణ ఉండే అవకాశం ఉంటుంది.

సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.

తోచినది చేసేయడం కన్నా తోచినదాని వలన ఫలితం ప్రయోజనమెంతో ఆలోచన చేయడం వలన మంచి పనులనే ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది.

కోరికలే దు:ఖానికి మూలం అవుతాయి. వ్యక్తిని బలహీనపరుస్తాయి. విద్యార్ధి దృష్టిని దారి మళ్లిస్తాయి. అనవసరపు కోరికల జోలికి వెళ్ళే విధంగా కోరికలు మనసును ప్రేరేపింపజేస్తాయి. కావునా కోరికలను తీర్చుకోవడానికి ప్రాకులాడడం కన్నా లభించినప్పుడు అనుభవించడం ఆస్వాదించడం మేలు అంటారు.

వేళకానీవేళలో నచ్చిన కూర వండించుకుని తినాలంటే, వేళకానీవేళలో కూరకు సంబంధించిన సరకులు తేవడానికి యజమానికి శ్రమ, వేళకానీవేళలో వంట చేసేవారికి శ్రమ… కానీ వేళకానీవేళలో నచ్చిన కూర వండి ఉంటే, దాని తృప్తి వేరు. అటువంటి తృప్తి లభించినప్పుడు ఆస్వాదించాలి…. లభించనప్పుడు వెంపార్లడకూడదని అంటారు..



లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం.

ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది.

ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య సాధనవైపు మనసు పరుగులు పెడుతుంది.

అయితే లక్ష్యం చాలా సులభంగా కనబడవచ్చు. కానీ అప్పుడు నిర్లక్ష్యం చూపిస్తే, అదే లక్ష్యానికి శత్రువు అవుతుంది. మధ్యలోనే లక్ష్యం చెదిరే అవకాశాలు ఎక్కువ.

ఏర్పరచుకున్న లక్ష్యం చెదిరిపోవడానికి ప్రధాన కారణం. మనసులో లక్ష్యంపై దృష్టితో బాటు ఇతర విషయాలు కూడా ఉండడం.

పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు రావాలి! అనే లక్ష్యం ఉన్న విద్యార్ధికి టి‌వి చూడడం అనే అలవాటు ఉంటే, అతని మనసులో టి‌విలోనూ కార్యక్రమములు కనబడుతూ ఉంటాయి.

మరొక విద్యార్ధికి ఆటలంటే ఇష్టం కానీ అతనికి పబ్లిక్ పరీక్షల లక్ష్యం ఉంది. అయితే అటలంటే ఆసక్తి ఉన్న అతని మనసుకు మాత్రం ఆడుకోవడానికి రెడీగా ఉంటుంది.

దేనిపై ఎక్కువ ఆసక్తి ఉంటే దానివైపు మనసు వేగంగా మరలిపోతుంది అంటారు.

మనసులో లక్ష్యం సాధనకు కృషి చేయాలన్న తలంపు బలంగా ఉండాలి!

మరలిపోవడం మనసు యొక్క గుణం అయితే, ఆ గుణాన్ని అదుపు చేయడం యువతకు బలం అవుతుంది. అటువంటి బలం యువత ఎంత పెంచుకుంటే, అంత త్వరగా లక్ష్య సాధనకు మనసులో ఏకాగ్రత ఏర్పడుతుంది.

మన చుట్టూ ఎప్పుడూ అనేక విషయాలు ఉంటూనే ఉంటాయి. అవి మనం పుట్టి పెరిగిన లేక నివసిస్తున్న ప్రాంతం మరియు మిత్రుల బట్టి ఉంటాయి. అయితే మనం పుట్టి పెరిగిన లేక మన మిత్రుల మద్య మనం హీరో కావాలంటే మన మనసుపై మనకు నియంత్రణ ముఖ్యం.

తన చుట్టూ అనేక విషయాలు ఆకట్టుకునే విధంగా ఉంటూ, తన సమయం వృధా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అని ఎవరు విషయాలపై అవగాహనతో ఉంటారో, వారు వ్యక్తులపై ఆగ్రహం తెచ్చుకోరు. విషయాల వ్యాపకం తగ్గించుకోవడంలో జాప్యం చేస్తున్న మనసుపై ఆగ్రహిస్తారని అంటారు.

ఎందుకంటే విషయాలే మనసులో ఉంటాయి. విషయాలే ఆలోచనలకు కారణం అవుతాయి. విజ్ఞాన వేదికగా ఉండాల్సిన మనసు వినోద వేదికగా మారుతుంటే, విజ్ఞులు ఒప్పుకోరు అంటారు.

