రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు, కుయుక్తులు మనకు రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పనులను చూపుతూ ఉంటారు. వీటిని చూసి ఎవరు ఎలా ప్రభావితం అవుతారో తెలియదు కానీ రాజకీయాలు అంటే సమాజాన్ని బాగు చేయగలవు. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు సమాజానికి హాని కూడా చేయగలవు అని సినిమాలు చూస్తే అర్ధం అవుతుంది. రాజకీయాలు రాజకీయ నాయకులు ప్రభావము రాజకీయాలు మనం నివసిస్తున్న సమాజంపై ప్రభావం చూపుతూ, మనపై ఎప్పుడూ ప్రభావం చూపుతాయి. వాటిని శాసించేవారు రాజకీయ పార్టీల నాయకులు.
రాజకీయపార్టీ అంటే మన భవిష్యత్తుని నిర్ణయించే సామాజిక శక్తి. రాజకీయ నాయకుడు మన భవిష్యత్తుపై ప్రభావం చూపించేవారిలో ముఖ్యుడు. మంచి నాయకత్వంలో నాయకులు నడిస్తే, అది మంచి రాజకీయ పార్టీ. ఒక మంచి నాయకుడిని గెలిపిస్తే, అది ఆ ప్రాంతపు అభివృద్దికి తోడ్పడుతుంది. ఎక్కువమంది మంచి నాయకులకు ప్రజలు ఎన్నికలలో ఎన్నుకుంటే… ఆ రాష్ట్రమే బాగుపడుతుంది. అలా ఒక రాష్ట్రంలో ఎక్కువమందిని ఎన్నుకునే అవకాశం రాజకీయ పార్టీ వలన సాద్యపడుతుంది. కావునా ఒక రాజకీయ పార్టీ యొక్క సిద్దాంతాలు, వారి భవిష్యత్తు దార్శినికతను తెలుసుకోవాలి.
మీడియాలో మనకు రాజకీయ పార్టీల నిర్ణయాలు, రాజకీయ నాయకులు చేష్టల గురించి విశ్లేషణలు ఒక అవగాహనను కల్పిస్తాయి. సినిమాలు ఐతే రాజకీయం ఎలా ఉంటుందో? చూపుతూ ఉంటారు.
రాజకీయ పార్టీలు సమాజ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు…
ఒక్కసారి ఓటేసి గెలిపించిన నాయకుడు ఒక అధికార పదవిని చేపడతారు. అధికారం చేపట్టిన నాయకుడు, అధికార రాజకీయ పార్టీ అధినేత పాలనలో భాగమై పని చేస్తారు.
ఒక రాజకీయ పార్టీయే ఒక ప్రభుత్వంగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉంటుంది. కావునా ఒక రాజకీయ పార్టీ అధినేత విధానం బట్టి ఆ ప్రాంతపు అభివృద్ది ఆధారపడి ఉంటుంది.
చాలా రాజకీయ పార్టీలలో ఆ పార్టీ అధ్యక్షుడే, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు.
మన దేశానికి కూడా గతంలో రాజకీయ పార్టీ అధ్యక్షులే, ప్రధానమంత్రిగా ఉండేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలు, పార్టీ అధ్యక్షలు ఒకరైతే, దేశప్రధానిగా మరొకరు ఉంటున్నారు.
పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వానికి నాయకత్వం వహించినా లేక పార్టీ సభ్యులు ఎంపిక చేసినవారు ప్రభుత్వానికి నాయకత్వం వహించినా, ఆయా రాజకీయ పార్టీల విధానాన్ని బట్టే పాలన ఉంటుందని అంటారు.
కావునా ప్రధానంగా రాజకీయ పార్టీ యొక్క విధి విధనాలు తెలుసుకోవాలి.
మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలలో ఉండే, ప్రాంతీయ నాయకులు గురించి పూర్తిగా అవగాహన ఓటరుకు ఉండాలి. అప్పుడే సరైన నాయకత్వంలో అధికారం ఉంటుందని అంటారు.
ప్రజాక్షేమం కోరి పనిచేసేవారి వర్తమానంలో చేసే పనులు భవిష్యత్తులో ప్రజల సౌకర్యం కోసమే ఉండాలి కానీ భవిష్యత్తులో ప్రజలకు కష్టాలు కలిగించేవి కాకుడదని అంటారు.
అంటే దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసే రాజకీయ పార్టీల గురించి ఆలోచన చేయాలని అంటారు.
ముందుగా మనకు మన సమాజం. మన సమాజంలో రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు రాజకీయ తీరు… ఇలా రాజకీయ అవగాహన ఉండాలి. రాజకీయం ఎలా ఉంటుందో? అందులో ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉంటాయో మనకు న్యూస్ మీడియా అందిస్తుంది. కొన్ని తెలుగు సినిమాలు కూడా రాజకీయ నేపధ్యం మిళితమై ఉంటాయి.
అలాంటి కొన్ని ‘రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు‘, రాజకీయాలు రాజకీయ నాయకులు యుక్తులు రాజకీయాలను, రాజకీయ నాయకులు ప్రభావమును” చూపించే కొన్ని తెలుగు సినిమాలు.
ఎవడైతేనాకేంటి, లీడర్, నేనేరాజు నేనేమంత్రి, ప్రతినిధి, ప్రస్థానం, గాడ్సె, ఒకేఒక్కడు, కెమెరామెన్ గంగతో రాంబాబు, మేస్త్రీ, రిపబ్లిక్, రంగం, ప్రభజంనం, శకుని, ఠాగూర్, అధిపతి, రంగస్థలం, భరత్ అను నేను, మాచర్ల నియోజకవర్గం, నోటా, భారత్ బంద్, అసెంబ్లీరౌడీ, గాడ్ ఫాదర్, సామాన్యుడు, ఒకేఒక్కడు, దరువు, ఎన్జీకె, అధినేత..
లీడర్ తెలుగు సినిమా రాజకీయ నేపధ్యంలో ఉంటుంది.
ఈ తెలుగు సినిమాలో కధానాయకుడు ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఆ ముఖ్యమంత్రి అవినీతి ముఖ్యమంత్రి అని బహిరంగ రహస్యమే. అటువంటి ముఖ్యమంత్రి చనిపోతే, అతని కొడుకు మరలా ముఖ్యమంత్రి కావాలంటే, ఎలాంటి పరిస్థితులు? ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు మేలు మాత్రమే చేయడానికి అతని చేసే రాజకీయాలు… ఈ సినిమాలో ఉంటాయి.
ఠాగూర్ తెలుగు సినిమా ఒక ఉపాధ్యాయుడు సమాజంలో అవినీతిని అంతం చేయడానికి పూనుకుంటే?
ఈ తెలుగు సినిమా మరొక భాషలో నుండి రీమేక్ చేశారు. ఒక టీచర్ నివసించే చోట ఒక వ్యాపారి రాజకీయ నాయకులను, ప్రభుత్వ ఉద్యోగులను మేనేజ్ చేసుకుంటూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతాడు. అలాంటి వ్యక్తి చేతిలో తనవారిని పోగొట్టుకున్న టీచర్, అతనిపై పగ తీర్చుకోవడం కన్నా, సమాజంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసే యజ్ఙం మొదలుపెడతాడు. దీర్ఘకాలిక ప్రణాలికతో సమాజంలో అవినీతిపరులకు సింహస్వప్నంగా మారతాడు. ఇది ఒక ప్రాంతంలో అవినీతిని అంతం చేయడానికి టీచర్ పోరాటం, యువత సహకారం, ఒక మంచి సంకల్పమునకు యువత ఎలా ఆసక్తిపరులు అవుతారో…. చూపుతుంది.
ఒకేఒక్కడు తెలుగు సినిమా ఒక చదువుకున్న సామాన్యుడికి ఒక్కరోజు అధికారం ఇస్తే?
రాజకీయ నాయకులలో ముఖ్యమంత్రి ఒక పార్టీకి నాయకత్వం వహిస్తాడు. ఒక రాష్ట్రమును నాయకత్వం వహిస్తాడు. ఆ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రమును పరిపాలన చేయడంలో అవినీతికి పరాకాష్టగా మారితే, అతనికి ఒక సామాన్య ఉద్యోగి చెప్పే సమాధానం. సమాజంపై మంచి అవగాహన ఉన్నవారు అధికారంలో ఉంటే, రాష్ట్రములో ఉండే, సమస్యలకు పరిష్కారం ఎలా ఉంటుందో? ఈ సినిమాలో ఉంటుంది.
శకుని ఇచ్చిన హామిని నెరవేర్చని ముఖ్యమంత్రికి బుద్ది చెప్పిన యువకుడు
ఎన్జీకె తెలుగు సినిమా ఒక కార్యకర్త ఒక ప్రాంతంలో నాయకుడుగా ఎదగడానికి పడే పాట్లు. రాజకీయాలలో ఎటువంటి నాయకులు ఉంటారు? నీచ రాజకీయాల మద్య నలిగిపోయే కార్యకర్త.
రంగం తెలుగు సినిమా రాజకీయాలలో యువత ఉంటే, సమాజం వేగంగా వృద్ది చెందుతుంది. కాలం చెల్లిన పెద్దలను కాదని, విజన్ తో వెళ్ళే యువతకు నాయకత్వం వహించే ఒక వ్యక్తికి సహకరించే మీడియారంగం. ఇంకా అతనిని బ్యాక్ గ్రౌండులో మరొక శక్తి అతని ప్రణాళికలో నడిచే యువత. చివరకు ఆ నాయకుడికి ప్రజలు పట్టం కడితే, అతని ఉద్దేశ్యం ఏమిటి? అతనికి సహకరించినవారు, అతని వలన మోసపోయాము అని తెలిస్తే, జరిగిదేమిటి? ప్రజలకోసం ఎలాంటి ముగింపు సమాజానికి మంచి సందేశం ఇస్తుంది… ఈ సినిమా చూడాలి అంటారు.
ఎవడైతేనాకేంటి తెలుగు సినిమా ఒక స్వార్ధ రాజకీయ నాయకుడు ఇంట్లో అంతా స్వార్ధపరులు, అతని చుట్టూ ఉండేవారు కూడా అంతే… అయితే అతని కనిష్ట కుమారుడు మాత్రం ప్రజల కష్టాలను చూస్తాడు. వారికోసం తండ్రిని ఎదిరించి, ప్రజలకు మేలు చేయడానికి పూనుకుంటాడు.
సామాన్యుడు తెలుగు సినిమా
మీడియా తలచుకుంటే, ఒక రాజకీయ నాయకుడుతో ఎలా మంచి పనులు చేయవచ్చో? ఈ సామాన్యుడు సినిమాలో చూపుతారు.
ప్రతినిధి తెలుగు సినిమా ఒక సామాన్యుడు ముఖ్యమంత్రిని అడ్డుపెట్టుకుని, సమాజానికి మేలు చేయాలనుకుంటాడు.
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు ఇంకా సామాజిక స్పృహ ఉండే కొన్ని సినిమాలు
తెలుగులో వ్యాసాలు
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్