Tag Archives: ధూమపానం చేయగా వచ్చే పొగను

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు.

చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటితో పొగ త్రాగుట లేదా పీల్చుట ఆరోగ్యానికి హానికరం…. కాబట్టి ధూమపానం చేయరాదు. ధూమపానం చేయడం వలన కాన్సర్ వస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు.

సమాజంలో 39-69 ఏళ్ల మద్య వయస్సున్నవారు మరణిస్తున్నారు. అలాంటి ధూమపాన ప్రియుల్లో 38 శాతం టి.బి, 32 శాతం క్యాన్సర్, 20 శాతం మందికి రక్తనాళాల సమస్యలు కారణమని పరిశోధనలో తేలింది. ధూమపానం చేసేవారి ఆయుష్షు సుమారుగా పదేళ్లు తగ్గుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇంతటి ప్రమాదకరమైన ధూమపానం చేయడం వ్యక్తిగతంగా విలాసం అయినా అది సమాజానికి చేటు చేయడం వంటిదే… ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంతో ఆయా ప్రదేశాలలో తిరిగే జనుల కూడా ధూమపానం చేయగా వచ్చే పొగను పీల్చడం జరుగుతుంది. ధూమపానం చేయగా వచ్చే పొగ పీల్చడం కూడా ఆరోగ్యానికి హానికరం అంటారు. కావునా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయరాదు.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసి, ఇతరుల ఆనారోగ్యానికి కారణం కావడం అంటే అది సామాజిక పరంగా వ్యక్తి వ్యక్తే చేటు చేయడం అవుతుంది. కావునా ధూమపానం చేసేవారు ఆ అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలి… ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం మానేయాలి….

ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ఉంది… అయితే అది ఎంతవరకు అమలు అవుతుందో…. ఆయా ప్రాంతాలలో నివసించేవారికే తెలియాలి…

ముఖ్యంగా బస్టాండ్ లేదా బస్టాప్ ఆవరణలలోనూ, సినిమా హాళ్ళల్లోనూ, షాపింగ్ మాల్స్ ఆవరణలలోనూ, హాస్పటల్స్ మొదలైన ప్రదేశాల్లో ధూమపానం నిషేధం కఠినంగా అమలు జరగాలి… ఎక్కువగా జనులు సంచరించే ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు