Tag Archives: మన మహనీయులు

మన మహనీయుడు పొట్టి శ్రీరాములు

మన మహనీయుడు పొట్టి శ్రీరాములు.

కనిగిరి ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుటుంబం వ్యాపారరీత్యా మద్రాసులో స్థిరపడింది. ఆయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజా సేవ చేసేవారు. గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర్యోద్యమంలో అడుగు పెట్టారు. ఆరునెలలు జైలు శిక్ష అనుభవించారు. అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఆమరణ నిరాహారదీక్ష చేశారు. రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించలేదు. ఆయన మరణించడంతో ఆంధ్రదేశం ఆందోళనలతో అట్టుడికింది. అప్పుడు కేంద్రం ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

పైడిమర్రి వెంకట సుబ్బారావు మన మహనీయుడు

భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రతి బడిలో ప్రార్థనా సమావేశంలో ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞ వినిపిస్తుంది. దానిని రాసిన సుబ్బారావుగారు ఆంధ్రుడే. పిల్లల్లో దేశభక్తిని కలిగించడానికి ఆయన రాసిన ఈ ప్రతిజ్ఞ అన్ని పాఠ్య గ్రంథాల్లో ఉంటుంది. నల్గొండ జిల్లాలో జన్మించిన ఆయన అనేక పుస్తకాలు రచించారు. కావ్య నాటకాలు రాశారు.

మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి

మన మహనీయుడు శంకరంబాడి సుందరాచారి

నిరాడంబరంగా కనిపిస్తూ తెలుగు జీవనం గురించి అనర్గళంగా ఉపన్యసించే గొప్ప వక్త ‘సుందరాచారి. ఆయన రచించిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” అనేది మన రాష్ట్ర గేయంగా స్వీకరించారు. చిత్తూరు జిల్లాలో జన్మించిన ఆయన అనేక గ్రంథాలు రాశారు. తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహం ఉంది. ఇటువంటి గొప్పవారి చరిత్రలు తెలుసుకోవాలి. వారిని ఆదర్శంగా తీసుకొని సమాజాన్ని దిద్దుకోవాలి.