Posted intelugulo vyasalu top-views
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది. పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది. భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం. వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి. సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది. ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో…