దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టివి అని అంటారు.
టివి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును.
కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది.
శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములను చలనచిత్ర రూపంలో దూరదర్శిని మనకు దర్శింపజేస్తుంది. అందుకే దీనిని దూరదర్శనీ అంటారు.
రేడియోలో అయితే కేవలం శబ్ధ రూపంలో మాటలు వినగలం కానీ టివిలో అయితే శబ్దరూపంలోను చలనచిత్ర రూపంలోనూ కార్యక్రమములు వీక్షించవచ్చును.
ఈ దూరదర్శిని కనిపెట్టే ప్రయోగం 1883 నుండి ప్రారంభం అయితే, 1925 లో ఒక చిత్రం మరొక రూమ్లో ఉన్న రిసీవర్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది.
1946లో బ్లాక్ అండ్ వైట్ దూరదర్శిని ప్రసారాలు జరిగాయి. అటు తర్వాత కలర్ టివిలు కూడా రావడం విశేషంగా ప్రజాధరణ పొందడం జరిగింది.
ఈవిధంగా రంగుల దూరదర్శిని మనిషి జీవితంలో ప్రతి కుటుంబంలో భాగమై ఉంది.
ప్రతి వ్యక్తి కుటుంబంలోకి వచ్చిన టివిలలో మొత్తం ప్రాపంచిక విషయాలు చలనచిత్ర రూపంలో దర్శనం ఇస్తున్నాయి.
వివిధ రకాల చానల్స్ ద్వారా వివిధ రకాల కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.
వార్తా ఛానళ్ళు, క్రీడా ఛానళ్ళు, సినిమా ఛానళ్ళు, భక్తి ఛానళ్ళు, వ్యాపార వర్తక ఛానళ్ళు ఇలా ప్రాచుర్యం పొందిన ప్రతి రంగానికి చానల్ రావడం సాదారణం అయింది.
సమాజంలో ఏమూల ఏం జరిగినా ప్రజల ముందుకు తీసుకువచ్చే ఛానళ్ళు అనేకంగా ప్రాంతాలవారీగా ఉన్నాయి. వీటికి తోడు జాతీయ, అంతర్జాతీయ ఛానళ్ళు సర్వసాధారణం.
ఇంట్లోనే కూర్చుని ప్రాపంచిక విషయాలు తెలుసుకోవచ్చు. అలా టివి ప్రజల జీవితమలో మమేకం అయ్యింది.
దూరదర్శిని ప్రధాన ప్రయోజనాలు
దూరదర్శిని ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే ముఖ్యంగా వినోదభరిత కార్యక్రమములు ఇంట్లోనే వీక్షించవచ్చు.
అలాగే ప్రపంచంలో జరిగే వివిధ విషయాలు తెలుసుకోవచ్చు.
సమాజంలో ఉండే పోకడలు దూరదర్శిని ద్వారా వీక్షించవచ్చు.
విజ్ఞానమును పెంపొందించుకోవడంలో కూడా టివి ఉపయోగపడుతుంది.
ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ పనితీరు తదితర వాటిగురించి విశ్లేషకుల అభిప్రాయాలూ ప్రత్యక్షంగా దూరదర్శినిలో వీక్షించవచ్చు.
కాలక్షేపం కోసం కాసేపు టివి చూసే ధోరణి నుండి, అదేపనిగా టివి చూసేవిధంగా కార్యక్రమములు అందుబాటులో ఉండడం వలన కొంతమేరకు వ్యక్తికి కాలహరణం జరిగే అవకాశం లేకపోలేదు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?