Tag: నేడు నెట్ లేకపోతే

  • ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

    ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు అన్నట్లుగా అనిపిస్తుంటుంది.

    ఒక రోజంతా కరెంటు లేకపోతే చాలా పనులకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ఇంటర్నెట్ ఆగినా అదే పరిస్థితి.

    ఇంటర్నెట్ అంతగా మనలో బాగస్వామి అయ్యింది. ప్రతివారి చేతిలోనూ ఇంటర్ నెట్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కనబడుతుంది. నెట్టింట్లో కాసేపయినా కాలక్షేపం చేయకుండా ఉండనివారుండరు.

    అలా మనిషి ఇంటర్నెట్ మరొక వర్చువల్ లోకాన్ని క్రియేట్ చేసింది. ఇలా ఇంటర్నెట్ వ్యక్తిగతంగా ప్రతీ వ్యక్తికి దగ్గర అయ్యింది. అలాగే ప్రతి కంపెనీలో ఇంటర్నెట్ తప్పనిసరి అయ్యింది. టివిలేని ఇల్లు, ఇంటర్నెట్ లేని వ్యవస్థ ఉండదు.

    ప్రతి మనిషి జీవితంలోనూ ఇంటర్నెట్ వాడుక బాగమైంది. ప్రత కంపెనీకి అవసరం అయ్యింది. ఇంటర్నెట్ సేవలు అందించే వ్యవస్థలు పుట్టాయి.

    తెలుగులో ఇంటర్నెట్ అంటే అంతర్జాలం అంటారు. అంటే కంప్యూటర్ – కంప్యూటర్స్ – ఆల్ కంప్యూటర్స్…

    ఒక కంప్యూటర్ ప్రపంచంలో ఏ కంప్యూటర్ కు అయిన అనుసంధానం చేయడానికి లభించే ఆకాశ మార్గాలు అంతర్జాలం అంటారు. ఒక కంప్యూటర్ ఒక చోటనే ఉంటుంది… కానీ అందులో నుండి ప్రపంచంలో ఎక్కడి కంప్యూటర్ తో అయినా సంభాషించేకునే విధానం ఇంటర్నెట్ కల్పిస్తుంది.

    ఒక వీధి నుండి మరొక వీధికి అనుసంధానం ఉంటుంది. అలాగే అన్ని వీధులు కలిపి ఒక ఊరితో అనుసంధానంగా ఉంటాయి. అలా ఊళ్ళన్ని ప్రపంచంతో రోడ్డు మార్గంలో, రైలు మార్గంలో అనుసంధానం అయి ఉంటాయి. అలాగే కంప్యూటర్స్ కూడా నెట్ వర్క్ ద్వారా అనేక కంప్యూటర్లకు అనుసంధానం అయే మార్గములను ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ ఒక నెట్ వలె ఉంటుంది. అంటే ఒక వలలాగా ఉంటుంది.

    ఇంటర్నెట్ అంటే ఏమిటి?

    ఇలా కంప్యూటర్లు అంతర్జాలంతో అనుసంధానం అయి ఉండడం వలన కమ్యూనికేషన్ వేగం పెరిగింది. ఒకరు ఒకచోటే ఉంటూ మరొక వ్యక్తితో సంభాషించడానికి అంతర్జాలం బాగా ఉపయగపడుతుంది.

    ఒక ఆఫీసులో కూర్చుని ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తితోనైనా సంభాషించవచ్చును. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఎక్కడ ఉన్న వ్యక్తి అక్కడి నుండే ప్రపంచంలో మరొక వ్యక్తితో సంభాషణ చేయవచ్చును.

    ఒకరోజు కరెంటు సరఫరా ఆగిపోతే కొన్ని కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఒకరోజు ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోతే కొన్ని కోట్ల నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

    ముఖ్యంగా ఎవరు ప్రపంచలోని ఎక్కడి నుండైన మరొక వ్యక్తితో మాట్లాడవచ్చును. దీనివలన సందేశం చేరవేయడానికి ఒక వ్యక్తి ప్రయాణం చేయవలసిన పని లేదు.

    ఒకప్పుడు పోస్టు కార్డ్ ద్వారా సందేశాలు కొన్ని రోజులకు చేరేవి… ఇప్పుడు ఒక సెకనులో కాలంలోనే సందేశం ఒకరి నుండి మరొకరి చేరిపోతుంది. తద్వార విలువైన కాలం వృధా కాదు.

    వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యంతో ఎక్కడెక్కడో దూరంగా ఉండే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చును. దీని వలన వ్యక్తిగత ప్రయాణపు అవసరాలు తగ్గాయి.

