Tag Archives: ప్రాచీన ప్రజలు

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా?

ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ఇది ప్రశ్నా లేకా యాధాలాపంగా పుట్టిన మాటా? మనం ఆకాశంలో ఎగిరే విమానాలలో ప్రయాణం చేస్తాం. నేలపై వివిధ వాహనాల ద్వారా వివిధ సుదూర ప్రాంతాలకు సైతం సులభంగా ప్రయాణం చేస్తాం. ఇంకా…

లోకంలో ఏమూల ఏం జరిగినా గోడకు తగిలించిన టివిలోనో…. చేతిలో ఉండే సెల్ ఫోనులోనో వీక్షించేస్తాము. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువును ఆర్డర్ చేయగలం. ఇంకా…. తినాలకున్న తినుబండారం బయటి నుండి ఇంటికి రప్పించుకోగలం… అర్ధబలం ఉండాలే కానీ భూతల స్వర్గముగా భూమిపై జీవించగలం. ఇలా ఇప్పటి స్థితి ఉంటే, ఈ ప్రస్తుత ప్రపంచం ప్రాచీన ప్రజలకు ఎలా తెలియబడుతుంది?

మన చేతిలో ఉండే ఫోనులో ఇష్టమైనవి చూడగలం. ఇష్టమైనవి వినగలం. ఇష్టమైనవి రప్పించుకోగలం. మన ఇంట ఉండే వస్తువులతో అనేక పనులను సులభంగా చేయగలం. చేయించగలం. ఆఫీసులో ఉండే వస్తుసంపదతో పనులను చేయించగలం. ఇలా ఎక్కడ చూసిన వస్తువు ఆధారం ప్రస్తుత జీవనం కొనసాగుతుంటే, దానికి తోడు సాంకేతికత కూడా వచ్చి చేరింది.

మరి ఇలాటి ఈ ప్రపంచం గురించి మన ముందు ఎప్పుడో జీవించినవారికి ఎలా తెలియబడుతుంది. ప్రాచీన ప్రజలు ప్రస్తుతం మనకు తెలిసిన ప్రపంచం మొత్తం తెలుసా? ప్రశ్నేగా అనిపించడం లేదు. ఈ ప్రశ్నకు బదులేది?