Tag Archives: బ్యాంక్ ఖాతా లింక్

అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి

అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఎలా? అమ్మ ఒడి అర్హులైనవారికి మాత్రమే అంటున్నారు. 2020, 2021లో జనవరి నెలలో అమ్మఒడి (Amma Vodi) పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం 2022లో మాత్రం కొన్ని నియమాలు చేర్చింది. ఇంకా జూన్ నెలకు అమ్మ ఒడి పధకం అమలు చేయలని భావించారు.

విద్యార్ధి హాజరు శాతం బాగుండాలి. నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ వినియోగం దాటరాదు. ఇంకా విద్యార్ధి యొక్క తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం అయి ఉండాలి. తమ పిల్లలకు ఇకెవైసి జరిగి ఉండాలి. లేకపోతే వాలంటీర్ ద్వారా ఇకెవైసిని చేయించుకోవాలి. తల్లి బ్యాంక్ ఖాతాలో మినిమమ్ ఎమౌంట్ ఉండి, ఆ బ్యాంక్ ఖాతా చలామణిలో ఉండాలి. అదే బ్యాంక్ ఖాతా పిల్లవాని స్కూల్ రికార్డులలో అంటే స్కూల్ తరపున ఆన్ లైన్లో రిజిష్టర్ అయి ఉండాలి. స్కూల్ ఆన్ లైన్ వెబ్ సైటులో పిల్లవాని వివరాలు సరిగ్గా ఉండాలి.

మదర్ ఆధార్ లో ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి.

ఈ పై బటన్ పై క్లిక్ చేయండి. ఆధార్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

అక్కడ విద్యార్ధి / విద్యార్ధిని యొక్క మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. తల్లి ఆధార్ కార్డులో నమోదు అయి ఉన్న మొబైల్ నెంబరుకు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేయగానే తల్లి ఆధార్ కార్డుకు జోడించబడి ఉన్న బ్యాంకు పేరు మీకు కనబడుతుంది. అదే బ్యాంక్ ఖాతా స్టూడెంట్ ఇన్ పో లో స్కూల్ యాజమాన్యం సాయంతో అప్డేట్ చేయించుకుని ఉండాలి.

అమ్మ ఒడి అర్హుల జాబితా

ఇప్పటికే అమ్మ ఒడి అర్హుల జాబితా ప్రకటించబడింది. అమ్మఒడి అర్హుల జాబితా లిస్టు కొరకు ఈ క్రింది బటన్ క్లిక్ చేయండి. అమ్మ ఒడి పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలోకి అమ్మ ఒడి పధకం అర్హుల జాబితాలో పేరు సరిచూసుకోవాలి. అందులో పేరు ఉండడమే కాకుండా బ్యాంక్ ఖాతా ఆధార్ కు అనుసంధానం అయి ఏక్టివ్ లో ఉందో ఇన్ ఏక్టివ్ లో ఉంది సరిచూసుకోవాలి. ఇన్ ఏక్టివ్ లో ఉంటే, బ్యాంకులో ఆధార్ అనుసంధానం చేసుకోవాలి.

telugureads

teluguvyasalu

blog