Tag Archives: భక్తిక్విజ్

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే

నిర్మల భక్తి అంటే ఏమిటి అంటే నిర్మల మనసుతో భగవంతుడిని చేరడానికి చేసే ప్రయత్నం అంటారు.

అసలు నిర్మల అంటే మాలిన్యం లేనిది అయితే నిర్మల మనసు అంటే మనసులో మలినం లేకుండా ఉండడం.

మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే, అందులో ఉన్న మలినం, అందులో ఉండే మంచి గుణాలు తెలియబడతాయని అంటారు.

అంతేకానీ ప్రశాంతత లేని మనసులో తన గురించిన ఆలోచన కన్నా ఇతర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.

స్వీయ పరిశీలన వలన మనసు శాంతితో ఉండవచ్చు అంతే, స్వీయ పరిశీలనకు కూడా ఆలంబన భక్తి అంటారు.

ఎందుకంటే ముందు మనసు లోకంలో ఉండే విషయాల గురించి ఆలోచన చేయడం భాగా అలవాటు అయ్యి, అటువంటి ఆలోచనలతో స్వీయ పరిశీలనకు ఆస్కారం లేకుండా చేసుకుంటుంది.

బహుశా అందుకేనోమో భగవానుడు వివిధ రూపాలలో అవతరించి లోకరీతిలో భక్తుడి మనసులోకి వెళ్ళేవిధంగా కనబడతాడేమో?

మనసు ముందుగా తనపై తన పరిశీలన చేయడానికి అంగీకరించదు… కాబట్టి ఒక జడ్జి మనసులోకి రావాలి. ఆత్మ స్వరూపుడైన ఈశ్వరుని మనసులో జడ్జిగా నియమించుకుంటే, స్వీయ పరిశీలనకు మనసుకు మార్గం లభిస్తుందని అంటారు.

భగవంతుడు ముందు మనసులోకి వచ్చాడనే ఎరుకను మనసు కలిగి ఉంటే, తన లోపల ఒకరికి జవాబుదారీ అనే ఆలోచన మనసు చేయగలదు.

కానీ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు… ఇప్పుడు అది కాదు ముఖ్యం అనుకుంటే, భగవంతుడు లోపలే ఉన్నాడనే ఎరుక మనసు కలిగి ఉండదు.

ఒకసారి భగవంతుడు మనసులోనే ఉన్నాడు. మనసుకు ఆధారమైన అత్మే భగవానుడు… అని గ్రహిస్తే, మనసు తాను చేస్తున్న కర్మలలో విచక్షణ కోల్పోదు అని అంటారు.

చేస్తున్న కర్మలకు ఒకడు అధికారి లోపాలే ఉన్నాడనే భావన, మనసుని తప్పు చేయనివ్వదని అంటారు.

అలా జడ్జిగా మనసులో ఉన్న భగవానుడు, మనసుని శుద్ది చేయడం మొదలైతే చిత్తశుద్ది ఏర్పడి, మనసు నిర్మలం కావడానికి కారణం కాగలదని అంటారు.

నిర్మల భక్తి అంతే ఏమిటో అని ఆలోచన చేస్తూ, కాలం వృధా చేయడం కంటే, ఆత్మస్వరూపుడైన భగవానుడిని ఇష్టదేవత రూపంలో నిత్యస్మరణ శ్రేయష్కారం అంటారు.

మనసు శాంతిగా ఆలోచన చేయడానికి అలవాటుపడితే, ప్రశాంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటారు.

ప్రశాంతమైన ఆలోచనలు కలిగిన మనసు నిర్మల మనస్తత్వంతో మనగలగుతుంది. ప్రశాంతమైన ఆలోచన పరమాత్మ స్వరూపం గురించిన ఆలోచన మనసుతోనే ఉంటుందని అంటారు..

ఏది ఏమిటి అను తెలుసుకునే ఆలోచన సందేహాలకు తావు ఇస్తూ ఉంటే, ఒక్కడు ఉన్నాడు. వాడు అధికారి అనే ఆలోచన మనసును సరి అయిన దారిలో పెట్టవచ్చని అంటారు.

తెలుగు భక్తి