మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చాలా అవసరం. మన పుట్టుక ఏమో కానీ మన బ్రతుకు మనకు తెలిసే ఉంటుంది. మన పుట్టుకకు మనకు కారణం తెలియకపోవచ్చును కానీ మన ఎదుగుదల మన ఆలోచనలకు అనుగుణంగా సాగుతుంటే, మన బ్రతుకుతున్న విధానం మనకు తెలిసే ఉంటుంది. ఊహ తెలియని బాల్యంలో అందరి సంరక్షణలో మంచి విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటాము. అలాంటి బాల్యదశలో విన్న మంచి విషయాలపై ఆలోచనలు పెంచుకుంటే, మంచి మనిషిగా ఎదుగుదల ఉంటుందని అంటారు.
తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, తోటివారు అలా మన చుట్టూ అలుముకుని ఉన్న బంధాలు మంచి చెడులను పరిచయం చేస్తూ ఉంటారు. వారిలో మన శ్రేయోభిలాషులే ఎక్కువగా ఉంటారు. ప్రతి చెడు విషయాన్ని ఖండిస్తూ, మంచి విషయాలపై మన మనసు మళ్చించుకునే విధంగా మాటలు చెబుతూ ఉంటారు. విన్నవారు మంచి గుణములను పుణికి పుచ్చుకునే అవకాశం ఉంటుంది.
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన అవసరం
అన్ని మొక్కలకు మూలం మట్టే, కానీ ప్రతి మొక్కకు దేనికదే ప్రత్యేకం. అయితే మొక్క తన ప్రభావం చూపించడానికి అది చెట్టుగా మారాలి. అప్పుడే అది అందరికీ తన ప్రభావం చూపగలదు. వృక్షంగా మారిన మర్రిచెట్టు నీడగా ఉండగలదు. పెద్ద చెట్టుగా మారిని మామిడి మొక్క, మామిడి పండ్లు అందిస్తుంది. అలా ప్రతి వ్యక్తి ఉండే తమ స్వీయ ప్రతిభను తమ చుట్టూ ఉండే పరిస్థితులలో ప్రతిబింబించే విధంగా జీవించాలంటే, ముందుగా అనేక విషయాలలో మనసు నియంత్రణగా ఉంటూ, తమ స్వీయ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవాలి. అప్పుడే బాగా పెరిగిన వృక్షం వలె, ఫలాలను తోటివారికి అందించగలం.
అలా ఒక విద్యార్ధిని మంచి ఫలాలను అందించే ఒక వృక్షంలాగా మార్చే ప్రయత్నం విద్యార్ధి చుట్టూ ఉండే సంరక్షకులు, శిక్షకులు చేస్తూ ఉంటారు. అయితే మహావృక్షం వలె మారి ఏళ్ళ తరబడి నీడనిచ్చే భారీ వృక్షంగా మారాలంటే మాత్రం విద్యార్ధి స్వీయ సంకల్పం, స్వీయ సాధన, పట్టుదల చాలా ప్రధానం.

తామరపువు బురదలో పడుతుంది. కానీ వికసించిన పద్మము మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే మనం ఎక్కడ పుట్టామో అనే దాని కన్నా మనలో ఉన్న చైతన్యము. మనలో ఉన్న ప్రతిభకు గుర్తింపు తెచ్చుకునే విధంగా సాధన చేయాలి. వికసించిన తామరపువ్వు అందంగా కనబడినట్టే, సాధన చేసిన స్వీయ ప్రతిభ కూడా అందరి దృష్టిలో ప్రత్యేకంగా నిలబడుతుంది.
మన టాలెంటును ముందుగా మనం గుర్తించాలి
మనలో ఉన్న ప్రతిభను ముందుగా మనం గుర్తించకపోతే, అది మనకు నష్టమే. బాల్యంలోనే మనలోని ప్రతిభ మనకు తెలిస్తే, దానిపై పట్టు సాధించుకుని, విశేష సాధన చేత మరింతగా ప్రతిభను మెరుగుపరచుకోవచ్చును. అది యవ్వనంలో మరింతగా ఉపయోగపడుతుంది.
ఒకరికి చక్కగా పాడే గొంతు ఉంటుంది. ఒక్కరికి చక్కగా నర్తించే శక్తి ఉంటుంది. ఒక్కొక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కరికి శోధించే ఆలోచనాతీరు ఉంటుంది. ఒక్కొక్కరికి పనితీరుని ఇట్టే పట్టుకునే శక్తి ఉంటుంది. ఒక్కొక్కరికి సామాజిక స్పృహ బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక రంగంలో కానీ ఏదొ ఒక అంశంలో కానీ ప్రతి వ్యక్తి స్వీయ ప్రతిభ ఉంటుంది.
సొంత టాలెంటును మరింతగా పెంచుకుంటే, మంచి ఫలితాలను పొందవచ్చును.
ఎందుకు సొంత టాలెంటును పెంచుకోవాలి?
మనకు చూసి నేర్చుకుంటూ, పనిచేయగలిగే శక్తి ఉంటుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం ఆ శక్తి మరింత మెరుగ్గా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులోనైనా ఆ విషయాలలో మన మనసు స్థిరంగా నిలబడగలదు. అలా ఎలాంటి స్థితిలోనైన మన మనసు స్థిరంగా పని చేయగలుగుతుందో, ఆ పనికి సంబంధించిన మూల విషయంలో మనకు సొంతటాలెంటు ఉంటుందని అంటారు.
కొందరికి మల్టీ టాలెంటు ఉంటుంది. కొందరికి ఏదో ఒక విషయంలో మాత్రమే టాలెంటు ఉంటుంది. కానీ సాధన చేయడం ద్వారా మన టాలెంటుని మెరుగుపరుచుకుంటూ, ఇతర విషయాలలో కూడా ప్రతిభను పెంచుకోవచ్చు అంటారు.
స్వీయప్రతిభకు మెరుగుపరచుకోవడానికి అనుషంగిక సాధనములు ప్రధానం
మనలోని స్వీయప్రతిభకు మనకు అందుబాటులో ఉండే సాధనాలు చేతన సాధన చేయడం వలన మన ప్రతిభ మెరుగుపడుతుంది. మన ప్రతిభకు తోడుగా అనుషంగిక విషయాలలో కూడా ప్రతిభ ఉండడానికి సాధనములు ఉపయోగపడతాయి. ఒక వ్యక్తికి చక్కటి చేతివ్రాత ఉంది. కేవలం చేతివ్రాత చక్కగా ఉంటే సరిపోదు.
చేతివ్రాతతో బాటు, ఎక్కౌంటింగ్ నాలెడ్జ్ కూడా ఉంటే, రెండు విషయాలు అతనికి బాగా ఉపయోగపడతాయి. కృష్టి చేస్తే ఎక్కౌంటింగ్ రంగంలో అతను ఒక పుస్తకం వ్రాసే శక్తిని పెంచుకోవచ్చును.
ఒక్కరికి టైపింగ్ వచ్చు కానీ అతనికి ఏ విషయంలో టైపింగ్ చేయాలి? తెలియదు. కావునా అతను కేవలం ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే పని చేయగలడు. అదే బాగా టైపింగ్ చేయగలిగిన వ్యక్తికి, ఒక వెబ్ సైట్ తయారు చేసే, కోడింగ్ తెలిసి ఉంటే, అతను ఒక వెబ్ సైటుని తయారు చేయగలడు. ఒక వెబ్ సైటులో కంటెంటుని సృష్టించగలడు.
బాగా డ్రైవింగ్ తెలిసిన వ్యక్తికి ఇతర భాషలలోనూ పట్టు ఉంటే, అతను దేశంలో ఎక్కడైనా డ్రైవింగ్ చేయగలడు. అలాగే అనేక విశేషాలను చూడగలడు. జీవితాన్ని ఒక మంచి అనుభవంగా మార్చుకోగలడు.
సాఫ్ట్ వేర్ తయారు చేయగలిగే శక్తి ఉన్న వ్యక్తికి, సమాజంపై అవగాహన లేకపోతే, అతని శక్తి కేవలం ఒక యజమాని వద్ద ముగిసిపోతుంది. అదే సాఫ్ట్ వేర్ ఇంజనీరుకి సమాజంపై మంచి అవగాహన ఉంటే, అతను సమాజానికి ఉపయోగపడే కొత్త సాఫ్ట్ వేర్ సృష్టించే అవకాశం ఉండవచ్చును. కావున స్వీయప్రతిభకు మెరుగుపరచుకోవడానికి అనుషంగిక సాధనములు ప్రధానం అంటారు.
తెలుగులో అనేక విషయాలపై అవగాహన ఉండి, సామాజిక స్పృహ బాగా ఉన్నవ్యక్తికి సామాజిక విషయాలపై విశ్లేషణాత్మక తెలుగు వ్యాసాలు వ్రాయగలడు.
మన సొంత టాలెంటు మెరుగుపరచుకోవడానికి పరికరాలు ప్రధానం.
కోడింగ్ బాగా వ్రాయగలిగే వ్యక్తికి కంప్యూటర్ అందుబాటులో లేకపోతే, అతను కేవలం ఒక డవలపర్ గా ఉండే అవకాశం ఉంటుంది. కేవలం పనిచేసే చోట మాత్రమే కంప్యూటర్ అందుబాటులోఉంటే, అతను ఒక సాఫ్ట్ వేర్ గా మాత్రమే ఉండగలడు. అదే అతనికి కంప్యూటర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటే, అతను తన సొంత ఆలోచనకు అనుగుణంగా ఒక సామాజిక ప్రయోజనం నెరవేర్చగలిగే కంప్యూటర్ ప్రోగామ్ ని సృష్టించే అవకాశం ఉంటుంది.
సొంత టాలెంటు మరియు దానికి ఉపయోగపడే మరికొన్ని విషయాలలో టాలెంటు మెరుగుపరచుకోవడానికి పరికరాలు కూడా ప్రధానం. శరీరమే సాధన అయితే, శరీరంతో సాధన చేయడానికి కూడా కొన్ని ఉపకరణాలు అవసరం అవుతాయి.
చక్కగా పాడే శక్తి ఉన్నవారికి, వారి గొంతు వారికి ఉపకరణం అయితే, బాహ్య వస్తువులు కూడా మరింత సాధనకు ఉపయోగపడతాయి.
అలాగే బాగా ఆటలు ఆడేవారికి ఆట స్థలంతో పాటు, ఆడడానికి వస్తువులు కూడా ప్రయోజనమే అవుతాయి.
స్వీయప్రతిభకు గుర్తింపు ఎంత ముఖ్యమో, దానికి పోత్సాహం కూడా ప్రధానమే!
మనలోని స్వీయప్రతిభను మనం గుర్తించడం ప్రధానం. అలాగే దానికి ప్రోత్సాహం కూడా ప్రధానమే. మనం గుర్తించిన మన ప్రతిభకు సాధన చేయకుండా మిన్నకుండడం మన ప్రతిభకు మనమే ప్రోత్సహించకుండా ఉండడం అవుతుంది. ముందుగా స్వీయప్రతిభకు మనమే విలువనివ్వాలి. దానిని మరింత పెంచుకునే క్రమంలో, అది చుట్టూ ఉన్నవారి వద్ద గుర్తింపును తెచ్చుకుంటుంది.
అలా మన చుట్టూ ఉండేవారి మద్య గుర్తింపు సాధించిన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటే, అది ఇంకా వ్యాప్తి చెంది, కీర్తికి కారణం కాగలదు. అందుకు మన చుట్టూ ఉండేవారి ప్రోత్సాహం కూడా ప్రధానమే అవుతుంది.
మన చుట్టూ ఉండేవారిలో కారణం లేకుండా మనల్ని నిరుత్సాహపరచివారికి దూరంగా ఉండడమే మేలు అంటారు. ఎందుకంటే మనమంటే ఇష్టంలేనివారికి మన ప్రతిభ తెలియబడినా, దాని వలన పెద్ద ప్రయోజనం ఉండదు. ఇంకా మన ప్రతిభకు సరైన ప్రోత్సాహం లభించకు, అది మరుగునపడే అవకాశం ఉంటుంది. కావునా వ్యక్తి స్వీయప్రతిభకు ముందుగా ఆ వ్యక్తి చేత గుర్తింపబడడం ప్రధానం అలాగే అతని చుట్టూ ఉండేవారి ప్రోత్సాహం కూడా లభిస్తే, అతను తారాస్థాయికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదని అంటారు.
మన స్వీయప్రతిభ వికసిస్తే, అది ఆకాశమే హద్దుగా కీర్తి ప్రభంజనం కాగలదు!
ఒక బాలుడు సైన్సులో మార్కులు బాగా వస్తుంటే, అతనికి సైంటిఫిక్ విషయాలలో ప్రతిభ ఉన్నట్టే. అయితే అతను సైన్సుకు సంబంధించిన విషయంలోనే ఏవిధమైన రంగంలో రాణించగలడు. దానికి సంబంధిత స్కూల్ టీచర్ల ప్రోత్సాహం లభిస్తే, అతను ఒక గొప్ప వైద్యుడు కావచ్చును. ఒక గొప్ప శాస్త్రవేత్త కావచ్చును.
సోషల్ విషయాలతో బాటు సోషల్ సబ్జెక్టులో మంచి పట్టు ఉన్న బాలుడుకి మంచి ప్రోత్సాహం లభిస్తే, అతను ఒక సామాజిక వేత్తగా మారవచ్చును. మంచి వకీలు కావచ్చును. మంచి ఐఏఎస్ అధికారి కావచ్చును.
విద్యార్ధి దశలోనే విద్యార్ధి స్వీయప్రతిభ గుర్తింపబడి, అందుకు తగిన సాధన, ఆ సాధనకు సరైన ప్రోత్సాహం లభిస్తే, అతను జీవితంలో ఉన్నత స్థితికి చేరడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు.
మన జీవితానికి మనమే నాయకత్వం వహించాలి.
మన జీవితానికి మనమే నాయకుడు. అయితే ఆ నాయకత్వం స్వీకరించే సమయానికి మనం నేర్చుకున్న విద్య ఒక ఉపకరణంగా మారగలదు.

మనం ఉండే ప్రదేశంలో, చుట్టూ రకరకాలు స్వభావం ఉన్నవారు ఉంటే, వారి వారితో మనం ప్రవర్తించే, వ్రవర్తన వారి వారిలో మనపై ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అదే సమయంలో మన ప్రవర్తనను బట్టి మనమంటే ఇష్టపడేవారు, మనమంటే ఇష్టపడనివారు ఉంటారు. మనమంటే ఇష్టపడేవారు మన ప్రతిభ కన్నా మన శ్రేయస్సు ప్రధానంగా ఆలోచిస్తారు. అందుకోసం మన ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తారు. అయితే మనమంటే గిట్టనివారు మాత్రం మన మాటకు అడ్డుతగులుతారు. అటువంటప్పుడు మనకున్న స్వీయప్రతిభ వారిని కట్టడి చేయగలదు.
ఎలాంటి స్థితిలోనూ మన అంతరాత్మ మనకు శ్రేయస్సునే అందిస్తుంది. అయితే అంతరాత్మ మాటను వినని మనసుకు మంచి మిత్రుల మాట అంతరాత్మ మాటగా ఉపయోగపడుతుంది. లేదా మన బంధువుల మాటలు కూడా మన మనసుని గాడిలో పెట్టగలదు. అయితే అది వేరొకరిపై ఆధారపడడమే అవుతుంది.
మన చుట్టూ ఉండే మన పెద్దలు మనల్ని మాటలు ద్వారా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనపై కఠినమైన మాటలతో మన మనసుపై ప్రభావం చూపుతారు. ఎందుకంటే కష్టంలో మనకు మనమే నిలబడి పరిష్కారం వైపు మన మనసుని మళ్లించాలనే ప్రయత్న చేయడానికి మనం ఒంటరి అనే భావన వచ్చే విధంగా కొంత కఠినంగా మాట్లాడే అవకాశం ఉండవచ్చును. సమస్యని ఒంటరిగా పరిష్కరించినప్పుడే మనపై మనకు ధృఢమైన నమ్మకం ఏర్పడుతుంది. ధృఢమైన స్వీయనమ్మకం స్వీయప్రతిభను బాగా ప్రతిబింబింపజేయగలదు. మన జీవితానికి మనమే నాయకుడుగా ఉంటే, మన తోటివారికి కూడా మన మార్గము మార్గదర్శకము కాగలదు.
మనలోని స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
మన స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన చేయడం వలన, మనకున్న ప్రతిభ మనపై విశ్వాసం పెంచగలదు. మనకున్న ప్రతిభకు మనం చేసిన సాధన బలమై, అది మరింత వెలుగులోకి రాగలదు. మన చుట్టూ ఉన్నవారికి మనపై మరింత విశ్వాసం పెరగడంలో మన స్వీయప్రతిభ చాలా కీలకంగా మారగలదు. మన జీవితానికి మనమే నాయకుడుగా మారడానికి స్వీయప్రతిభ ఎంతగానో ఉపయోగపడవచ్చును. కావునా మన టాలెంటుకి మరింతగా మెరుగుపరచుకుంటూ, నలుగురిలో ఒక్కరిగా గుర్తింపు తెచ్చుకుంటూ, మంచి జీవితానికి మార్గము వేసుకోవాలి.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
దీర్ఘకాలిక ప్రణాళికలు తాత్కాలికంగా కాలహరణం
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
మంచి ప్రసంగం ఎలా చేయాలి? తెలుగులో
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
తెలుగులో శతకాలు గల తెలుగుబుక్స్
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకమా?
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
తెలుగువారి ఇంటిపేర్లు తెలుగుబుక్
నాయకుడు నాయకత్వం నాయక లక్షణాలు
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
More Telugureads Posts
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
యోగవాశిష్ఠము తెలుగు బుక్ గురించి…
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
ఆడువారి భద్రత అందరి సామాజిక బాధ్యత
దేశాభివృద్ధిలో విద్యార్థుల పాత్ర గురించి వ్రాయండి
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తే – అలాంటి ఆలోచనలు
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
సత్య హరిశ్చంద్ర తెలుగు భక్తి మూవీ
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
తల్లిదండ్రుల కష్టాలకు బాధ్యత తీసుకునే పిల్లలు
స్వీయ ప్రతిభకు గుర్తింపు వచ్చేవరకు సాధన
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
జీవితంలో చదువుకు ఎంత విలువ? చదువు ఎందుకు అవసరం?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
పరీక్షలు వ్రాసిన 10thక్లాస్ స్టూడెంట్
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
సాధన చేత సామాన్యులు కూడా అద్భుతాలు సాధించగలరు
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో
నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?