విజ్ఞానమును వంటబట్టించుకునే సమయంలో ఏర్పడే అవరోధాలకు విషయాలు కారణం అయితే, అటువంటి విషయాలవైపు వెళ్లకుండా ఉండడానికి మనసులో ఏకాగ్రత ముఖ్యం.

ఏకాగ్రతతో ఉండే మనసు తన ముందు ఉన్న పనిని చాలా చాలా చక్కగా చేయగలదని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణగా వేకువజామునే చేసే పనులు చెబుతారు.

కాబట్టి అనేక విషయాలు మనసును పట్టుకుని దానిని ఆకర్షించే పనిలో ఉంటాయి. కానీ లక్ష్యం చేరాలంటే వాటిని నియంత్రించాలి. అటువంటి విషయాలను నిరోధించడానికి మనసుకు బలం ఏకాగ్రత. ఏకాగ్రతగా మనసును ఒక విషయం వైపు మరలిస్తే, అది లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది.

నేర్చుకునే వయసులో జీవితానికి ఉపయోగపడే ప్రతి విషయంలోనూ శ్రద్ద చూపుతూ, లక్ష్యాన్ని చెదరగొట్టే విషయాలపై నియంత్రణ కలిగి ఉంటూ ముందుకు సాగాలి…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ముందుగా మీకు బాగా తెలిసిన వ్యక్తులలో మంచి గుణములు ఎవరిలో ఉన్నాయో ఆలోచించాలి.

అలా ఆలోచించాకా బాగా మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎలా తెలుసుకోవాలి? ఈ ప్రశ్న పుడుతుంది.

సింపుల్… మన చుట్టూ ఉండేవారిలో ఎక్కువమంది ఎవరిని పొగుడుతున్నారో… వారిలో సహజంగానే మంచి గుణాలు ఉంటాయి.

మంచి గుణాలు అంటే ఉపకారం చేయడం, దానం చేయడం, చెప్పిన మాట వినడం, సాయం చేసే గుణం కలిగి ఉండడం మొదలైనవి…

ఒక వ్యక్తి గురించి వ్యాసం వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించిన గుణగణములు తెలియాలి. ముఖ్యంగా ఆవ్యక్తిలో ప్రధానమైన మంచి గుణములు తెలియాలి.

అందరికీ నచ్చిన ఆ గుణములు గురించి మనకు తెలియాలి. సాధారణంగా వ్యాసరచన చేస్తున్నామంటే, అతని పాపులరిటి కలిగిన వ్యక్తి అయి ఉంటాడు.

కనుక అతని గుణగణాలు అందరికీ తెలిసినవే ఉంంటాయి. వాటిని మనం వార్తా పత్రికలు, టివిలు, ఆన్ లైన్ న్యూస్ చానల్స్ ద్వారా తెలుసుకోవచ్చును.

ఇంకా మన చుట్టుప్రక్కల ఉండే కొందరు పెద్ద మనుషుల గురించి కూడా మన చుట్టూ ఉండేవారు మాట్లాడుకుంటూ ఉంటారు. వారి గురించి మనకు మాములుగానే తెలిసి ఉంటుంది.

అప్పుడు ఆ వ్యక్తి పేరు, పుట్టిన ఊరు, పుట్టిన తేది, పెరిగిన నేపధ్యం, చదువు, వృత్తి ఉద్యోగాలు, బంధు మిత్రులను పరిచయం చేస్తూ క్లుప్తంగా వివరించాలి.

ఆ తర్వాత అతని పుట్టిన నాటి నుండి అతని జీవితంపై ప్రభావం చూపిన సంఘటనలు వ్రాయాలి.

అతని జీవితంపై ప్రభావం చూపిన వ్యక్తులు, అతని జీవితంలో మార్పుకు నాంది పలికిన మలుపులు… తెలుసుకుని వాటి గురించి వ్రాయాలి…

ఇవి పూర్తయ్యాక ప్రధానముగా వ్యక్తి సమాజంలో కీర్తిగడించిన అంశమును గురించి వ్యాసములో విపులంగా విస్తారంగా వివరించాలి.

మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, బాగంగా అందరికీ తెలిసిన నరేంద్ర మోదీ గారి గురించి వ్యాసం

క్లుప్తంగా వివరణ: నరేంద్ర మోదీ గారు మన దేశ ప్రధానమంత్రి. అంతకుముందు ఆయన గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి. నరేంద్రమోదీ అసలు పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, ఈయన 1950 సెస్టెంబర్ 17న జన్మించారు. ఈయన తండ్రి దామోదర్ దాస్, తల్లి హీరాబెన్ మోదీ… రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఈయన శాకాహారి….

