సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! మనకు చాలా రకాల ఆలోచనలు వస్తాయి. చాలా అంశాలపై కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాటి అమలు చేయము. మనకు వచ్చిన ఆలోచనే ఇతరులు చేసి చూపించినప్పుడు మాత్రం, అయ్యో అది మనకొచ్చిన ఆలోచనే కదా! నేను చేయలేకపోయాను అనే భావన పొందుతాము. ఒక కొత్త ఆలోచన చేయడం మంచిదే, అది ఉపయోగపడేది అయితే, దానిని ఆచరించి చూడడం వలన ప్రయోజనం ఉంటుంది. కానీ కేవలం ఆలోచనలకే పరిమితమైతే సాధించగలిగేది ఏముంటది?
జీవితం ఎదుగుదల అంటే, సమాజంలో మంచి గుర్తింపు పొందడం అంటారు. ఇంకా సమాజంలో స్థాయి పెరగడం. కానీ అంతకుముందు మనల్ని మనం గుర్తించాలి. మనలో పుట్టిన, మన ఆలోచనను మనం పూర్తిగా నమ్మాలి. అలా మన ఆలోచనను మనం పూర్తిగా నమ్మి, ముందుకు సాగలనే నిర్ణయాన్ని సంకల్పం అంటారు.
మనలో పుట్టిన అనేక ఆలోచనలలో ఒక సరికొత్త ఆలోచన మన మనసులో నెగిటివ్ ని దాటి బయటికి రావడం ఒక ఎత్తయితే, అది అమలు చేయడంలో మనకు ఎదురయ్యే ఒత్తిడులను జయించడం మరొక ఎత్తు. ఒక్కసారి బయటికి వచ్చిన సంకల్పం, కొందరిచేత అవునని, మరికొందరి చేత కాదని ఊగిసలాటలో పడిపోతుంది. చిత్రమేమిటంటే, మన మనసులో ఊగిసలాట ఉన్నప్పుడూ మనమే దానికి బాద్యులం. అలాగే సంకల్పం బయటకు తెలిశాకా, దానిపై ఊగిసలాట అభిప్రాయాలకు మనమే బాద్యులం ఎందుకంటే సంకల్పం మనది కాబటి. కావునా సంకల్పం బలమైనదిగా ఉండాలి. అప్పుడే దానిని పూర్తిగా అమలు చేయగలం.
కనుక సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! ఉదాహరణ పవన్ కళ్యాణ్ పొలికటికల్ సక్సెస్.
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్రను పోషించారు. 2013లో చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసేసారు. కానీ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన తన సొంతపార్టీని స్థాపించారు. జనసేన పార్టీని పెట్టి, బేషరతుగా పోటీలో లేకుండా 2014 ఎన్నికలలో టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతు పలికారు. ఇక్కడ నుండే విమర్శలు ప్రారంభం అయ్యాయి… ఎందుకు పార్టీ పెట్టి, పోటీ చేయకుండా ఉండడం? పోటీ చేస్తేనే కదా పార్టీ ఉనికి చాటేది. ఏదైనా చేయడానికి బలం ఉండాలి కదా? బలం సంపాదించుకోకుండా, ఏదో తోక పార్టీలాగా మద్దతు పలకడం ఏమిటని? విమర్శించినవారు ఉన్నారు. అన్న పార్టీ పెట్టి ఎత్తేశాడు, ఇప్పుడు తమ్ముడు వంతు వచ్చింది అన్నవారు కూడా ఉన్నారు. విమర్శలు తాకిడి మొదలైందిక్కడ…
2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతు మరియు చంద్రబాబునాయుడుపై ప్రజలకు గల అభిప్రాయంతో పాటు, మోదీ హవా టిడిపి, బిజెపి, జనసేన కూటమి గెలిచింది. ఇక కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడలో పడి, కూటమి వేరు వేరుగా అయింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలయ్యాయి. అయినా ఇది బాబు – పవన్ డ్రామా, పవన్ కళ్యాణ్ దత్త పుత్రుడు అంటూ ప్రచారం మొదలైంది.
2019 ఎన్నికలు వచ్చాయి. జనసేన పార్టీ సొంతంగా 140 స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేశారు. 2019ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ పరాజయం, ఆ పార్టీ కేవలం ఒక్క స్థానమే గెలుచుకుంది. ఇక్కడే… ఇక్కడే పవన్ కళ్యాణ్ పట్టుదల, ఆయన సంకల్ప బలం ఎంతటిదో గ్రహించాలి. మాములుగా అయితే ఎవరైనా ఆ స్థాయిలో పరాజయం చూశాకా, ఆస్థాయిలో విమర్ళలు విన్నాక వెనకడుగు వేయకుండా ఉండలేరు. కనీసం ఆ ఆలోచన అయినా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా తాను రాజకీయాల నుండి తప్పుకునే పని చేయలేదు.
విమర్శకులు ప్రసంశలు పొందిన పవన్ కళ్యాణ్ సంకల్పం
2024 వరకు తన ప్రణాళికను ఎలా అమలు చేయాలో? అలా అమలు చేశారు. 2019 నుండి వైసిపి పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు, మీడియాలో 2019 నాటి పరాజయ జ్ఙాపకాలు, ఇంకా విమర్శకలు సలహాలు…. ఇలా ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా ట్రోల్స్….. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి, తన నిర్ణయం బయటికి చెప్పి, తన ప్రయత్నం ఎందుకోసమో చెప్పి, ప్రజలలో తన అభిప్రాయంపై నమ్మకం పెంచి, అన్ని పార్టీల కార్యకర్తలకు జోష్ అందించారు. 2019 నుండి 2024 వరకు ఒక యుద్ధానికి ప్రతక్ష్యంగానూ, పరోక్షంగానూ నాయకత్వం వహించారు. ఫలితాలు ఆశించినదానికంటే, ఊహించనివిధంగా వచ్చాయి. ప్రధానమంత్రి అంతటివారు పవన్ అంటే తుఫాన్ అనే స్థాయికి పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అందుకు ఆయన సంకల్ప బలమే ఆయనికి ఆయుధం, అదే ఎంతోమందికి ఆయుధమైంది.
సంకల్పం ఎంత బలంగా ఉంటే, అంతటి అద్భుత విజయం!
కావునా సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు! ముందుగా మనల్ని మనం గుర్తించాలి. మనలో వచ్చే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఉపయోగపడే ఆలోచనను గుర్తించాలి. సరికొత్త ఆలోచన అయితే, దానిని ఆచరిస్తే ఎలా ఉంటుందో పరిశీలన చేయాలి. పరిశీలన చేసి, ఒక నిర్ణయానికి రావాలి. నిర్ణయానికి వచ్చిన తర్వాత సంకల్పమే… కానీ అది బలంగా ఉండాలి. ఎంతలా అంటే, రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సంకల్పం ఎంతటి బలమైనదో అంతటి బలంగా ఉండాలి. అప్పుడే అద్భుతమైన విజయం, మనం మన చుట్టూ ఉన్నవారి ముందు హీరో ఉంటాం.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?