తొలి ఏకాదశి నుండి హిందూ సంప్రదాయంలో పండుగలు మొదలు అవుతాయి. ఆ పర్వదినం నుండి మనిషి సాత్వికమైన పద్దతిలోకి మనసును ప్రయాణింపజేసి, భగవంతునికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం మొదలుచేస్తూ ఉంటారు. ఏకాదశి వ్రత తెలుగుబుక్స్ గురించి ఈ పోస్టులో…
ఒక్క ఏకాదశి వ్రతమైనా శాస్త్రియ పద్దతిలో మన:పూర్వకముగా ఆచరిస్తే, ఆ జన్మ ఫలించినట్టుగా పెద్దలు చెబుతారు. అటువంటి ఏకాదశి ఒక మాసానికి రెండు సార్లు చొప్పున, సాలుకు 24 సార్లు వస్తాయి, అధికమాసం వస్తే సంఖ్య పెరుగుతుంది.
ఆధునిక వైద్య పద్దతిననుసరించి కూడా ప్రతి పక్షానికి ఒక రోజు పూర్తి సాత్విక ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవడం ఆరోగ్య లక్షణం అంటారు. అంటే ప్రతి పదిహేను రోజులకు ఒక రోజులో కేవలం సహజంగా లభించే ఆహారం పండ్లు, పాలు లాంటివి స్వీకరిస్తే, జీర్ణవ్యవస్థ భాగుగా ఉంటుంది, అంటారు. కాబట్టి హిందూ సంప్రదాయ ఏకాదశి నియమాలు కూడా ప్రత పక్షానికి ఒకమారు రావడంతో ఏకాదశి చేయడం భక్తితోపాటు ఆరోగ్యవంతం కూడా అని అంటారు.
ఇలా రెండు రకాలు మేలును చేయగలిగే ఏకాదశి వ్రతం నియమనిష్టలకు పెట్టింది పేరు అని అంటారు. ఏకాదశి వ్రతం ఆచరించి పూర్వం కొందరు మంచి ఫలితాలను పొందినట్టు చాలా తెలుగుపుస్తకములలో చెబతారు. అంబరీషుడు ఏకాదశి వ్రత ఫలితం చేత దూర్వాశో మహర్షి శాపం కూడా ఆయనను ఏమి చేయలేకపోయింది, అనే పురాణగాధ చాలా ప్రసిద్ధమైనది.
ఏ ఏకాదశికి ఎలా ఉపవాసం ఉండాలి? విష్ణు స్వరూపాన్ని ఎలా పూజించాలి? ఏకాదశి గొప్పతనం గూర్చి చెప్పే గాధలను తెలుపుతూ ఉండే పుస్తకాలు ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తున్నాయి. ఈ పుస్తకం చదవడం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్న అంశంతో కొంతకాలం ఏకాగ్ర బుద్దితో మనసు ప్రయాణించడం, కాబట్టి భక్తిని ప్రభోదించే ఏ పుస్తకమును అయినా రీడ్ చేయడం అనేది మంచి అలవాటుగా చెబుతారు.