ఇప్పుడు నరేంద్ర మోదీ గారి బాల్యం గురించి

గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో నరేంద్ర మోదీ జన్మించారు. అక్కడి స్థానిక పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయంలో నరేంద్రమోదీగారు రాజనీతి శాస్త్రములో మాస్టర్స్ డిగ్రి పట్టభద్రులయ్యారు. ఈయన విద్యార్ధి దశలోనే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో ఒక మారుమూల టీ అమ్మిన ఈయన జీవితం అనేక మలుపులు తిరిగింది.

భారతీయ జనతా పార్టీలో నరేంద్రమోదీ 1987 సంవత్సరంలో చేరారు. అచిర కాలంలోనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అందుకున్నారు. ఎల్.కె. అద్వానీ నేతృత్వంలో 1990లో జరిగిన అయోధ్య రధయాత్రలో ఇన్ చార్జ్ గా పనిచేశారు. అదేవిధంగా మురళీమనోహర్ జోషి తలపెట్టిన కన్యాకుమారి టు కాశ్మీర్ రధయాత్రకు కూడా ఇన్ చార్జ్ గా పనిచేశారు. అనతి కాలంలోనే కేశుభాయ్ పటేల్ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. 2001లో ముఖ్యమంత్రిగా మారిన మోదీగారు ప్రధాని అయ్యేవరకు గుజరాత్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రిగానే పనిచేస్తూ ఉన్నారు.

దేశప్రధానిగా నరేంద్ర మోదీ

గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాని అభ్యర్దిగా పోటీ చేశారు. అంచనాలకు భిన్నంగా నరేంద్రమోదీ సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలలో విజయం సాధించింది. ఎంపిగా పోటీ చేసి, గెలిచిన తొలిసారే ప్రధాని పదవిని అధిష్టించారు.

ఈయన దేశప్రధానిగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పెద్ద నోట్ల రద్దు ప్రక్రియగా ఉంది. అర్ధరాత్రి అప్పటికప్పుడు పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశ మొత్తం ఆశ్చర్యపోయింది. అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు చేయడం జరిగింది. జిఎస్టీ అమలు చేయడంలో కూడా కృషి జరిగింది. ఇంకా మూడు సార్లు తలాక్ రద్దు, పారసత్వం సవరణ చట్టం (CAA), జాతీయ పౌర జాబితా(NRC) అమలు వంటివి ఉన్నాయి

2014 మే 26న భారతదేశ పదిహేనవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ ప్రస్తుతం అదే పదవిలో కొనసాగుతున్నారు.

విశిష్ట లక్షణాలతో భారతదేశాన్ని ముందుండి ముందుకు నడిపిస్తున్నందుకు గాను మోడీకి అవార్డు అవార్డు దక్కింది జనవరి 14 2019 లో న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డు అందుకున్నారు.

పాపులర్ ప్రధానమంత్రిగా, అశేష ప్రజాధరణ కలిగిన నాయకుడు

నరేంద్ర మోదీ ప్రత్యేకతలు

రాజనీతి శాస్త్రంలో పీజీ చేశారు.

గుజరాత్ రాష్ట్రమునకు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి.

అధునిక పరిజ్ఙానం వాడుకుంటూ పాపులారిటీ పెంచుకోవడంలో ఈయనకు ఈయనే సాటి.

అందరికీ తెలిసిన వ్యక్తి గురించి వ్రాస్తే, వ్రాయడం ఎలా అనే కాన్సెప్ట్ అర్ధం అవుతుందిన నరేంద్రమోదీ గారి గురించి ఒక వ్యాసంలోకి తీసుకురావడం జరిగింది.

ఈయన గురించి ఇంకా చాలా వివరాలు ఆన్ లైన్లో పబ్లిక్ డొమైన్లలో లభిస్తుంది.

వ్యాసం ప్రారంభం, వ్యాసం ముగింపు క్లుప్తంగా అర్ధవంతంగా ఉంటే బాగుంటుంది.

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం అంటే మనం ఎరిగినవారిలో మంచి గుణాలు కలిగిన వారిని ఎంచుకోవాలి.

మీకు తెలిసిన వ్యక్తి గురించి తెలుగులో వ్యాసము వ్రాయాలంటే, ఆ వ్యక్తి గురించి తెలిసినవారు ఏమనుకుంటున్నారో చూడాలి. లేదా ఆ వ్యక్తి గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. అప్పుడే వాస్తవాలు వ్రాయగలుతాము.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు