వివాహం జరిగిన తేదీన దంపతులకు తెలుగులో వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడానికి,
పెళ్ళిరోజు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుగు
పరిచయం అయ్యే ప్రతివారు ఏదో ఒక కారణంతో పరిచయం కాగలరు. కానీ అందరూ కోరుకునేది మాత్రం శాంతి. అటువంటి శాంతికి అలవాలం అయిన మిత్రమా నీకు
కలపడం వరకే మావంతు కలిసి ఉండడం మీవంతు… కలిసి జీవించే మీకు అండగా ఉండడం మావంతు అయితే మీరు మాత్రం వంతులు కోసం వాదులాడుకోకుండా చక్కగా కాపురం చేసుకోవాలి…
ఇరువురికి ఇష్టమైతే అది ఎంత కష్టమైనా భరించవచ్చును… ఎంత కాలమైనా కలిసి మెలిసి జీవితంచవచ్చును. మీ ఇరువురి ఇష్టానికి అప్పుడే సంవత్సరకాలం… అటువంటి మీ కాపురం కలకాలం పిల్లాపాపలతో కళకళలాడాలని ఆశిస్తూ…
బంధం బరువు అనుకునే రోజులలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడమంటే, మీరు మరొక జంటకు ఆదర్శమే అవుతారు.
ఇద్దరి మద్య బంధం బలపడిందంటే అది ఇద్దరి మద్య ఏర్పడిన అవగాహనే కారణం. అటువంటి అవగాహన మీకు జీవిత పర్యంతము కొనసాగాలని కోరుకుంటూ…
కాలం కట్టబెట్టే బంధానికి పెద్దల ఆశీర్వాదం తోడైతే, అది ఆదర్శంతమైన దాంపత్యానికి మార్గం అయితే, ఆ దాంపత్యంలో కష్టమైనా ఇష్టమే!
మీమద్య కష్టం కూడా కాలంతో బాటే కరిగిపోవాల్సిందేనని మీ దాంపత్య జీవితం తెలియజేస్తుంది. కలకాలం కలసి ఉండాలనే కాంక్షతో జీవిస్తున్న మీకు
ఒకరికొకరు అనుకుని బ్రతికేస్తూ ఉంటే సంవత్సరాలు కూడా రోజులులాగా గడిచిపోతాయని మీ ఇద్దరి బంధం నిరూపిస్తూ సంవత్సరం పూర్తయిన సందర్భంగా…
నీఇల్లు ఆనందానికి అడ్రస్, నీ మనసు మంచితనానికి మారుపేరు. నీ పెళ్ళిరోజు మాకు పండుగ మిత్రమా… నీకు
దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
మిత్రమా నీ ఆదర్శమునకు అనుకూలంగా నడుచుకునే జీవిత భాగస్వామి నీకు లభించినందుకు మిక్కిలి సంతోషిస్తూ… మొదటి వివాహావార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా
మీ కొత్త కాపురానికి ఏడాది కాలం అయితే మా ఆనందానికి మరింత ఆనందకరం మీ ఇద్దరి అనోన్యత…
నమ్మిస్తూ బ్రతకడం కన్నా నమ్మకంతో బ్రతకం వలస జీవనం సాఫీగా సాగుతుందని మీ జంట వలన తెలియబడుతుంది. మీకు…
వస్తువుని పరీక్షించి చూస్తాము… బంధాన్ని అవగాహన ఏర్పరచుకుని ముందుకు సాగుతాము… మీ ఇరువురిలో మీపై మీకుండే అవగాహన అందరికీ ఆదర్శం…
ఆకర్షణలో కలిసి ఉండడం కన్నా కష్టం వచ్చినప్పుడు కలిసి ఎదుర్కోవడం వలన బంధం మరింత బలపడుతుందని నిరూపించిన మీ జంటకు….
కాలక్షేపం కోసం కబుర్లాడే కొందరు సృష్టించే కలహాలు కాపురాలను కూలదోస్తాయి… కాబట్టి మీరు అలాంటి వారి మాటలను ప్రక్కన పెట్టి మీరు ఇరువురు కలకాలం కలిసి ఉండేవిధంగా ఒక అవగాహనతో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ…
నాకెందుకులే అని పట్టించుకోని స్వభావమే బంధాన్ని బలహీనపరుస్తుంది. అటువంటే తలంపే లేని మీ సంసారం ఆదర్శవంతం.
చూడడానికి జంట ముచ్చటగా ఉంటే చూడచక్కని జంట… ప్రవర్తన కూడా మరొక జంట అనుసరించే విధంగా అది ఆదర్శప్రాయమైన దాంపత్యం…
కారణంలేకుండా కొట్టుకుని విడిపోయే జంటలను కూడా చూస్తున్నాం…అలాంటి వారి దృష్టి మీపై పడకుండా ఉండాలని కోరుకుంటూ… మీరు కలకాలం కలిసి ఉండాలని ఆశిస్తూ
చూడడానికి చూడముచ్చటైన జంట, మీ అనుబంధమే మీ అసలైన ఆనందానికి కారణం, మీ శ్రేయస్సును కాంక్షించే మాకు పరమానందభరితం. మీకు…
అర్ధం చేసుకునే ప్రయత్నం చేసేకొద్ది బంధం బలపడుతుంది. అపార్ధం అధికమయ్యేకొద్ది, బంధం బలహీనపడుతుంది. అపార్ధాలకు తావులేని మీ దాంపత్యం అందరికీ ఆదర్శంతం.
పరిచయం లేని స్త్రీపురుషులను చూసి ఒక్కటిగా బ్రతికేస్తారని భావించి మిమ్మల్ని కలిపిన మీ పెద్దల నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుతూ ఉండే మీ జంట అన్యోన్యత మార్గదర్శకం! మీకు…