Tag Archives: న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు? న్యూస్ అంటే వ్యూ ఆఫ్ ట్రూత్ అంటారు. కానీ చెప్పే విషయానికి హెడ్ లైన్ కాదు జరిగిన విషయానికి హెడ్ లైన్… వివరాలలో వ్యూస్ ఆప్ ట్రూత్ ఉండాలి. కానీ ఏదో ఆసక్తికరంగా టైటిల్ పెట్టేసి, న్యూసెన్స్ ను వ్యూస్ ఆఫ్ ట్రూత్ అన్నట్టుగా వ్రాస్తే, అటువంటి న్యూస్ వ్యూస్ తగ్గుతాయి. ఎందుకంటే ఎవరైనా ట్రూత్ తెలుసుకోవాలనుకుంటారు కానీ న్యూసెన్స్ కాదు.

ఇప్పుడు న్యూస్ వ్యూస్ తగ్గడం ఎందుకు?

గతంలో న్యూస్ వార్తాపత్రికలలో రోజుకొక్కసారి ఉదయం కనబడితే, రేడియోలో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రసారం జరిగితే, దూరదర్శన్ లో కూడా రోజు రాత్రి వేళల్లో న్యూస్ ప్రసారం జరిగేవి… ఆయా సమయాలలో న్యూస్ వినడానికి ఆసక్తి చూపేవారు. కానీ ఇప్పుడు న్యూస్ 24గంటలు ప్రసారం జరుగుతూనే ఉంటాయి. సంచలనం సృష్టించిన న్యూస్ అయితే, అదే న్యూస్ రోజంతా ప్రసారం. లేకపోతే వివిధ విశ్లేషణలు, వివిద రకాల కార్యక్రమములతో న్యూస్ ఉంటుంది.

న్యూస్ హెడ్ లైన్ ఆకట్టుకునే విధంగా, న్యూస్ డిటైల్స్ లో మాత్రం విషయసారం లేకపోవడం ఉంటే, అటువంటి న్యూస్ చదవడానికి వ్యూవర్స్ ఆసక్తి చూపరు. ఎందుకంటే హెడ్ లైన్ నమ్మశక్యంగా లేకుండా ఉండి, దాని డిటైల్స్ కూడా హెడ్ లైన్ లోని భావనను బలపరచకుండా ఉండడం వలన సహజంగానే అటువంటి న్యూస్ ఒక అబద్దపు న్యూస్ గా భావించే అవకాశం ఉంటుంది. అది కేవలం వ్యూవర్ ని ఆకట్టుకోడానికి చేసిన ప్రయత్నంగా న్యూస్ వ్యూవర్ కు అర్ధం అవుతుంది.

ఈ విధంగా న్యూస్ అంటే వార్తలు వాస్తవికతను వదిలి కేవలం ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే, వాటిని చదివేవారు కూడా మరలా అటువంటి వార్తలపై ఆసక్తి చూపరు.

మరొక ప్రధాన కారణం చేతను న్యూస్ వ్యూస్ తగ్గడం జరగవచ్చును.

అదేమిటంటే… మరలా మరలా ఒకే వార్తను చెప్పడం. చెప్పినదే చెప్పడం. చూపినదే చూపడం. వ్రాసినదే మరలా మార్చి వ్రాయడం…. జరగడం కూడా న్యూస్ వ్యూస్ తగ్గడానికి ప్రధాన కారణం అంటారు.

ఇంకా రాజకీయ ప్రసంగాలు కూడా న్యూస్ పై ప్రభావితం చేయగలవు.

అది ఎలా అంటే?

ఒక ఊరికి ఒక డమ్మీ పేరు పెట్టుకుందాం. అలాగే ఆ ఊరిలో ఒక డమ్మీ సమస్య గురించి, రాజకీయ ప్రకటనలు ఏ విధంగా కొనసాగితే, ఆ ఊరి ప్రజలకు ఆ ప్రసంగాలపై విశ్వాసం ఉండదో చూద్దాం….

ఒక ఊరికి ఒకపురం అని పేరు పెట్టుకుంటే, ఆ ఊరి సమస్య…. ఊరికి రోడ్డు లేదు. దీనిపై ఆ ఊరిలో వివిధ పార్టీల రాజకీయ ప్రసంగాలు ప్రగల్భాలుగా మారితే…

అయ్యా! ప్రజలారా.. గతంలో ఎందరో వచ్చారు. ఈ ఊరి కోసం ఏమి చేయలేదు. ఎవరు ఏమి చేయలేకపోయిన ఊరికి రోడ్డు సమస్యను నేను గెలవగానే తీర్చేస్తాను. ఇక ఒకపురం ఊరికి సిమెంటు రోడ్డు వస్తుంది. అది చెక్కు చెదరని రోడ్డు. వాన వచ్చినా కొట్టుకు పోనీ రోడ్డు…. అంటూ పలు మార్లు ఎన్నికల జరిగినా ప్రతిసారీ అదే ప్రసంగం ఉంటూ… ఊరికి రోడ్డు మాత్రం రాకపోతే…. ఆ ఊరి ప్రజలు విసిగి… ఆ రోడ్డు సమస్య గురించి మాట్లాడని వారుంటే, వారి మాటలు వినడానికి ఆసక్తి చూపుతారు. కానీ రోడ్డు గురించి మాట్లాడడం మొదలు పెట్టగానే… అవి బూటకపు మాటలుగా జమ కట్టే అవకాశం ఉంటుంది. అంటే ప్రజలకు వాస్తవాలు కావాలి. సమస్యలకు పరిష్కారం కావాలి. దానినే ప్రజలు గుర్తిస్తారు. ఇలా ఒకపురం రోడ్డు గురించిన న్యూస్ కు విలువ లేకుండా చేసినదెవరు?

బూటకపు మాటలు, పరిష్కారం లేని మాటలు, వక్రీకరించిన ప్రసంగాలు ఆకట్టుకునే విధంగా ఉండవచ్చును కానీ సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చలేవని అంటారు. న్యూస్ వాటిని ఫాలో అయినప్పుడు వ్యూవర్స్ న్యూస్ పై ఆసక్తి తగ్గుతుంది.

ప్రేరణ తెలుగు పదము అర్ధము

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

తెలుగు వ్యతిరేక పదాలు

ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్

తెలుగురీడ్స్.కమ్

తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు

ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా

telugureads

బాధ్యత అంటే ఏమిటి?

పద్దతి తెలుగు పదానికి పర్యాయపదాలు