గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు.
చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు.
చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం కావచ్చును. అప్పటికాలం ఆనాటికి ప్రస్తుతం అయితే ఆ ప్రస్తుతం గురించి పుస్తకం అయ్యిందంటే, అది భవిష్యత్తుకు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉందని గ్రహించేదెవరు? అప్పటికీ ఆ ప్రస్తుతం పుస్తకంగా మార్చాలనే తలంపు వచ్చిన వ్యక్తికి భవిష్యత్తు దర్శనం ఎలా? అంటే వారు ఏదో వ్రాసుకోవడం కోసం వ్రాసినవేనా?
మొన్నటి నైపుణ్యం నేటికి మరింతగా మెరుగవ్వాలి. అయితే గతంలో వ్రాయబడిన చరిత్ర, ఇప్పటికీ మనకు ఉపయోగంగా ఎలా ఉంటుంది? అంటే అంటారు పండితులు గతమెప్పుడూ వర్తమానం కన్నా కఠినంగానే ఉండి ఉంటుంది. అటువంటి కఠిన పరిస్థితులు తెలసుకోవడవం వలన వర్తమానం మనకు మేలుగానే ఉందనే భావన మనసుకు ఊరటనిచ్చే అంశంగా చెబుతారు.
గతంలోని కష్టకాలంలో వారు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితలు, వర్తమానంలో ప్రస్తుత కష్టకాలం మనిషి మనసు పోల్చి చూసుకుని, గతంలో తమ కంటే తమ పూర్వులు మరింత కష్టం అనుభవించారు. అంటే వర్తమానం మనకు గతంకంటే మేలుగానే ఉంది. ఇది కష్టకాలంలో మనసు పొందే భావన అంటారు.
గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా ఉంటుంది.
ఉదాహరణ: మహాభారతంలో రాజ్యం కోల్పోయి, వనవాసం చేస్తున్న పాండవులకు ఏర్పడిన కష్టకాలంలో ధర్మరాజు… తమకన్నా అధికమైన కష్టం గతంలో ఎవరూ అనుభవించి ఉండరనే భావనను పొందుతాడు. కానీ ధర్మరాజుగారికి నలదమయంతిల వృత్తాంతం వినేటప్పటికీ తమకష్టం వారి కష్టం కన్నా మేలైన పరిస్థితిలోనే ఉందనే భావన కలుగుతుంది. ఇంకా నలదమయంతిల వృత్తాంతం వినడంతో విజయానికి మేలైన మార్గం ఏర్పడుతుంది. ఇలా గొప్పవారి గతం వర్తమానంలో మనిషికి మార్గదర్శకంగా మారగలదని అంటారు.
గత చరిత్ర వర్తమానానికి ఒక సూచనను తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వర్తమాన పరిస్థితులకు గతం కారణం అయ్యి ఉంటుందని అంటారు. కాలం సృష్టించిన భారీ మార్పులు చరిత్రగా వర్తమానానికి అందుతూనే ఉంటాయి. అవి భవిష్యత్తు ఆలోచనకు వర్తమానంలో మనకు మార్గదర్శకంగా మారతాయని అంటారు.
ప్రపంచం కరోనా వైరస్ వలన కష్టకాలంలో ఉంది
ప్రస్తుతంలో పరిస్థితులు కఠినంగా మారుతున్నప్పుడు సమాజంలో గతాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చింది. అనగానే గతంలో ప్రపంచాన్ని కుదిపిన అంటువ్యాధుల గురించి మీడియా ప్రస్తావించింది. కారణం మానవాళికి కఠినమైన కాలం ఎదుర్కొనడం సవాలే, కానీ ఎదుర్కొని పోరాడిన ఘనతే మనదే అనే భావనా బలం మనకు కలిగిస్తుంది.
ప్రపంచం కరోనా వైరస్ వలన కష్టకాలంలో ఉంది. అన్ని దేశాలకు పెద్దన్నలాగా ఉండే అమెరికా, కరోనా వైరస్ కాటు కూడా బలంగానే ఉంది. ఎక్కువ పాజిటివ్ కేసులు అక్కడే, ఎక్కువ కరోనా కాటుకు బలైనవారు అక్కడే… అన్నింటిలో జాగ్రత్తగా ఉండే అమెరికా కరోనా వైరస్ కట్టడిలో వెనుకబడ్డట్టే చాలామంది భావిస్తారు.