    ఇంటర్నెట్ ఆధారిత పరికరాలతో పనులు చాలా వేగంగా సాగుతాయి. అన్నింటికి మనిషిపై ఆధారపడవలసిన పనిలేదు.

    వ్యాపార విస్తరణకు ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది. అనేక సేవలలో కూడా ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉంటుంది.

    ఎక్కౌంటింగ్, స్టాటిక్స్, బ్యాంకింగ్, మీడియా వంటి రంగాలలో ఇంటర్నెట్ చాలా ఉపయోగకరంగా ఉంది.

    వ్యక్తిగతంగానూ స్మార్ట్ ఫోను రూపంలో ఇంటర్నెట్ ప్రతిమనిషిని ఆన్ లైన్ ప్రపంచంతో అనుసంధానం ఏర్పడుతుంది. తద్వార వ్యక్తిగత పనులు కూడా ఫోన్ నుండే నిర్వహించుకోవచ్చును.

    మొబైల్ ద్వారా ఒకరి నుండి ఒకరికి మనీ ట్రాన్సఫర్ చేయవచ్చును.

    స్మార్ట్ ఫోను ద్వారా వివిధ నెలవారీ బిల్లుల చెల్లింపులు చేయవచ్చును.

    ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
    ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు

    ఇంటర్నెట్ అన్నింటిలోనూ వేగం పెంచింది. వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ పనివేగం పెరగడానికి ఇంటర్నెట్ సాయపడుతుంది.

    వ్యక్తి జీవనంలో ఒక భాగంగా మారిన ఇంటర్నెట్ వలన ఉపయోగాలు అనేకంగా ఉన్నాయి. అలాగే నష్టం కూడా కొంత ఉందనే వాదన ఉంది.

    ఇంటర్నెట్ వలన వ్యక్తికి నష్టం కలిగే అవకాశాలు

    వ్యక్తిగత డేటా అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని వలప వ్యక్తిగత డేటా భద్రత విషయంలో గ్యారంటీ లేకపోవచ్చును.

    ఒక వ్యక్తి వ్యక్తిగత విషయాలు, ఆ వ్యక్తి అనుమతి లేకుండానే మరొకరికి తెలిసే అవకాశం ఉంది.

    వర్చువల్ మీటింగులకు అలవాటుపడితే, పర్సనల్ మీటింగులు తగ్గుతాయి… ఆప్యాయతలు కూడా కృత్రిమమైనవిగా మారే అవకాశం ఉంటుంది.

    ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ వ్యక్తిని తనచుట్టూ ఉండే ప్రపంచం నుండి మరొక ప్రపంచంలోకి వెళుతూ ఉంటుంది. ఇది అతి అయితే మనో రుగ్మతలు కలిగే అవకాశం ఉంటుంది.

    మానవ సంబంధాలు కృత్రిమమైనవిగా మారే అవకాశాలు ఇంటర్నెట్ పరికరాలు సృష్టించే అవకాశం ఎక్కువ.

    సమాజానికి వనరులు ఎంత అవసరమో, విలువలు అంతే అవసరం. సహజమైన బంధాలు మద్య సహజమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో కాఠిన్యత ఉండదు.

    కానీ కృత్రిమమైన బంధాలలో అప్యాయత కన్నా అవసరానికి ప్రధాన్యత పెరిగి కాఠిన్యతకు దారి తీస్తుంది.

    ఈరోజులో నెట్ అవసరం రోజు రోజుకు పెరుగుతుంది. అవసరాలు అలాగే ఏర్పడుతున్నాయి. ఇంటర్నెట్ లేకుండా రోజు గడవని స్థితికి కూడా సమాజం వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఎంత నెట్ అవసరం పెరుగుతుందో అంత ఒంటరితనం పెరిగే అవకాశం కూడా ఉంది.

    ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ సంతోషించే వ్యక్తి, తనపై ఇంటర్నెట్ ప్రభావం ఏవిధంగా ఉందో పరిశీలించుకోవడం వలప ఇంటర్నెట్ ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ మాయలో పడకుండా ఉండవచ్చును.

    ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

    నేటి నీ కృషి రేపటికి నీకు

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

    అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

    అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

    అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

    మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

    విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

    జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

    దానం గురించి దానం గొప్పతనం

    సన్మాన పత్రం ఇన్ తెలుగు

    వేచి ఉండడాన్ని నిర్వచించండి

    పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

    పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

    అవతారం అర్థం ఏమిటి తెలుగులో

    తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

    లీడర్ అంటే ఎలా ఉండాలి

    ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

    ప్రేరణ తెలుగు పదము అర్ధము

    గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

    నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

    కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు