Telugu Bhāṣā Saurabhālu

Tag: పోతనామాత్యులుగా

  • బమ్మెర పోతన గురించి రాయండి

    తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్….” “ఇందు గలఁ డందు లేఁ డనిసందేహము…

    Read all

Go to top