రెండు మిలియన్ కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా ఉంటే, మరణాలు ఒక లక్షా ముప్ఫై వేలు దాటింది. కరోనా కాటు బలంగానే ప్రపంచంపై పడింది. ఇంత గడ్డుకాలం గతంలో కానవచ్చినట్టుగా మనకు కనబడటం లేదు. కోవిడ్-19 కరోనా కాటు ప్రపంచంలో ఒక గీటురాయిగా మారుతుంది. కరోనా వైరస్ ముందు, కరోనా వైరస్ తర్వాత చరిత్ర అంటూ వర్తమానం చరిత్రగా మారనుంది.
కరోనా వైరస్ తెచ్చిన కష్టం మనకు గతంలో కనబడలేదు… కానీ మనకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే తోటివారి కష్టం మనకన్నా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు మనకు ఫరవాలేదనే ఊరట పొందే అవకాశం ఉంటుంది. అమెరికా, ఇటలీ, స్పైయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, ఇరాన్, టర్కీ లాంటి దేశాలతో పోల్చి చూస్తే, ప్రస్తుతానికి మనం బెటరుగానే ఉన్నాం.
వర్తమానంలో తోటివారు ద్వారా మనకు తెలియవచ్చేది… ఏమిటి? అంటే నిర్లక్ష్యం – జాగ్రత్త… ఈ రెండు ప్రమాదాన్ని పెంచడం, తగ్గించడం చేస్తాయి. ఇటలీ, అమెరికా నిర్లక్ష్యం వలన భారీ మూల్యం చెల్లిస్తే, దక్షిణ కొరియా తదితర ఇతర దేశాల జాగ్రత్తలు ప్రపంచానికి ముందు జాగ్రత్త ఫలితం కనబడుతుంది. నిర్లక్ష్యం భారీ మూల్యం నిర్లక్ష్యం వహించినవారి కన్నా వారిని నమ్ముకున్నవారికే అధికంగా ఉంటుంది.
పోరాడి గెలిచినవారిని సమాజం చరిత్రగా గుర్తు పెట్టుకుంటుంది
భవిష్యత్తు వర్తమానంలో మనం తీసుకునే జాగ్రత్తలు, వర్తమానంలో మనం పోరాడిన తీరు భవిష్యత్తులో మార్గదర్శకంగా మారుతుంది. పోరాడేవారికి పోరాటం చేస్తూనే ఉంటారు. పోరాడి గెలిచినవారిని సమాజం చరిత్రగా గుర్తు పెట్టుకుంటుంది. వర్తమానంలో కష్టపడ్డ కష్టమే భవిష్యత్తుకు బాట అవుతందని అంటారు.
వర్తమానంలో పోరాటం చేయడంలో మనకు సాధానాలను సరిగ్గా ఉపయోగించడమే యోధుల చేసే యుద్ధం అంటారు. అయితే ఇప్పుడు జనులే యోధులు, సమాజంలో ఇల్లే యుద్దక్షేత్రం. సామాజిక దూరమే జనుల ఆయుధం… సామాజికదూరమనే అయుధం ఉపయోగించడమే మన ముందున్న ఏకైక లక్ష్యం. సామాజిక దూరం ఎక్కువగా ఉండడం కోసమే లాక్ డౌన్ ప్రభుత్వాలు విధించారు. కారణం కరోనా వైరస్ కు మందు కనిపెట్టబడలేదు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో ప్రతివ్యక్తి బాధ్యత ఉంటుంది. మనం సమాజంలో ఉంటున్న, ఎందరో కృషి సమాజంలో ఎన్నో రకాల సౌకర్యాలు మనం అనుభవించడానికి దోహదం అయ్యిందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మనం చేసే పోరాటం సమాజానికి అవసరం. ఇంట్లో ఉండడమే, సామాజిక దూరం పాటించడమే మనం చేసే పోరాటం… అదే మన ప్రస్తుత సామాజిక సేవ.
గత కాలపు మూలాలు మనపై ఏదో విధంగా ప్రభావం చూపుతూ వర్తమానంలో మనపై ఉంటుందని అంటారు. అయితే ఆ మూలాలు తెలుసుకోవడం కన్నా ఎదురవుతున్న పరిస్థితులలో పోరాడడమే మన కర్తవ్యం అవుతుందని అంటారు. కరోనా వైరస్ జీవం పోసుకోవడానికి ప్రస్తుతానికి ముందు ఎవరో కారణం అయ్యి ఉంటారు. వ్యాప్తికి ఎవరి నిర్లక్ష్యమో కారణం అయ్యి ఉంటుంది. అయితే వారిని కాలం చెబుతుంది.
బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం తెలియబడుతుంది. గమ్యం తెలియబడుతుంది. తెలుగుబుక్స్ మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. కష్టకాలంలో బుక్ రీడింగ్ ప్రస్తుతం నుండి మనసుకు కొంతసేపు దూరం చేయగలవు అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో