Tag: పల్లె గురించి తెలుగు వ్యాసం

  • అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

    అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం వ్రాయాలంటే, పల్లెటూరి వాతావరణం అనుభవించాలి. ఆ వాతావరణంలోని ప్రశాంతమైన స్థితిని ఆస్వాదించాలి. అప్పుడు వ్యాసం సహజంగా ఉంటుంది.

    పల్లెటూరు అంటేనే ప్రకృతి తన సహజత్వాన్ని కోల్పోకుండా, కుత్రిమత్వానికి దూరంగా ఉంటుంది. కాబట్టి పల్లెటూరి వాతావరణంలో మనిషి చుట్టూ ఆహ్లాదకరమైన స్థితి అలముకుంటుంది.

    భారతదేశంలో పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అని ప్రసిద్ది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో వ్యవసాయం సాగుతూ ఉంటుంది. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూరు ఏర్పడి ఉంటుంది. మనదేశంలో వ్యవసాయమే ప్రధాన రంగం.

    వ్యవసాయమే ప్రధాన రంగంగా ఉండే మనదేశంలో పల్లెటూళ్ళల్లో కొనసాగే సంప్రదాయాలు, ఆచారాలు ప్రక్రుతికి సహజత్వాన్ని పెంచేవిధంగా ఉంటాయి.

    సహజంగా తెల్లవారుజామునే నిద్రమేల్కొనాలంటే చాలామంది అలారంపై ఆధారపడతారు. కాని పల్లెటూళ్ళల్లో కోడికూత ఊరి మొత్తాన్ని మేల్కొల్పుతుంది. పట్టణాలలో ఉండే కృత్రిమమైన అలారం, పల్లెటూళ్ళలో కోడి రూపంలో సహజంగా ఉంటుంది.

    ఈ విధంగా మనిషి నిత్యకృత్యాలు పట్టణాలలో అయితే కృత్రిమంగా ఉంటే, పల్లెటూళ్ళల్లో సహజంగా ఏర్పడి ఉంటాయి.

    అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
    అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

    మనదేశంలో పల్లెటూరు అందంగా కనబడుతుంది. సూర్యోదయం పచ్చని పొలాల్లో నుండి పొడుచుకువస్తుంది. భానుడి కిరణాల వేడి పెరిగేకొలది చెట్లు చల్లదనం మనకు ఎంతో హాయిని అందిస్తాయి.

    గ్రామంలో ఉండే చెరువులు, ఆ చెరువుల చుట్టూ ఉండే గట్టు, గట్టుపై ఉండే చెట్లు, చెట్ల చాటున సాగే దాగుడుమూతల ఆటలు అవి మనిషి మరుపురాని స్మృతులుగా ఉంటాయని అంటారు.

    ప్రధానంగా పల్లెటూరు అంతా ఎక్కువగా చెట్లతో, మొక్కలతో నిండి ఉంటుంది. ఇంకా పల్లెటూళ్ళల్లో ఉండే ఇళ్ళు కూడా పూల మొక్కలతో, కాయగూరల పాదులతో చక్కగా ఉంటుంది.

    మనిషికి కావాల్సిన గాలి చాలా సహజంగా ఒక్క పల్లెటూళ్ళల్లోనే లభిస్తుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఉంటాయి. చెట్ల ద్వారా ఆక్షిజన్ పుష్కలంగా లభిస్తుంది.

    భూమి, గాలి, నీరు, నిప్పు పల్లెటూళ్ళల్లో సహజంగా ఉంటాయి.

    భూమి, గాలి, నీరు, నిప్పు ఎంత సహజంగా ఉంటే, ప్రకృతి అంట ప్రశాంతంగా ఉంటుంది. భూమిపై కొన్నాళ్లు ఉండి వెళ్ళిపోయే మనిషి ప్రకృతిపై చేసే మార్పులే మనిషికి భవిష్యత్తుగా మారతాయి.

    అలాంటి మనిషి కాపాడుకుంటున్న, కాపాడుకోవలసిన అంశాలలో పల్లెటూరి వాతావరణం, పశుసంరక్షణ ప్రధానమని పెద్దలు చెబుతారు. భూమి, గాలి, నీరు, నిప్పు వలననే మనిషి మనుగడ సాగుతుంది.

    స్వచ్చమైన గాలి మనసుపై మంచి ప్రభావం చూపుతుంది. భూమిలో నుండి వచ్చే ఆహార పదార్ధాలు స్వచ్చంగా ఉంటే, మనిషి పూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలడు. స్వచ్చమైన నీరు మానవ శరీరం పోషణలో కీలకంగా ఉంటుంది.

    అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

    ఈ విధంగా భూమి, గాలి, నీరు మనిషి ఆరోగ్యంపైన, మనసుపైనా కూడా ప్రభావం చూపుతాయని అంటారు.

    సహజమైన ప్రక్రుతి పల్లెటూరిలో మెరుగ్గా ఉంటుంది. అందమైన పల్లెటూరు గురించి ఎంత చెప్పిన తక్కువే, ఎంత అనుభపూర్వకంగా తెలుసుకుంటే, అంత ప్రయోజనం తెలుసుకున్న వారికి ఉంటుంది.

    పల్లె గురించి, పల్లె అందాల గురించి పల్లెటూరి కవితలు చెబుతాయి. గుడికి వెళ్లేముందు గుళ్ళో దేవుడి గురించి తెలుసుకుని వెళ్లినట్టు, పల్లెటూరికి వెళ్ళేముందు పల్లె గురించి తెలుసుకుంటే, ఆ వాతావరణం ఆస్వాదించగలం.

    అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం

    అందమైన పల్లెలో సహజమైన ప్రక్రుతి చాలా సహజంగా ఉంటుంది. అందమైన పల్లెటూళ్ళల్లో వ్యక్తి గ్రామ జీవితం శ్రమతో కూడినది అయినా సంతృప్తికరమైనదిగా ఉంటుందని అంటారు.

    ఒక వ్యక్తి కోడికూసే వేలకు నిద్రలేవడం పల్లెటూళ్ళల్లో ఉంటుంది. సూర్యోదయమునకు ముందే నిద్రలేవడం ఆరోగ్య లక్షణాలలో మొదటిదిగా చెబుతారు. అలా గ్రామంలో నివసించేవారు సహజంగా ఆరోగ్యలక్షణం పాటిస్తూ ఉంటారు.

    ఇంకా గ్రామాలలో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం ఉంటుంది.

    బంధువులు, భాందవ్యాలు బలంగా ఉండడంలో పల్లెటూరి ప్రశాంతత ప్రధానం అంటారు.

    పల్లెలో నివాసం అంటే ప్రశాంతమైన ప్రకృతిలో పడుకున్నట్టే….

    ఆసక్తిని బట్టి వార్తలు వస్తున్నాయా?

    నేటి నీ కృషి రేపటికి నీకు

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

    అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

    అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

    అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

    మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

    విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

    జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

    దానం గురించి దానం గొప్పతనం

    సన్మాన పత్రం ఇన్ తెలుగు

    వేచి ఉండడాన్ని నిర్వచించండి

    పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

    పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

    అవతారం అర్థం ఏమిటి తెలుగులో

    తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

    లీడర్ అంటే ఎలా ఉండాలి

    ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

    ప్రేరణ తెలుగు పదము అర్ధము

    గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

    నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

    కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు