Tag Archives: తదేకంగా అనే పదమును

తదేకంగా అర్థం తెలుగు పదం

తదేకంగా అర్థం తెలుగు పదం. అదే దృష్టిని ఒకేచోట కేంద్రికరించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా చూడడం అంటారు. ఉదాహరణకు ఈ క్రింది వ్యాక్యాలు గమనించండి.

”అతను తదేకంగా ఆ వస్తువుని చూస్తున్నాడు”,

”ఆమె ఆ ప్రదేశాన్ని తదేకంగా గమనిస్తుంది”

”ఆ వ్యక్తి గోడపై ఉన్న చిత్రపఠాన్ని తదేకంగా చూస్తున్నాడు.”

కళ్ళప్పగించి చూస్తూ ఉండడాన్ని తదేకంగా అని చెబుతారు. తన చుట్టూ ఉండే పరిస్థితులను మరిచి చూడడం అని కూడా అంటారు. ఒక వస్తువును కానీ ఒక చిత్ర పఠమును కానీ పరిశీలనగా చూస్తూ, దృష్టిని దానిపైనే కేంద్రికరించి చూడడం చేస్తుంటే, అప్పుడు తదేకంగా చూస్తున్నారని చెబుతారు. అంటే ఇక్కడ చూడడం అనే క్రియను ఏకాగ్రతతో చేస్తుంటే, దానిని తదేకంగా అని చెబుతారు. అదేపనిగా గమనించడం అనే క్రియను చెప్పేటప్పుడు కూడా తదేకంగా అనే పదమును వాడవచ్చును.

తెలుగురీడ్స్

2014లోని రాజకీయాలు ఏపిలో పునరావృతం అవుతాయా?