Tag Archives: భక్తి తెలుగు పుస్తకాలు

భక్తి తెలుగు పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో

భక్తి పుస్తకాలు చదవడం మనసులో భక్తి భావన ఎక్కువగా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణకు భక్తులను చెబుతారు. మనసులో దేవుడి గురించిన ఆలోచనలు పెరగడం వలన మనసులో భక్తి బలపడుతుంది. మనకు భక్తి ఆలోచనలు పెరగడం కోసం భగవంతుడి గురించిన మంచి మాటలు వినడం, మంచి పుస్తకాలు చదవడం లేదా భక్తి సినిమాలు చూడడం చేయగలం. భక్తి పుస్తకాలు మనలో భక్తి బలపరచగలవు. ఎందుకంటే పుస్తకాలు చదువుతూ ఉండడం చేత, మన మనసులో ఊహాత్మక శక్తి ఏర్పడుతూ ఉంటే, భక్తి పరమైన పుస్తకాలు, భక్తి పరమైన ఊహ ఉంటుందని అంటారు.

రాముడి గురించిన భక్తి పుస్తకాలు చదవడం వలన సీతారాముల ప్రతిరూపం మన మనసులో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. మన ఊహలలో సీతారాములు, ఆంజనేయుడు, లక్ష్మణుడు తదితర రూపాలు మెదులుతూ ఉంటాయి.

అలాగే శ్రీకృష్ణుడి గురించిన భక్తి పుస్తకాలు చదివితే, శ్రీకృష్ణుడి లీలలే మనసులో మెదులుతాయి. ఈ విధంగా భక్తిని పెంపొందించుకోవడంలో భక్తి పుస్తకాలు మనకు సాయపడతాయని అంటారు. వివిధ తెలుగు భక్తి పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో మీ ఫోనులోనే చదవడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

తెలుగురీడ్స్